ఉద్యోగులకు ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) భారీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2023 నుంచి హైబ్రిడ్ వర్క్‌కు స్వస్తి చెబుతున్నట్లు ఆ సంస్ధ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
హైబ్రిడ్ వర్క్‌కు గుడ్‌బై చెప్పిన టీసీఎస్ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరింది. ఈ పరిణామంతో దేశీయంగా ఐటీ విభాగంలో పనిచేస్తున్న మొత్తం 50 లక్షల మంది వర్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుందని సమాచారం.
అయితే, ఈ హైబ్రిడ్ వర్క్‌కు పూర్తి స్థాయిలో ముగింపు పలికే వరకు ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ రావాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పిస్తుంటే పలు విభాగాల్లో మేనేజర్లుగా పనిచేస్తున్న పై స్థాయి సిబ్బంది మాత్రం వారానికి 5 సార్లు ఆఫీస్ రావాల్సిందేనని టీసీఎస్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ ఫ్లెక్సిబిలిటీ/హైబ్రిడ్ పాలసీలను అలాగే కొనసాగించి అవసరమైన చోట మినహాయింపులు ఇస్తుంది.
చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపగా.. ఆ మెయిల్స్ ఏముందనే అంశంపై స్పష్టత వచ్చింది. యాజమాన్యం ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్ అన్నీ విభాగాల ఉద్యోగులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అదే టీసీఎస్ సెప్టెంబర్ 2022 నుండి ఉద్యోగులు వారానికి మూడురోజులు కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కూడదు అంటే సదరు సిబ్బందిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని టీసీఎస్ హెచ్చరించింది. కాగా, హైబ్రిడ్ వర్క్ ముగింపుపై పలు మీడియా సంస్థలు టీసీఎస్‌ను సంప్రదించాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు.
చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
Comments
Please login to add a commentAdd a comment