Aviva
-
టెక్ దిగ్గజం టీసీఎస్‌కు జాక్ పాట్..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!
భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్‌తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్‌కు అప్పగించిన ప్రాజెక్ట్‌ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్‌తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు. -
అవైవా ‘ఐ-సెక్యూర్’ టర్మ్ ప్లాన్
అవైవా లైఫ్ ‘ఐ-సెక్యూర్’ పేరుతో ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుని మరణం తర్వాత పిల్లల చదువులు, గృహ రుణాలకు చెల్లించే ఈఎంఐలు భారం కాకుండా ఉండటానికి ఏటా కొంత మొత్తం ఇచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. క్లెయిమ్ చేసినప్పుడు.. సమ్ అష్యూర్డ్‌లో 10 శాతాన్ని ఏకమొత్తంగా ఇవ్వడంతో పాటు, ఆపైన 15 ఏళ్ల పాటు ఏటా 6% వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. -
భారత్ లో బీమాకు అవీవా గుడ్‌బై?
న్యూఢిల్లీ: బ్రిటన్ ఆర్థిక సేవల దిగ్గజం అవీవా భారత బీమా మార్కెట్ నుంచి వైదొలగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్‌తో జాయింట్ వెంచర్ద్వారా పదేళ్లుగా అవీవా జీవిత బీమా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జేవీలో అవీవా ఇండియా వాటా 26 శాతం. వాటాల అమ్మకానికి కొనుగోలుదారుని వెతికే ప్రక్రియలో భాగంగా కార్పొరేట్ సలహాదారులను నియమించుకునే పనిలో అవీవా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నో కామెంట్: ఈ వార్తలపై వ్యాఖ్య కోసం ఈ మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు, అవీవా ఇండియా ప్రతినిధి సమాధానమిస్తూ, ‘‘మార్కెట్ ఊహాగానాలు లేదా వదంతులపై మా విధానం ప్రకారం వ్యాఖ్యానించలేం’’ అని పేర్కొన్నారు. 2002లో ప్రారంభమైన జాయింట్ వెంచర్ పెయిడప్ క్యాపిటల్ రూ.2,004 కోట్లు. ఇందులో అవీవా వాటా 26 శాతం. 2011-12తో పోల్చితే, 2012-13లో అవీవా జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు 11% క్షీణించి రూ. 2,140.6 కోట్లకు దిగింది. ఈ ఏడాది మొదట్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్జీ... ఇంగ్ వైశ్యా లైఫ్ కంపెనీలో తన 26% వాటాను యక్సైడ్కు విక్రయించాలని నిర్ణయించింది. గతేడాది అమెరికాకు చెందిన న్యూయార్క్ లైఫ్ కూడా భారత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తన 26% వాటాను జపాన్‌కు చెందిన మిత్సూయీ సుమిటోమో బీమా కంపెనీకి విక్రయించింది. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు కంపెనీల బాటన అవీవా నడుస్తుందన్న వార్తలు వస్తుండడం గమనార్హం.