ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) స్వస్తి పలికింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో నవంబర్ 1నుంచి (అంచనా) సిబ్బంది కార్యాలయాల నుంచి పనిచేయనున్నారు. ఈ తరుణంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేసింది.
వర్క్ ఫ్రమ్ ముగింపు పలికిన టీసీఎస్.. తాజాగా ఉద్యోగులకు మరోసారి మెయిల్స్ పంపింది. ఆఫీస్‌కి వచ్చే ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో సంస్థ సంప్రదాయాల్ని మరువకూడదని గుర్తు చేసింది. ముఖ్యంగా, వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్ లక్కడ్ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ వాటాదారులు సంస్థ సంప్రదాయాలకు గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. డ్రెస్ కోడ్ పాలసీలో భాగంగా సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో సరైన వస్త్రధారణ ఉండేలా మార్గదర్శకత్వం చేస్తున్నట్లు లక్కడ్ తెలిపారు.
ఈ సందర్భంగా నా సహచరులు దాదాపూ రెండేళ్ల పాటు ఇంటి వద్ద నుంచే పని చేశారు. ఇప్పుడు కార్యాలయాల నుంచి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో క్లయింట్ల ఉద్యోగులు డ్రెస్ కోడ్ గురించి స్పష్టత ఇచ్చేలా లక్కడ్ ఉద్యోగులు మెయిల్స్ చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఉద్యోగుల కోడ్ విషయానికి వస్తే..పురుషులు తప్పని సరిగా ఫుల్ - స్లీవ్డ్ షర్టులతో టక్ చేసుకోవాలి. మహిళా ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు సెమినార్‌లు, క్లయింట్ మీటింగ్‌లలో బిజినెస్ ఫార్మల్స్ తప్పని సరి. శుక్రవారం హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్‌నెక్, ఖాకీ చొక్కాలు, చినోలు, కుర్తీ, సల్వార్ (మహిళలు)లను మాత్రమే అనుమతిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఉద్యోగుల డ్రెస్ కోడ్ నిబంధనలపై టీసీఎస్ యాజమాన్యం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
Comments
Please login to add a commentAdd a comment