ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది? | TCS Employee Suspended | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల తొలగింపు.. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?

Published Wed, May 8 2024 4:52 PM | Last Updated on Wed, May 8 2024 6:29 PM

TCS Employee Suspended

ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్‌ విభాగంలో చర్చాంశనీయంగా మారింది.  

భద్రత పేరుతో టీసీఎస్‌ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో వాపోతున్నారు.

రెడ్డిట్‌ పోస్ట్‌ల ప్రకారం.. లేఆఫ్స్‌ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్‌ క్రెడిన్షియల్స్‌ను షేర్‌ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్‌ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్‌ పోస్ట్‌లో తెలిపారు.   

I got suspended from tcs today because of a security incident which was reported by me 
byu/Personal_Stage4690 indevelopersIndia

 

తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్‌లు షేర్‌ చేయడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం, వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

 

I got suspended from tcs today because of a security incident which was reported by me 
byu/Personal_Stage4690 indevelopersIndia

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement