ఇదే ఫైనల్.. ఇక ఆఫీసులకు రాకపోతే మీ ఇష్టం.. ఇది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇచ్చిన్న వార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు మార్చి ఆఖరికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం.
రిటర్న్-టు-ఆఫీస్ మ్యాండేట్‌కు అనుగుణంగా ఉద్యోగుల హైక్‌లు, వేరియబుల్ పేఅవుట్‌లను టీసీఎస్ లింక్ చేస్తున్నట్లు నివేదికలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఈ డెడ్‌లైన్ రావడం గమనార్హం. కొత్త ఆదేశాల గురించి యూనిట్ హెడ్‌లు తమ టీం సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు టీసీఎస్ సీవోవో ఎన్‌జీ సుబ్రహ్మణ్యంను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. డెడ్‌లైన్‌కు సంబంధించి టీసీఎస్ ఉద్యోగులకు తుది కమ్యూనికేషన్ పంపించింది. విస్మరించినవారు పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం ఇటు ఉద్యోగులు, అటు కంపెనీ ఇద్దరికీ ఇబ్బందికరమని సంస్థ పేర్కొంటోంది.
ఇప్పటికే 65 శాతం మంది
టీసీఎస్ జనవరి 11 నాటి డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల ప్రకటనలో 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నారని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికర ప్రాతిపదికన 5,680 పడిపోయింది. టీసీఎస్‌కు హెడ్‌కౌంట్ తగ్గడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. క్యూ2లో ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గింది. గత డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 603,305.
Comments
Please login to add a commentAdd a comment