ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్‌కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది.
ఆ నివేదిక ప్రకారం.. టిమ్‌కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది.
రిపోర్ట్‌లో ఏముందంటే?
ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్‌కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది.
టిమ్‌కుక్ విమాన ఖర్చులు
యాపిల్ 2022లో సీఈఓ కుక్‌కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు.
2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది
యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే?
2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్‌కుక్‌తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్‌లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో
సీఎఫ్‌ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు
జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు
రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు
సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment