ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు షాకిచ్చింది. త్వరలో పెరగనున్న జీతాలు, ప్రమోషన్‌లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టూ ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనిట్లు సమాచారం.
వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
అంతేకాదు ఉద్యోగులు ఇకపై వర్క్ ఫ్రం హోమ్ చేస్తామంటే కుదరదని, తప్పని సరిగా వాళ్లు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబడుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఉద్యోగులు తాము నివాసం ఉంటుంన్న ప్రాంతాలకు సమీపంలోని ఆఫీస్ కార్యాలయాలను ఎంపిక చేసుకోవద్దని కోరింది. తామే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేయాలని చెబుతామని సూచించింది.
కోవిడ్-19 కేసుల వారీగా పరిమిత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను హెచ్ఆర్ విభాగం అనుమతిస్తోందని నివేదిక తెలిపింది. కాగా, ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో సహా పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో వర్క్ ఫ్రం హోమ్ విధానం ముగిసినట్లేనని ఐటీ నిపుణులు భావిస్తుండగా.. విప్రో తప్పనిసరి హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది’అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment