Apple Sets New iPhone Record In India, Says CEO Tim Cook - Sakshi
Sakshi News home page

భారత్‌లో యాపిల్‌, అమ్మకాల్లో సరి కొత్త రికార్డులు..సంతోషంలో టిమ్‌ కుక్‌

Published Sat, Aug 5 2023 7:54 AM | Last Updated on Sat, Aug 5 2023 8:54 AM

Apple Sets New Iphone Record In India, Says Ceo Tim Cook - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 2023 జూన్‌ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఐఫోన్లకు భారీ డిమాండ్‌ ఇందుకు కారణం. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ అయిన భారత్‌లో వృద్ధి పట్ల యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక్కడి మార్కెట్లో బలమైన రెండంకెల వృద్ధి సాధించామన్నారు. ‘అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  శక్తిని ఉపయోగిస్తాం. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇప్పటికీ చాలా నిరాడంబరమైన, తక్కువ వాటాను కలిగి ఉన్నాం.

కాబట్టి ఇది మాకు గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. జూన్‌ త్రైమాసికంలో రెండు స్టోర్లను తెరిచాం. అంచనాలను మించి ఇవి పనితీరు కనబరుస్తున్నాయి’ అని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement