ఇది అలాంటిలాంటి విమానం కాదు, పెద్ద ఓడలాంటి విమానం. గాలిలో ఇది ఎగురుతుంటే, పెద్ద ఓడ నింగిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌లాండర్ ఈ భారీ విమానానికి రూపకల్పన చేసింది. బ్రిటన్‌కు చెందిన విమానాల డిజైనింగ్ సంస్థ ‘డిజైన్–క్యూ’ సహాయంతో రూపొందించిన ఈ విమానం పేరు ‘ఎయిర్‌లాండర్–10’. ఇందులో లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం విశేషం.
ఇదీ చదవండి: ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం ఎనిమిది బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, షవర్‌లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా, వైఫై సౌకర్యం, ఇతర వినోద సౌకర్యాలు, బార్ వంటి విలాసాలు ఈ విమానం ప్రత్యేకత. సాధారణ విమానాలతో పోలిస్తే దీని వేగం కాస్త తక్కువే! సాధారణ విమానాల గరిష్ఠ వేగం గంటకు 500 మైళ్లకు పైగా ఉంటే, దీని గరిష్ఠవేగం గంటకు 100 మైళ్లు మాత్రమే! ఇది 2026లో తన తొలి ప్రయాణం ప్రారంభించనుంది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment