hybrid
-
వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీ
డెల్(Dell) టెక్నాలజీస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ(వారంలో కొన్ని రోజులు ఆఫీస్ నుంచి, ఇంకొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే విధానం)కి స్వస్తి చెప్పింది. డెల్ కార్యాలయం సమీపంలో అంటే ఒక గంట ప్రయాణ సమయం పట్టే పరిధిలో ఉన్న ఉద్యోగులు మార్చి 3, 2025 నుంచి వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసింది. ఉత్పాదకత, సృజనాత్మకతను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెల్ సీఈఓ మైఖేల్ డెల్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.కొత్త విధానంతో డెల్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ముగించింది. ఉద్యోగుల మధ్య పరస్పర చర్చల వల్ల సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ విశ్వసిస్తుంది. మైఖేల్ డెల్ తాను పంపిన ఈమెయిల్లో..‘ప్రపంచంలోని మెరుగైన అన్ని టెక్నాలజీలకు మూలం పరస్పర మానవ చర్చలే. దాంతో పనులు మరింత వేగంగా పూర్తవుతాయి’ అన్నారు. డెల్ కార్యాలయాలకు సమీపంలో గంట ప్రయాణ సమయం ఉన్న ఉద్యోగులకు కొత్త ఆదేశాలు వర్తిస్తాయి. అయితే మరింత దూరంలో నివసించే వారు రిమోట్‌గా పని చేసేందుకు సీనియర్ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలియజేశారు.ఇదీ చదవండి: అనుకున్నదొకటి.. అయినదొకటి!ఈ ప్రకటనపై డెల్ ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది పిల్లల సంరక్షణ ఏర్పాట్లు, పార్కింగ్ కొరత వంటి లాజిస్టిక్ సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును అందించాయి. క్రమంగా దాన్ని తొలగించి రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఏటీ అండ్ టీ, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇటీవల ఇలాంటి విధానాలను అమలు చేశాయి. -
బంతి విలాపం... చాందినీ వికాసం
నాటురకం బంతిపూలు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సాగు చేసిన రైతులు వాటిని రోడ్డుపై పారబోస్తున్నారు. దీంతో అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ పూలతోటలు సాగు అధికంగా ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకం పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటోంది. రైతులు ఈ హైబ్రిడ్ రకం పూల తోటలు సాగు చేస్తే లాభాలు పొందుతారని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూలసాగు ఎక్కువగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఉంటుంది. ఈ దఫా ఈ ప్రాంతంలో నాటు రకాలైన బంతి, చామంతిని సాగుచేసిన పూలరైతులు తీవ్ర నష్టాలబాటలో పయనిస్తున్నారు. బంతిపూలు కిలో రూ.4 కూడా పలకపోవడంతో కొనేవారు లేక పూలను రైతులు రోడ్డుపై పారబోస్తున్నారు. ఇదే సమయంలో చామంతిలో హైబ్రిడ్ రకాలైన సెంట్ రెడ్, ఎల్లో, వైట్, వైలట్ రకాలను సాగు చేసిన రైతులు లక్షాధికారులుగా మారుతున్నారు. ఇవి వారం రోజులైనా వాడకుండా ఉండడంతో, బొకేలకు, ఫంక్షన్ హాళ్ల అలంకరణకు వాడుతుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి ధర ప్రస్తుతం కిలో రూ.వందకు పైమాటే. పూల రైతులు వారి పొలంలో కాస్త పెట్టుబడి ఎక్కువగా పెట్టి నాటీ రకాల బదులు డిమాండ్ ఎక్కువగా ఉన్న హైబ్రిడ్ రకాలను సాగుచేస్తే లాభాల పట్టేవారు. కానీ రైతులు అప్డేట్ కాకపోవడమే నష్టాలకు కారణమవుతోంది. లక్ష పెట్టుబడితో రూ.3 లక్షల లాభం హైబ్రిట్ రకాల పూల సాగు పంటకాలం నాలుగునెలలు. రెండో నెల నుంచే పూలు కోతకొచ్చి రెండునెలల పాటు కోతలు ఉంటాయి. ఎకరా పొలంలో 7 నుంచి 9వేల హైబ్రిడ్ రకాల సీడ్స్ అవసరం ఉంటుంది. ఒక్కో సీడ్ రూపాయిగా కర్ణాటకలోని తుముకూర్, తమిళనాడులోని రాయకోట నర్సరీలో వీటిని విక్రయిస్తున్నారు. ఎకరా పొలానికి పెట్టుబడిగా మల్చింగ్‌తో సహా రూ.లక్ష దాకా అవుతోంది. పంట బాగా వస్తే ఎకరానికి 30 టన్నుల ఉత్పత్తి ఉంటుంది. ప్రస్తుతం హైబ్రిడ్ రకాల పూల ధరలు కిలో రూ.100 వరకు ఉన్నాయి. ఈ లెక్కన 30 టన్నులకు రూ.3 లక్షలు వస్తుంది. అదే నాటి రకం పూలైతే.. నాటి రకమైన బంతి 70 రోజులకు కోతకొచ్చి ఆపై 40 రోజులు కటింగ్‌లు ఉంటాయి. అదే చామంతి అయితే 90 రోజులకు కోతకు వచ్చి ఆరునెలలు కటింగ్ ఉంటాయి. వీటి సాగు కోసం ఎకరా పొలంలో రైతు పంట పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాలి. పంట దిగుబడి బాగా వస్తే పదిటన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ధర కిలో రూ.4తో రూ.40వేలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతుకు నష్టం తప్పదు. అందువల్ల రైతులు వారిపొలంలో నాటి రకాల పూలకు బదులు హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకుంటే నికర లాభాలు రావడం తథ్యం.హైబ్రిడ్ పూల సాగులో లాభాలు.. పూలను సాగుచేసే రైతులు సంప్రదాయ రకాలైన బంతి, చామంతిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వీటికి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అదే హైబ్రిడ్ రకాలైన కస్తూరి చాందిని రకాలైన సెంట్ రెడ్, వైట్, ఎల్లో, వైలట్ రకాలను సాగుచేసిన రైతులు లాభాల బాటలో ఉన్నారు. ఎందుకంటే ఈ రకం పూలు వారం రోజులైనా వాడకుండా ప్లాస్టిక్ పూలవలే వికసిస్తూ ఉంటాయి. వీటిని దూర ప్రాంతాలకు సైతం రవాణా చేసేందుకు వెలుసుబాటుగా ఉంటుంది. అదే నాటి రకాలు మూడురోజుల్లోనే వాడిపోతుంటాయి. దీంతో పూల వ్యాపారులు సైతం హైబ్రిడ్ రకాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఈ రకం పూలను బొకేలకు సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉండడంతో ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.హైబ్రిడ్ రకాలనే సాగు చేయాలి నాటి రకాలైన బంతీ, చామంతిలను సాగుచేసినష్టాలు బాట పట్టాం. అందుకే తమిళనాడులోని రాయకోట నుంచి సెంట్ ఎల్లో, వైట్, రెడ్ రకాల హైబ్రిడ్ రకాల పూలను సాగుచేసి నికర లాభాలను పొందుతున్నాం. రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డిమాండ్ ఉన్న పూలను సాగుచేయడం అలవర్చుకోవాలి. అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. – రవీంద్ర, పూలరైతు, కూర్మాయి గ్రామం, పలమనేరు మండలంఅవగాహన కల్పిస్తూనే ఉన్నాం..సంప్రదాయ రకాలైన బంతి పూలకు ఇప్పుడు కాలం చెల్లింది. వీటికి ఎప్పుడు ధరలుంటాయో తెలియని పరిస్థితి. అందువల్ల రైతులు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకోవడం మేలు. ఎందుకంటే అదే పొలంలో కాస్త ఎక్కువగా పెట్టుబడి పెట్టి నికరంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిపస్తూనే ఉన్నాం. – డా.కోటేశ్వర్రావు, సహాయ సంచాలకులు, ఉద్యానశాఖ -
ఢిల్లీలో హైబ్రీడ్ మోడ్‌లో పాఠశాల తరగతులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్’లో అంటే ఆన్లైన్, ఆఫ్లైన్లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్‌లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్లైన్లో, ఇటు అఫ్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
కార్పొరేట్ ట్రావెల్ 20.8 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్‌లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్బాట్లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి. ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు.. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్‌ఫామ్‌లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్‌లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది. -
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్‌జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌తో కలిసి రూమీ–1 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్‌జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్‌ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌ను తయారు చేసినట్లు స్పేస్‌జోన్ కంపెనీ వెల్లడించింది. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!
మాంసంతో బియ్యం తయారు చేయడం ఏంటిదీ! అనిపిస్తుంది కదూ. మీరు వింటుంది నిజమే గొడ్డు మాంసంతో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో ఎదురయ్య ఆహార సమస్యను ఈ సరికొత్త వంగడం తీరుస్తుందని చెబుతున్నారు. చూస్తే బియ్యపు గింజల్లానే ఉంటాయట. తింటే మాత్రం మాంసం రుచిని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఏంటా వరి వండగం? ఎలా తయారు చేశారంటే.. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు బృందం ఈ సరికొత్త బీఫ్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు. వాళ్లు సృష్టించిన బియ్యపు గింజల్లో గొడ్డు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి ఈ బియ్యం. ఫిష్ జెలటిన్‌లో సాంప్రదాయ బియ్యం గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం కొవ్వు మూలకణాలతో ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో సాగు చేశారు. అలా తొమ్మిది నుంచి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు, జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని సాగు చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును ఉంటాయి. చివరిగా ఉత్పత్తి అయ్యే వరి వంగడం మంచి పౌష్టికరమైన బియ్యంగా మారుతుంది. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ గొడ్డు మాంసం కల్చర్డ్ రైస్‌ను ప్రోఫెసర్ జింకీ హాంగ్ వండి రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా పెళుసుగా ఉందని అన్నారు. అయితే ఇందులో 8% దాక ప్రోటీన్, 7% కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుందన్నారు. వండిన తర్వాత వెన్న, కొబ్బరి నూనె కూడిన వాసన వస్తుందన్నారు. ఈ వరి వంగడాన్ని సృష్టించడానికి కారణం.. ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆ అవసరాలను తీర్చడం కోసం ఈ సరికొత్త వరి బియ్యాన్ని సృష్టించే ప్రయోగాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జంతువుల నుంచి మనకు అవసరమైన ప్రోటీన్‌ను అందుతుంది. అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం. ఇది ఒకరకంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. అలాగే వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది అందరికీ వెసులుబాటుగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుంచి మనకు అవసరమైన అన్ని పోషకాలు పొందడం గురించి కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. పరిశోధకులు స్థానిక వధశాలలో వధించిన హన్వూ పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను తీసుకుని ఈ సరికొత్త వరి వండగాన్ని సృష్టించారు. ఇలా ఎక్కువ జంతువులు అవసరం లేకుండా ల్యాబ్‌లో నిర్వహించగల జంతు కణాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో మరిన్ని మార్పులు చేసి.. చేపల వంటి వాటిని కూడా వినియోగించి వివిధ రుచులగల ఆహారాన్ని తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ హైబ్రిడ్ బియ్యం అచ్చంగా మాంసం రుచిని పోలీ ఉంటాయి కాబట్టి మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఈ సరికొత్త వరి వంగడం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు మంచి ఆహార వనరుగా ఉంటుంది. అలాగే సైనికులకు అవసరమైన పౌష్టికాహారంగానూ, అంతరిక్ష ఆహారంగానూ పనిచేస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. చెబుతున్నారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.' లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. నెలకొరిగినా తిప్పుకుంది! డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్) 3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం! 3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది. – ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా – ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు (చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం) -
హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ
యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ నారాయణ మూర్తికి మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా మూర్తి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఇంటా, బయటా అలుపెరగకుండా పనిచేస్తున్నా కూడా, వారికి తగిన గుర్తింపు లభించడం లేదనీ, దీనికి గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచారకరమంటూ ట్వీట్ చేశారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ) తాజాగా వ్యాపారవేత్త హర్హ్ గోయెంకా నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 హర్ష్ గోయెంకా ఏమన్నారంటే.. ‘‘వారానికి 5 రోజుల ఆఫీస్ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌గా పని చేస్తున్నారు. ఇదోక గేమ్-ఛేంజర్. 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.’’ ప్రస్తుతం జరుగుతోంది.. భవిష్యత్తు అంతా హైబ్రిడ్ పని విధానమే. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా ,రిమోట్‌గానే అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ప్రయోజనాలు, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే.. కొత్త వర్క్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మారాలి. వర్క్ లైఫ్‌లో వర్క్ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది! అంటూ పరోక్షంగా నారాయణమూర్తికి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇన్పీ మూర్తి మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి మాట్లాడడం లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించాలని గుర్నాని అన్నారు. అంతేకాదు యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌గా మారాలంటే యువత 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని పిలుపు నిచ్చారు. -
టీసీఎస్ ఊహించని నిర్ణయం.. షాక్‌లో ఉద్యోగులు
ఉద్యోగులకు ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) భారీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2023 నుంచి హైబ్రిడ్ వర్క్‌కు స్వస్తి చెబుతున్నట్లు ఆ సంస్ధ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హైబ్రిడ్ వర్క్‌కు గుడ్‌బై చెప్పిన టీసీఎస్ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరింది. ఈ పరిణామంతో దేశీయంగా ఐటీ విభాగంలో పనిచేస్తున్న మొత్తం 50 లక్షల మంది వర్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుందని సమాచారం. అయితే, ఈ హైబ్రిడ్ వర్క్‌కు పూర్తి స్థాయిలో ముగింపు పలికే వరకు ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ రావాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పిస్తుంటే పలు విభాగాల్లో మేనేజర్లుగా పనిచేస్తున్న పై స్థాయి సిబ్బంది మాత్రం వారానికి 5 సార్లు ఆఫీస్ రావాల్సిందేనని టీసీఎస్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ ఫ్లెక్సిబిలిటీ/హైబ్రిడ్ పాలసీలను అలాగే కొనసాగించి అవసరమైన చోట మినహాయింపులు ఇస్తుంది. చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపగా.. ఆ మెయిల్స్ ఏముందనే అంశంపై స్పష్టత వచ్చింది. యాజమాన్యం ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్ అన్నీ విభాగాల ఉద్యోగులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అదే టీసీఎస్ సెప్టెంబర్ 2022 నుండి ఉద్యోగులు వారానికి మూడురోజులు కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కూడదు అంటే సదరు సిబ్బందిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని టీసీఎస్ హెచ్చరించింది. కాగా, హైబ్రిడ్ వర్క్ ముగింపుపై పలు మీడియా సంస్థలు టీసీఎస్‌ను సంప్రదించాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
క్యాన్సర్ కణాలకు చెక్!
న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్ కణాలను విజయవంతంగా వధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్ సలై్ఫడ్ రేణువులు క్యాన్సర్ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్ అణువులను ఇవి విడుదలచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్ సల్ఫైడ్ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్ కణతులపై ఆక్సిజన్ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి. గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్ సలై్ఫడ్ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు. -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్‌లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్‌ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్‌ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్‌ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ!
కరోనా వైరల్ అధికంగా విజృంచిన సమయంలో ఉద్యోగులంతా దాదాపు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home)కి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితి వచ్చింది. కానీ ఆఫీసులకు రావడానికి ఎంప్లాయిస్ ససేమిరా అంటున్నారు. సంస్థలేమో ఆఫీసులకు రమ్మంటుంటే.. ఉద్యోగులేమో ఇంటి నుంచి పనిచేస్తామని పట్టుపడుతున్నారు. ఈ సమస్యకు హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దిగ్గజ కంపెనీలు సైతం తప్పకుండా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని, ఈ నిర్ణయం కాదంటే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చని తేల్చి చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. దీనికోసం హైబ్రిడ్ వర్క్ కొనసాగించాలని భావిస్తున్నారు. ఇది తప్పకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. వివిధ రంగాల్లోని సుమారు 3800 ఉద్యోగుల్లో 76 శాతం మంది హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ విధానం కాదంటే కొత్త ఉద్యోగాలను అన్వేషించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పనిచేయాల్సిన రోజుల సంఖ్యను పెంచాలనే యజమానులు నిర్ణయాన్ని 35 శాతం మంది ఆహ్వానిస్తున్నారు. జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ సాచ్స్, మెటా, టీసీఎస్ కంపెనీలు సైతం తప్పకుండ ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. అంతే కాకుండా జూమ్ సంస్థ కూడా 50 కిమీ దూరంలో ఉన్న ఎంప్లాయిస్ వారానికి రెండు రోజులు కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఇదీ చదవండి: గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా.. ఆయన గ్యారేజీలో ఉండే కార్లు, బైకుల లిస్ట్ ఇదిగో! ఉద్యోగులకు, కంపెనీలకు సామరస్యంగా ఉండాలంటే హైబ్రిడ్ విధానం పాటించడం మంచిది. వేగంగా పరుగులు పెడుతున్న ప్రపంచంతో పోటీపడాలంటే అనుభవజ్ఞులైన ఉద్యోగులు చాలా అవసరమని సీఐఈఎల్ హెచ్ఆర్ సత్యనారాయణ అన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఫ్లెక్సిబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్‌పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు!
పట్టణాలు, నగరాల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. మార్కెట్లో దొరుకుతున్న ఈ–సైకిళ్లు, ఈ–మోపెడ్స్, ఈ–స్కూటర్స్‌కు భిన్నంగా కాలిఫోర్నియాకు చెందిన ‘సిక్స్త్రీజీరో’ ఇటీవల మూడుచక్రాల ఈ–సైకిల్‌ను ‘ఎవ్రీజర్నీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 250 వాట్ రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఏడుస్థాయిల్లో దీని వేగాన్ని మార్చుకోవచ్చు. రోడ్డు బాగుంటే, పవర్ ఆఫ్ చేసుకుని మామూలు సైకిల్ మాదిరిగానే పెడల్స్ తొక్కుకుంటూ కూడా పోవచ్చు. ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేసుకుంటే, 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలదు. ముందువైపు ఒక చక్రం, వెనుకవైపు రెండు చక్రాలు, వెనుక ఉన్న రెండు చక్రాల మధ్య సరుకులు పెట్టుకోవడానికి అనువైన బుట్టతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మూడుచక్రాల ఈ–సైకిల్ ధర 3,999 డాలర్లు (రూ.3.27 లక్షలు) మాత్రమే! -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
ఎయిర్‌లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!
ఇది అలాంటిలాంటి విమానం కాదు, పెద్ద ఓడలాంటి విమానం. గాలిలో ఇది ఎగురుతుంటే, పెద్ద ఓడ నింగిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌లాండర్ ఈ భారీ విమానానికి రూపకల్పన చేసింది. బ్రిటన్‌కు చెందిన విమానాల డిజైనింగ్ సంస్థ ‘డిజైన్–క్యూ’ సహాయంతో రూపొందించిన ఈ విమానం పేరు ‘ఎయిర్‌లాండర్–10’. ఇందులో లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం విశేషం. ఇదీ చదవండి: ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు! విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం ఎనిమిది బెడ్రూమ్లు, బాత్రూమ్లు, షవర్లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా, వైఫై సౌకర్యం, ఇతర వినోద సౌకర్యాలు, బార్ వంటి విలాసాలు ఈ విమానం ప్రత్యేకత. సాధారణ విమానాలతో పోలిస్తే దీని వేగం కాస్త తక్కువే! సాధారణ విమానాల గరిష్ఠ వేగం గంటకు 500 మైళ్లకు పైగా ఉంటే, దీని గరిష్ఠవేగం గంటకు 100 మైళ్లు మాత్రమే! ఇది 2026లో తన తొలి ప్రయాణం ప్రారంభించనుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్‌కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్‌మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్‌తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్‌ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్‌లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్‌యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్‌లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్‌ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!
ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో..‘హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది’ అంతేకాదు ‘మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి👉 ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం! ఈ నేపథ్యంలో ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజ స్పందించారు. దేశీయ టెక్ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు. కొద్ది రోజుల క్రితం టీసీఎస్ గత సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్ ఆర్ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 300 మందిపై వేటు ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో తమ కాంపిటీటర్లతో కలిసి వర్క్ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరుణంలో విప్రో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. చదవండి👉 పదోతరగతి కుర్రాడికి అమెరికా నుండి పిలుపు -
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్ అంటారెస్ పవర్స్ అనే హైబ్రిడ్ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్ విలియం జాన్ పవర్స్ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంటుందని తెలిపారు. 2016లలో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదం మరణించాయని తెలిపారు. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంతని కూడా అన్నారు. అంతేగాదు అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించిందని చెప్పారు. (చదవండి: టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..) -
జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌లో ఉద్యోగం అంటే మాటలా. పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం విరక్తి. అందుకే శాలరీ రూ.8 కోట్లు (అంచనా) తీసుకుంటున్నా..ఆ జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశాడు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ రిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ రిజిగ్నేషన్ అంశం యాపిల్‌తో పాటు ఇతర టెక్ సంస్థల్లో చర్చాంశనీయంగా మారింది. సుధీర్ఘ కాలం తర్వాత ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెబుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. అయితే ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు కోట్లలో శాలరీ తీసుకుంటున్నా..ఉన్న ఫళంగా జాబ్ రిజైన్ చేస్తున్నారు. ఆఫీస్‌కు రావాలంటే కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే చేస్తాం. లేదంటే జాబ్ రిజైన్ చేస్తామంటూ బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో ఆ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. ఆఫీస్ అమలు చేసిన కొత్త రూల్ కారణంగా తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫీస్‌కు రావాల్సిందే కరోనా కారణంగా యాపిల్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసే వారు. కానీ ఇటీవల సంస్థ తన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిచ్చింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ పాలసీని అమలు చేసింది. యాపిల్ కొత్త వర్క్ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఏప్రిల్ 11నుంచి వారానికి కనీసం ఒక రోజు, ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత అది కాస్త మే 2 నుంచి వారానికి రెండు రోజులకు పెరిగింది. ఇప్పుడు, యాపిల్ తన ఉద్యోగులను కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. మే 23 నుంచి వారానికి 5రోజులు పనిచేయాలని కొత్త పాలసీలో స్పష్టం చేసింది. టిమ్‌కుక్‌కు గుడ్‌ఫెలో మెయిల్ ఈ నిర్ణయంపై గుడ్‌ఫెలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని, తన టీం సభ్యుల వర్క్ ఫ్లెక్సిబులిటీ తనకు ముఖ్యమని, వాళ్లకి బాగుంటే వర్క్ రిజల్ట్ బాగుంటుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాసిన మెయిల్స్ తాను తన జాబ్‌కు ఎందుకు రిజైన్ చేస్తున్నాడో వివరించాడు. శాలరీ ఎంతంటే! వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ప్రకారం, గతంలో ఇయాన్ గుడ్‌ఫెలో జీతం సంవత్సరానికి రూ. 6 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి టెస్లాలో పని చేసిన అతని శాలరీ సంవత్సరానికి కనీసం రూ.6 కోట్లుగా ఉందని, టెస్లాకు రిజైన్ చేసిన గూగుల్లోకి వెళ్లడంతో అతని శాలరీ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2019లో యాపిల్‌లో చేరిన గుడ్ ఫెలో శాలరీ రూ.6 కోట్ల నుంచి రూ.8కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్! -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
హైబ్రిడ్ ఎంతో హాయి..
కరోనా సంక్షోభం తర్వాత తెర మీదకు వచ్చిన హైబ్రిడ్ వర్క్ విధానం ఎంతో బాగుందంటున్నారు ఉద్యోగులు. కరోనా భయాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతుండగా మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంను కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఈ రెండింటి కలయికగా ఉద్యోగులు తమకు నచ్చినట్టు ఆఫీసు, ఇంట్లో పని చేసుకునే వెసులుబాటు హైబ్రిడ్ విధానంలో ఉంది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లేదా ఆఫీసు ఉంచి పని ఈ రెండింటిలో ఏ పని సౌకర్యంగా ఉందో తెలుసుకునేందుకు గ్లోబల్ స్టడీ సంస్థ సిస్కో ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో నూటికి 61 శాతం మంది హైబ్రిడ్ వర్క్ విధానం బాగుందంటూ సమాధానం ఇచ్చారు. హైబ్రిడ్ మోడ్‌లో పనితీరు, ప్రొడక్టివిటీ కూడా మెరుగైందని చెబుతున్నారు. దీంతో పాటు మానసికంగాను చాలా ఉత్తేజవంతంగా ఉంటున్నామని వెల్లడించారు. చదవండి: ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు! -
కో–వర్కింగ్ స్పేస్.. అందరి నోటా ఇదే మాటా.. ప్రత్యేకతలు ఇవే
సాక్షి, హైదరాబాద్: దేశీయ కో–వర్కింగ్ పరిశ్రమకు డిమాండ్ ఏర్పడింది. కరోనా నేపథ్యంలో ప్రారంభమైన రిమోట్ వర్కింగ్‌పై విశ్వసనీయత అనుమానం కారణంగా 90 శాతం కంపెనీలు ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వైపు మళ్లేందుకు ఇష్టపడుతున్నారని అనరాక్ లింక్డిన్ సర్వేలో తేలింది. హైబ్రిడ్ పని విధానం వైపు మొగ్గుచూపిస్తున్న కంపెనీలలో 46 శాతం కో–వర్కింగ్ స్పేస్ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. 30 శాతం మంది హబ్ అండ్ స్పోక్ మోడల్‌కు, 24 శాతం మంది ఇప్పటికే ఉన్న ఆఫీస్ లే–అవుట్ మార్పు కోసం ఫ్లెక్సిబుల్ స్పేస్‌ను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో.. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధి రేటుతో రెట్టింపు కానుంది. ప్రస్తుతం దేశంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 3.5 కోట్ల చ.అ.లుగా ఉండగా.. ఇందులో 71 శాతం అంటే 2.5 కోట్ల చ.అ. స్పేస్ పెద్ద ఆపరేటర్లు నిర్వహిస్తున్నారని సీఐఐ–అనరాక్ నివేదిక వెల్లడించింది. ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాలలో 3.7 లక్షల కో–వర్కింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగిస్తున్న కంపెనీలు, కొత్త సంస్థలు ఈ రంగంలో విస్తరించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. స్మార్ట్‌వర్క్స్ వచ్చే 3–4 ఏళ్లలో 20 మిలియన్ చ.అ.లలో 2.5 లక్షల సీట్లను అందుబాటులోకి తీసుకురానుందని ఆయన పేర్కొన్నారు. -
వర్క్‌ఫ్రం హోం లేకపోతే ఏం.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఎప్పటి నుంచి కార్యాలయాలకు రావాలనే విషయంలో స్పష్టమైన విధానం అంటూ ఏదీ రూపొందించుకోలేదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. క్లిష్టపరిస్థితుల్లో ఆఫీసులకు రావడం ఎందుకనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 73 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి పెరిగితే ఉద్యోగులు కంపెనీలు మారేందుకు వెనుకాడటం లేదు. గతంలోనే ఉన్నడూ లేనంతగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్లెక్లిబులిటీ ఉండే హైబ్రిడ్ పని విధానం వైపు మైక్రోసాఫ్ట్ మొగ్గిందని ఆయన తెలిపారు. టెక్నాలజీతో ఉత్పాదకత పెంపు టెక్నాలజీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వివిధ స్థాయుల్లోని వ్యాపార సంస్థలు తమ ఉత్పాదకతను మరింతగా పెంచుకోవచ్చని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తద్వారా తమ ఉత్పత్తులు, సర్వీసులను చౌకగా అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్ బాట పడుతున్నాయని ఆయన వివరించారు. హైబ్రిడ్ పని ధోరణి పెరుగుతోందని, వ్యాపారాలు మరింత లోతుగా అనుసంధానమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విశ్వసనీయమైన సంబంధాలు నెలకొనాలంటే ఎల్లలు లేని డిజిటల్ వ్యవస్థ అవసరం అవుతుందని నాదెళ్ల తెలిపారు. ‘ద్రవ్యోల్బణం పెరిగే ఆర్థిక వ్యవస్థలో.. ధరలను కట్టడి చేసే శక్తి డిజిటల్ టెక్నాలజీకి ఉంది. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు టెక్నాలజీ ఊతంతో తమ ఉత్పత్తులు, సర్వీసుల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చౌకగా అందించవచ్చు‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. చిప్‌ల డిజైనింగ్‌లో అవకాశాలు: చంద్రశేఖర్ వచ్చే 5–7 ఏళ్లలో సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల్లో భారత్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. కంప్యూటింగ్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇవి కీలకంగా ఉండనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కంపెనీల్లో టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వినియోగించడం మరింతగా పెరిగిందని ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. వ్యాపార సంస్థలు ఉత్పాదకత పెంచుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, పోటీ పడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. మరింత పటిష్టంగా భారత్ వృద్ధి: టీసీఎస్ చంద్రశేఖరన్ భారత్ దీర్ఘకాల వృద్ధి గతిపై కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా లేదని దేశీ దిగ్గజం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. కొన్ని ప్రాథమిక అంశాల కారణంగా కాస్త జాప్యం మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఎకానమీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాక.. ఈ దశాబ్దంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసే దేశాల్లో భారత్ ముందు ఉంటుందని చెప్పారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు! -
వర్క్ ఫ్రం హోం.. ‘బాబోయ్ మాకొద్దు’
సాక్షి, వెబ్‌డెస్క్: కోల్‌కతా బేస్డ్ ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వర్క్‌ఫ్రం బెటరా ? లేక ఆఫీస్ నుంచి పని బెటరా అని అర్థం వచ్చేలా గ్రాఫ్లతో కూడిన ఫోటోలను షేర్ చేశారు. బిజినెస్ టైకూన్ సంధించిన ఈ ప్రశ్నకు ఉద్యోగులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు. ఏది బెటర్ కోవిడ్ తీవ్రత తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా ఊపందుకోవడంతో అనేక కంపెనీలు తిరిగి ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలంటూ ఉద్యోగులకు సూచించగా మరికొన్ని కంపెనీలు వర్క్‌ఫ్రం హోం గడువు పెంచాయి. ఎక్కువ శాతం కంపెనీలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసుకునేలా హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. మొత్తంగా ఐటీ, మీడియా, బిజినెస్ సెక్టార్లో వర్క్‌ఫ్రం హోం అనే అంశంపై చర్చ బాగా జరుగుతోంది. అమ్మో ! వర్క్‌ఫ్రం హోం ఆనంద్ మహీంద్రా తరహాలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష్ గోయెంకా వర్క్‌ఫ్రం హోం, ఆఫీస్ వర్క్‌పై ట్వీట్ వదిలారు. ఇందులో ఆఫీస్ వర్క్ అయితే ట్రాఫిక్‌లో ఎంత సేపు ఉంటాం, కో వర్కర్లతో ముచ్చట్లు, లంచ్‌టైం, టీ టైంలో ఎంత సేపు ఉంటమనే విషయాలు గ్రాఫ్‌లో చెప్పారు. ఈ పనులన్నీ పోను ఆఫీసులో పని చేసేది చాలా తక్కువ సమయం అన్నట్టుగా ఫోటో పెట్టారు. అదే వర్క్‌ఫ్రం హోం అయితే వర్క్ తప్ప మరేం ఉండదంటూ చమత్కరించారు. మరికొందరు వర్క్‌ఫ్రం హోంలో వర్క్ మాత్రమే ఉంటున్నా అది కేవలం ఆఫీస్ పని ఒక్కటే కాదని, ఇంటి పనులు, సినిమాలు చూడటం వంటి పనులు కూడా ఉంటున్నాయన్నారు. వర్క్‌ఫ్రం హోంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. It has become reality now. Employees requesting to HR for office opening so that they can work for 8 hours instead of 24 hours. pic.twitter.com/Dm8pYXywie — Talkative $ (@Talkativedollar) August 16, 2021 ఆఫీసే బెటర్ హార్స్ గోయెంకా ఈ ట్వీట్ చేయడం ఆలస్యం నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇప్పటికే ఆఫీసులు ఓపెన్ చేయాలంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను కోరుతున్నా మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. వర్క్‌ఫ్రం హోంలో వర్క్‌లోడ్ ఎక్కువైపోయిందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అయ్యాయి. మరికొందరు ఆఫీస్‌లో పని ముగిస్తే పర్సనల్ లైఫ్ ఉంటుందని, కానీ వర్క్‌ఫ్రం హోంలో 24 గంటలు ఆఫీస్ పనే అవుతోందంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద వర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీస్ పనే బాగుందంటూ దానికి తగ్గట్టుగా ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు. pic.twitter.com/TcUG3LT9I2 — prashant (@chanchvayu) August 16, 2021 -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
వర్క్ ఫ్రం హోమ్ 2.0
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం క్రమంగా రెండో దశకు చేరుకుంది. ఇంటి నుంచి పని విధానం కాస్త హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు తెరలేపింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఉద్యోగులు గతంలో మాదిరిగా రోజూ ఆఫీసులకు వచ్చే సూచనలు కనిపించకపోవటంతో హైబ్రిడ్ వర్కింగ్ విధానాలపై కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒక రోజు ఇంటి నుంచి.. మరొక రోజు ఆఫీసు నుంచి పని చేసే వీలుండటమే హైబ్రిడ్ ప్రత్యేకత. ఉత్పాదకత పెరగడంతో పాటు ఉద్యోగుల గైర్హాజరు సగానికి పైగా తగ్గడంతో కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు కాసింత తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో కార్యాలయాల పునఃప్రారంభం, ఉద్యోగులు హాజరు అంశాల మీద చాలా వరకు కంపెనీలు కన్సల్టెంట్లతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పెద్ద కంపెనీలు హైబ్రిడ్ పని విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్ని ప్రారంభించేశాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ యూనిలివర్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ లీనా నాయర్ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇక ఎప్పటికీ పోదని చెప్పారు. కరోనాతో అనివార్యమైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కంపెనీలు, ఉద్యోగులు స్వాగతించక తప్పదన్నారు. 40 గంటల వారాల పాటు పనిదినాల తిరిగి రావటం ఇప్పట్లో కష్టమే. వ్యాపార సంస్థలకు ఉత్తమమైన పని విధానాలకు మారేందుకు కరోనా రూపంలో ఒక మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే యూనిలివర్ సరళమైన పని విధానాలను కలిగి ఉందని చెప్పారు. దీన్ని మరింత సమర్ధవంతగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మరింత మెరుగైన పని విధానాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 2020కి ముందటి పని విధానాలైతే తిరిగి రావని తేల్చిచెప్పారు. హైబ్రిడ్ వర్క్‌తో ఉత్పాదకత మెరుగు.. గతేడాది పని విధానాలలోని సవాళ్లను, మార్పులను గమనించిన కంపెనీలు పని విధానాలలో సరికొత్త మార్పులు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్, ఆఫీస్ ఫ్రం వర్క్ రెండు రకాల పని విధానాలతో భవిష్యత్తు కార్యాలయాలుంటాయి. ఇటీవలే పెప్సికో కార్పొరేట్ అసోసియేట్స్ కోసం ‘వర్క్ దట్ వర్క్స్’ కొత్త ప్రోగ్రామ్ కింద ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ప్లేస్ పాలసీలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త విధానంతో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేనేజర్స్, అసోసియేట్స్ రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రం హోమ్‌లో ఏ పని చేయాలో.. అదే సమయంలో కార్యాలయంలో ఏ పని చేయాలో ఎంపిక చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇలాంటి సౌకర్యవంతమైన పని విధానంలో ఉద్యోగుల గైర్హాజరు 31 శాతం తక్కువగా ఉంటుందని పెప్సికో అధ్యయనం తెలిపింది. అదే సమయంలో ఉత్పాకదతలో 15 శాతం వృద్ధి, టర్నోవర్‌లో 10 శాతం క్షీణత, వేధింపులు 10 శాతం తగ్గాయని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి కేపీఎంజీ ఇండియా హైబ్రిడ్ ఆఫీస్ పని విధానాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఉద్యోగుల దృష్టి కోణంలోంచి.. వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత మీద ప్రభావితం చూపుతుందన్న సందేహాలు చాలా వ్యాపార సంస్థలకున్నాయి. అయితే ఈ సందేహాలన్నీ కరోనాతో పటాపంచలయ్యాయని పెప్సికో ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పవిత్రా సింగ్ చెప్పారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులలో ఇలాంటి విధానం కీలకమైనదని.. ఇదొక గొప్ప ముందడుగని తెలిపారు. సాధారణ పని విధానాల మైండ్‌సెట్ మారాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే హైబ్రిడ్ పని విధానాల ప్రయోజనాలను మరింత సహజంగా నమ్ముతారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు హైబ్రిడ్ పని విధానాలను కచ్చితంగా ఇష్టపడతారని.. అయితే అదే సమయంలో ఆఫీస్, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారని తెలిపారు. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీసులకు రావటానికి ఇష్టపడతారు. ఎందుకంటే సాధారణ పని విధానం, ఒత్తిళ్లకు విరామం, సహోద్యోగులు, స్నేహితులతో కలిసే అవకాశం దొరుకుతుందని. అయితే హైబ్రిడ్ పని విధానాన్ని ఉద్యోగుల దృష్టి కోణంలోంచి చూస్తే.. ఔట్పుట్ డెలివరీ, వాస్తవ ఉత్పాదకత పెరిగాయి. ఉద్యోగుల సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణలు, ఆనందాల విషయంలో వ్యాపార సంస్థలు, యజమానులు రాజీపడకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఇక్కడే హైబ్రిడ్ పని విధానం సమర్ధవంతమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ వర్కింగ్ మోడల్లో ఆవిష్కరణ, çసహకరణ, అనుసంధానం, ఆనందం అన్ని రకాల అంశాలుంటాయని వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే ఉద్యోగులు స్థిరపడిపోతే వాళ్లు కార్యాలయ వాతావరణాన్ని, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారు. అందుకే ఉద్యోగులు తరుచుగా ఆఫీస్‌కు రావాల్సిన అవసరం ఉందని నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ హెడ్ విక్రమ్ ష్రాఫ్ తెలిపారు. హైబ్రిడ్ పని విధానంలో ప్రత్యామ్నాయ పని దినాలు, ఫ్లెక్సిబుల్ పని గంటల వంటి ఫీచర్లుంటాయి. ఫ్రంట్ డెస్క్, ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో దశల వారీగా ఆఫీసు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాలపై దృష్టిసారించాయి. టీకా వేయించుకున్న ఉద్యోగులే ఆఫీసులకు రావటానికి మొగ్గుచూపుతారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగుల అవసరాలను, ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని ష్రాఫ్ సూచించారు. -
ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది!
న్యూఢిల్లీ: ఓవైపు వర్క్‌ఫ్రం హోం విధానానికి ముగింపు పలికేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా... మరోవైపు వర్క్‌ఫ్రం హోంకే మెజారిటీ ఉద్యోగార్థులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు, పని విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. తొమ్మిది నగరాల్లోని 1,200 కంపెనీలతోపాటు 1,500 మంది ఉద్యోగుల నుంచి ఈ సర్వే కోసం శాంపిల్స్ సేకరించారు. వర్క్‌ఫ్రం హోం బెటర్ కరోనా కేసులు తగ్గినా.. దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లి పని చేసేయడానికి ఫ్రెషర్లు విముఖత చూపిస్తున్నారు. ఇంటి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పనికి 46 శాతం మంది మద్దతు తెలపగా హైబ్రిడ్ విధానం ఉండాలని 29 శాతం మంది అన్నారు. హైబ్రిడ్ అంటున్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసు, ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మేలని 42 శాతం కంపెనీలు తెలిపాయి. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందని ఆ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. కాగా ఇంటి నుంచి విధులు ఉండాలని 35 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడమే సరైన పద్దతని 23 శాతం కంపెనీలు చెప్పాయి. ఆఫీసే... మేల్ వర్క్‌ఫ్రం హోం విధానానికి మేల్ ఎంప్లాయిస్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. అయితే ఇదే సమయంలో మహిళలు వర్క్‌ఫ్రం హోంకే జై కొడుతున్నారు. ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పని కొనసాగించడమే బాగుంది 51 శాతం మహిళలు తెలియజేస్తే.. పురుషుల విషయంలో ఇది 29 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సాధారణంగా బయటకు వెళ్లి పని చేయడాన్ని ఇష్టపడే మగవాళ్లు, వర్క్‌ఫ్రం హోంలో ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటాన్ని ఇష్టపడటం లేదు. వేతనమే ముఖ్యం వర్క్‌ఫ్రం హోం , ఆఫీస్ అనే తేడాలు పెద్దగా పట్టించుకోమని కంపెనీ ఎంత వేతనం అందిస్తుంది అనేదే తమకు ప్రాధాన్యమని 25 శాతం మంది ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. నియమకాలు పెరిగాయ్ దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఐటీ 61 శాతం, ఆర్థిక సేవలు 48, బీపీవో, ఐటీఈఎస్ రంగాలు 47 శాతం వృద్ధి కనబరిచాయి. అయితే గడిచిన త్రైమాసికంలో పదోన్నతి, వేతన పెంపు అందుకోలేదని 70 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. -
మరోముప్పు.. కరోనా హైబ్రిడ్
వెబ్‌డెస్క్: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా హైబ్రిడ్ రకం వెలుగు చూసింది. గత వేరియంట్లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వియత్నాంలో సంకర కరోనా సాధారణంగా వైరస్లు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంటాయి. మొదట వచ్చిన వైరస్‌లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్ వేరియంట్లు చాలా ప్రమాదకరం. అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అత్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇండియాలో, బ్రిటన్లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్టు వియత్నాం హెల్త్ మినిష్టర్ న్యూయెన్ థాన్ ప్రకటించారు. పాత వేరియంట్లను మించి వియత్నాం దేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చుట్టేస్తోంది. దేశంలో ఉన్న 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఈ 31 నగరాల నుంచే వస్తున్నాయి. దీంతో ఇక్కడ కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్ పరిశీలించగా.... ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ లక్షణాలతో కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ పూర్వపు మ్యూటెంట్లను మించిన వేగంతో త్వరగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు రకానికి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన వేరియంట్ల కంటే ఇది ప్రాణాలకు ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం అంటోంది. వియత్నాంలో వణుకు ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కరోనా వేరియంట్ల వ్యాప్తిని గతంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. కానీ హైబ్రిడ్ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. దేశంలో రోజురోజుకి హైబ్రిడ్ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. -
సుప్రీంలో ‘హైబ్రిడ్’ విచారణ
న్యూఢిల్లీ: గతేడాది మార్చి నుంచి ఆన్లైన్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటున్న సుప్రీంకోర్టు ఇకపై హైబ్రిడ్ విధానంలో వాదనలు విననుంది. ఈ హైబ్రిడ్ పద్ధతి ఇదే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి సాధారణ మార్గదర్శకాలను (ఎస్ఓపీ) సుప్రీంకోర్టు శనివారం విడుదల చేసింది. ‘ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు కింద హైబ్రిడ్ విచారణ జరుగుతుంది. వీటిలో తుది వాదనలు, సాధారణ వాదనలు.. మంగళ, బుధ, గురు వారాల్లో జరుగుతాయి. ఏ పద్ధతిలో విచారణ జరగాలన్న విషయాన్ని ధర్మాసనమే నిర్ణయిస్తుంది. ఇరు వైపు కక్షిదారుల్లో ఉన్న సంఖ్యను బట్టి, కోర్టు హాలు సైజును బట్టి ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక సోమ, శుక్రవారాల్లో కేవలం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణ జరుగుతుంది. ఏమిటీ హైబ్రిడ్ పద్ధతి.. విచారణ సమయంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తుల సంఖ్య కోవిడ్ నిబంధనల ప్రకారం, గది సైజును మించి ఎక్కువగా ఉంటే.. అప్పుడు ధర్మాసనం హైబ్రిడ్ పద్ధతిలో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం కోర్టు గదిలో కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రత్యక్ష విచారణ జరిపేలా పార్టీల్లో ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు టెలీ కాన్ఫరెన్స్‌లో ఉంటారు. ఇదే ‘హైబ్రిడ్ విధానం’ అని సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇదంతా ధర్మాసనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ పార్టీలు ఉంటే అప్పుడు ఒక్కో పార్టీకి ఒక్క అడ్వొకేట్ మాత్రమే విచారణలో పాల్గొంటారని తెలిపింది. ఇతర నియమాలు కూడా.. హైబ్రిడ్ పద్ధతిలో కూడా కరోనా నిబంధనలు తప్పనిసరి. విచారణల్లో పాల్గొనే వారికి ప్రాక్సిమిటీ/లాంగ్‌టర్మ్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డులు నిర్ణీత కాలవ్యవధి అనుమతి మాత్రమే కలిగి ఉంటాయి. వాదనల్లో పాల్గొనే ఇరు పార్టీలు ఆన్లైన్ ద్వారా విచారణ జరిపేందుకు అంగీకరిస్తే ధర్మాసనం కూడా దాన్ని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తుంది. విచారణకు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే పార్టీలను కోర్టు హాల్లోకి అనుమతిస్తారు. -
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ‘బాలెనో’
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘బాలెనో’ కారు నూతన వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పెట్రోల్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.5.58 లక్షల నుంచి రూ.8.9 లక్షలుగా ప్రకటించింది. వీటితో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మరో రెండు అధునాతన వేరియంట్లను కంపెనీ విడుదలచేసింది. 1.2 లీటర్ల డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ ధర రూ.7.25 లక్షలు కాగా, జీటా వేరియంట్ ధర రూ.7.86 లక్షలు. ఈ కార్లు లీటరుకు 23.87 కిలో మీటర్ల మైలేజీ ఇస్తాయని సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి మాట్లాడుతూ.. ‘అధునాతన, మెరుగైన, పర్యావరణ స్నేహపూర్వక సాంకేతికత కలిగిన ఉత్పత్తులను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలకు తగిన, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బాలెనోను విడుదలచేశాం. దేశంలోనే తొలి ఈ తరహా టెక్నాలజీ కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా ఉందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఇక బాలెనో మోడల్ 2015లో విడుదల కాగా, ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 2 లక్షల యూనిట్లను విక్రయించింది. అగ్రస్థానంలో ‘ఆల్టో’ ఇప్పటికే అనేక సార్లు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన మారుతీ ‘ఆల్టో’.. 2018–19 ఏడాది ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం.. గతేడాదిలో ఆల్టో వాహన విక్రయాలు 2,59,401 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది (2017–18) అమ్మకాలు 2,58,539 యూనిట్లు. ఇక టాప్ 10 విక్రయాల జాబితాలో 2,53,859 యూనిట్లతో డిజైర్ రెండో స్థానంలో నిలిచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ 2,23,924 యూనిట్లతో మూడవ స్థానంలో ఉండగా.. బాలెనో 2,12,330 యూనిట్లతో 4వ స్థానంలో ఉంది. -
పతనాల్లో కొంత రక్షణ
ఎన్నికల ముందు మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళనతో ఉన్న వారు, మార్కెట్ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై కాస్త అధిక రాబడులు ఆశించే వారికి ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూడా ఒక ఎంపిక అవుతుంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని తీసుకెళ్లి డెట్సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో మార్కెట్ పతనాల్లో ఎన్ఏవీ ఘోరంగా పతనం కాకుండా డెట్ పెట్టుబడులు మేలు చేస్తాయి. అలాగే, ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు వీలు పడుతుంది. హైబ్రిడ్ ఫండ్స్ నుంచి ఉన్న రెండిందాల ప్రయోజనాలు ఇవే. ఈ విభాగంలో ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ప్రిన్సిపల్ బ్యాలెన్స్డ్ ఫండ్ పేరుతో కొనసాగగా... సెబీ పథకాల పునర్వ్యవస్థీకరణ ఆదేశాల తర్వాత పేరులో మార్పు చోటు చేసుకుంది. పెట్టుబడుల విధానం అన్ని మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్త ధోరణితో కొనసాగుతుంది. ఈక్విటీలకు పెట్టుబడులను 70 శాతం వరకు కేటాయించడం అన్నది అరుదుగా మాత్రమే ఈ ఫండ్ మేనేజర్ చేస్తుంటారు. 2017 బుల్ మార్కెట్, 2018 బేర్ మార్కెట్ సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. 2017 ర్యాలీలో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉండడం వల్ల అద్భుత పనితీరు చూపించింది. సమస్యాత్మకమైన సాఫ్ట్వేర్, ఫార్మా వంటి విభాగాల్లో ఆ ఏడాది పెట్టుబడులను తగ్గించుకుంది. ఇక 2018లో సురక్షితంగా కనిపించిన కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ స్టాక్స్‌ను యాడ్ చేసుకుంది. తద్వారా అస్థిరతల ప్రభావాన్ని తగ్గించుకుంది. అలాగే, రూపాయి బలోపేతం అవుతుండడంతో ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకోవడం ఆరంభించింది. దీనికితోడు అస్థిరతల ప్రభావం తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం పెంచింది. 2018 ఆరంభంలో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు 25 శాతంగా ఉండగా, వాటిని 20%కి తగ్గించుకుంది. ఇక డెట్ విభాగంలోనూ పలు మార్పులు చేసుకుంది. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 6.5% నుంచి 8%కి పెరగడంతో ఈ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ను తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు, పెట్టుబడుల విధానాల కారణంగా ఈ పథకం హైబ్రిడ్ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది. రాబడులు..: ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 2.5%. ఇదే సమయంలో ఈ విభాగం సగటు రాబడులు 2.2% ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈ పథకం వార్షికంగా ఇచ్చిన రిటర్నులు 16.7% ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు 11.2%∙ఉండడం గమనార్హం. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 15.1% ఉంటే, విభాగం రాబడులు 12.4%గానే ఉన్నాయి. -
భారత్‌కు హైబ్రిడ్ కార్లు మేలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘దేశీయంగా 2030 నుంచి అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌వే ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ సమయానికి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించి తన నిర్ణయంపై వెనుకడుగు వేసింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే కొత్తగా రోడ్డెక్కాలంటే 2050 తర్వాతనే సాధ్యం అవుతుంది’’ అని టయోట కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ఇక్కడి మార్కెట్‌కు హైబ్రిడ్ కార్లు అనువైనవని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా టయోట 34 రకాల హైబ్రిడ్ మోడళ్లను తయారు చేస్తోందన్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు 1.1 కోట్ల వాహనాలను విక్రయించిందని చెప్పారు. కస్టమర్ల డిమాండ్, పన్నుల ఆధారంగా భారత్‌లోనూ దశలవారీగా వీటిని ప్రవేశపెడతామన్నారు. గురువారమిక్కడ టయోట కొత్త వాహనం యారిస్‌ను విడుదల చేసిన సందర్భంగా డీజీఎం వినయ్ కన్సల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. యారిస్ కోసం 60,000 పైగా ఎంక్వైరీలు వచ్చాయన్నారు. -
రంగుల రోజా
రామభద్రపురం (బొబ్బిలి) : ఊసరవల్లిలా రంగులు మార్చుతున్న పుష్పం‘గులాబీ పువ్వై నవ్వాలి వయసు.. జగాన వలపే నిండాలిలే’ అయు ఒక కవి రాశాడు. ప్రేమజంటల చేతిలో ఈ పూలను చూస్తుంటాం.. అసలు గులాబీ పువ్వుని ప్రేమించకుండా.. ఆరాధించకుండా ఎవరుంటారు. అరవిరిసిన గులాబీ వర్ణం అద్భుతం.. అది విభిన్న వర్ణాలను సంతరించుకుంటే అపూర్వం. అలాంటి గులాబీ రామభద్రపురం చొక్కాపువీధిలోని చొక్కాపు సత్యవతి ఇంటి ఆవరణలో అందాలు చిందిస్తోంది. మొగ్గ దశలో పసుపు రంగులో.. పూర్తిగా వికసించే సరికి గులాబీ రంగులోకి మారిపోతూ కనువిందు చేస్తోంది. ఈ విషయాన్ని ఉద్యానశాఖాధికారి ఎస్ వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా హైబ్రిడ్ రకానికి చెందిన మొక్కలే ఇలాంటి పూలు పూస్తాయని తెలిపారు. -
ఎన్‌సోనో చేతికి విప్రో ‘డేటా సెంటర్’
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా తమ హోస్టెడ్ డేటా సెంటర్ సర్వీసెస్ వ్యాపారాన్ని ఎన్‌సోనో సంస్థకు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎన్‌సోనోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ 405 మిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ప్రకారం విప్రోకి చెందిన ఎనిమిది డేటా సెంటర్స్, వాటిల్లో పనిచేసే 900 మంది ఉద్యోగులు ఎన్‌సోనోకు బదిలీ అవుతారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఎన్‌సోనో సంస్థకి ఈ డీల్ ఉపయోగపడుతుందని విప్రో సీనియర్ వీపీ కిరణ్ దేశాయ్ పేర్కొన్నారు. 2007లో ఇన్ఫోక్రాసింగ్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా మరో రెండు విభాగాలతో పాటు హోస్టెడ్ డేటా సెంటర్ సర్వీస్ వ్యాపారం కూడా విప్రో చేతికి వచ్చింది. తాజాగా దీన్నే విక్రయిస్తోంది. ఇక, మూడేళ్ల వ్యవధిలో ఇది తాము కొనుగోలు చేస్తున్న మూడో సంస్థ కానుందని ఎన్‌సోనో సీఈవో జెఫ్ వాన్‌డైలెన్ తెలిపారు. మరోవైపు విప్రో కొత్త, పాత ఎంటర్ప్రైజ్ కస్టమర్స్‌కి సంయుక్తంగా హైబ్రీడ్ ఐటీ సర్వీసులు అందించే దిశగా విప్రో, ఎన్‌సోనో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
హైబ్రిడ్ కూరగాయల సాగుకు అదును
– విత్తన మోతాదు పెంచుకోవాలి – మొక్కల సాంద్రత పెరిగితేనే లాభం – ఉద్యాన శాఖ ఏడీ రఘునాథరెడ్డి సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో కూరగాయల కొరత సహజంగా ఏర్పడుతుంది. అప్పుడు ధరలు పెరగడం ప్రతి ఏటా సర్వసాధారణం. వేసవికి మార్కెట్లోకి కూరగాయలు మార్కెట్లోకి వచ్చే విధంగా సాగు చేసుకుంటే నికరాదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుత వాతావరణానికి తగినట్లుగా అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్(సంకర జాతి) వంగడాలను ఎన్నుకోవడం అవసరమని ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి(79950 86793) పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... మొక్కల సాంద్రత పెంచుట... రబీలో అధిక ఉష్ణోగ్రత కారణంగా మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. పూత, పిందె తగ్గి, దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను దగ్గరదగ్గరగా తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే ఒక మొక్క ద్వారా దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉండటం వల్ల నిర్ణీత విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వేసవిలో కూరగాయలు సాగు చేసే రైతులు విత్తన మోతాదును పెంచాలి. మొక్కల మధ్య దూరం.. టమటాలో మొక్కల మధ్య దూరంలో 40 ఇంటు 30 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 250 గ్రాముల విత్తనం అవసరం. వంగలో మొక్కల మధ్య దూరం 60 ఇంటు 45 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 300 గ్రాముల విత్తనం అవసరం. బెండలో 45 ఇంటు 20 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాలు అవసరం. పచ్చి మిరపలో 45 ఇంటు 45 ప్రకారం మొక్కల మధ్య దూరం ఉండాలి. 650 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. బీరలో 1.5 ఇంటు 0.5 మీటర్ల మేర మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. కాకరలో 1.5 ఇంటు 0.5 మీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. కాకరలో 1.5 ఇంటు 0.5 మీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. జాగ్రత్తలు అవసరం.. – సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వాడితే భూమిలో తేమను పట్టి ఉంచే గుణం పెరగటమే కాక సూక్ష్మ జీవుల చర్య పెరిగి పోషకాల లభ్యత పెరుగుతుంది. – జీవన ఎరువులైన అజటోబాక్టర్, ఫాప్పొ బాక్టీరియా ఎకరానికి 2 కిలోల చొప్పున వాడితే సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం ఎరువులు 25 శాతం ఆదా చేయవచ్చు. – మొక్క పెరుగుదల దశలో అంటే 30, 45, 75 రోజులకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేస్తే నత్రజని ఆదాతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే వీలుంటుంది. – ప్రతి 9 కిలోల యూరియాకు ఒక కిలో వేప పిండి లేదా 25 కిలో యూరియాకు ఒక కిలో వేపనూనె కలిపి అరగంట సేపు ఆరబెట్టి వేస్తే ఎంత వేడికైనా యూరియా ఆవిరి కాకుండా ఎక్కువ కాలం మొక్కకు అందుబాటులో ఉంటుంది. – రబీలో టమాటలో కాయ పగుళ్లు, సైజు తగ్గడం, కాయ కింద కుళ్లు మొదలైన సమస్యలు బోరాన్, కాల్షియం లోపం వల్ల వస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి పూత, పిందె దశలో రెండు సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేయాలి. కాయ కింద కుళ్లు నివారణకు కాల్షియం నైట్రేటు 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి. ప్రభుత్వ చేయూత... రబీలో కూరగాయల సాగుకు డ్రిప్ సౌకర్యం కల్పించుకోవాలి. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఉంది. ట్రైల్లీస్ పద్ధతిలో టమాట సాగు చేసుకోవడానికి రాయితీ లభిస్తుంది. కూరగాయల పంటల సాగుకు మల్చింగ్ సౌకర్యం కల్పించుకోవాలి. మల్చింగ్ ఏర్పరచుకునేందుకు 50 శాతం రాయితీ లభిస్తుంది. -
వరి ఉత్పత్తిలో రికార్డ్ సృష్టించిన చైనా శాస్త్రవేత్త
-
జీఎం పంటల్లోనూ గోప్యతేనా?
సందర్భం సహజంగా పండే పంటలకు జన్యుమా ర్పిడి చేస్తున్నామంటూ కొన్ని కంపెనీలు కొత్త హైబ్రిడ్ జీవ పదార్థాలను పర్యావరణంలోకి వదులుతున్నాయి. రైతులు వాటిని పండించాలని మార్కెట్ చేస్తున్నారు. అవి పర్యావరణపరంగా భద్రమైనవా కావా అని తేల్చి ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం బాధ్యత పర్యావరణ మంత్రిత్వ శాఖపైన ఉంది. వీటికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ప్రజలకు మొత్తం సమాచారం ఇచ్చి ప్రయోగాలు జరిపి, అభ్యంతరాలు విని, వాటిని నిపుణుల ద్వారా పరిశీలింపచేసిన తరువాత అమ్మకాలకు అనుమతించాలని చెబుతున్నాయి. ఉత్పత్తి దారుడి వాణిజ్య ప్రయోజనాలను కూడా రక్షించేందుకు కొంత గోప్యనీయత అవసరం. ఏది గోప్యనీయం ఏది కాదు అని నియమాలను కూడా రూపొందించారు. పర్యావరణ రక్షణ చట్టం కింద కూడా ఈ సమాచారం ఇవ్వవలసిందే. ఆవాలకు సంబంధించి జన్యుమార్పిడి ప్రయోగాల సమాచారం మొత్తం ఇవ్వాలని కవితా కురుగంటి పర్యావరణ మంత్రిత్వ శాఖను సమాచార హక్కు చట్టం కింద అడిగారు. జన్యుమార్పిడి ఆవాల పంట విషయంలో క్షేత్ర స్థాయి పరీక్షలు ప్రయోగాలు జరుగు తున్నాయని కాని అవి ఇంకా పూర్తి కాని ప్రక్రియకు సంబంధించిన సమాచారం కనుక రహస్యాలని, ఇవ్వడం సాధ్యం కాదని అధికా రులు జవాబిచ్చారు. ప్రయోగాలు పూర్తికాకముందే సమాచారం ఇస్తే పాక్షిక సమాచారం అవుతుందని వాదించారు. ఇది వరకు జన్యుమార్పిడి వంకాయలకు సంబంధించిన ప్రయోగ సమాచారాన్ని ఈ విధంగానే దాచివేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లవలసి వచ్చిందని, వాటి వల్ల ప్రజల భద్రతకు ముప్పువాటిల్ల బోదనే గ్యారంటీ లేకపోవడం వల్ల ఆ సమాచారం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన తరువాత గానీ పర్యావరణ శాఖ ఆ సమాచారాన్ని ప్రజాబాహుళ్యంలోకి తేలేదని, మరోసారి అటువంటి పొరపాటు చేయవద్దని కవిత కోరారు. చివరకు జన్యుమార్పిడి పదార్థాలను కంపెనీలు జనం మీద రుద్దితే బాధితు లయ్యేది ప్రజలే కనుక వారికి సమాచారం ఇవ్వడంలో లోపం ఉండకూడదని కవిత కోరారు. జన్యుమార్పిడి పరిశీలన సంఘం జీఈఏసీ కూడా వంకాయ జన్యుమార్పిడి వివరాలు ఇచ్చిందని వివరించారు. కనుక జీఈఏసీ పరిశీలనకు సమర్పించిన అజెండా వివరాలు వారి నిర్ణయ సమావేశంలో నిర్ణయ వివరాలు (మినిట్స్) కూడా ఇవ్వాలని ఆమె కోరారు. జన్యుమార్పిడి చేసిన ఆవాలు హైబ్రిడ్ డీఎంహెచ్ 11, సీజీఎం సీపీ వారి పర్యావరణ పరమైన విడుదల కోసం ఢిల్లీ విశ్వవిద్యా లయం దక్షిణ క్యాంపస్ ప్రయోగాలలో ఉందని, జీఈఏసీ అనుమ తించిన తరువాత సమాచారం ఇస్తారని అధికారులు అన్నారు. అనుమతించిన తరువాత సమాచారం ఇస్తే ఏం ప్రయోజనం? అంతకు ముందు సమాచారం ఇస్తే దానికి ఎందుకు అనుమతించ కూడదనో అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ప్రజలకు వస్తుంది. తమకు నిర్ణయ వివరాల సారాంశం ఇవ్వాలని మాత్రమే అను మతి ఉందని, పూర్తి వివరాలు ఇవ్వడానికి వీల్లేదని జి.ఇ.ఎ.సి. మెంబర్ సెక్రటరీ మధుమిత బిస్వాస్ కమిషన్‌కు విన్నవించారు. అదీగాకుండా క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతేనే తాము వివరాలు ఇస్తామని అన్నారు. సారాంశం ఇచ్చినపుడు వివరాలు ఎందుకు ఇవ్వకూడదో వారు చెప్పలేదు. ప్రయోగాలు విజయవంతమైతే ఇస్తాం విఫలమైతే ఇవ్వబోము అనే వాదానికి ఆధారం లేదు. సమాచార హక్కు చట్టం కింద ఇటువంటి మినహాయింపులేమీ లేవు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాల వివరాలు ఇవ్వవల సిందే. కోరిన సమాచారం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటో అది ఏ మినహాయింపు కింద సమర్థనీయమో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థపైన ఉంటుంది. అసలు ఈ సమాచారం ముందుగా సెక్షన్ 4 ఆర్టీఐ చట్టం కింద తమంత తాముగా ఇవ్వవలసిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆవాలు కొనుక్కోవలసింది జనం. తిని బాధపడవలసింది జనం. వారికి ఈ జన్యుమార్పిడి ఆవాలలో భద్రత ఉందో లేదో వివరిం చాల్సిన అవసరం ఉంది. ఏ దశలోనైనా సరే ఈ వివరాలు ఇస్తే ఎవరైనా అభ్యంతరాలు చెప్పడానికి వీలుంటుంది. పర్యావరణ రక్షణలో ప్రమాదాలను కూడా చర్చించే వీలుంటుంది. జన్యుమార్పిడి ఆవాలు తయారు చేసిన కంపెనీ వారికి పేటెంట్ హక్కులున్నాయని, ముందే సమాచారం ఇస్తే వారి పేటెంట్ హక్కులు భంగపడతాయని కూడా పర్యావరణ అధి కారులు వాదిం చారు. పేటెంట్ హక్కును గుర్తించినప్పటికీ, దాని అర్థం సమాచారం ఎవ్వరికీ ఇవ్వకూడదని కాదు. నిజానికి పేటెంట్ కోరుకునే వ్యక్తి లేదా కంపెనీ తాము పేటెంట్ సాధించిన పరిశోధన సమాచారాన్ని సమా జానికి అందుబాటులో ఉంచడానికి ఒప్పుకుం టుంది. అందుకు ప్రతి ఫలంగా ఆ సమాచారాన్ని వినియోగించి ఎవరైనా పారిశ్రామిక ఉత్పత్తి చేయకుండా ప్రభుత్వం నిరోధిస్తుంది. కనుక పేటెంట్ హక్కు కేవలం పారిశ్రామిక ఉత్పత్తులు అనధికా రికంగా ఇతరులు సాగించకుండా నిలిపివేస్తుంది. అంతేగానీ పేటెంట్ సమాచారాన్ని రహస్యంగా దాచడం పేటెంట్ లక్షణం కాదు. ఒకవేళ మినహాయింపు వర్తిస్తుందనుకున్నా ప్రజాశ్రేయస్సు కోసం ఇవ్వవచ్చునని సెక్షన్ 8(1) (2) వివరిస్తున్నాయి. దేశాల హద్దులు దాటి జన్యుమార్పిడి ఆహార పదార్థాలు విస్తరణ విష యంలో తొలి అంతర్జాతీయ ఒప్పందం జీవ వైవిధ్యంపైన కార్టెజెనా ప్రొటోకాల్ ప్రకారం వీటిపైన ఆంక్షలు, నిషేధాలు విధించే అవ కాశం ఉంది. జీవవైవిధ్యంపైన ఈ కొత్త జన్యుమార్పిడి పదార్థాల ప్రభావం, ప్రజల ఆరోగ్యంపైన పడే ప్రమాద అవకాశాలను, సంక్షోభ సమయంలో చేయవలసిన పనుల వివరాలను రహస్యా లుగా భావించకూడదని ఈ ఒప్పందం వివరిస్తున్నది. కనుక ఈ ఒప్పందంతో పాటు, ఆర్టీఐ చట్టం, పర్యావరణ చట్టాన్ని అనుస రించి జన్యుమార్పిడి ఆవాల ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం జనం ముందుంచాల్సిందే. (కవితా కురుగంటి వర్సెస్ భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/అ/అ/2015/901798లో 1.4.2016 నాడు ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. -
హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు
యాంత్రీకరణ కూడా అవసరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యక్రమాల వివరణ జెడ్‌ఆర్‌ఈఏసీ సమావేశాలు ప్రారంభం అనకాపల్లి, న్యూస్‌లైన్: అధిక వర్షాలను తట్టుకోగలిగే ఎంటీయూ 1121 వరివంగడం ఉపయోగించుకోవాలని, హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ డీన్ టి.రమేష్‌బాబు సూచించారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం జూబ్లీ హాల్లో సోమవారం నుంచి 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించిన ఉత్తర కోస్తా మండలి పరిశోధనా, విస్తరణ సలహా మండలి సమావేశాలు మొదలయ్యా యి. ఏడీఆర్ కె.వీరభద్రరావు అధ్యక్షతన జరిగి న ఈ సమావేశాలను జిల్లా వ్యవసా య శాఖ సంయుక్త సంచాలకులు ఎన్.సి.శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసిన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌బాబు మా ట్లాడుతూ జిల్లాలో యాంత్రీకరణ చా లా తక్కువగా ఉందని తెలిపారు. డ్ర మ్ సీడర్, శ్రీవరి సాగు వల్ల అధిక దిగుబడులు వస్తున్నందున ఆ పద్ధతులనే అవలంబించాలని సూచించారు. మొ క్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వు సా గు చేసినప్పుడు అవి భూమి నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటాయని చెప్పారు. దీని వల్ల అనంతరం సాగుచేసే వరిలో దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. చిరుధాన్యాల సాగును ప్రో త్సహించాలని, హైబ్రీడ్ వరి, హైబ్రీడ్ చెరకుపై పరిశోధనలు జరగాలని పరిశోధనా విభాగానికి సూచించారు. పత్తిలో మొక్కల సాంధ్రత ఎక్కువ చే యడం ద్వారా అధిక దిగుబడులు సా ధించవచ్చన్నారు. వరిలో ఇనుము, జింక్ ధాతువులను చొప్పించడం ద్వా రా ఆరోగ్యవంతమైన వరి మనకు లభిస్తుందని చెప్పారు. టీబీజీ 104 అనే మినుము రకం కూడా పల్లాకు తెగులును తట్టుకుంటుందని చెప్పారు. వి శిష్ట అతిథిగా విచ్చేసిన నైరా వ్యవసా య కళాశాల అసోసియేట్ డీన్ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ సా గు ఖర్చులు తగ్గించుకుని వ్యవసా యం చేయాలని రైతులకు పిలుపుని చ్చారు. ఉత్తర కోస్తా భూముల్లో భాస్వ రం అధికంగా ఉన్నందున ఎరువులు తక్కువగా వినియోగించాలని సూచిం చారు. విత్తన శుద్ధి, రసాయన కలుపు మందులు వాడడం వల్ల కూలీల కొరతను అధిగమించవచ్చని చెప్పారు. వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వరి విస్తీర్ణం రోజుకు రోజుకూ పెరుగుతోందని, అధిక వర్షాల వల్ల దిగుబడులు బాగా పడిపోయాయని పేర్కొన్నారు. పంటల్లో పురుగులు, తెగుళ్ల బాధలు అధికంగా ఉన్నాయని, తక్కు వ కాలపరిమితి కలిగిన రకాలను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను వినియోగించాలని కోరారు. విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సం చాలకులు జి.లీలావతి మాట్లాడుతూ మొక్కజొన్న గింజలు ఎండబట్టే డ్రయ ర్స్ రావాలని ఆకాంక్షించారు. బయోఫెర్టిలైజర్స్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తరపున విచ్చేసిన కె.రామారావు మాట్లాడుతూ గత ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. వరిలో ఎకరానికి 15 బస్తాల దిగుబడి రావడంతో రైతులు నష్టపోయారని చెప్పారు. అంతకుముందు ఏడీఆర్ కె.వీరభద్రరావు ఉత్తర కోస్తా మండలంలో గత సంవత్సరం చేపట్టిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. ముందుగా చెరకు ప్రధాన శాస్త్రవేత్త కె.ప్రసాదరావు సమావేశంలోని సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన ఏరువాక కేంద్రం ప్రతినిధు లు, వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.