టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు జాక్‌ పాట్‌..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు! | Tcs Extended Partnership With Aviva For 15 Years | Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు జాక్‌ పాట్‌..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!

Published Tue, Jan 30 2024 9:29 PM | Last Updated on Tue, Jan 30 2024 9:39 PM

Tcs Extended Partnership With Aviva For 15 Years - Sakshi

భారత్‌ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ జాక్‌ పాట్‌ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్‌తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్‌కు అప్పగించిన ప్రాజెక్ట్‌ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. 

అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్‌ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. 

యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్‌తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్‌ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్‌, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది.


ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్‌ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్‌లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్‌లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement