vehicle
-
వాహన జోరుకు యూవీల తోడు
తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.‘2024 జనవరితో పోలిస్తే హోల్‌సేల్‌గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది. ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికిటీవీఎస్ సప్లై చైన్‌లో మరింత వాటాద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ మోటార్ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది. -
జర్నలిస్ట్ పై టీడీపీ నేతల దాడి
-
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ నేత వాహనానికి నిప్పు
సాక్షి, అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు. -
అడవుల్లో సైతం అవలీలగా వెళ్లే వెహికల్ ఇదే (ఫోటోలు)
-
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీ (11 ఎంఎల్ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.🚨 SAD NEWS! 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector. Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care.PRAYERS 🙏 pic.twitter.com/oltXwzFCIH— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024 -
బండి తోసుకెళ్తారు... తుక్కు చేసేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కాలం చెల్లిన వాహనాలను తుక్కు చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేసే సమగ్ర స్క్రాపింగ్ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని కొత్తూరు, తూప్రాన్లలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో నగరంలో కాలం చెల్లిన వాహనాల తుక్కు ప్రక్రియ మొదలైంది. రవాణాశాఖ పర్యవేక్షణలో జరిగే స్క్రాపింగ్‌లో 15 ఏళ్ల కాల పరిమితి ముగిసిన వాహనాలను తుక్కు చేయడంతో పాటు వాటి రిజి్రస్టేషన్లను రద్దు చేస్తారు. ఈ మేరకు స్క్రాపింగ్ సెంటర్ల నిర్వాహకులే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీంతో వాహనదారులకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రెండో వాహనంపై 2 శాతం చొప్పున జీవితకాల పన్ను విధిస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన స్క్రాప్ పాలసీతో ఈ ఇబ్బంది తొలగనుంది. అలాగే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం వరకు పన్ను రాయితీ లభించనుంది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే వాహనదారులకు కొత్త వాటిపై ద్విచక్ర వాహనాలపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు, కార్లపై కనిష్టంగా రూ.5000 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు పన్ను రాయితీ ఉంటుంది. వాహనదారులు తమ వాహనాలను స్క్రాప్ చేయాలని కోరితే సదరు స్క్రాప్ కేంద్రాల నిర్వాహకులే స్వయంగా వచ్చి టోయింగ్ ద్వారా వాహనాలను తరలించి స్క్రాప్ చేస్తారు. గ్రేటర్లో 18 లక్షల పాత వాహనాలు... ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. మోటారు వాహన నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను తిరిగి వినియోగించుకునేందుకు రవాణాశాఖ వాటి అనుమతులను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందజేస్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన వాహనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇది స్వచ్ఛందంగా కొనసాగే ప్రక్రియే అయినప్పటికీ ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ పాత వాహనాలను వదిలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో కొన్నింటిని యజమానులు రిజి్రస్టేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వినియోగానికి పనికి రాకుండా మూలన పడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు కొన్ని వాహనాలు రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపిస్తూ వినియోగంలో లేకుండా ఉన్నాయి.స్పష్టత లేని స్క్రాప్...ఇలాంటి వాహనాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ప్రభుత్వం తాజాగా స్క్రాప్ పాలసీని అమలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఉనికిలో లేని వాహనాలను కూడా తుక్కుగా మార్చినట్లు ధ్రువీకరించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే స్క్రాప్ విధానం సమగ్రంగా అమలవుతుందని పేర్కొంటున్నారు.గల్లంతైన వాటి సంగతేంటి.... మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయవలసి ఉంటుంది. ఇక వ్యక్తిగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాప్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవిత కాలపన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపై పోలీస్స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. -
మూడు చక్రాల వింత వాహనం: ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
పేరుకుపోతున్న వాహన నిల్వలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీలర్ల వద్ద ప్యాసింజర్ వాహన నిల్వలు పోగవడం సహజం. ప్రస్తుతం ఉన్న 80–85 రోజుల ఇన్వెంటరీ(గోదాముల్లో అమ్ముడవకుండా ఉన్న నిల్వలు) స్థాయి ఆందోళన కలిగిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) చెబుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.9 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాల నిల్వలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతమవుతోంది.డీలర్ల వద్ద పోగైన వాహనాల విలువ ఏకంగా రూ.79,000 కోట్లు అని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 19 శాతం క్షీణించి 2,75,681 యూనిట్లకు వచ్చి చేరాయి. టూవీలర్స్ అమ్మకాలు 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 1,06,524 యూనిట్లు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 10 శాతం పడిపోయి 74,324 యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్లు 15 శాతం దూసుకెళ్లి 74,324 యూనిట్లను తాకాయి. ఇక అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్స్ 18,99,192 నుంచి 9 శాతం క్షీణించి 17,23,330 యూనిట్లకు పడిపోయాయి. ఇది చివరి అవకాశం..‘భారీ వర్షపాతం, మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమ పనితీరు చాలా వరకు నిలిచిపోయిందని డీలర్లు పేర్కొన్నారు’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మరింత ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి తయారీ సంస్థలకు ఇది చివరి అవకాశం అని అన్నారు. అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా నిరోధించడానికి డీలర్ సమ్మతి, వాస్తవ పూచీకత్తు ఆధారంగా మాత్రమే కఠినమైన ఛానల్ ఫండింగ్ విధానాలను తప్పనిసరి చేస్తూ బ్యాంకులకు సలహా జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఫెడరేషన్ కోరిందన్నారు. ఇదీ చదవండి: ‘పెయిడ్ ట్వీట్’ అంటూ వ్యాఖ్యలుడీలర్లు, తయారీ సంస్థలు పండుగలకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో సానుకూల నగదు ప్రవాహం, మెరుగైన వ్యవసాయ పరిస్థితులు డిమాండ్‌ను పెంచుతాయని ఆశించినప్పటికీ ఆశించినమేర ఫలితం లేదని ఫెడరేషన్ తెలిపింది. అదనపు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి, 2024–25 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి సానుకూల వృద్ధి పథాన్ని నడపడానికి అక్టోబర్ నెల చాలా అవసరమని పేర్కొంది. ఊహించిన విక్రయాలు కార్యరూపం దాల్చకపోతే కొత్త సంవత్సరంలోకి వెళ్లే క్రమంలో డీలర్లతోపాటు తయారీ సంస్థలను కూడా కష్టతర పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది. -
Khairatabad Ganesh: మహా ట్రైలర్ సిద్ధం
ఖైరతాబాద్: అశేష భక్తజనం పూజలందుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి సాగర నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రైలర్ వాహనం శనివారం ప్రాంగణానికి చేరుకుంది. వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ట్రైలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోయగలదు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే వాహన సారథిగా నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి ఈసారి కూడా వ్యవహరించనున్నారు. ‘మహా గణపతి బరువు 70 టన్నుల వరకు ఉంటుంది. నిమజ్జన సమయంలో ఎలాంటి పగుళ్లు రాకుండా నాలుగు లేయర్లుగా తయారీ చేశాం. 4 గంటల పాటు వర్షం వచ్చినా కరిగిపోదు. నిమజ్జనం పూర్తిచేసిన 7 గంటల్లో నీటిలో కరిగిపోతుంది’ అని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే
శంషాబాద్: చార్జింగ్ కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. పర్యావరణహిత∙ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు.స్వీడన్‌కు చెందిన గ్లీడా సంస్థ శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో శ్రీశైలం హైవేలో ఒకేసారి 102 వాహనాలు చార్జింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్ మాట్లాడుతూ గ్లీడా వంటి సంస్థ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ 2018 కేవలం ఒక చార్జింగ్ పాయింట్‌తో ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం నగరంలో మొత్తం 89 కేంద్రాలను విస్తృత పర్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవదేష్ అన్నారు. -
లోయలో పడిన టాటా సుమో.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాందంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనం టాటాసుమో కిష్త్వార్ వైపు నుంచి వస్తున్న సమయంలో లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
‘రాయల్’ దొంగ అరెస్టు
మోతీనగర్: జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్‌లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ ఎన్ఫీల్డ్ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్చెరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు రాయల్æఎన్ఫీల్డ్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్ సాహిల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
చేప కాదు కానీ.. నీటిలో దిగితే తక్కువా కాదు
వాహన ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హోవర్‌క్రాఫ్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీటిలో, గాలిలో కూడా పయనించగలదు. అయితే ఇప్పుడు 'నార్త్రోప్ గ్రుమ్మన్' (Northrop Grumman) అంతర్గత జలాలలో (నీటి లోపల) ప్రయాణించే ఓ సరికొత్త 'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్' గురించి వెల్లడించింది.'రోబోటిక్ మంటా రే సబ్మెర్సిబుల్'కు సంబంధించిన వీడియోలో గమనించినట్లయితే.. ఇది వేగంగా నీటిలోపల వెళ్లడం చూడవచ్చు. చూడటానికి ఓ చేప ఆకారంలో ఉండే ఈ వెహికల్ రెండు కన్నుల వంటి నిర్మాణం, రెక్కలు వంటి వాటిని కూడా పొందుతుంది. నీటిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి చేపవంటి నిర్మాణంలో దీన్ని తయారు చేసినట్లు భావిస్తున్నాము.నార్త్రోప్ గ్రుమ్మన్.. తన మాంటా రే ప్రోటోటైప్‌ను ఈ ఏడాది పరీక్షించింది. లాంగ్ రేంజ్, లాంగ్ డ్యూరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన వాహనాన్ని నిమించడానికి ఏకంగా నాలుగు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని 'ఎక్స్ట్రా లార్జ్ అన్‌క్రూడ్ అండర్ వాటర్ వెహికల్' అని పిలుస్తారు. దీనిని DARPA అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని తయారు చేశారు.తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. అంతే కాకుండా ఎక్కువ బరువును తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇది పైకి, కిందికి గ్లైడింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ టెక్నాలజీ ఈ వాహనాన్ని మరింత వేగంగా ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇది సముద్రం అడుగు భాగంలో కూడా ప్రయాణించగలదు. -
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల ప్రైవేట్ మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్సీఆర్కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
సొంత వాహనంలో చార్ధామ్ యాత్ర.. విధివిధానాలివే!
మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సు తప్పనిసరి చేశారు.తేలికపాటి వాహనాలకు గ్రీన్‌కార్డు రుసుముగా రూ.400, భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్‌లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.ఈ ఏడాది చార్ధామ్ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్‌లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. -
పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి
-
వాహన ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ.. ► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి. -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2023లో 40 లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదైంది. తయారీ కంపెనీల నుంచి గతేడాది డీలర్లకు 41,01,600 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. యుటిలిటీ వెహికిల్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘హోల్‌సేల్‌లో 2022లో జరిగిన ప్యాసింజర్ వాహన అమ్మకాలతో పోలిస్తే గతేడాది నమోదైన విక్రయాలు 8 శాతం అధికం అయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 22.4 శాతం వృద్ధి చెంది గత ఏడాది 23,53,605 యూనిట్లకు పెరిగాయి. వ్యాన్స్ 1,32,468 నుంచి 1,46,122 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ కార్స్ 8 శాతం క్షీణించి 16,01,873 యూనిట్లకు పడిపోయాయి. అక్టోబర్–డిసెంబర్లో డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం అధికమై 10,12,285 యూనిట్లను తాకాయి’ అని సియామ్ వివరించింది. ఇతర విభాగాల్లో ఇలా.. గతేడాది తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 9 శాతం పెరిగి 1,70,75,160 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 9.33 లక్షల నుంచి 9.78 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు 4,18,510 నుంచి 6,80,550 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి హోల్‌సేల్‌లో వాహన విక్రయాలు గతేడాది 10 శాతం వృద్ధితో 2,28,36,604 యూనిట్లకు పెరిగాయి. 2022లో ఈ సంఖ్య 2,07,92,824 యూనిట్లుగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి 2023 సహేతుకంగా సంతృప్తికరంగా ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర వాహనాలు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. త్రిచక్ర వాహనాలు చాలా మంచి రికవరీని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విభాగంలోని మొత్తం అమ్మకాలలో యుటిలిటీ వాహనాల వాటా ఏకంగా 62 శాతానికి చేరిందని వివరించారు. 2024లో సైతం వృద్ధి జోరు కొనసాగుతుందని ఆటో పరిశ్రమ ఆశాజనకంగా ఉందన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో..: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఫిబ్రవరి 1–3 తేదీల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరుగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో కంటే ఈ ప్రదర్శన విస్తృత స్థాయిలో ఉంటుందని వినోద్ అగర్వాల్ చెప్పారు. ఆటోమొబైల్‌తో ముడిపడి ఉన్న అన్ని విభాగాల కంపెనీల భాగస్వామ్యంతో ఇది మరింత విస్తృత ఈవెంట్‌గా మారనుందని ఆయన అన్నారు. వాహన తయారీ సంస్థలతోపాటు ఈ ప్రదర్శనలో టైర్లు, స్టీల్, బ్యాటరీ, ఇతర విభాగాల కంపెనీలు సైతం పాల్గొంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని వివరించారు. -
ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
బ్రిటిష్ కంపెనీ ‘పీ50’ విడుదల చేసిన ఈ కారు ప్రపంచంలోనే అతి చిన్న కారు. ఈ కంపెనీ దాదాపు అరవై ఏళ్లుగా ఈ కార్ల ఉత్పత్తి చేస్తోంది. అన్నేళ్లుగా ఉత్పత్తి చేస్తున్న ఈ కారులో కొత్త విశేషం ఏముందనేగా మీ అనుమానం? ఇప్పటి వరకు మిగిలిన కంపెనీల మాదిరిగానే ‘పీ50’ కూడా పూర్తిగా తయారైన కార్లనే తన షోరూమ్‌ల ద్వారా విక్రయించేది. తాజాగా ఈ కంపెనీ ‘పీల్ పీ50’ పేరుతో ఈ కారుకు సంబంధించిన ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’ (డీఐవై) కిట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో టైర్లతో కూడిన చక్రాలు, హెడ్లైట్లు, స్టీరింగ్‌వీల్, సీటు, పైభాగంలో అమర్చుకునేందుకు ఫైబర్‌గ్లాస్ షెల్ సహా కారుకు చెందిన విడిభాగాలన్నీ ఉంటాయి. దీని పార్సెల్‌ను తెచ్చుకుని, ఇంట్లోనే పూర్తి కారును ఎవరికి వారు సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇదివరకు పెట్రోలుతో నడిచే కార్లు రూపొందించిన ఈ కంపెనీ, తాజాగా ఎలక్ట్రిక్ మోడల్‌ను డీఐవై కిట్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఇది 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు సాయంతో 49 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని గరిష్ఠవేగం గంటకు 45 కిలోమీటర్లు. ఇందులో ఒక వ్యక్తి కూర్చోవడానికి, పరిమితంగా లగేజీ పెట్టుకోవడానికి చోటు ఉంటుంది. దీని ధర 10,379 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) మాత్రమే! -
వెహికల్‌గా మారిన సోఫా.. ఆనంద్ మహీంద్రా ఫిదా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు సోఫాలో ప్రయాణించడం చూడవచ్చు. ఈ సంఘటన చూసిన వెంటనే ఒక్క నిమిషం ఇదెలా సాధ్యమని చాలామంది షాక్ అవుతారు. ఇదెలా తయారైందో వీడియోలో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. నిజానికి ఒక సోఫాను ఆన్లైన్ సోఫాను ఆర్డర్ చేసిన దానికి చక్రాలు, మోటార్ వంటి భాగాలను.. దానిని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండింగ్ కూడా అమర్చారు. ఇది రోడ్దుపైన ప్రయాణించడానికి అనుకూలంగా ఉంది. ఈ వీడియోలో సోఫా ద్వారా రోడ్డుపైన ప్రయాణించే ఇద్దరి యువకులను చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్టు మాత్రమే.. అయితే ఇందులో ఆ యువకుల అభిరుచి, ప్రయత్నం తప్పకుండా ప్రశంసనీయం. ఒక దేశం ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కొత్త ఆవిష్కరణలు ఎంతైనా అవసరం' అంటూ.. ఈ వెహికల్ చూస్తే RTO ఇన్స్పెక్టర్ ఎలా ఫీలవుతాడో చూడాలనుకుంటున్నా అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్ ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇలాంటి వీడియో 42 సంవత్సరాల క్రితమే వచ్చిందని దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. Just a fun project? Yes, but look at the passion and engineering effort that went into it. If a country has to become a giant in automobiles, it needs many such ‘garage’ inventors… Happy driving kids, and I’d like to see the look on the face of the RTO inspector in India, when… pic.twitter.com/sOLXCpebTU — anand mahindra (@anandmahindra) December 30, 2023 -
వెహికల్ స్క్రాపింగ్, మరో యూనిట్ ప్రారంభించిన టాటా మోటార్స్
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను చండీగడ్‌లో ప్రారంభించింది. ఇప్పటికే టాటా జైపూర్, భువనేశ్వర్, సూరత్‌లో స్క్రాపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగాచండీగడ్లో ప్రారంభించిన ఈ స్క్రాపింగ్ యూనిట్లో ఏడాదికి 12,000 వాహనాల్ని చెత్తగా మార్చనుంది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35)తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది. -
బీఆర్ఎస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై రాళ్ల దాడి
-
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
‘సరి- బేసి’ విధానం తొలుత ఏ దేశంలో మొదలయ్యింది?
కాలుష్యం కాటుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ జనం అతలాకుతలం అవుతున్నారు. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ స్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేస్తోంది. దీపావళి అనంతరం ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. అయితే ఈ విధమైన ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో బేసి-సరి ఫార్ములాను అమలు చేసింది. ఆ సమయంలో ఈ విధానం అందరికీ కొత్తగా అనిపించింది. చాలామందికి దీని గురించి అర్థం కాలేదు. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య (3,5,7,9) ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలలో నడుస్తాయి. సరి సంఖ్య గల వాహనాలు (2,4,6,8) రోడ్లపైకి రావడానికి సరిసంఖ్య గల తేదీలలోనే అనుమతి ఉంటుంది. 2016లో ఢిల్లీలో అమలు చేసిన ఈ ఫార్ములాను తొలిసారిగా మెక్సికోలో ప్రవేశపెట్టారు. దీనికి ‘హోయ్ నో సర్కులా’ అనే పేరు పెట్టారు. దీని అర్థం ‘మీ కారు ఈరోజు నడవదు’. అనంతర కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి విధానాలను అమలు చేశారు. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ తదితర ప్రాంతాల్లో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా చదవండి: దీర్ఘాయుష్షు అంటే ఎంత? -
మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్’ వాహనం.. ధర ఎంతంటే?
బెంగళూరు: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎంఎల్ఎంఎంఎల్) కొత్తగా సరకు రవాణా కోసం ’జీతో స్ట్రాంగ్’ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జీతో ప్లస్ వాహనానికి కొనసాగింపుగా మరింత ఎక్కువ పేలోడ్ సామర్థ్యం, మరిన్ని ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. వెర్షన్‌ను బట్టి (డీజిల్, సీఎన్జీ) దీని ధర రూ. 5.28 లక్షల నుంచి రూ. 5.55 లక్షల వరకు (పుణె ఎక్స్–షోరూం) ఉంటుంది. డీజిల్ వెర్షన్లో పేలోడ్ సామర్థ్యం 815 కేజీలుగాను, లీటరుకు 32 కి.మీ. మైలేజీ ఉంటుంది. సీఎన్జీ వెర్షన్ పేలోడ్ సామర్థ్యం 750 కేజీలుగా, మైలేజీ 35 కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 72,000 కి.మీ. వారంటీ, అలా గే డ్రైవరుకు ఉచితంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
దేశంలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ..ఆచరణ సాధ్యమేనా?
దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. మరి దీనివల్ల కలిగే లాభాలేంటి? పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్‌తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35) తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది. అయితే, యజమానులు తమ వద్ద ఉన్న పాత వాహనాల్ని ఈ స్క్రాపింగ్‌కి ఇస్తారా? అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమ నివేదికల ప్రకారం.. అనధికారికంగా దేశంలో 90కి పైగా పాత వాహనాలున్నాయి. ఇవి కాకుండా ఇళ్లల్లో, గ్యారేజీలలో మూలుగుతున్న వాహనాల సంఖ్య లక్ష నుంచి కోట్లలో ఉండొచ్చనేది అంచనా. -
ఇలాంటి వెహికల్ భారత్ తయారు చేయాలి - ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ ఆసక్తికరమైన 'త్రీ-వీలర్' వీడియోను ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇది ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉండటం చేత నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో చిన్న త్రీ-వీలర్ వెహికల్ చూడవచ్చు. ఇది మాన్‌హట్టన్‌లో కనిపించిన దృశ్యం. ఇలాంటి వాహనాన్ని భారత్ కూడా ఏదో ఒక రోజు తయారు చేస్తుందని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్ వీడియోలో కనిపిస్తున్న వాహనం, కారు మాదిరిగా స్టీరింగ్ వీల్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా ఇలాంటి వాహనాలను రేసింగ్లలో ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇలాంటి వాహనాలు భారతదేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు, కానీ భవిష్యత్తులో విడుదలవుతాయా? లేదా? అనేది ప్రశ్నార్థకం. I spot this ‘three wheeler’ in Manhattan. It’s no commercial rickshaw! And it’s certainly not about last~mile-mobility. This one has style oozing out of it. One day from an Indian company? After all, we’re the global heavyweights in 3-wheelers…🙂 @sumanmishra_1 pic.twitter.com/tWsdte0Ny6 — anand mahindra (@anandmahindra) October 28, 2023 -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్‌గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్‌ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి! -
ఎమ్మెల్యే శంకరనారాయణ వాహనంపై డిటోనేటర్‌తో దాడి
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ వాహనంపై ఆదివారం ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ డిటోనేటర్‌తో దాడిచేశాడు. అది పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన హరిజన గణేశ్ తన జేబులో ఉన్న ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకుని ఎమ్మెల్యే వాహనంపై విసిరాడు. అది పేలలేదు. గమనించిన సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది వెంటనే గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితుడు గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసన్ కంపెనీలో డ్రైవర్ విధులతోపాటు డిటోనేటర్లు పేల్చేపని చేసేవాడు. ఆదివారం అతిగా మద్యం తాగడంతో కాంట్రాక్టర్ పనుల్లో పెట్టుకోకుండా వెళ్లిపొమ్మన్నాడు. దీంతో అతడు నేరుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాడు. మద్యం మత్తులో ఎమ్మెల్యే వాహనంపైకి డిటోనేటర్ విసిరాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ డీఎస్పీ ఉసేన్‌పీరా గోరంట్ల స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరింత లోతుగా విచారించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన దురదృష్టకరం నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ ప్రభావం లేకుండా ప్రజలకు సేవచేస్తున్నా. డిటోనేటర్ పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దురదృష్టకరం. పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ఎమ్మెల్యే శంకరనారాయణ -
జోరందుకున్న సీఎన్జీ వాహనాల అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరి–సెప్టెంబర్ మధ్య 6,66,384 యూనిట్ల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం పెరుగుదల. 2022 జనవరి–సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 5,04,003 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో సీఎన్జీతో నడిచే త్రిచక్ర వాహనాల విక్రయాలు 81 శాతం అధికమై 2,48,541 యూనిట్లు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాలు 9 శాతం పెరిగి 2,65,815 యూనిట్లకు చేరుకున్నాయి. సరుకు రవాణా వాహనాలు 26 శాతం క్షీణించి 60,531 యూనిట్లకు వచ్చి చేరాయి. బస్‌లు, వ్యాన్స్ 125 శాతం ఎగసి 91,497 యూనిట్లను తాకాయి. తక్కువ వ్యయం కాబట్టే.. సీఎన్జీ కేజీ ధర ప్రస్తుతం రూ.76 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82 ఉంది. డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ చవకగా దొరుకుతుంది కాబట్టే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. సీఎన్జీ ఆధారిత త్రీవీలర్లు, ప్యాసింజర్ వెహికిల్స్, సరుకు రవాణా వాహనాలతోపాటు బస్‌లు, వ్యాన్స్ అన్నీ కలిపి 2022–23లో తొలిసారిగా పరిశ్రమలో 6,50,000 యూనిట్ల అమ్మకాలను దాటాయి. 2021–22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్జీ వెహికిల్స్ విక్రయాల్లో 46 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–సెప్టెంబర్‌లో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో సీఎన్జీ ఆధారిత వాహనాల వాటా 8.8 శాతం ఉంది. ఇక సీఎన్జీ విభాగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 40 శాతం, త్రిచక్ర వాహనాలు 37 శాతం కైవసం చేసుకున్నాయి. తొలి స్థానంలో మారుతీ.. సీఎన్జీ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 72 శాతం వాటాతో మారుతీ సుజుకీ ఇండియా హవా కొనసాగుతోంది. 15 మోడళ్లలో ఈ కంపెనీ సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. భారత్‌లో ఈ స్థాయిలో సీఎన్జీ వేరియంట్లు కలిగిన కంపెనీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. మారుతీ సుజుకీ 2023 జనవరి–సెప్టెంబర్‌లో 10.85 శాతం వృద్ధితో 1,91,013 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. 2020 ఏప్రిల్‌లో డీజిల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సంస్థ సీఎన్జీని ప్రధాన్యతగా తీసుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో హుందాయ్ మోటార్ సీఎన్జీ విక్రయాలు 10.67 శాతం క్షీణించి 35,513 యూనిట్లకు పరిమితమైంది. టాటా మోటార్స్ 13.77 శాతం ఎగసి 34,224 యూనిట్లను సాధించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 52 యూనిట్ల నుంచి ఏకంగా 4,679 యూనిట్ల అమ్మకాలను అందుకుంది. సీఎన్జీ త్రిచక్ర వాహనాల్లో బజాజ్ ఆటో 87 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. పియాజియో, టీవీఎస్ మోటార్ కో, అతుల్ ఆటో, మహీంద్రా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సీఎన్జీ గూడ్స్ క్యారియర్స్ విభాగంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా, వీఈ కమర్షియల్ వెహికిల్స్, అశోక్ లేలాండ్, ఎస్ఎంఎల్ సుజుకీ వరుసగా పోటీపడుతున్నాయి. -
రోడ్డుపై బాలింత.. మధ్యలోనే వదిలి వెళ్లిన 102 వాహనం
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేక మూడు రోజుల బాలింతను రోడ్డుపైనే దింపి 102 వాహనం వెళ్లిపోయి న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన పార్వతి 3 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డతో రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. చదవండి: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో.. -
వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాత వాహనాలను తుక్కుగా మార్చే (వాహన స్క్రాపేజీ) విధానానికి మద్దుతగా నిలవాలని ఆటోమొబైల్ పరిశ్రమ, భాగస్వాములు అందరికీ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది అందరి విజయానికి దారితీసే విధానమని పేర్కొన్నారు. పరిశ్రమ భాగస్వాములతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 15-20 ఏళ్ల జీవిత కాలం ముగిసిన వాహనాలను తొలగించి, కొత్త వాటి కొనుగోలును ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యమని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం, వాహనాల విద్యుదీకరణ, వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయడం తదితర చర్యలతో వాహనాలకు స్థిరమైన బలమైన డిమాండ్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) తయారీని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆటోపరిశ్రమగా అవతరించేందుకు కృషి చేయాలని కోరారు. వాహన స్కాప్రేజీతో పరిశ్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందని గుర్తు చేశారు. కనుక మూడు స్తంభాలను నిర్మించేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలు, వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటుపై పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమను కోరారు. నూతన విధానంతో కలిగే ప్రయోజనాలపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు తమ డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనాన్ని తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. -
తిరుమల బ్రహోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫోటోలు)
-
వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..
దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు. ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు. -
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు ’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ►అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. ►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ►ఇప్పటికే మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు అప్డేట్ చేసుకో వడం తప్పనిసరి. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. (చదవండి: ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. -
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయివేట్ సంస్థలకు..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇటీవలే అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు అప్పగించేందుకు ఆ సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో చిన్న తరహా ఉపగ్రహాలకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉండటంతో భూమికి అతి తక్కువ దూరంలో, అంటే లియో ఆర్బిట్‌లోకి వాటిని పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌కు రూపకల్పన చేశారు. ప్రపంచంలో అంతరిక్ష కేంద్రాలు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేశాలకు భారతదేశం అతి తక్కువ ధరకే చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల దాకా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాల కోసమే ఎస్ఎస్ఎల్వీ రాకెట్లతో పాటు ప్రయోగ కేంద్రాన్ని కూడా తమిళనాడులో కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్నారు. ఇస్రో రూపొందించిన ఆరు రకాల రాకెట్ సిరీస్‌లలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ మాత్రమే ప్రయివేట్ సంస్థలకు అప్పగించబోతున్నారన్న మాట. -
ఫోర్డ్లో ఉద్యోగుల తొలగింపులు.. డిమాండ్ పడిపోవడంతో
ప్రపంచ దేశాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలవుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకుంటూ పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్న అమలు చేయగా.. మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ నిర్ణయంతో అమెరికాతో పాటు, కెనడాకు చెందిన 3వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు రెండువేల మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెయ్యిమంది ఉన్నారు. మార్కెట్లో పెరిగిపోతున్న పోటీ, ఆర్ధిక మాంద్యం దృష్ట్యా ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ భారీగా పడిపోతుంది. ఈ తరుణంలో ఖర్చులు తగ్గించుకొని భవిష్యత్‌లో సురక్షితంగా ఉండేలా ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!
World Largest Truck: చాలా మంది ఇప్పటి వరకు నాలుగు, ఎనిమిది, పదహారు చక్రాల ట్రక్కులను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రక్కు వాటన్నింటికంటే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కు కావడం గమనార్హం. 'బెలాజ్ 75710' (Belaz 75710) పేరు కలిగిన ఈ ట్రక్కు ఒకసారికి సుమారు 500 టన్నుల బరువును తీసుకెళుతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా ప్రసిద్ధి చెందిన ఈ వాహనం బెలారస్లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ట్రక్కులను తయారు చేసే BelAZ కంపెనీ సోవియట్ యూనియన్ కాలంలో బెలారస్, జోడినో నగరంలో ఉండేది. సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తరువాత ఈ కంపెనీ ఇతర దేశాల కంటే పెద్దగా ఉండే వాహనాలను తయారు చేయడం ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కూడా కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) ఇక బెలాజ్ 75710 విషయానికి వస్తే.. దీని బరువు 450 టన్నులు. దీనికి 8 చక్రాలు అమర్చారు, ఒక్కొక్క టైర్ బరువు సుమారు 5 టన్నుల కంటే ఎక్కువ. ట్రక్కు పొడవు 20 మీటర్లు, వెడల్పు 9.7 మీటర్లు. లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈ ట్రక్కు స్పీడ్ 45 కిమీ/గం కాగా, ఖాళీగా ఉన్నప్పుడు 60 కిమీ/గం వేగంతో వెళుతుంది. ఇంత పెద్ద భారీ ట్రక్కు పనిచేయాలంటే ఒక్క ఇంజిన్ సరిపోదు. కావున ఇందులో రెండు డీజిల్ ఇంజిన్లు అమర్చారు. (ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!) బెలాజ్ 75710 ట్రక్కులోని 16 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్లు 2300 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రస్తుతం ఈ ట్రక్కుని సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలు క్వారీలలో చాలా ఉపయోగపడతాయి. దీని ధర సుమారు రూ. 50 కోట్లకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ
న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్ వాహనం ఎక్స్‌యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్‌యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది. ఎక్స్‌యూవీ 700 కార్ ఓనర్ కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్‌యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్‌గా మంటలు వ్యాపించినట్టు కులదీప్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముందస్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం అసలు సర్క్యూట్‌ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్‌మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్ వైరింగ్ కనెక్షన్ ఒరిజనల్‌ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమాచారాన్ని కారు ఓనర్‌కు ఈమెయిల్ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 చాలామంది తమ వాహనాలను ఎడిషనల్ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్డేట్ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్లు, మెకానిక్లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది. Here is an update to our official statement with reference to the incident in Jaipur involving the XUV700. Our customers' safety is always our top most priority. pic.twitter.com/HYSQDEBFIu — Mahindra Automotive (@Mahindra_Auto) May 24, 2023 -
ఎయిర్‌లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!
ఇది అలాంటిలాంటి విమానం కాదు, పెద్ద ఓడలాంటి విమానం. గాలిలో ఇది ఎగురుతుంటే, పెద్ద ఓడ నింగిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌లాండర్ ఈ భారీ విమానానికి రూపకల్పన చేసింది. బ్రిటన్‌కు చెందిన విమానాల డిజైనింగ్ సంస్థ ‘డిజైన్–క్యూ’ సహాయంతో రూపొందించిన ఈ విమానం పేరు ‘ఎయిర్‌లాండర్–10’. ఇందులో లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం విశేషం. ఇదీ చదవండి: ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు! విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం ఎనిమిది బెడ్రూమ్లు, బాత్రూమ్లు, షవర్లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా, వైఫై సౌకర్యం, ఇతర వినోద సౌకర్యాలు, బార్ వంటి విలాసాలు ఈ విమానం ప్రత్యేకత. సాధారణ విమానాలతో పోలిస్తే దీని వేగం కాస్త తక్కువే! సాధారణ విమానాల గరిష్ఠ వేగం గంటకు 500 మైళ్లకు పైగా ఉంటే, దీని గరిష్ఠవేగం గంటకు 100 మైళ్లు మాత్రమే! ఇది 2026లో తన తొలి ప్రయాణం ప్రారంభించనుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఆర్మీ వాహనంలో అగ్నిప్రమాదం
-
వింత వాహనం.. నేల మీద, నీటిపైనా ఎక్కడైనా ప్రయాణించగలదు!
న్యూజీలాండ్‌కు చెందిన పడవల తయారీ కంపెనీ ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ ఈ పోర్టబుల్ మల్టీయూజ్ పాడ్‌ను రూపొందించింది. చూడటానికి ఇది ఏదో విచిత్ర గ్రహాంతర వాహనంలా కనిపిస్తుంది గాని, ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటి మీద ప్రయాణించగలిగే ఈ వాహనాన్ని ‘డ్రెడ్‌నార్ట్ బోట్స్’ నిపుణులు సునామీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) ఈ వాహనం కిటికీలకు దృఢమైన అద్దాలు, మిగిలిన భాగాలను భారీ నౌకల తయారీకి ఉపయోగించే నాణ్యమైన అల్యూమినియం ఉపయోగించారు. వాహనం లోపల విశాలమైన స్థలం, వాహనంలోనే వివిధ పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా 350 వాట్స్ సామర్థ్యం గల ఇన్వర్టర్ వంటివి ఏర్పాటు చేశారు. వాహనం పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇది పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడుస్తుంది. దీని ధర 61,243 డాలర్లు (రూ.50.40 లక్షలు) మాత్రమే! (sleepisol: ఈ హెడ్సెట్ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!) -
మార్కెట్లోకి యమహా ఏరాక్స్ 155 కొత్త వెర్షన్ @ 1,42 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా ఏరాక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్ 2023 వెర్షన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1,42,800 ఉంది. ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా 155 సీసీ ఇంజన్ పొందుపరిచింది. ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, మొబైల్ చార్జింగ్ కోసం పవర్ సాకెట్, 24.5 లీటర్ల స్టోరేజ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, 14 అంగుళాల అలాయ్ వీల్స్, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్తోపాటు స్కూటర్లలో తొలిసారిగా ఈ మోడల్‌కు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్15ఎస్, ఎంటీ15 వీ2, ఆర్15 వీ4 మోడళ్లలో 2023 వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.63–1.86 లక్షల మధ్య ఉంది. కాఫీడే రూ.436 కోట్ల రుణాల ఎగవేత న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. -
హైదరాబాద్: వాహనదారులకు షాక్.. దొరికారో 200 శాతం పెనాల్టీ తప్పదు!
సాక్షి,హైదరాబాద్: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్‌ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తేలికపాటి వాహనాలే అధికం.. గ్రేటర్లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్‌లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్ విధించారు. తనిఖీలు ఉధృతం త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్లైన్లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్ చెకింగ్ రిపోర్ట్ (వీసీఆర్) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. –జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
20 లక్షల వాహనాలు తుక్కు లోకి!
భువనేశ్వర్: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు. 15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చదవండి వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ! -
చాయ్ ఎంత పనిచేయించింది..డ్రైవర్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు!
భారతీయులకు చాయ్ అంటే ఎంత మక్కువ అనేది చెప్పనవసరం లేదు. అదీకూడా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అల్లం టీ సిప్ చేస్తే ఉండే ఆనందమే వేరు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక డ్రైవర్ ఆ చాయ్ మీద ఇష్టం కొద్ది ఏం చేశాడో వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. వివరాల్లోకెళ్తే...ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీఓ) బస్సు డ్రైవర్ టీ కోసం ఏకంగా రద్దీగా ఉండే రహదారి మధ్యలో బస్సును ఆపేశాడు. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతలో టీ కప్పుతో బయటకు వచ్చిన డ్రైవర్ దీన్ని గమనించి..ర్యాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసినట్లు ఉన్నానుకుంటూ.. గబగబ టీకప్పుతో బస్సు వద్దకు వచ్చి స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని శుభ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో పేరుగాంచిన సుదామా టీ స్టాల్ అని, అందుకే డ్రైవర్ అక్కడ బస్సు ఆపాడని ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. దీంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై మండిపడుతూ.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాలని ఒకరు, మరోకరేమో అతన్ని ఎందుకు తిడుతున్నారు, సుదామా టీస్టాల్ కారణంగానే ఇది జరగిందంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. men😭☕ pic.twitter.com/EDOSmxlnZC — Shubh (@kadaipaneeeer) January 2, 2023 (చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి) -
ఎంటీఏఆర్, ఇన్–స్పేస్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎంటీఏఆర్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్‌తో (ఇన్–స్పేస్) ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూ కాలపరిమితి మూడేళ్లు. ఇందులో భాగంగా రెండు దశల నుండి భూమికి తక్కువ కక్ష్య వరకు ప్రయాణించే సెమి క్రయోజనిక్ సాంకేతికత ఆధారిత పూర్తి ద్రవ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలను ఎంటీఏఆర్ చేపడుతుంది. 500 కిలోల బరువు మోయగల సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందిస్తారు. -
చల్‌చల్ గుర్రం.. 50 ఏళ్లుగా అశ్వాన్నే వాడుతున్న రైతు
సాక్షి, బషీరాబాద్: ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతిఒక్కరూ శరవేగంగా గమ్యం చేరాలని భావిస్తున్నారు. నిమిషాలు, గంటల్లో వెళ్లేలా ఆధునిక వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైనన కార్లు, బైకులు కనిస్తున్నాయి. కానీ బషీరాబాద్ మండలం ఎక్మాయికి చెందిన రైతు అల్లూరు నర్సయ్యగౌడ్ యాభై ఏళ్లుగా అశ్వాన్నే వాహనంగా వాడుతున్నారు. తన 18వ ఏట నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు గుర్రాలపై స్వారీ చేసినట్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ప్రమాదం లేకుండా, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం పూర్తవుతుందని తెలిపాడు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్ప బైకులు, కార్లు, బస్సులు ఎక్కలేదని వివరించాడు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక ) -
పవన్ కల్యాణ్ పై పేర్ని నాని ఫైర్
-
అది వారాహి కాదు నారాహి : మంత్రి రోజా
-
అది వారాహి కాదు.. నారాహి: మంత్రి రోజా సెటైర్లు
సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కత్తులు పట్టుకుని పిచ్చి పిచ్చి చేస్తున్నారంటూ పవన్‌పై మండిపడ్డారామె. నగరంలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధి పై ఇన్సట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ITPI) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభాగం, ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సమావేశానికి ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రచార వాహనంపై ఆమె సెటైర్లు వేశారు. ‘‘అది వారాహి కాదు నారాహి. కత్తులు పట్టుకుని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరైన పద్దతి కాదు. ఆయన ఎన్నికల ప్రచార వాహనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆయన అనుకూల మీడియానే హైలెట్ చేసింది. అయినా నిబంధనల ప్రకారం.. ఆర్మీ వాళ్ళు మాత్రమే పచ్చ రంగు కలర్ వాహనాన్ని వాడాలని నిబంధన ఉంద’’ని ఆమె జనసేన నేతకు గుర్తు చేశారు. -
ఈ కార్లకు జనాల్లో ఫుల్ క్రేజ్..కానీ ఇప్పుడు షెడ్డుకు చేరిన వేల కార్లు!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేస్తోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడు పోతున్న సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా కార్లలో ముందు వరుస సీట్ల బెల్ట్లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవి 2022 నవంబర్ 2–28 తేదీల్లో తయారైనవని కంపెనీ తెలిపింది. షోల్డర్ హైట్ అడ్జెస్టర్ ఉప భాగాలలో ఒకదానిలో లోపం ఉందని అనుమానిస్తున్నామని, ఇది అరుదైన సందర్భంలో సీట్ బెల్ట్ విడదీయడానికి దారితీయవచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. వాహనాలను తనిఖీ చేసి, లోపం ఉన్న భాగాన్ని భర్తీ చేయడం కోసం ఉచితంగా రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వివరించింది. అధీకృత వర్క్‌షాప్‌ల నుండి సంబంధిత కార్ల యజమానులకు సమాచారం వెళుతుందని తెలిపింది. -
టాంజానియా పోలీసు బలగాలకు అశోక్ లేలాండ్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తాజాగా టాంజానియా పోలీసు బలగాలకు 150 వాహనాలను సరఫరా చేసింది. వీటిలో సిబ్బంది ప్రయాణించేందుకు కావాల్సిన బస్‌లు, పోలీస్ ట్రూప్ క్యారియర్స్, అంబులెన్స్‌లు, రికవరీ ట్రక్స్, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. టాంజానియా పోలీసు బలగాలు ఇప్పటికే అశోక్ లేలాండ్ తయారీ 475 వాహనాలను విని యోగిస్తున్నాయి. మరిన్ని వెహికిల్స్‌ను టాంజానియాకు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. -
బీజేపీని గుజరాత్ ఎన్నికల్లో గట్టేక్కించేది కాంగ్రెసే ...కేజ్రీవాల్ సెటైర్
అహ్మదాబాద్: గుజరాత్లో ఎన్నికల వేళ ఈసారి ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ వాహనాన్ని కాంగ్రెస్ బయటకు లాగేందుకు సహకరిస్తోందా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. 182 స్థానాలున్న గుజరాత్లో డిసెంబర్ 01, 5 తేదిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల ప్రచార ర్యాలీ సమావేశాల్లో బిజీగా ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ పోస్టర్లతో కూడిన ప్రచార ర్యాలీ వాహనం బురదలో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వాహనాన్ని కాంగ్రెస్ ప్రచార వాహనం సాయం అందించి బయటకు తీసేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల్లో ఇరుక్కుపోయిన బీజేపీకి కాంగ్రెసే దిక్కు అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల ఐఎల్‌యూ-ఐఎల్‌యూ(వాహనాల)ల కథ అంటూ కామెంట్లు చేస్తూ... ఆ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. गुजरात में भाजपा की अटकी हुई चुनावी गाड़ी को बचाने में पूरा ज़ोर लगाती कांग्रेस.. ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी 🫶🏻💕 pic.twitter.com/nbBu7GjW6i — AAP (@AamAadmiParty) November 12, 2022 (చదవండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. టవర్ ఎక్కి ఆప్ నేత ఆత్మహత్యాయత్నం!) -
ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు
నవంబర్ 20న నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ 200 వాహానాలను నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మకు అందజేశారు. ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్ మాట్లాడుతూ...నేపాల్ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు నేపాల్ మంత్రి జనార్దన్ శర్మ. అదీగాక ఎన్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
అరే ఏంట్రాఇది.. ఏకంగా పోలీసు వాహనాన్నే..
సాక్షి, అమరాపురం (సత్యసాయి జిల్లా): ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. చాలా దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొన్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసి అవాక్కయ్యారు. అమరాపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన రామన్న కుమారుడు నవీన్‌కుమార్ సోమవారం ఉదయం అమరాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. పరిసరాల్లో నిలిపి ఉంచిన పోలీసు జీపులో తాళం కూడా ఉండడంతో వేసుకుని వెళ్లిపోయాడు. మండలంలోని వలస సమీపంలో ఓ చింతచెట్టుకు ఢీ కొట్టాడు. అక్కడున్న వారు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు వచ్చి నవీన్‌కుమార్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారు. పోలీసులు నవీన్‌కుమార్‌ను తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడన్న విషయం చర్చనీయాంశమైంది. చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే) -
లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు జిల్లాలోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘కులు జిల్లా బంజర్ వ్యాలీలోని ఘియాఘి సమీపంలో టూరిస్ట్ వాహనం కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో పది మందికి గాయాలయ్యాయి. అయిదుగురిని కుళ్లులోని జోనల్ ఆసుపత్రికి తరలించాడం. మరో అయిదుగురికి బంజార్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం’మని కులు ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. బాధితులంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చదవండి: అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు -
రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (చదవండి: ఘోర ప్రమాదం..గోడ కూలి 10 మంది దుర్మరణం) -
నగరంలో చోరీ.. తాండూరులో అమ్మకం
తాండూరు: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. యాలాల మండలం, కమాల్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మ్యాతరి భాస్కర్, మ్యాతరి శివ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. నాలుగు నెలలుగా వాహనాలు అపహరిస్తూ.. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు తాండూరులో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు దొంగిలించారు. మాదాపూర్ పరిధిలో ఐదు బైకులు, కూకట్‌పల్లిలో రెండు బైకులు, ఒక ఆటో, మియాపూర్‌లో రెండు బైకులు, బంజారాహిల్స్ ప్రాంతంలో మూడు బైకులు, సనత్‌నగర్‌లో రెండు బైకులు, బాచుపల్లి ప్రాంతంలో ఒక ఆటో, చందానగర్‌లో మూడు, యూసుఫ్‌గూడలో ఒక బైక్ చోరీ చేశారు. యాలాల మండలంలోనూ రెండు బైకులను దొంగిలించారు. ఇందులో 9 ద్విచక్రవాహనాలను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోయిని ఆనంద్‌కు విక్రయించారు. మరో నాలుగు ద్విచక్రవాహనాలను యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పలి మహిపాల్‌కు విక్రయించారు. మిగతా వాటిలో బోయిని శ్రీకాంత్ వద్ద 3 బైకులు ఒక ఆటో, మ్యాతరి భాస్కర్ ఇంటి వద్ద 2 బైకులు, మ్యాతరి శివ ఇంటి వద్ద 2 బైకులు, ఒక ఆటోను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలను కొనుగోలు చేసిన ఆనంద్, మహిపాల్‌లపై కేసు నమోదు చేశామన్నారు. దొరికారిలా.. యాలాల పీఎస్ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18న యాలాలలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపి పత్రాలు అడిగారు. వీరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని, విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐతో పాటు బృందాన్ని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో అదృశ్యమైంది) -
ఏడాదిన్నరకే నూరేళ్లు... తండ్రి నడిపే వాహనమే..
బనశంకరి: ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటుండగా విధి కన్నెర్ర చేసి తన వశం చేసుకుంది. తండ్రి నడుపుతున్న వాహనమే మృత్యుశకటమై చిన్నారి ప్రాణాలు బలిగొంది. బోసినవ్వుల చిన్నారి ఇకలేదని తెలియడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన సర్జాపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సర్జాపుర కామనహళ్లిలో బాలకృష్ణ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. దంపతులకు ఏడాదిన్నర వయసున్న మనీశా అనే కుమార్తె ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందు మనీశా ఆడుకుంటోంది. బాలకృష్ణ తన ఐచర్ వాహనాన్ని రివర్స్ చేస్తుండగా ఆకస్మికంగా పసికందు వాహనం కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. (చదవండి: పెళ్లై ఏడు నెలలే ... తల్లిదండ్రులను చూడటానికని వెళ్లి..) -
13 ఖరీదైన వాహనాలు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: ఖరీదైన వాహనాలను దొంగలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన ఏడు రాయల్ ఎన్ఫీల్డ్, ఒక యమహా, ఐదు బజాజ్ పల్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. నగరంతో పాటూ సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఖరీదైన వాహనాలు దొంగలిస్తూ అతి తక్కువ ధరకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించామని, ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని, అందులో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 13 వాహనాల్లో 2 అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైనవి కాగా మిగతావి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ అయ్యాయి. -
మంత్రి వాహనంలో బడికెళ్లిన బాలుడు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ము కుంటున్న బాలుడు విజయ్ కుమార్ తనను చదివించాలని ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. బాలునికి కొత్త దుస్తులు, బూట్లు, సూట్ కేస్, ఇతర వస్తువులను ఇప్పించిన మంత్రి... సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారిక వాహనంలో జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలకు పంపించారు. మంత్రి స్వయంగా లగేజీని తీసుకొచ్చి బాలుడిని కారులో ఎక్కించి స్కూల్‌కు పంపించారు. -
ఫైర్ ఫైటర్.. 55 మీటర్ల ఎత్తుకు వెళ్లి.. టీటీఎల్ ప్రత్యేకతలివే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అగ్నిమాపక శాఖ అమ్ముల పొదిలో అత్యాధునిక వాహనం చేరింది. టర్న్ టేబుల్ లేడర్ (టీటీఎల్)గా పిలిచే ఈ వాహనం బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వాహనంపై ఉండే ల్యాడర్ (నిచ్చెన) 55 మీటర్ల ఎత్తుకు వెళ్తుంది. 18వ అంతస్తు వరకు వెళ్లి అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు దోహదం చేస్తుంది. ఈ ఫైర్ ఫైటర్‌ను జపాన్ నుంచి కొనుగోలు చేశారు. రాష్ట్రంలోనే ఇది మొదటిది. విజయవాడ, తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! జనాభా పెరగడం, నగరం ఎక్కువ విస్తరిస్తుండడంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు అనివార్యంగా మారాయి. ఈ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించడం కష్ట సాధ్యంగా ఉంటోంది. వీటి నివారణకు అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన యంత్రాలు లేవు. కొద్దిపాటి అపార్టుమెంట్లు, మాల్స్ వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పేవారు. 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో ప్రమాదాలు జరిగితే కొంత ఇబ్బందిగా ఉండేది. బ్రాంటో స్కై లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ దాని పనితీరు పరిమితంగా ఉండేది. టీటీఎల్ ప్రత్యేకతలివీ.. టర్న్ టేబుల్ ల్యాడర్ 18 అంతస్తుల భవనాల్లో సైతం ప్రమాదాలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి, మంటలను ఆర్పడం దీని ప్రత్యేకత. ల్యాడర్ 360 డిగ్రీల వరకు తిరుగుతూ మంటల్ని ఆర్పుతుంది. 75 డిగ్రీల వాలుగా నిలవగలదు. సిబ్బంది ఓ వైపు మంటలు ఆర్పుతూనే మరో వైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ల్యాడర్‌కు అనుసంధానంగా ఉన్న లిఫ్ట్ ద్వారా కిందికి పంపుతారు. ల్యాడర్ చివర ఉన్న క్యాబిన్లో ఎల్ఈడీ స్క్రీన్ అమర్చి ఉంటుంది. ల్యాడర్ ఎంత ఎత్తులో ఉంది, గాలి వేగం ఎంత ఉంది, గాలి ఎటు వీస్తోంది వంటి విషయాలను స్క్రీన్ ఆధారంగా తెలుసుకుంటూ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తారు. టర్న్ టేబుల్ ల్యాడర్‌ను మూడుచోట్ల నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ల్యాడర్ చివర క్యాబిన్, లిఫ్టర్, వాహనం ఇలా 3 చోట్ల నుంచి దీన్ని ఆపరేట్ చేస్తూ మంటలు ఆర్పే అవకాశం ఉంది. ల్యాడర్‌లో పైకి వెళ్లిన సిబ్బంది అక్కడి పరిస్థితిని బట్టి ల్యాడర్‌ను తమకు అనుకూలంగా తిప్పుకునే అవకాశం ఉండటం ఈ వాహనం ప్రత్యేకత. రాష్ట్రంలోనే ఇది మొదటిది అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా టీటీఎల్ను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఇది మొదటిది. ఇదొక ప్రత్యేకమైన ఫైర్ ఫైటర్. ఇప్పటివరకు బాధితులను రక్షించడం, మంటలను ఆర్పడం వేర్వేరుగా జరిగేవి. దీని సహాయంతో ఏకకాలంలో రెండు పనులు చేయొచ్చు. – జి.శ్రీనివాసులు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ప్లాన్ ప్రకారమే ఆ వాహనం వినియోగించాం.. కానీ..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి తీసుకోగా సోమవారమే ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నాలుగు రోజులుగా బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ కస్టడీలో ఉన్న మైనర్లను వేర్వేరుగా, ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది, ఇందుకు ఉసిగొల్పింది ఎవరు అనే విషయాలపై ఆరా తీయగా, జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం జరిపినట్లు చెప్పారు. ఒకేచోట అందరం కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకుతోపాటు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, సంగారెడ్డి మున్సిపాలిటీ కో–ఆప్షన్ మెంబర్ కొడుకు ఉండగా ఆ రోజు అధికారిక వాహనాన్ని ఎవరు తీసుకు రమ్మన్నారని పోలీసులు ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఈ కారుకు బ్లాక్ ఫిలింఉండటమే కాకుండా గవర్నమెంట్ వెహికిల్ అని ఉంటే ఎవరూ టచ్ చేయరన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్లు విచారణలో చెప్పారు. ఫోరెన్సిక్ విభాగం అధికారులు కారును తనిఖీ చేసినప్పుడు కండోమ్‌లు దొరికిన విషయం తెలిసిందే. కస్టడీలో భాగంగా ఆదివారం మైనర్లందరినీ సీన్ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్ హోంకు తరలించారు. కార్ల యజమానులపై కేసులు: ఈ ఘటనలో మైనర్లు నడిపిన కార్లకు సంబంధించి కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లో నివసించే ఓ ఎమ్మెల్యే కుమార్తెకు చెందిన బెంజ్ కారును ఆమె కుమారుడు నడిపాడు. అలాగే ఇన్నోవా డ్రైవర్ని బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్ద దించి ఆ వాహనాన్ని మరో మైనర్ నడిపాడు. ఈ ఉదంతాల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు. చదవండి: Hyderabad: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా -
మద్యం బాటిళ్ల లోడ్.. వాహనం బోల్తాకొట్టడంతో పండగ చేసుకున్న జనం
చెన్నై: తమిళనాడులోని మధురై హైవేపై రూ.10 లక్షల విలువైన మద్యం లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లన్ని ఒక్కసారిగా రహదారిపై అడ్డంగా పడిపోయాయి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదన్నట్లుగా అక్కడ ఉండే స్థానికులు ఎగబడ్డారు. ఆ బాటిళ్లను ఎత్తుకుపోవడం ప్రారంభించారు. దొరికినంత దోచుకుని పండగ చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఉపక్రమించారు. కేరళలోని మనలూర్‌లో ఉన్న గోదాం నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పి బొల్తాపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు) -
వాహనాలపై లైఫ్ ట్యాక్స్ మోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల జీవిత పన్నును ప్రభుత్వం పెంచింది. వాహనాల ధరను బట్టి గతంలో ఉన్న రెండు శ్లాబులను నాలుగుకు పెంచి.. వేర్వేరు పన్ను శాతాలను ఖరారు చేసింది. ద్విచక్ర వాహనాలకు వేరుగా రెండు శ్లాబుల్లో పన్ను శాతాలను నిర్ణయించింది. ఈ కొత్త చార్జీలు సోమవారం నుంచే అమలు చేస్తున్నట్టుగా పేర్కొంటూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు శ్లాబులుగా.. ద్విచక్ర వాహనాలకు రూ.50వేల లోపు ధర ఉన్నవి, ఆపై ధర ఉన్నవిగా రెండు శ్లాబులను ఖరారు చేశారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. రూ.5లక్షలలోపు, రూ.5–10లక్షలు, రూ.10–20 లక్షలు, రూ.20 లక్షలపైన అనే 4 శ్లాబులుగా విభజించి.. ఒక్కో శ్లాబుకు ఒక్కో పన్ను నిర్ణయించారు. ఇక నాన్ ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన 10 సీట్ల వరకు ఉండే వాహనాలకు ఆయా శ్లాబుల్లో 15శాతం, 16 శాతం, 19 శాతం, 20 శాతం పన్నును నిర్ధారించారు. పెరగనున్న ఆదాయం దాదాపు పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను సవరించారు. రూ.10 లక్షలలోపు ఉన్నవాటిని సాధారణ వాహనాలుగా, అంతకంటే ఎక్కువ ధర ఉంటే ఖరీదైన వాహనాలుగా పరిగణించి రెండు శ్లాబుల్లో పన్ను విధించారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా పన్ను శ్లాబులు, శాతాలను పెంచారు. దీనితో ఈ పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల వాహనాలు కలిపి.. సగటున రోజుకు ఆరు వేల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై బదిలీ చేసుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై.. తెలంగాణకు బదిలీ అయిన వాహనాలకు వాటిని కొన్నకాలం ఆధారంగా పన్నులను నిర్ణయించారు. రాష్ట్రంలో రిజిస్టరయ్యే వాహనాల శ్లాబ్‌లకు తగినట్టుగా.. ద్విచక్ర వాహనాలకు వేరుగా.. 3, నాలుగు చక్రాల వాహనాలకు వేరుగా పన్ను శాతాలను ఖరారు చేశారు. ద్విచక్ర వాహనాలైతే.. ♦రూ.50వేలలోపు ధర ఉన్నవాటికి.. వాటిని కొని 2 ఏళ్లకు మించకుంటే 8శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒకశాతం టాక్స్ తగ్గుతూ వస్తుంది. అంటే కొని రెండేళ్లు దాటితే 7శాతం, మూడేళ్లు దాటితే 6 శాతం.. ఇలా తగ్గుతూ వస్తుంది. చివరిగా కనీసం ఒకశాతం పన్ను వసూలు చేస్తారు. ♦రూ.50 వేలు, ఆపై ధర ఉంటే.. కొని రెండేళ్లకు మించకుంటే 11 శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక్కో శాతం ట్యాక్స్‌ను తగ్గుతూ ఉంటుంది. చివరిగా కనీసం 4 శాతం పన్ను వసూలు చేస్తారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. ♦కొని రెండేళ్లు మించని వాహనాలకు.. రూ.5లక్షల లోపు ధర ఉన్నవాటికి 12 శాతం; రూ.5–10 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 13శాతం; రూ.10–20 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 16శాతం; రూ.20 లక్షలపై ధర ఉన్నవాటికి 17శాతం పన్ను వసూలు చేస్తారు. ♦ఆయా వాహనాలు కొని ఒక్కో ఏడాది పెరిగిన కొద్దీ పన్ను శాతాన్ని ఒక శాతం, అర శాతం చొప్పున తగ్గిస్తూ ఖరారు చేశారు. ‘లైఫ్ ట్యాక్స్’ లెక్కలివీ.. ♦ఇప్పటివరకు వాహనం ఏదైనా.. రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12%.. ఆపై ధర ఉంటే 14% లైఫ్ ట్యాక్స్‌ను విధించేవారు. ♦తాజాగా ద్విచక్ర వాహనాలకు వేరుగా.. మిగతా వాహనాలకు వేరుగా నిర్ధారించారు. ♦ద్విచక్ర వాహనాల ధర రూ.50 వేలలోపు ఉంటే 9శాతం, ఆపై ధర ఉంటే 12 శాతం పన్ను వసూలు చేస్తారు. -
టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఏస్ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈవోజెన్ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. చదవండి👉తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..! -
రూ.3.5 లక్షలు చోరీ
మందస: మండలంలోని హరిపురం నుంచి బయల్దేరిన బొలేరో వాహనం నుంచి రూ.3.5 లక్షలు చోరీ జరిగినట్లు డ్రైవర్ రట్టి నవీన్ మందస పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బాలాజీ కాజూ ఫ్యాక్టరీ యజమా ని కోరాడ సునీల్ జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి డ్రైవర్ నవీన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చి పంపించారు. నవీన్ తన బొలేరో వాహనంలో హరిపురం నుంచి బయల్దేరి కమలాపురం సమీపంలోని పెట్రో ల్ బంకులో ఆయిల్ కొట్టించారు. అక్కడ ఎవరో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇచ్చారు. అతను కొర్రాయిగేటు సమీపంలోనే దిగిపోయాడు. తర్వాత నవీన్ నరసన్నపేట వరకు వెళ్లిపోయారు. అక్కడ టిఫిన్ చేసి వా హనాన్ని పరిశీలిస్తే నగదు కనిపించలేదు. దీంతో కంగారు పడి.. తిరిగి మందస వచ్చి పోలీసులకు ఫిర్యా దు చేశారు. అయితే పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఇదే బొలేరో వాహనంలో నుంచి ఏదో తీసుకుని వెళ్తున్నట్టు సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తోంది. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నాలుగు సెక్షన్లతో పాలన) -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ రోడ్డు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తుంది. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్టీహెచ్) రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్'ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో చూపించడానికి కేంద్రం నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహనం నెంబరు ప్లేట్ తరహాలోనే ఉంటుంది. దీని మీద వేహికల్ ఫిట్నెస్ గడువు తేదీని స్పష్టంగా కనబడుతుంది. ఈ సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్'లో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారీ వస్తువులు/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున దీనిని ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్లు & క్వాడ్రిసైకిల్స్ విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక మోటార్ సైకిళ్లకు వాహనా మీద స్పష్టంగా కనిపించ భాగంలో దీనిన్ ఉంచాలని తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలు టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్'లో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. MoRTH has issued a draft notification according to which validity of fitness certificate (in format DD-MM-YYYY) and registration mark of the motor vehicle shall be exhibited on the vehicles in the manner as prescribed in the draft rules. pic.twitter.com/g0D0sIoTkJ — MORTHINDIA (@MORTHIndia) March 3, 2022 ఇందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రజలు, ఇతర వాటాదారులు సూచనలు చేయలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 51 లక్షల లైట్ మోటార్ వాహనాలు ఉన్నాయి. అలాగే 15 ఏళ్ల కంటే ఎక్కువ లైఫ్ గల 34 లక్షల వాహనాలు దేశంలో ఉన్నాయి. 15 ఏళ్లు పైబడిన మరో 17 లక్షల మీడియం & హెవీ కమర్షియల్ వేహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నాయి. (చదవండి: కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!) -
విషాదం: ఆడుకుంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో..
ఊట్కూర్: ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్‌ను పిల్లలు ఆడుకుంటూ స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలి ఒక బాలికను బలిగొంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్ మండలం ఎర్గాట్‌పల్లిలో మంగళవారం మైసమ్మ జాతర నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు కుటుంబ సభ్యులతో ట్రాక్టర్‌పై జాతరకు వెళ్లి వచ్చి.. ఇంటి ముందు వాహనాన్ని ఆపాడు. రాత్రి 8 గంటల సమయంలో కొందరు చిన్నారులు ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. వీరిలో ఒకరు ఇంట్లోకి వెళ్లి ట్రాక్టర్ తాళం తెచ్చి స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. అదే సమయంలో ట్రాక్టర్ ముం దు ఆడుకుంటున్న రూప (8), కల్పన, వెంకటేష్‌లను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఊట్కూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రూప మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కల్పన, వెంకటేశ్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషాదం: ఆడుకూంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో -
ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం..రోడ్లపై, పట్టాలపై ఒకేలా!
World's First Dual-Mode Vehicle: బస్సు, రైలు మాదిరి రెండు విధాలుగా మాదిరిగా నడిచే సరికొత్త డీఎంవీ వాహనాన్ని జపాన్‌లోని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ రూపొందించింది. ఇది రహదారుల పై బస్సు మాదిరిగానూ, రైల్వే పట్టాలపైన రైలులా అత్యంత వేగవంతంగా వెళ్లిపోతోంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడ్ వాహనం. ఈ వాహనంల రహదారులపనై నడిచేటప్పుడు రబ్బరు టైర్లపై నడుస్తుంది. రైల్వే ట్రాక్ వద్ద వాహనం అండర్బెల్లీ ఆటోమెటిక్ అడ్జ్‌మెంట్ టెక్నాలజీతో ఇంటర్ చేంజ్ అయ్యి ఉక్కుచక్రాల సాయంతో సమర్థవంతమైన రైలు బండిలా వెళ్లుతుంది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) అంతేకాదు ముందు చక్రాలు ట్రాక్ మీద నుంచి వెళ్లేలా పైకి, వెనుక చక్రాలు రైల్వే ట్రాక్‌పై నెట్టడానికి కిందకి ఉంటాయి. రహదారులకు, రైల్వే ట్రాక్‌లకు అనుగుణంగా దాని టైర్లు ఆటోమెటిక్ అడ్జెస్ట్ చేసుకుని ఆయా వాహానాల మాదిరిగా వేగవంతగా వెళ్లటమే ఈ డ్యూయల్‌మోడ్ వాహనం ప్రత్యేకత. అంతేకాదు ఈ వాహనాన్ని జపాన్‌లోని తోకుషిమా ప్రిఫెక్చర్‌లోని కైయో పట్టణంలో శనివారం బహిరంగంగా ప్రారంభించింది. ఈ మేరకు ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా తక్కువ జనాభ ఉన్న కైయో వంటి చిన్న పట్టణాలకు ఇలాంటి వాహనాలు ఉపకరిస్తాయని అన్నారు. అంతేకాదు ఈ డీఎంవీ వాహనాలు మినీ బస్సువలే కనిపిస్తుందని తెలిపారు. పైగా ఈ వాహనం సుమారు 21 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదని అన్నారు. రైల్వే పట్టాలపై 60 కి.మీ/గం వేగంతోనూ, రోడ్డపై 100 కి.మీ/గం వేగంతో వెళ్లగలదని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ తెలిపింది. పైగా డీజిల్ ఆధారిత వాహనం అని పేర్కొంది. జపాన్ వాసులను ఈ ప్రాజెక్టు ఆకర్షించటమే కాక ప్రోత్సహిస్తారని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!) -
మా ప్రైవసీకి భంగం కల్గిస్తారా.. ఎత్తిపడేసింది..
ప్రిటోరియా: సాధారణంగా చాలా మంది సరదాగా గడపటానికి జంతువుల సఫారీలకు, అభయారణ్యాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో సందర్శకులు.. క్రూరమృగాలను, ప్రత్యేక జీవులను దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడతారు. వీటికోసం ఆయా పార్కులలో ప్రత్యేక వాహానాలు ఉంటాయి. అయితే, ఒక్కొసారి జంతువులను చూసే క్రమంలో.. సందర్శకులు అనుకొకుండా ఆపదలకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్‌లో గత ఆదివారం(నవంబరు28) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలాటి గేమ్ రిజర్వ్‌లోని క్రూగెర్ నేషనల్ పార్కులో... కొందరు సందర్శకులు ప్రత్యేక వాహనంలో గైడ్ సహయంతో ఏనుగుల సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత.. ఏనుగుల దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత.. గట్టిగా అరవడం ఆరంభించారు. వీరిని గమనించిన ఏనుగుల గుంపు కాస్త బెదిరిపోయింది. వారి వాహనం ఏనుగుల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికా ఏనుగు వారు ప్రయాణిస్తున్న వాహనం వైపు ఘీంకరించుకుంటూ వచ్చింది. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నట్లు..’ వారి వాహనాన్ని తొండం సహయంతో పక్కకు నెట్టి, కిందకు పడేసింది. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాహనం నుంచి దూకి పారిపోయారు . అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేవు. వాహనం మాత్రం తుక్కుతుక్కయ్యింది. శీతాకాలంలో ఏనుగులు మేటింగ్‌లో పాల్గొంటాయి. వాటి ఏకాంతానికి అంతరాయం కల్గినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాయని రిజర్వ్ మేనెజర్ హవ్మెన్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను.. సందర్శకులలో ఒక వ్యక్తి రికార్డు చేశాడు. అతను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏనుగు ఎంత భయంకరంగా ఉంది..’, ‘కొంచెంలో బతికి బట్టకట్టారు..’, ‘మీరు ఏనుగుకు దొరికితే అంతే సంగతులు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Too much intrusion will take your life in Wilderness. However, wild animals keeps on forgiving us since long.#responsible_tourism specially wildlife tourism should be educational rather recreational. हांथी के इतना घुसा नही जाता 🙏 watch second video too pic.twitter.com/AOKGZ2BAjB — WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021 -
వైరల్: కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలాన్లు
సాక్షి, కామారెడ్డి: ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో అందరూ సమానులే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. నాయకుల నుంచి సామాన్యుల వరకు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసిన తెలంగాణ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దొరికిన వారికి దొరికినట్టు చలానాలు విధిస్తూ హడలెత్తిస్తున్నారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఏకంగా కలెక్టర్ వాహనానికే చలనాలను విధించారు. చదవండి: నెహ్రూ జూలాజికల్ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 3366) పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20 వరకు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఈ చలానాల ప్రకారం మొత్తం రూ.27,580 జరిమానా కట్టాల్సి ఉంది. ఇన్ని చలానాల్లో అధికంగా 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం. ఇక కలెక్టర్ వాహనంపైనే 28 చనాలు ఉండటంతో సదరు కలెక్టర్ గారి వాహనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ‘మాయా’ మసాజ్ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో.. అయితే, కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. కామారెడ్డి కలెక్టర్ కంటే ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి చలాన్లే ఉండేవి. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా, ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు. -
తుక్కు వ్యాపారంలోకి టాటా గ్రూప్
న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ విధానంలో వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి కేంద్రం అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఈడీ గిరీష్ వాఘ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా 25,000 ట్రక్కులు తుక్కుగా మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయని, కానీ సరైన స్క్రాపేజీ కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్‌కు చెందిన నిపుణులతో కలిసి మోడల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని రూపొందించామని వాఘ్ పేర్కొన్నారు. ఫ్రాంచైజీ విధానంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గిరీష్ వాఘ్ తెలిపారు. ఇప్పటికే భాగస్వాములకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) పంపించడం మొదలు పెట్టామని వివరించారు. స్క్రాపేజీ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు రాగలవనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతోందని వాఘ్ వివరించారు. అహ్మదాబాద్‌లో వాహనాల స్క్రాపేజీ సెంటర్ నెలకొల్పడానికి గుజరాత్ ప్రభుత్వంతో టాటా మోటార్స్ ఇటీవలే చేతులు కలిపింది. -
బండి అమ్మేసినా.. ఆ చలాన్లు కట్టడానికి సరిపోదేమో..
సాక్షి, గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఒకే ద్విచక్ర వాహనంపై ఒకటికాదు రెండుకాదు ఏకంగా.. 117 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం సదరు వాహనాన్ని అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హోండా యాక్టివా(ఏసీ09ఏయూ1727)నంబర్ యాక్టివాను ఆపి తనిఖీ చేశారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 117 చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అవాక్కయ్యారు. హెల్మెట్,మాస్క్, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్ చేశారు. -
డిస్కౌంట్లో వాహనాలిప్పిస్తామని నమ్మించి రూ.10 కోట్లకు టోకరా!
VSVP Projects కామారెడ్డి క్రైం: తక్కువ ధరకే వాహనాలు ఇప్పిస్తామన్నారు.. భారీ డిస్కౌంట్ పేరిట ఎర వేశారు.. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుని జేబులు గుల్ల చేశారు. వందల మంది కస్టమర్లకు డిపాజిట్ల పేరిట కట్టించుకుని రూ. కోట్లల్లో టోకరా వేసి ఉడా యించిన వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్ కంపెనీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డిపాజిట్‌గా కంపెనీలో జమ చేసిన డబ్బులు పోవడమే కాకుండా తీసుకున్న వాహనాలకు ప్రతినెలా చెల్లించాల్సిన ఫైనాన్స్ వాయిదాలు కస్టమర్ల నెత్తినపడ్డాయి. వాటిని చెల్లించలేక ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఆరు నెలల క్రితమే సదరు కంపెనీ దాదాపు రూ.10 కోట్లకు పైగా కస్టమర్లకు టోకరా వేసి బిచానా ఎత్తేసింది. అప్పటి నుంచి బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. తీసుకున్న వాహనాలకు ప్రతినెలా వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీల ఒత్తిళ్లు పెరిగాయని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఏడాదిన్నర క్రితం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో కొందరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్ పేరిట కంపెనీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కస్టమర్లను రాబట్టేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకున్నారు. 25శాతం డిస్కౌంట్ మీద వాహనాలను ఇప్పిస్తామని నమ్మించారు. కస్టమర్ల వాటాను ముందుగా ఒకేసారి చెల్లించాలి. వాటిలో నుంచి కొంత మొత్తాన్ని షోరూంలో డౌన్ పేమెంట్ కింద చెల్లిస్తాం.. మిగతా మొత్తానికి ఫైనాన్స్ చేయిస్తామన్నారు. వీఎస్‌వీపీ కంపెనీ వద్ద మిగిలి ఉన్న కస్టమర్ డబ్బుకు ప్రతినెలా వడ్డీ కింద ఫైనాన్స్ వాయిదాలను మేమే చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంటుంది. ఫైనాన్స్ కస్లమర్ పేరుమీదే చేయించారు. ప్రతినెలా వీఎస్‌వీపీ కంపెనీ నుంచి కస్టమర్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత ఫైనాన్స్ వాయిదాలకు కట్ అవుతాయని నమ్మించారు. ఫైనాన్స్ వాయిదాలకు ప్రతినెలా వీఎస్‌వీపీ నుంచి డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయని కస్టమర్లు భావించారు. ముందుగా చెల్లించే తక్కువ ధరకే కొత్త వాహనం వస్తుంది కదా అని చాలామంది సభ్యులుగా చేరారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఇలా అన్ని వాహనాలను డిస్కౌంట్ కింద ఇప్పిస్తామని నమ్మించి వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వారు ఎంచుకున్న వాహనం ఖరీదులో నుంచి 75 శాతం మొత్తాన్ని ముందుగానే కట్టించుకుని వాహనాలు ఇప్పించారు. అందులో నుంచి కేవలం 10శాతం మాత్రమే డౌన్ పేమెంట్ కింద షోరూంలకు చెల్లించి మిగితావి ఫైనాన్స్ చేయించినట్లు తెలుస్తుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలలు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత కస్టమర్ల డిపాజిట్ డబ్బులను మాయం చేసి బోర్డు తిప్పేశారు. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు వీఎస్‌వీపీ బోర్డు తిప్పేయడంతో కస్టమర్లు నిండా మునిగారు. ఇప్పుడిక తమ వాహనాలకు సంబంధించిన నెలవారీ ఫైనాన్స్ వాయిదాలు తామే చెల్లించుకోవాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఎదురైంది. వాయిదాల డబ్బులు కట్టాలని ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు, లేదంటే వాహనాలను లాక్కెళ్తున్నారని వాపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు పెరగడంతో ఇప్పుడిప్పుడే మోసపోయామంటూ బాధితులు బయటకు వస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎవరైనా బాధితులు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రూ. కోట్లలో టోకరా.. స్కీంలను, లాటరీలను, భారీ డిస్కౌంట్లను, మోసపూరిత కంపెనీలను నమ్మవద్దని ఎంత మొత్తుకున్నా కొందరు అత్యాశకు పోయి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీఎస్‌వీపీ మోసాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. కంపెనీలో సభ్యులుగా చేరి, ద్విచక్ర వాహనాలు తీసుకుని మోసపోయిన వారు ఒక్క దేవునిపల్లి పరిధిలోనే దాదాపు 60 నుంచి 70 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. దాదాపు రూ. 10 కోట్లకు పైగా దండుకుని కంపెనీ నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుస్తోంది. కంపెనీలో ఏజెంట్లుగా పనిచేసిన వారికి కష్టాలు తప్పడం లేదు. కొందరు ఏజెంట్లు, బాధితులు 5 నెలల క్రితం పట్టణ పోలీస్ స్టేషణ్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. దేవీవిహార్‌లో నివాసం ఉండే కంపెనీ నిర్వాహకుడు హైదరాబాద్‌కు పరారీ కాగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆ వెంటనే బెయిల్ తెచ్చుకుని కేసు పెట్టిన వారికి డబ్బులు మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుట్లు తెలిసింది. రూ. 56 వేలు చెల్లించా రూ. 56 వేలకే ఫ్యాషన్‌ప్రో బైక్ ఇస్తామన్నారు. దాంట్లో నుంచి రూ. 10 వేలు డౌన్‌పేమెంట్ కట్టి రూ. 71 వేలు నా పేరు మీద ఫైనాన్స్ చేయించారు. మిగతా డబ్బు కంపెనీ వద్ద డిపాజిట్‌గా ఉంటుందన్నారు. డిపాజిట్‌పై వడ్డీ కింద ఫైనాన్స్ వాయిదాల కోసం ప్రతినెలా నా అకౌంట్లో డబ్బులు జమచేస్తామన్నారు. రెండు నెలలు డబ్బులు వేశారు. ఆ తర్వాత కంపెనీ ఎత్తేశారు. అప్పటి నుంచి ప్రతినెలా ఫైనాన్స్ వాళ్లు వచ్చి వాయిదాలు కట్టాలని వేధిస్తున్నారు. నాలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. – వెంకన్న, భవానీపేట్, లింగంపేట మండలం -
Dalit Bandhu: కారు... లేకుంటే ట్రాక్టరు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు. కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ -
టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్‌కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ భార్య : గెల్లు శ్వేత కేసులు : మూడు -
టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి
మంచిర్యాల(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి -
Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం
కృష్ణా (విజయవాడ): కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో.. కృష్ణాకరకట్టపై ఇన్నోవా వాహనం అదుపుతప్పి కేఈబీ కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం కొంతదూరం కొట్టుకుపోయింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నవారంతా మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో చిరువోలు గ్రామానికి చెందిన కైలా ప్రశాంత్(25) మృతి చెందాగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. క్షత గాత్రులను స్థానికుల సహయంతో, అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. చదవండి: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక.. -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆసుపత్రిలో మరణించింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ దగ్గర రోడ్డుపై చనిపోయిన గేదెపైకి టాటా ఏస్ వాహనం ఎక్కింది. దీంతో అదుపుతప్పి వాహనం.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. టాటా ఏస్ వాహనంలో 16 మంది ప్రయాణికులు వున్నారు. అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పోట్లపాటి శివమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, వెనకటేశ్వరరెడ్డి, కోటమ్మ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: మహిళా ఎస్ఐ ఆత్మహత్య మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ -
‘స్క్రాపేజ్ పాలసీతో అదనంగా రూ.40వేల కోట్లు’
న్యూఢిల్లీ: వాహనాల తుక్కు విధానం (స్క్రాపేజీ పాలసీ) దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించడం కేంద్రం, రాష్ట్రాలకు సైతం అనుకూలిస్తుందంటూ.. జీఎస్టీ రూపంలో రూ.40వేల కోట్లను అదనంగా పొందొచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వాహన స్క్రాపేజీ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. -
వివాహమై ఏడాది కాకముందే.. భార్యభర్తలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన శరవణన్(39), నివేద(37) దంపతులు ఈ నెల 8వ తేదీ ద్విచక్ర వాహనంపై తిరుత్తణికి వెళుతున్నారు. పట్రపెరంబదూరు వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో గాయపడ్డారు. తిరువళ్లూరులో ప్రథమ చిక్సిత అనంతరం చెన్నై రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 10న నివేద మృతి చెందగా, శనివారం శరవణన్ మృతి చెందాడు. వివాహమై ఏడాది కాకముందే భార్యభర్తలు కన్నుమూయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నడుస్తున్న పోలీస్ వాహనం లో మంటలు
-
పెట్రోల్‌లో నీళ్లు..
-
మధ్యలో ఆగిన బండి.. మొత్తం నీరే పెట్రోల్ లేనే లేదు!
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీరు కలిపి పోశారంటూ వాహనదా రులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం 11 గంటలకు దుర్శేడ్‌కు చెం దిన బత్తిని శివ తన వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. కొంతదూరం వెళ్లినతర్వాత వాహనం ఆగిపోవడంతో స్థానికంగా ఉన్న మెకానిక్కు చూ పించాడు. కల్తీ పెట్రోల్ పోసినట్లు అతను చెప్ప డంతో బంకుకు తిరిగి వచ్చిన శివ, అక్కడి సిబ్బంది తో వాగ్వాదానికి దిగాడు. అనుమానంతో బాటిల్లో పెట్రోల్ పోసి చూడగా సగానికిపైగా నీళ్లు ఉండటంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. వారు సిబ్బందిని ప్రశ్నించగా సాంకేతిక సమస్యతో నీళ్లు వచ్చాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలువురు వాహనదారులు అక్కడికి వచ్చి కల్తీ పెట్రోల్ పోశారని ఆందోళనకు దిగారు. దీంతో బంకు సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీళ్లు నిల్వ ఉండి పెట్రోల్ ట్యాంకు లోపలికి రావడంతో నీళ్లు వస్తున్నాయంటూ నిర్వాహకులు చెప్పారు. చివరకు వాహనదారుల ఆందోళనతో నిర్వాహకులు పెట్రోల్ బంకును మూసివేశారు. కల్తీ పెట్రోల్‌పై బత్తిని శివ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
వాహన ఎగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్ 47,151 ఉన్నాయి. మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్ మోటార్ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది. -
శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా..
సాక్షి,రామకుప్పం( చిత్తూరు): శుభ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా టాటాఏస్ బోల్తా పడి ఆరుగురు గాయపడిన ఘటన బుధవారం రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటశివకుమార్ కథనం.. దేవరాజపురానికి చెందిన పలువురు కుప్పం మండలం చందం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు టాటాఏస్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆరివనుపెంట వద్ద టాటాఏస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దేవగి(62), జగన్నాథ్ (52), కనగ(45), కోమది(45), ప్రశాంత్(14), రాహుల్ (12) తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ వెంకటశివకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని 108లో క్షతగాత్రులను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. జగన్నాథ్, కోమది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
విషాదం: పెళ్లి సంబంధం కుదుర్చుకుని వస్తున్నారు.. అంతలోనే..
సాక్షి, వేలూరు(తమిళనాడు): పెళ్లి సంబంధానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాధం నింపింది. వివరాలు.. చెన్నై నందనం నగర్‌కు చెందిన చంద్ర మౌళి ఇతని భార్య వసుందర దేవి(45), కుమారుడు వేణుగోపాల్(26) ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. వేణుగోపాల్‌కు పెళ్లి సంబందం చూసేందుకు చెన్నై నుంచి హోసూరుకు ఆదివారం బయలుదేరారు. రాణిపేటలో చంద్ర మౌళి తండ్రి కన్నయన్(94) ఉండటంతో అతన్ని కూడా తీసుకొని హోసూరుకు వెళ్లారు. అక్కడ సంబంధం కుదుర్చుకొని అదేకారులో సాయంత్రం చెన్నైకి బయలుదేరారు. కారును వేణుగోపాల్ నడుపుతున్నాడు. కారు తిరుపత్తూరు జిల్లా సెంగిలికుప్పం వద్ద హైవే వస్తూ.. ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో కారులోని కొత్త పెళ్లి కుమారుడు వేణుగోపాల్, తాత కన్నయ్యన్ అక్కడిక్కడే మృతి చెందగా చంద్రమౌళి, ఆయన భార్య వసుందర దేవికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఇతర వాహనదారులు పోలీసుల సాయంతో ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలో వసుందర దేవి మృతి చెందింది. చంద్రమౌళి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్ -
వెహికల్ ఇంజన్లకు ఇథనాల్ టెన్షన్
వెబ్‌డెస్క్ : కేంద్రం ప్రకించిన ఇథనాల్ రోడ్‌మ్యాప్ 2020-25పై ఆటోమోబైల్ పరిశ్రమపై ఎటువంటి ప్రభావం పడనుంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 20కి పెరిగితే ఇంజన్లపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా ? మెయింటనెన్స్ పెరుగుతుందా ? ఇలా అనేక సందేహాలు ఇటు పరిశ్రమ వర్గాల నుంచి అటు వాహనదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆటోమొబైల్ రంగ నిపుణులు ఏమంటున్నారంటే... 20 శాతం ఇథనాల్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోలు దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు లీటరు పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని రాబోయే రోజుల్లో 20 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2025 కల్లా ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు 2014 నుంచి పెట్రోలులో ఇథనాల్‌ని మిక్స్ చేయడం 2014 నుంచి ప్రారంభమైంది. మొదట 1 నుంచి 1.5 శాతం వరకు ఇథనాల్ కలిపేవారు. ప్రస్తుతం లీటరు పెట్రోలులో 8.5 శాతం ఇథనాల్ కలిపి చమురు సంస్థలు విక్రయిస్తున్నాయి. దీన్ని రాబోయే మూడేళ్లలో 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజన్లపై ప్రభావం ? కార్లను తయారు చేసేప్పుడు స్వచ్ఛత ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌లు ఉపయోగించేలా డిజైన్ చేస్తారు. పెట్రోలు స్వచ్ఛత తగ్గితే సాధారణంగానే ఇంజనుపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు సాధారణంగా పెట్రోలుకు మండే స్వభావం ఎక్కువ. తద్వారా ఇంజన్‌కి ఎక్కువ మొత్తంలో ఉష్ణశక్తి లభిస్తుంది. పెట్రోలుతో పోల్చినప్పుడు ఇథనాల్‌కి మండే స్వభావం తక్కువగా ఉంటుంది. పెట్రోలులో ఇథనాల్ శాతం పెరిగితే క్రమంగా ఇంజన్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇథనాల్ తినేస్తుంది ఇథనాల్ కరోసివ్ లక్షణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్, రబ్బర్ పదార్థాలను ఇథనాల్ కాలక్రమేనా తినేస్తుంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెరిగితే ట్యాంకు పెట్రోలు పోయడం దగ్గర నుంచి ఇంజన్లో శక్తి వెలువడే వరకు ఇంజన్, వాహనం విడిభాగాలు ఇథనాల్ కారణంగా చెడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్ దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా పెద్దగా సమస్యలు రాలేదు , కాబట్టి 20 శాతం ఇథనాల్ కలిపినా సమస్యలు రాకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయోమయం కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో అన్ని కార్లు, వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అంతకు ముందు బీఎస్ 6 ప్రమాణాలకు తగ్గట్టు ఇంజన్ డిజైన్లలో మార్పులు చేశాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇథనాల్ శాతం పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అయోమయంలో పడ్డాయి. చదవండి: పెట్రోల్‌లో 20% ఇథనాల్! -
లోయలో పడిన ఎస్యూవీ: ఐదుగురి దుర్మరణం
బనిహాల్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఖుని నల్లాహ్ దగ్గర్లో శనివారం ఓ ఎస్యూవీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపా రు. లోయలో పడేముందు ఎస్యూవీ ఓ కారును ఢీకొందని చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. లోయలోకి తాళ్ల సాయంతో బలగాలు దిగాయని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రమాద స్థలంలో ముగ్గురు, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుం డగా మరణించారు. మరో మృతదేహాన్ని ఘటనా స్థలానికి కొంత దూరం లో కనుగొన్నారు. మృతులను సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ షగుణ్ కుమార్, వనీత్ కౌర్, గారు రామ్, మహ్మద్ రఫీ, సంజీవ్‌కుమార్‌గా గుర్తించారు. గాయపడిన ఇండియన్ రిజర్వ్ పోలీస్ అజిత్‌కుమార్‌ను జమ్మూకు తరలించారు. చదవండి: వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి -
తెలంగాణ లో ప్రారంభమైన భూముల , వాహనాల రిజిస్ట్రేషన్లు
-
ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగినప్పటికి దేశంలో ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రెండు నెలలుగా సవరించలేదు. ఇందుకు ప్రధాన కారణం అందరూ భావిస్తున్నట్లు దేశంలో ఎన్నికలు జరగడమే. మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఇందన ధరలో మార్పు రావొచ్చు. నాలుగు రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగిన దేశంలోని కంపెనీలు పెంచలేదు. ప్రస్తుతం ఎన్నికల వల్ల ఏర్పడిన నష్టాలను తిరిగి పూడ్చుకోవడానికి ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల నష్టాలను పూడ్చడానికి డీజిల్, పెట్రోల్ ధరలను దశలవారీగా కనీసం రూ.2-3 పెంచాలని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓఎంసిలు ఆలోచిస్తున్నాయి. రేటు పెంపు అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి పెట్రో ధరలను పెంచకపోవడంతో త్వరలోనే పెట్రో షాక్ లకు వాహనదారులు సిద్ధం కావాలనే సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి కేంద్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునేది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలను 26 రెట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 7.46 రూపాయలు, డీజిల్ రేట్లు వరుసగా లీటరుకు 7.60 రూపాయలు పెరిగాయి. చదవండి: ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు? -
కోవిడ్ శవాలను తీసుకెళ్లే వాహనాల ముందు ఎంపీ ఫొటోషూట్!
భోపాల్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కంటికి కనబడని ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్ ఎంపీ, మాజీ మేయర్ అలోక్ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ‘ముక్తి వాహనం’ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పైగా తన ఫొటోషూట్ కోసమే ఈ వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నరేంద్ర సలుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచనమైన చర్యకు పాల్పడినందుకు సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా దీన్ని చూసిన నెటిజన్లు సైతం బీజేపీ ఎంపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. -
పల్టీలు కొట్టిన పోలీస్ వాహనం.. ఎస్ఐకు గాయాలు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్ఐ రఘకు త్రటిలో ప్రమాదం తప్పింది. తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపుకు వెళ్లుతుండగా ఎస్ఐ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని తప్పించబోయి పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో లో రెండు పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఎస్ఐ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎస్ఐకు స్పల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వేరే వాహనం తెప్పించుకోని తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం ఎస్ఐ తిరిగి మళ్లీ విధుల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. చదవండి: 9 ఏళ్ల బాలిక కిడ్నాప్: సినిమా చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి.. -
కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు
డోర్నకల్/వరంగల్: ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు కోసం ఖబ్రస్థాన్ను ఆక్రమించారని ఆరోపిస్తూ డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు మానుకోట జిల్లా కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని అడ్డగించారు. వివరాలిలా ఉన్నాయి. అమ్మపాలెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్ బుధవారం పరిశీలించేందుకు వచ్చారు. పరిశీలన అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఎస్కె మునీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు. 21 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 571లోని 1.20 ఎకరాల బంచరాయి భూమిని ఖబ్రస్థాన్ కోసం కేటాయించారని మునీర్ తదితరులు తెలిపారు. ఆ స్థలంలో 20 మంది ముస్లింల సమాదులు ఉండగా.. ఇటీవల నర్సరీ ఏర్పాటు కోసం వాటిని తొలగించి ఆక్రమించారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ఖబ్రస్థాన్ స్థలాన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. -
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు
సాక్షి, ముంబై: ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో వాహనం రేపిన దుమారం అంతా ఇంతా కాదు. తాజాగా ఇదే అంశంపై మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించిందన్నవార్త ఫేక్‌న్యూస్ అంటూ జైష్-ఉల్-హింద్ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. (అంబానీ ఇంటికి బెదిరింపుల కేసులో ట్విస్ట్) టెలిగ్రామ్ యాప్‌లో మెసేజ్ ద్వారా తామే దీనికి బాధ్యత వహిస్తున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది. ఈ మేరకు జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్ టుడే నివేదించింది. టెలిగ్రామ్ ఖాతాలో, జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్‌తో తమకు సంబంధంలేదని, తప్పుడు వార్తలని పేర్కొంది. 'జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు' అనే పేరుతో వెల్లడించిన వివరణలో ‘‘తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమే. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం షరియా కోసం, డబ్బు కోసం కాదు. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదు’’ అని తెలిపింది. అలాగే తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫోటోలతో భారత నిఘా సంస్థ నకిలీ పోస్టర్లు తయారు చేస్తోందంటూ మండిపడింది. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) కాగా ఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో ఒక వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఇది ట్రైలర్ మాత్రమే..అని హెచ్చరించడంతోపాటు బిట్‌కాయిన్ ద్వారా డబ్బు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు "మీకు వీలైతే మమ్మల్ని ఆపండి" అని దర్యాప్తు సంస్థలకు జైష్-ఉల్-హింద్ సవాల్ విసిరిందన్న వార్త మరింత ఆందోళన రేపింది. దీంతో ముంబై పోలీసులు అంబానీ ఇంటిముందు భారీ భద్రతను విధించారు. ఈ కేసును 10 పోలీసు బృందాలు, ఎన్ఐఏ సంయుక్తంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): సినిమాలో సీన్ చూస్తాడు.. నేర కథనాలను చూస్తాడు.. ఆ తర్వాత బయటకు వచ్చి అదే తరహాలో ఘటనలకు పాల్పడతాడు. సినిమాలో చూచిన విధంగానే చేస్తాడు. అంతే కాదు మద్యం సేవిస్తే మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో పోరంకి గ్రామం ప్రభునగర్‌కు చెందిన మొక్కపాటి ఫణిదుర్గాప్రసాద్ తెలియదు. వాహనాల దగ్ధం కేసులో నిందితుడు ఫణిదుర్గాప్రసాద్‌ను పెనమలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను తెలిపారు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ప్రభునగర్‌లో తన ఇంటికి వెళ్లేందుకు గాను మార్గమధ్యంలో పోరంకి గ్రామంలోని కరణం గారి బజారు వద్ద నిలబడ్డాడు. ఇక్కడే ఇళ్లముందు పార్కింగ్ చేసిన మూడు మోటార్ సైకిళ్లకు ఉన్న పెట్రోల్ ట్యాంకు పైపులను ఊడదీసి తన దగ్గర జేబులో ఉన్న లైటర్ తో వాటిని తగులపెట్టినట్టు ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు మంటలు అధికంగా వ్యాపించడంతో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఇన్నోవా కారు కూడా కాలిపోయిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడు గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా ఫణిదుర్గాప్రసాద్ విజయవాడలోని పోరంకి గ్రామం ప్రభునగర్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’) కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య -
తగ్గనున్న లగ్జరీ వాహనాల ధరలు
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ కారణంగా ఆర్థిక రంగంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేలా కేంద్రం వివిధ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ కాలంలో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ హై ఎండ్ వాహనాల అమ్మకాలకు మాత్రం బ్రేక్ పడింది. లగ్జరీ బైక్‌లపైనా వాహన వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల ఖరీదు చేసే బైక్‌లపై సుమారు రూ.30 వేల వరకు, రూ.50 లక్షలు దాటిన కార్లపై రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ధరలు తగ్గనున్నట్లు అంచనా. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించడం, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలామంది సొంత వాహనాలకు ప్రాధాన్యమిచ్చారు. కానీ చిన్న కార్లు, బైక్‌లకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సుమారు 50 వేల వరకు వాహన విక్రయాలు జరిగాయి. కానీ హై ఎండ్ వాహనాలకు మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో హై ఎండ్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. హై ఎండ్‌పై ఆసక్తి.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు లక్షన్నర వరకు హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలు దాటిన బైక్‌లు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. రూ.50 లక్షలు దాటిన కార్లు సుమారు 50 వేల వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం 10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఆడి, బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్, ఓల్వో, రోల్స్‌రాయిస్, లాంబోర్గ్ వంటి అధునాతన వాహనాలు హైదరాబాద్ రహదారులపై పరుగులు తీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ధరల తగ్గింపుతో వినియోగదారులు హై ఎండ్ పట్ల ఆసక్తి చూపవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈవీలకు ఊతం.. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. వాహనాల ధరల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం కొంత వరకు తగ్గింపు ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రైట్ రైట్.. సిటీ రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 ఏసీ ఓల్వో ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల మేరకు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం విద్యుత్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో 20 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా నగరంలో కొన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే రాయితీలపైన ఈ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల గ్రేటర్ ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు అవకాశం లభించనుంది. ఆహ్వానించదగిన పరిణామం కోవిడ్‌తో లగ్జరీ వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వాహనాల ధరలను కొంత మేరకు తగ్గించాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన మార్పు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. – రామ్కోటేశ్వర్రావు, తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
చిన్న ఉపగ్రహాల కోసం ఎస్ఎస్ఎల్వీ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ, విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.గత ఏడాదిలోనే ప్రయోగం చేపట్టాలని అనుకున్నప్పటికి కోవిడ్–19 లాక్డౌన్ ప్రభావంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ డిజైన్ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు. ప్రపంచ మార్కెట్లో అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయం భారత్ నేడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా అవతరించింది. 2022 ఆఖరు నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా వంద కిలోలు నుంచి 500 కిలోలు బరువు కలిగిన 6000 వేలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా 33 దేశాలకు చెందిన 328 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవిర్భవించింది. నూతన ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కృషి కొత్త ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్నం అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన చేసి భూసేకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించాలని అనేక దేశాల నుంచి వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను పంపించాల్సిన వ్యవహారానికి మంచి డిమాండ్ ఉండడంతో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ఎల్వీ రూపు రేఖలు ఇలా.. స్మాల్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. 34 మీటర్లు ఎత్తు, రెండు మీటర్లు వ్యాసార్థం కలిగి వుంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు దాకా వుంటుంది. 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్లో పెట్టి ప్రయోగించనున్నారు. అంటే ఇస్రో మొదటి రోజుల్లో ఎస్ఎల్వీ రాకెట్‌ను కూడా వర్టికల్ పొజిషన్లోనే పెట్టి ప్రయోగించారు. దీనికి షార్ కేంద్రంలో పాత లాంచ్‌ప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను కూడా పీఎస్ఎల్వీ రాకెట్ లాగానే నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్‌కు మొదటి, మూడో దశలు ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతోనే చేస్తారు. ఇందులో ద్రవ ఇంధనం దశమాత్రం వుండదు. నాలుగోదశలో మాత్రం వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశ కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెడతారన్నమాట. 2022 ఆఖరు నాటికి 6000 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు. ఇక విదేశీ ఉపగ్రహాలన్నింటిని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనుండడం కొసమెరుపు. ఆస్ట్రోనాట్ విద్యార్థులకు అనుగుణంగా... దేశీయంగా పలు యూనివర్శిటీలకు చెందిన ఆస్ట్రోనాట్ విద్యార్థులు ఎక్స్ఫర్మెంటల్గా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వాణిజ్యపరంగా విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భవిష్యత్తులో ఈ రాకెట్ ఉపయోగపడనుంది. విద్యార్థులను అంతరిక్ష ప్రయోగాలల్లో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి శాస్త్రవేత్తలుగా మార్చాలన్న లక్ష్యంతో ఇస్రో దృష్టిసారించింది. ఆ మేరకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఎస్‌ఎఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పోలీసుల కళ్లుగప్పి.. సీఐ వాహనంతో పరార్
-
రూరల్ సీఐ పోలీసు వాహనం చోరీ
సాక్షి, నల్గొండ: పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మిర్యాలగూడ టౌన్ ఈదులగూడ సర్కిల్ వద్ద రూరల్ సీఐ రమేష్ బాబు పోలీస్ వాహనం చోరికి గురైంది. గురువారం అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ యువకుడు సీఐ వాహనంతో కోదాడ వైపు పరారయ్యారు. ఈ క్రమంలో ఎదరుగా వస్తున్న వాహనాన్ని పోలీస్ వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది. దీంతో పోలీసులు చేజింగ్ చేసి ఆలగడప టోల్గేట్ వద్ద వాహనాన్ని రూరల్ ఎస్ఐ పరమేష్ పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
సాక్షి, అమరావతి : వాహన నిబంధన ఉల్లంఘనపై జరిమానాలను భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి 7సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు, రెండోసారికి రూ.10వేలు, పర్మిట్‌లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహానాల బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40వేలు, ఓవర్ లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు జరిమానా విధించనుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన జరిమానాలు వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750 సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750 అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000 అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000 డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000 రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000 వేగంగా బండి నడిపితే - రూ. 1000 సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000 రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000 రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000 పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000 ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000 ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000 అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష -
ఆటోమొబైల్ రంగానికి గడ్కరీ గుడ్ న్యూస్
ముంబై: ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆటోమొబైల్ రంగం పుంజుకునేందుకు అక్టోబర్ చివర నాటికి వాహన పాలసీ రూపొందనుందని గడ్కరీ పేర్కొన్నారు. వాహన పాలసీ రూపకల్పనలో చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వాహన పాలసీపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాలు అధ్యయనం చేయనున్నాయని తెలిపారు. కాగా వాహన పాలసీలో వినియోగదారులకు లాభం జరగనుందని, పాత వాహనాలను మార్చుకునే కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పాత వాహనాల కోనుగోలు వల్ల వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడనుందని ముడి విభాగాల దిగుమతి తగ్గి ఖర్చు తగ్గుతుందని అన్నారు. మరోవైపు స్వదేశీ పరికరాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అధిక పన్నులు విధించనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకున్నదని, అలాగే ఎంఎస్ఎంఈలపై కేంద్రం నుంచే అన్ని ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని నితిన్ గడ్కరీ సూచించారు. (చదవండి: ఆర్టీసీ లిక్విడేషన్‌కు కేంద్రం అనుమతి అవసరం) -
జీఎస్టీ తగ్గింపు!- ఆటో షేర్లు రయ్రయ్
ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గించాలంటూ ఆటో పరిశ్రమ చేస్తున్న వినతులను పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 28 శాతంగా అమలవుతోంది. ద్విచక్ర వాహనాలు.. అటు విలాసవంత(లగ్జరీ) కేటగిరీలోకి లేదా ఇటు డీమెరిట్లోకీ రావని సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో జీఎస్టీ కౌన్సిల్ ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపునకు వీలుగా సవరణలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సభ్యులతో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలను ప్రస్తావించారు. కాగా.. గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంకానున్నప్పటికీ సెప్టెంబర్ 17న నిర్వహించనున్న సమావేశంలో ద్విచక్ర వాహన పన్ను తగ్గింపును చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆటో రంగ ఇండెక్స్ దాదాపు 2 శాతం ఎగసింది. షేర్లు జూమ్ ఆటో కౌంటర్లలో మొత్తం రుణ భారాన్ని తగ్గించుకోనున్న ప్రణాళికల నేపథ్యంలో టాటా మోటార్స్ 8 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో హీరో మోటో, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, అపోలో టైర్ 6-3.3 శాతం మధ్య జంప్‌చేయగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. -
వాహన పర్మిట్ల వ్యాలిడిటీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు విఘాతం కలగకుండా వాహన పర్మిట్ల వ్యాలిడిటీ గడువును జూన్ 30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ర్టేషన్ పత్రాల చెల్లుబాటు వ్యవధిని ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకూ పొడిగించినట్టు కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని జూన్ 30గా పరిగణించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూతపడటంతో మోటార్ వాహనాల చట్టం, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఆయా డాక్యుమెంట్ల రెన్యువల్లో ఎదురువుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. దేశమంతటా నిత్యావసర సరుకులు, వస్తువులు నిరాటంకంగా సరఫరా అయ్యేందుకు ఈ మార్గదర్శకాలను విధిగా అమలుపరచాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. చదవండి : మందుబాబులకు గుడ్‌న్యూస్.. డోర్‌డెలివరీ -
సెల్ఫోన్లో ఫోటోలు తీసి నానా రభస..
సాక్షి, ఆత్మకూరు : కారుకు సైడు ఇవ్వమని అడిగారన్న కోపంతో బొలెరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి... కారులో వెళుతున్న వారిని వెంటాడి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన ఏఎస్‌పేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేద పండితులుగా పనిచేస్తున్న విఘ్నేష్‌కుమార శర్మ తన కుటుంబసభ్యులతో కారులో ఏఎస్‌పేట మండలంలోని గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మవరం వద్ద ఓ బొలేరో వాహనం దారికి అడ్డుగా ఉండడంతో విఘ్నేష్‌కుమార్ హారన్ మోగించాడు. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు. బొలేరో వాహన డ్రైవర్ మద్యం మత్తులో కారులో ఉన్నవారిని దుర్భాషలాడుతూ వాహనాన్ని అడ్డు తొలగించాడు. పట్టించుకోని విఘ్నేష్‌కుమార్ తన కారును గుంపర్లపాడు వైపునకు పోనిచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఆ బొలేరో వాహనంలో ఉన్న వ్యక్తి తన వాహనంతో వీరి వాహనాన్ని వెనుకనే తరుముకుంటూ దారి పొడవునా హారన్ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. విఘ్నేష్‌కుమార్ కుటుంబ సభ్యులు మొత్తానికి గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. వీరి వెనుకనే వచ్చిన బొలేరో వాహనందారుడు విఘ్నేష్‌కుమార్ బంధువుల ఇంట్లోకి వెళ్లి తన సెల్‌ఫోన్‌తో మహిళలని కూడా చూడకుండా అందరి పొటోలు తీస్తూ నా వాహనానికి అడ్డు తగులుతారా అని బెదిరించి దుర్భాషలాడాడు. కారును వెంబడించిన బొలేరో వాహనం గ్రామస్తులు గమనించి బొలేరో వాహనదారుడిని మందలించేందుకు ప్రయత్నించారు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, తనను ఏమైనా అంటే అంతుచూస్తానని మద్యం మత్తులో నానాయాగి చేశాడు. దీంతో గ్రామస్తులు ఏఎస్‌పేట పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి అతడ్ని బైక్‌పై తీసుకుని వెళ్లారు. బొలేరో వాహనం ఏసుబాబు అనే వ్యక్తిదిగా గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు సీఐ పాపారావును సంప్రదించగా తాను పూర్తి విషయాలు తెలుసుకుని విచారణ చేస్తానని పేర్కొన్నారు. -
మీడియా వాహనంపై కర్రలతో దాడి
-
శభాష్ కలెక్టర్..!
కారులో వెళ్తుండగా ప్రమాద ఘటనపై స్పందించిన కలెక్టరు విజయ్‌అమృత కులంగా తన వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించిన వైనంకలెక్టరు తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు బరంపురం: అధికారులు ఎప్పుడూ తమ అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటారు. సామాన్యుడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సందర్భాల్లో కూడా తమ పనుల నిమిత్తం వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువ మంది మాత్రమే తామెంత అర్జంట్ పనిలో ఉన్నా ఎదురుగా ఉన్న మనిషి పడుతున్న కష్టం చూసి కారు ఆపుతారు. వెంటనే తమకు తోచిన సహాయం చేసి మానవత్వం చాటుకుంటారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే గంజాం జిల్లాలోని సరగడా సమితిలో ఆదివారం చోటుచేసుకుంది. అదే దారిలో ఓ కారులో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్న కలెక్టరు విజయ్‌అమృత కులంగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను చూసి కారు ఆపి, దిగారు. అనంతరం జరిగిన సంఘటనపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కారు–బైక్ ఢీకొన్న ఘటనలో శివరామ్ పాత్రో తీవ్రగాయాలపాలవ్వగా, అతడిని ఆస్పత్రికి తరలించేందుకు రెండు గంటల నుంచి అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయినా అంబులెన్స్ రాలేదు.. ఈ క్రమంలో క్షతగాత్రుడి పరిస్థితి రానురాను తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ఇదే విషయం పట్ల స్పందించిన కలెక్టరు తన ప్రభుత్వ వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత హింజిలికాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందజేసేలా చేశారు. ఇదే విషయంపై కలెక్టరు తీరు పట్ల అక్కడి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహోన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తే సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్రపూర్ నుంచి కలెక్టర్ విజయ్‌అమృత కులంగా సరగడా సమితిలోని ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సరగడా దగ్గర మారుతి గ్రామం జంక్షన్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాద ఘటనలో శివరామ్ పాత్రో తీవ్రగాయాలతో పడి ఉన్నాడు.ఇదే సంఘటన చూసిన కలెక్టరు కారును ఆపి, క్షతగాత్రుడిని తన కారులో ఎక్కించుకుని, హింజిలికాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి వైద్యసేవలు అందజేశారు. -
మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎలైట్, ధర ఎంతంటే
సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త వి-క్లాస్ ఎలైట్‌ను విడుదల చేసింది. ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్‌క్లూజివ్ కార్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వి-క్లాస్ ఎలైట్‌ను ఆవిష్కరించింది. స్పెయిన్‌లో రూపొందించిన వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది. వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు. -
వానాకాలం... బండి భద్రం!
బొల్లారం: అసలే ఇది వర్షాకాలం... మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో.. మన జీవనంలో భాగమై, కోరుకున్న గమ్యానికి మనల్ని చేర్చే వాహనాల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాహన రంగ నిపుణులు. బండే కదా పోనిద్దూ.. అనుకుని వర్షంలో తడిసేలా ఎక్కడబడితే అక్కడ నిలిపితే వ్యయప్రయాసలు తప్పవంటున్నారు. విడి భాగాలు దెబ్బతింటే.. వాహనాలను చాలామంది రోడ్లపై, వీధుల్లో, ఇళ్లమధ్య సందుల్లో, పార్కులు, చెట్ల కింద ఎక్కువగా నిలుపుతుంటారు. వర్షాల సమయంలో తగి న రక్షణ లేనందున కొద్దిరోజులకే అవి మొరాయిస్తుంటాయి. దాంతో మెకానిక్‌ల వద్దకు తీసుకెళ్తే వర్షంలో తడిసి, కొన్ని విడిభాగాలు దెబ్బతిన్నా యని, వాటిని వెంటనే మార్చాలని చెబుతారు. వాటి ధరలూ ఎక్కువగానే ఉంటున్నాయి. ఆదే విధంగా ద్విచక్ర వాహనం ఇంజిన్ వేడికి స్పార్క్ ప్లగ్పై ఉన్న ప్లాస్టిక్ భాగానికి చిన్నపాటి పగుళ్లు ఏర్పడినా, కరెంటు వైరింగ్ కిట్టులో అతుకులు ఎక్కువగా ఉన్నా వాహనాలు తడిసిన సమయంలో ఇబ్బందులు తప్పవు. అరిగిపోయిన తాళాలను వినియోగించడం సరికాదు. బండి సీటు కవరు సరిగా లేకపోతే వర్షపు నీరు ఫిల్టర్‌లోకి వెళ్తుంది. వర్షాకాలం వచ్చేసరికి స్పార్క్ ప్లగ్, వైరింగ్ కిట్టు, సీటు కవరు వంటివి పరిశీలించుకోవాలి. నాణ్యతతో కూడిన అసలు విడిభాగాలనే వాడాలి. తడిస్తే ఇలా చేయాలి.. వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి తడిస్తే ఇలా చేయాలి.. వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి లోపాలు గుర్తించండిలా... ♦ వాహనం వానలో తడిస్తే ముందుగా ఎక్సలేటర్ పైపుల ద్వారా కార్బేటర్లోకినీరు చేరుతుంది. దాంతో స్టార్టింగ్ సమస్యలు తలెత్తుతాయి. ♦ స్విచ్‌ల్లో నీరు చేరితే... హెడ్ లైట్లు, హారన్, స్టార్టింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. ♦ బ్రేక్ డ్రమ్‌లోకి నీరు వెళితే బ్రేకులు సరిగా పడవు. దాంతో బండి నియంత్రణ మన చేతిలో ఉండదు. ♦ బ్యాటరీలో నీరు చేరితే హారన్,స్టార్టింగ్ సమస్యలు అధికంగా ఉంటాయి. ♦ వర్షంలో ప్రయాణించేటప్పుడు టైర్ల అరుగుదలతో జారిపడే ప్రమాదం ఉంటుంది. ♦ స్టార్టింగ్ కాయిల్, స్పార్క్ ప్లగ్, కార్బేటర్లో నీరు చేరినా బండి మొరాయిస్తుంది. ♦ ఒక్కోసారి సైలెన్సర్లోకి నీరు వెళ్లినా బండి స్టార్ట్ కాదు. ♦ పెట్రోలు ట్యాంకుపై కవరు ఉంచడం మంచిది. లేకపోతే నీరు ట్యాంకులోకి చేరే అవకాశం ఉం ది. ఇది మరీ ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ♦ నీరు చేరి ఎలక్ట్రిక్ వైర్లు తుప్పుపట్టి పాడవుతాయి. ♦ వెనక చక్రం డ్రమ్‌లోకి నీరు చేరితేబండి ఎంతకూ కదలకపోవచ్చు. -
ఉద్యోగుల రవాణాకు ఈ–వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉద్యోగులకు రవాణా సేవలందిస్తున్న రూట్‌మ్యాటిక్ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత 10 వాహనాలతో నెల రోజుల్లో సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్ నిపుణులు నియామకం పూర్తయింది. మైండ్ ట్రీతో ఒప్పందం చేసుకున్నామని, మరొక నాలుగైదు కంపెనీలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని, సెప్టెంబర్ నాటికి 600ల వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ కో–ఫౌండర్ అండ్ సీఈఓ సురాజిత్ దాస్ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఐఎస్బీ పూర్వ విద్యార్థులు సురాజిత్ దాస్, శ్రీరామ్ కన్నన్‌లు బెంగళూరు కేంద్రంగా 2013 డిసెంబర్లో రూట్మ్యాటిక్ను ప్రారంభించారు. రూట్‌మ్యాటిక్ రెండు రకాల సేవలందిస్తుంది. 1. ఉద్యోగుల రవాణా కోసం వాహన సర్వీసులు, 2. ట్రాన్స్పోర్ట్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ సర్వీస్‌లు. మొదటి సర్వీస్‌లో కంపెనీలకు జీపీఎస్ ఆధారిత పాయింట్ టు పాయింట్ సేవలుంటాయి. అంటే వాహనాన్ని బట్టి కాకుండా అందులో ప్రయాణించే ఉద్యోగుల దూరాన్ని బట్టి చార్జీలుంటాయన్నమాట. దీంతో కంపెనీలకు వ్యయ భారం తగ్గుతుంది. ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,500–6,000 మధ్య ఉంటాయి. ఇక, రెండో విభాగంలో కంపెనీలకు ట్రాన్స్పోర్ట్ నిర్వహణ, టెక్నాలజీ సేవలందిస్తుంది. వీటి చార్జీలు ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,000–7,000 మధ్య ఉంటాయి. 60కి పైగా కంపెనీలు కస్టమర్లు.. ప్రస్తుతం ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, మధురై వంటి 12 నగరాల్లో సేవలందిస్తుంది. సిస్కో, బార్క్లెస్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి 60కి పైగా కార్పొరేట్ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మాకు 700లకు పైగా వాహనాలు, 1.50 లక్షల మంది కస్టమర్లున్నారు. నెలకు 10 లక్షల కి.మీ. ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 4 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ఏటేటా రెట్టింపు అదాయాన్ని నమోదు చేస్తున్నాం. రూ.175 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరొక 100 మందిని నియమించుకుంటాం. ‘‘ఇప్పటివరకు 31 కోట్ల నిధులను సమీకరించాం. బ్లూమ్ వెంచర్స్, దుబాయ్‌కు చెందిన వ్యామ్ క్యాపిటల్, కెఫే కాఫీ డే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నరేష్ మల్హోత్ర ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు లోగా రూ.175 కోట్లు (25 మిలియన్ డాలర్లు) నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని’’ సురాజిత్ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వాహనం విక్రయించారా? అందుకు మీరే బాధ్యత
సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం విక్రయించారా? అయితే యాజమాన్య మార్పిడి మరిచారో ముప్పు పొంచి ఉన్నట్లే! సదరు వాహనాలు అసాంఘిక వ్యక్తుల చేతుల్లో పడి నేరాల కోసం వినియోగించినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. అందుకు మీరే మూల్యం చెల్లించాల్సి రావచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది వాహనదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాహనాలను విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరిట యాజమాన్యం మార్పిడి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనం అమ్మేసిన తరువాత చాలామంది వాహనదారులు ఆర్టీఏ పత్రాలపై (ఫామ్ 29, 30) సంతకాలు చేస్తే తమ పని పూర్తయినట్లు భావిస్తారు. కానీ రవాణాశాఖ అధికారుల సమక్షంలో కచ్చితంగా విక్రయించిన వారి నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట ‘యాజమాన్య మార్పిడి’ జరగాల్సిందే. అలా కాకుండా కేవలం పత్రాలపైన సంతకాలు చేస్తూ ఒకరి నుంచి మరొకరికి వాహనాలు విక్రయిస్తూ పోతే చివరకు ఆ వాహనాలపైన జరిగే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన అసలు యజమానికి ఇబ్బందులు తప్పవు. రవాణాశాఖ వెబ్సైట్లో వాహనం ఎవరి పేరిట ఉంటే వారినే యజమానిగా గుర్తిస్తారు. నగరంలో ఇలా విక్రయించినప్పటికీ యాజమాన్యం బదిలీ కాకుండా సుమారు 10లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంఘటనల్లో పోలీసులు, రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు, ఆ క్షణం వరకు వాటిని వినియోగిస్తున్న వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు. వాహనాలు అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయడం లేదు. అలాగే కొనుగోలు చేసిన వాళ్లు కూడా తమ పేరిట తిరిగి నమోదు చేసుకోవడం లేదు. భారీ మూల్యం తప్పదు... కార్లు, మోటారు బైక్‌లు వంటి వ్యక్తిగత వాహనాలు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సులు తదితర రవాణా వాహనాలు ప్రతి రోజు వేల సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతాయి. సెకండ్హ్యాండ్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 1,000 వరకు పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ వాహన యాజమాన్య బదిలీ కోసం ఆర్టీఏకు వస్తున్న వాహనాలు మాత్రం 250 నుంచి 300 వరకు మాత్రమే ఉన్నాయి. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాలను అమ్మిన వెంటనే కొన్న వాళ్ల పేరిట బదిలీ చేయడం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం సకాలంలో తమ పేరిట బదిలీ చేసుకోవడం లేదు. పైగా ఇలా బదిలీ కాకుండా ఉన్న వాహనాలు ఒకరి నుంచి మరొకరికి అదే పనిగా మారిపోతున్నాయి. చివరకు అసలు వాహన యజమానికి, దానిని వినియోగించే వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 10లక్షల వాహనాలు బదిలీ కాకుండా ఉన్నట్లు అధికారుల అంచనా. నగరంలో తిరుగుతున్న 1.4లక్షల ఆటో రిక్షాల్లో సగానికి పైగా బినామీ పేర్లు, ఫైనాన్షియర్లపైనే నమోదై ఉన్నాయి. కానీ వాటిని వినియోగించే వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన లక్షలాది కార్లు, క్యాబ్‌లు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నగరంలో తప్పుడు చిరునామాలపై నమోదై తిరుగుతున్నాయి. చాలా వాహనాలు ఎలాంటి యాజమాన్య బదిలీ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడినప్పుడు, ›ట్రాఫిక్ ఉల్లంఘనల్లో దొరికిపోయినప్పుడు అసలు వాహన యజమానులు భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా రవాణాశాఖ రికార్డుల్లో నమోదైన వాహన యజమానులనే పోలీసులు పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. అలాంటి వాహనాలు తమ వినియోగంలో లేకపోయినప్పటికీ యాజమాన్య బదిలీ చేయకపోవడం వల్ల రూ.వేలల్లో జరిమానాలు చెల్లించక తప్పదు. బినామీ దందా... మరోవైపు వాహనాలపైన బినామీ దందా సైతం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తరలించిన వాహనాలు, ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్‌కు బదిలీ అయ్యే వాహనాలు చాలా వరకు బినామీ పేర్లపైనే నమోదవుతున్నాయి. నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రవాణా అధికారులు కొందరు దళారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏజెంట్లు, దళారుల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చిరునామా ధ్రువీకరణ కోసం రకరకాల ఆధారాలను సృష్టిస్తున్నారు. ఇదొక వ్యవస్థీకృత వ్యాపారంగా సాగుతోంది. ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు... వాహనం అమ్మిన వెంటనే ఆ వివరాలను ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని నమోదు చేసి సకాలంలో కొన్న వారి పేరిట నమోదయ్యే విధంగా అధికారులను సంప్రదించాలి. ఈ సేవా కేంద్రాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో ఆర్టీఏ ఆన్లైన్ పౌరసేవలను వినియోగించుకోవచ్చు. మోటారు బైక్‌లు, కార్లు తదితర వాహనాల బదిలీ కోసం రూ.650 నుంచి రూ.850 వరకు ఫీజు చెల్లిస్తే చాలు. కానీ చిన్న పనిని వాయిదా వేసినా, జాప్యం చేసినా రూ.వేలల్లో నష్టపోవడమే కాదు. నేరగాళ్ల చేతిలో పడితే మరిన్ని చిక్కులు తప్పవు. -
నాలుగేళ్ళ బాలికపై దూసుకెళ్ళిన పోలీసు వాహనం
-
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన వ్యాపార విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ’ (ఓఈఎం)లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ఈయన తన వ్యక్తిగత స్థాయిలో... సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్‌ను అందించారని ఓలా సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎంత మొత్తంలో ఈ పెట్టుబడి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విజయవంతంగా ఆచరణలోకి వచ్చేందుకు రతన్ టాటాకు ఉన్నటువంటి లోతైన అనుభవం, సలహాదారు హోదా ఓలా సంస్థ అభివృద్ధికి దోహదపడనుంది’ అని మాతృ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఓలా భాగస్వామ్య సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీలో సైతం 2015 జూలైలోనే ఈయన ఇన్వెస్ట్‌చేసి.. ఈ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టిన తొలి ఇన్వెస్టర్‌గా నిలిచారు. ఇక తాజా పెట్టుబడిపై స్పందించిన టాటా.. ‘విద్యుత్ వాహన రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ వృద్ధిలో ఓలా కీలకపాత్ర పోషించనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ విభాగంలోకి రతన్ టాటాను సలహాదారునిగా, పెట్టుబడిదారునిగా చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. -
ఇక వాహనంతో పాటే ‘హైసెక్యూరిటీ’
సాక్షి, హైదరాబాద్ : ఇక నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)తో పాటే వాహనాలు రోడ్డెక్కనున్నాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాహనాలను విడుదల చేసే పద్ధతికి త్వరలో స్వస్తి చెప్పనున్నారు. బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌తో పాటు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను బిగించి ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల కేంద్రం వాహన తయారీదార్లతో జరిపిన సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. వాహనం తయారీతో పాటే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తయారీదార్లు తేల్చారు. అది డీలర్ల స్థాయి లోనే అమలు జరగాలని స్పష్టీకరించారు. ఈ మేరకు కేంద్రం తాజాగా విధివిధానాలను రూపొందించింది. దీంతో రవాణా శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ద్విచక్ర వాహనా లు, కార్లు, తదితర అన్ని రకాల వాహన డీలర్లతో సమావేశం జరిపి మే నెల నుంచి అమలు చేయనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ ‘సాక్షి’తో చెప్పారు. హెచ్ఎస్ఆర్పీ ఇలా.... వాహనాల భద్రత దృష్ట్యా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ మేరకు రవాణాశాఖ 2013 నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లింక్ ఆటోటెక్ సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. మొదట్లో ఆర్టీఏలో నమోదయ్యే వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా నంబర్ప్లేట్లను తయారు చేసి ఇవ్వడంలో ఆ సంస్థ విఫలమైంది. ఒక్కో వాహనానికి కనీసం 2 నుంచి 3 నెలల వరకు సమయం పట్టేది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండగా వాటిలో కనీసం సగానికి కూడా అందజేయలేకపోయారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆర్టీఏ అధికారులు దీనిపై దృష్టిసారించారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనే లింక్ ఆటోటెక్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నంబర్ప్లేట్లను అందజేసేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో 2016 నుంచి కొంత మార్పు వచ్చింది.పెండింగ్ వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు ఈ జాప్యం కారణంగా వాహనదార్లే హెచ్ఎస్ఆర్పీ పట్ల విముఖత ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు అధిగమించే దిశగా రవాణా శాఖ అడుగులు వేస్తోంది. మరింత పకడ్బందీగా... తాజా ఆదేశాలతో బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ ఏర్పాటు చేసి ఇవ్వనున్న దృష్ట్యా వినియోగదారుడు నిరాకరించే వీలుండదు. అంటే శాశ్వత రిజిస్ట్రేషన్‌తోనే వాహనం బయటకు వస్తుంది.వాహనం ఖరీదులో భాగంగానే దీనిని ఏర్పాటు చేసి ఇస్తారు. హెచ్ఎస్ఆర్పీ కోసం ప్రత్యేకంగా అదనపు రుసుము వసూలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ అధికారులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. బండి విడుదలైన వారం, పది రోజుల్లో వాహన యజమాని ఇంటికే ఆర్సీ పత్రాలు స్పీడ్ పోస్టు ద్వారా చేరేలా చర్యలు తీసుకుంటారు. స్పెషల్ నంబర్లపైన ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇందుకోసం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
మరిన్ని భద్రతా ఫీచర్లతో ఈకోలో అప్డేటెడ్ వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ మల్టీపర్పస్ వెహికల్, ఈకోలో అప్డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రివర్స్ పార్కింగ్ అసిస్ట్, కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ తదితర భద్రత ఫీచర్లతో(ఇవి స్టాండర్డ్) ఈ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని మారుతీ సుజుకీ తెలిపింది. స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈకో కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉందని, ఫీచర్లను బట్టి కొత్త వేరియంట్ ధర ప్రస్తుత ధర కంటే రూ.400–23,000 అధికమని వివరించింది. -
ఆటో.. అటో ఇటో..!
ఆర్మూర్‌టౌన్: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆటోలతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు ఆటోలు, ఇతర వాహనాలు నడిపేందుకు ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సులు పొందాలి. లైసెన్సులు లేకున్నా ఆటోలు నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణం మున్సిపల్ పరిధిలో ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పట్టణంతోపాటు నిజామాబాద్ నగరం, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ పట్టణాలే కాకుండా అన్ని మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. పట్టణాలకు చుట్టు పక్కల గ్రామాలకు బస్సులు వెళ్లలేకపోవడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల మీద ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. అదే విధంగా పట్టణాల్లో ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది నుంచి పది మంది వరకు ఎక్కించుకుని వెళుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు అనుభవం, లైసెన్సు లేకుండా ఆటోలు నడపటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఆటోలు నడపాలి. అయితే ఇక్కడ మైనర్లు సైతం ఆటోలు నడుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆటోలు డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్ల పక్కన కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. కాగా డ్రైవర్ సీట్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా ప్రయాణికుల కోసం ఆటో డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు మీదనే నిలుపుతున్నారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఆటోవెనుక పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోతున్నాయి. బస్టాండ్ ప్రాంతంలో ఆటోడ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆటోడ్రైవర్లపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. ఫిబ్రవరి 7న పాత ఎంజే ఆస్పత్రి వద్ద బైక్ వెళ్తున్న మురిళి అనే వ్యక్తికి ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఆయన చేయి విరిగింది. సుమారు రూ.80వేల వరకు ఆస్పత్రి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈనెల 4న గోల్‌బంగ్లా ప్రాంతంలో ఓ ఆటోడ్రైవర్ ఆటోను రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న ఓ బాలుడిని చూడక ఢీకొని పక్కన ఉన్న మురికి కాలువ పడిపోయాడు. ఈ సంఘటనలో బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగపోడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఆలూర్ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 9మంది మహిళలకు గాయాలయ్యాయి. అటోల ఆగడాలను అరికట్టాలి.. పట్టణంలో ఆటోలు ఇష్టానుసారంగా వ్యహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణిలకు ఎక్కించుకొని వెళ్తున్నారు. మైనర్లు ఆటోలు నడిపించినట్లైతే వారి చర్యలు తీసుకునే విధంగా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. –రాజేందర్, ఆర్మూర్. లైసెన్సు లేకుంటే చర్యలు తీసుకోవాలి లైసెన్సు లేకుండా ఆటోలు నడిపిస్తున్న వారిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో నడిస్తున్న ఆటోడ్రైవర్లకు అడ్డుకట్టా వేయాలి. మైనర్లు ఆటోలు నడిపిస్తే ఆ ఆటోలను సీజ్ చేయాలి. అధికారులు ప్రతిరోజు ఆటోల తీరుపై నిఘా ఉంచాలి. –మోహన్, ఆర్మూర్. -
ప్రమాదంలో వ్యక్తి మృతి..10 వాహనాలకు నిప్పు
సెహోర్(మధ్యప్రదేశ్): సెహోర్ షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి బుధవారం రాత్రి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు సమీపంలో ఉన్న 10 ఇసుక రవాణా చేసే వాహనాలకు నిప్పుపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు ఢీకొనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇసుక వాహనాలు ఈ ప్రాంతంలో నిషేంధించాలని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ కోసం వెతుకుతున్నామని, కచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు స్థానిక అడిషనల్ ఎస్పీ సమీర్ యాదవ్ హామీ ఇచ్చారు. -
సొంత వాహనాలకూ జీపీఎస్!
సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం కొందరికి కల, ఎందరికో అవసరం. ప్రస్తుత కాలంలో కొన్ని ఉద్యోగాలు సైతం ద్విచక్ర వాహనం ఉన్నవారికే వస్తున్నాయి. అలాంటి వ్యక్తి తన వాహనాన్ని పోగొట్టుకుని, మరోటి కొనే శక్తి లేకుంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి ఉదంతాలతో పాటు బ్యాంకులకు చెందిన ప్రజాధనం సైతం మోసగాళ్ల పాలు కాకుండా ఉండాలన్నా.. పోలీసులకు కాస్త పనిభారం తగ్గాలన్నా ఇటీవల కేంద్రం తీసుకున్న ‘జీపీఎస్ నిర్ణయం’ వ్యక్తిగత వాహనాలకూ వర్తించాలని పోలీసులు చెబుతున్నారు. ఇది ఎంతో అవసరం, ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తప్పనిసరి... ప్రజా రవాణా వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఏర్పాటు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమలులోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఆటోలు, ఈ–రిక్షాలు మినహా సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్–1989 కిందకు వచ్చే అన్ని బస్సులు, స్కూల్ వాహనాలు, ట్యాకీలతో సహా ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఈ వ్యవస్థ ఉండాల్సిందే. నేషనల్ పర్మిట్ ఉన్న కమర్షియల్ వాహనాలకు సైతం జీపీఎస్ కిందికి వచ్చే వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ (వీఎల్టీ) తప్పనిసరి. దీంతోపాటు ప్యానిక్ బటన్ సైతం ఉంటేనే కొత్త వాటి రిజిస్ట్రేషన్, పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఏటా వేల సంఖ్యలో వాహనాల చోరీ హైదరాబాద్ నగరంలో ఏటా వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వ్యక్తిగత వాహనాలు చోరీ అవుతున్నాయి. వీటిలో సగానికి ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్) జారీ అవుతున్నాయి. ఆపై పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత దొరుకున్న వాటి సంఖ్య 50 శాతం కూడా ఉండడం లేదు. మిగతా వాహనాల యజమానులు నష్టపోతున్నారు. ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బు రావట్లేదు. ఇది అనేక మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఈ వాహన చోరీలకు ప్రధాన కారణం పార్కింగ్ సమస్య. ద్విచక్ర వాహనం ఆధారంగా ఉద్యోగం చేసే ఫీల్డ్ స్టాఫ్, ఉద్యోగాలకు వెళ్లిడానికి వీటిని వినియోగించే వారిలో అత్యధికులు సాధారణ జీవులే. వీరు ఇరుకైన ప్రదేశాల్లోని అద్దె ఇళ్లల్లో నివసిస్తుంటారు. వీటి ఆవరణల్లో పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో రోడ్డు పైన, వీధుల్లోను నిలుపుకోవాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న చోరులు తస్కరిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థతో ఎంతో మేలు ఈ తరహా కేసుల దర్యాప్తు కోసం పోలీసులు సైతం శ్రమించాల్సి వస్తోంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. అయినప్పటికీ వాహనచోదకులు తమ వాహనాలకు వీఎల్టీ వంటి పరిజ్ఞానం అమర్చుకోవట్లేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావట్లేదు. కమర్షియల్ వెహికిల్స్ మాదిరిగా వ్యక్తిగత వాహనాలకు జీపీఎస్ పరికరాల ఏర్పాటు తప్పనిసరి చేస్తే ఈ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. కేవలం వాహనాలు పోగొట్టుకున్న వారికి వీలైనంత త్వరగా వాటిని గుర్తించి అప్పగించడం పోలీసులకు తేలికవుతుంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాహనాలు ఖరీదు చేయడం, ఆపై నకిలీ పత్రాల ద్వారా వాటిని విక్రయించేసి రుణం ఎగ్గొట్టడం వంటి చేసే వారికీ చెక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు ద్విచక్ర వాహనాలపై విధులు నిర్వర్తించే తమ ఉద్యోగుల కదలికలూ ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. అయితే ఈ వాహనాలకు ఉండే జీపీఎస్ లేదా వీఎల్టీ పరికరాలు విడిగా ఉండే తీసి పారేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇంజన్‌కు కనెక్ట్‌గా, అంతర్భాగంగా ఏర్పాటు చేయించాలని పోలీసులు చెబుతున్నారు. అలా చేస్తే పరికరాన్ని తీస్తే బండి స్టార్ట్ కాకుండా ఉంటుందని, అప్పడే వీటి ఫలితాలు అందుతాయని పేర్కొంటున్నారు. విద్యార్థినులు,మహిళల భద్రత కోణంలోనూ ఆయా వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు. -
ఇది సెకండ్ హ్యాండ్ బండి గురూ..!
చిత్తూరు, బంగారుపాళెం: స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన కండీషన్ లేని వాహనంతో పోలీసులు అవస్థల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ డొక్కుబండి ఎప్పుడు ఆగిపోతుందో? ఎక్కడ అవస్థలు పడాల్సి వస్తుందోనని దేవుడికో దండం పెట్టి విధులకు బయల్దేరుతున్నారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో బంగారుపాళెం పెద్ద మండలం. ఇక్కడ చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి ఉండడంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా మండలంలో 40 గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా గొడవలు, ఇతర సంఘటనలు చోటుచేసుకుంటే హుటాహుటిన వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా బెంగళూరు, తిరుపతి, తిరుమల, చెన్నై తదితర పట్టణాలకు ప్రముఖుల రాకపోకల సమయంలో ఎస్కార్టుగా ఇదే వాహనంలో వెళ్లకతప్పడం లేదు. ఉంటుంది. 2002లో పలమనే రు పోలీసులకు క్వాలిస్ వాహనం ఇచ్చారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో దీనిని విరివి గా వినియోగించారు. ఆ తర్వాత కొత్త వాహనా న్ని వారికి పోలీస్ శాఖ ఇవ్వడంతో ఆ క్వాలిస్‌ను ఐదేళ్ల క్రితం బంగారుపాళెం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చారు. అప్పటికే దీనిని తుక్కు..తుక్కుగా వాడేశారు. చూసేందుకు బాగున్నా సరైన కండీ షన్ లేని ఈ సెకండ్ హ్యాండ్ వాహనంతో అవస్థలు పడుతున్నారు. సెల్ఫ్ మోటర్, రేడియేటర్, బ్యాటరీ మొదలైనవి సక్రమంగా పనిచేయక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం. అంతేకాకుండా ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ లేకపోలేదు. ఇటీవల జన్మభూమి గ్రామ సభ వద్ద కూడా ఈ వాహనాన్ని రిపేరు చేసు కుంటూ పోలీసులు కనిపించారు. వాస్తవానికి జిల్లాలో కేసుల తాకిడి ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లలో బంగారుపాళెం ఒకటి. ఇలాంటి పోలీస్ స్టేషన్‌కు కొత్త వాహనాన్ని మంజూరు చేయకపోవడం గమనార్హం! ఇటీవల జిల్లాకు వచ్చిన కొత్త వాహనాలను చిన్నచిన్న స్టేషన్లకు సైతం అందజేశారు. అత్యవసరమైన స్టేషన్లకు పాతకాలం నాటి డొక్కు వాహనాలే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించి బంగారుపాళెంకు కొత్త పోలీస్ వాహనాన్ని మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. పూతలపట్టు మండలంలో పోలీసులు హైవే పట్రోలింగ్ వాహనంలో వెళ్తూ ప్రమాదానికి గురై, ఒకరు మృతి చెందడం, ఎస్ఐతో సహా మరో ముగ్గురు గాయపడడటం విదితమే. డొక్కు వాహనాలతో యమర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అటువంటి ప్రమాదాల బారిన పడరనే గ్యారంటీ ఏమీ లేదు. పోలీస్ బాసులూ.. వీళ్లనూ కాస్త పట్టించుకోండి సారూ! -
లెక్క తేలింది..
సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు పదేళ్ల క్రితం నాటి ‘వాహన స్కామ్’ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో ఆరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 42 మందిని నిందితులుగా తేల్చిన అధికారులు 33 మందిపై నాంపల్లి కోర్టులో అభియోగాలు మోపారు. ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఖరీదు చేసుకువచ్చిన ఈ ముఠా నగరం కేంద్రంగా దందా చేసినట్లు తేల్చారు. ఇక్కడి వాహనాల ఇంజిన్, ఛాసిస్ నెంబర్లు మార్చడం ద్వారా అటు ఫైనార్షియర్లు, ఇటు ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసినట్లు గుర్తించారు. 2008 మే 28న నగర టాస్క్‌ఫోర్స్ పోలీసుల చొరవతో ఈ ముఠా గుట్టురట్టయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ గ్యాంగ్‌పై ప్రాథమికంగా బహదూర్‌పుర ఠాణాలో నమోదైన ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయిందని డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. సిటీకి చెందిన వారే సూత్రధారులు... ఈ అంతరాష్ట్ర వాహన స్కామ్ గ్యాంగ్‌లో నగరంలోని గుడిమల్కాపూర్‌కు చెందిన ఖాలీద్ అక్తర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. వృత్తిరీత్యా ఆర్టీఏ ఏజెంట్ అయిన ఇతడికి సహచర ఏజెంట్ గులాం జిలానీ (అత్తాపూర్), సంతోష్‌నగర్‌కు చెందిన పాత వాహనాల వ్యాపారి సయ్యద్ జఫార్, వాహనాల నెంబర్లు మార్చే సయ్యద్ గఫార్ తదితరులు సహకరించారు. వీరితో పాటు కొందరు ఆర్టీఏ ఏజెంట్లు, సిబ్బంది, వాహనాల డీలర్లు, మెకానిక్స్, ఫైనాన్స్ కంపెనీల సిబ్బంది పాత్రధారులుగా ఉన్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లోని వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. వీరిలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్టీఏ సిబ్బంది సైతం ఉన్నారు. అక్కడ ఖండమైన, ప్రమాదాలకు గురైన వాహనాల ఆర్సీలను వీరి సహకారంతో ఖాదిల్ అక్తర్ తదితరులు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు ఖరీదు చేసే వారు. వాటిని ఇక్కడికి తీసుకువచ్చి స్థానిక ఏజెంట్ల సాయంతో లోకల్ వాహనాలకు చెందినవిగా మార్చేవారు. అనంతరం పాత వాహనాల ఏజెంట్ల సహకారంతో కాలం చెల్లిన వాహనాలు, అసలే మనుగడలోనే లేని వాహనాలకు వీటిని వినియోగించే వారు. ఇలా తయారైన లోకల్ ఆర్సీలను ఒక్కోటి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు విక్రయించే వారు. టైగర్ మార్కింగ్‌తో నంబర్లు మార్చేసి... ఓ వాహనానికి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్‌తో పాటు ఇంజిన్, ఛాసిస్ నెంబర్ల ఆధారంగానే దానిని గుర్తిస్తారు. టైగర్ మార్కింగ్ విధానంలో కేటుగాళ్లు ఇంజిన్, ఛాసిస్ నెంబర్లను మార్చేస్తారు. అప్పటికే వాటిపై ఉన్న అంకెలను వెల్డింగ్ చేయడం ద్వారా పూర్తిగా చెరిపేసి దాని స్థానంలో పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన ఆర్సీల్లోని నెంబర్లు ముద్రించేవారు. దీనికోసం టైగర్మార్కింగ్ విధానాన్ని అనుసరించేవారు. ఇలా రూపొందిన వాహనాలకు అప్పటికే ఫైనాన్స్ ఉన్నా, కాలం చెల్లిపోయినా ఆ విషయాన్ని ఆర్టీఏ అధికారులు, ఫైనాన్స్ చేసిన వారే కాదు.. చిరవకు దాని యజమానులూ గుర్తించలేక పోయేవారు. అనంతరం వాటికి అప్పటికే ఫైనాన్స్ ఉన్న వాటిపై పదేపదే ఫైనాన్స్‌లు తీసుకోవడం చేసేవారు. ఈ వ్యవహారంలో ఆయా ఫైనాన్స్ కంపెనీలకు చెందిన సిబ్బంది సైతం సహకరించారు. అనేక సందర్భాల్లో అసలు వాహనాలే లేనప్పటికీ కేవలం ఆర్సీల ఆధారంగా రుణాలు తీసుకుంటూ ఫైనాన్స్ సంస్థలకు టోకరా వేశారు. 16 మంది పట్టివేత .. ఈ వాహన స్కామ్ గుట్టును 2008లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 15 మందిని పట్టుకున్న అధికారులు వీరి నుంచి రెండు లారీలు, రెండు టిప్పర్లు, మరో రెండు కార్లతో పాటు 35 బోగస్ ఆర్సీలు, మార్పిడికి సిద్ధంగా ఉన్న మరో 20 ఆర్సీలు తదితరాలు స్వాధీనం చేసుకుని బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. బహదూర్‌పుర పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేయగా... కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. దర్యాప్తు చేసిన ఆటోమొబైల్ టీమ్ అధికారులు మరో నలుగురిని అరెస్టు చేయగా... 13 మంది ముందస్తు బెయిల్ పొందారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన 9 మంది కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. వారు చిక్కకపోవడంతో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో పరీక్షలు చేయించారు. ఫలితంగా వాటి నెంబర్ల మార్పిడి జరిగినట్లు నివేదికలు వచ్చాయి. వీటి ఆధారంగా 33 మంది నిందితులపై సీసీఎస్ పోలీసులు గత వారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితులపై ఐపీసీలోని 420, 468, 471, 473, 474 తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. -
క్రిమియా తైగన్ సఫారీ పార్క్‌లో సింహం హల్చల్
-
నిలిచిన ప్రగతి చక్రం
సాక్షి, హైదరాబాద్: నూతన మోటారు వాహన చట్ట సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక్కరోజు సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు పలకడంతో మంగళవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 97 లక్షలమందిని గమ్యస్థానాలకు చేరవేసే 10,500 ఆర్టీసీ బస్సులు మంగళవారం సాయంత్రం దాకా డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలైంది. సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించడంతో కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద అన్ని కార్మిక సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. మోటారు వాహన చట్టం సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణæ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీకేయూ, టీజేఎంయూ, ఐఎన్టీయూసీ, బీఎస్పీ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఒక్క బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ్ మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. కాగా, ఆర్టీసీకి సమ్మె కారణంగా దాదాపు రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పాక్షికంగా ఆటోలు, క్యాబ్‌లు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా తామూ సమ్మెలో పాల్గొంటామని ఆటోలు, క్యాబ్‌ల సంఘాలు ప్రకటించినప్పటికీ, వీరు పాక్షికంగా సర్వీసులు నడిపారు. ఆర్టీసీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో ఉదయం 4 గంటల నుంచే ఆటో సర్వీసులు మొదలయ్యాయి. సమ్మె నెపంతో ప్రయాణికుల వద్ద రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల వద్ద ప్రైవేటు కార్ల డ్రైవర్లు.. సూపర్ లగ్జరీ చార్జీల కంటే రెండింతలు వసూలు చేశారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, విజయవాడ, షాద్‌నగర్ రూట్లలో ఈ దోపిడీ కొనసాగింది. ఏపీ నుంచి 30 శాతం బస్సులే.. ఏపీ నుంచి రావాల్సిన బస్సులపైనా సమ్మె ప్రభావం పడింది. రోజూ వచ్చే బస్సుల్లో 30 శాతం బస్సులే వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీలో గుర్తింపు సంఘం ఎన్నికల హడావుడి వల్ల అక్కడి సంఘాలు పెద్దగా సమ్మెలో పాల్గొనలేదు. రైల్వే ప్రత్యేక సర్వీసులు.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు సర్వీసులను నడిపించింది. లింగంపల్లి –ఫలక్‌నుమా, లింగంపల్లి– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపించారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఇంతకీ సమ్మె దేనికి? నూతన మోటార్ వాహన చట్టం సవరణ బిల్లు–2016ను చూసి రవాణా రంగంపై ఆధారపడ్డ వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ బిల్లు వల్ల దేశంలో రవాణా వ్యవస్థ కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, రవాణాా రంగాన్ని నమ్ముకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రవాణాా సంస్థల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త చట్టం నిబంధనలివే.. - కొత్త మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వాళ్లు రూట్లను కొనేసుకోవచ్చు. అంటే నిత్యం లాభాలు వస్తూ, బిజీగా ఉండే రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ కొనుక్కున్నా ఆ రూటులో ఆర్టీసీ బస్సు నడవకూడదు. ఉదాహరణకు తెలంగాణ నుంచి విజయవాడ చాలా రద్దీ రూటు. దీన్ని ఏదైనా ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ఆ దారిలో ఆర్టీసీ బస్సులు నడపకూడదు. ఈ విధానం అమలైతే ఆర్టీసీ బస్సులు లాభాలున్న రూట్లలో తిరగలేవు. అప్పుల ఊబిలో ఉన్న ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. - థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు భారీగా పెంచుతున్నారని రవాణా రంగం మీద ఆధారపడ్డవారు ఆరోపిస్తున్నారు. - కొత్త బిల్లులో భారీగా జరిమానాలు పెంచారు. ఉదాహరణకు సరైన పర్మిట్లు లేకుండా నడిపిస్తే రూ.10,000 జరిమానా విధిస్తారు. - లైసెన్సు నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే.. రూ.25 వేల నుంచి 1 లక్ష వరకు జరిమానా. - ఓవర్‌లోడ్‌కి రూ.20,000 జరిమానా, మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు. - అధిక ప్రయాణికులను ఎక్కిస్తే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతమందికి రూ.1000 చొప్పున వసూలు చేస్తారు. సాయంత్రానికి రోడ్డెక్కిన బస్సులు 24 గంటల సమ్మె అయినా సాయంత్రం 6 గంటలు దాటాక హైదరాబాద్‌లో సగం బస్సులు రోడ్డెక్కాయి. జిల్లాల్లోని డిపోల్లో కొన్ని బస్సులు రోడ్డెక్కాయి. అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయి. కాగా, ఆర్టీసీ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు వివిధ యూనియన్ల నాయకులు అశ్వత్థామరెడ్డి (టీఎంయూ), నాగేశ్వర్రావు, అశోక్ (ఎన్ఎంయూ) రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ (టీజేఎంయూ) కృతజ్ఞతలు తెలిపారు. -
సంచార వాహనం ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. మయూరిసెంటర్‌లోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగాల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రజలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు సునీల్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించిన ఏడాది కాలంలో 4 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందులో 293 మందికి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దాని నివారణకు మందులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కటకం గిరిప్రసాద్, కమర్తపు మురళి, ప్రమోద్‌కుమార్, తేజావత్ సురేశ్, పుల్లఖండం సురేశ్, బొమ్మిడి శ్యాంకుమార్, జంగాల శ్రీధర్, అబ్దుల్ కరీం, బొమ్మిడి సునీల్‌కుమార్, బండారు శివకుమార్, కూరపాటి ప్రదీప్, గోలీ అనూప్ పాల్గొన్నారు. -
నీటిలో మహింద్రా వాహనం, ఆనంద్ స్పందన
ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నగరాలను ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల్లో బయటికి వాహనాలు రావాలంటే, వాహనదారులకు నరకమే కనిపిస్తోంది. ఇక నీళ్లలో కూరుకుపోయిన వాహనాలను, వాటి నుంచి బయట పడేయడం ప్రాణం మీదకు వస్తోంది. కానీ మహింద్రా టీయూవీ 300 మాత్రం నదులా పారుతున్న నీటిలో కూడా అలవోకగా ప్రయాణిస్తుందట. ఈ విషయాన్ని ఆ వాహనం నడుపుతున్న వాహనదారే చెప్పాడు. 4 అడుగుల లోతైన వరద నీటిలో కూడా తన వెహికిల్ చాలా బాగా పనిచేస్తుందంటు మహింద్రా టీయూవీ 300 వాహనదారి చెప్పాడు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహింద్రాకు తెలుపుతూ ట్విటర్లో దాని ఫోటోను షేర్చేశాడు. ఎల్లవేళలా మైక్రబ్లాగింగ్ సైట్లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా వెంటనే ఈ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. మహింద్రా టీయూవీ 300 వాహనదారి సౌమిత్ర జోషి అనే వ్యక్తి చేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. ‘సర్ హ్యాట్సాప్. టీయూవీ 300 వాహనం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. 4 అడుగుల లోతైన నీటిలో కూడా ఇది డ్రైవ్ చేయగలుతుంది’ అని జోషి పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఆనంద్.. ఇది వినడం నిజంగా ఆనందాయకంగా ఉంది. కానీ సురక్షితంగా ఉండండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కారు లిమిట్స్ పరీక్షించడం అంత మంచిది కాదు. ఇది త్రివిధ దళ వాహనం కాదు’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. @anandmahindra sir Hats off& thanks for giving us TUV 300, drived 4 ft depth through water pic.twitter.com/EyJqK0fDiL — Sowmitra Joshi (@SowmitraJoshi) June 25, 2018 -
జేసీబీలో ఊరేగిన వధూవరులు
బొమ్మనహళ్లి : పెళ్లి అనేది జీవితంలో మరుపురాని ఘట్టం. వారి వారి ఆర్థిక స్థోమతలను బట్టి వివాహాలను వైభవంగా చేసుకుంటారు. ఇందులో మరో తరహా వ్యక్తులు ఉంటారు. ఆకాశంలో, నీటి అడుగు భాగంలో పెళ్లిల్లు చేసుకుని సాహసాలు చేసేవారు మరికొందరు. ఇక్కడ జేసీబీలో ఊరేగుతున్న ఈ నూతన జంటను చూడండి... పనిపై ఉన్న ప్రేమతోనే సదరు వరుడు, వధువును ఒప్పించి పెళ్లి అయిన తరువాత ఊరేగింపు ఇలా వెరైటీగా చేసుకున్నారు. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సంట్యార్ అనే ప్రాంతానికి చెందిన చేతన్ జేసీబీ ఆపరేటర్. పని పట్ల నిబద్దత ఎంతో ఎక్కువ. పనిని ప్రేమిస్తాడు. సోమవారం చేతన్‌కు మమతతో వివాహం జరిగింది. పెళ్లి తతంగం అంతా పూర్తయిన తరువాత పెళ్లి కుమారుడు చేతన్ జేసీబీలో ఊరేగింపు నిర్వహించాలని కోరాడు. ఇందుకు ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో ఒక జేసీబీని తెప్పించి దానికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నూతన వధూవురులను రెండు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేశారు. దారి పొడవునా వధువు ముసిముసి నవ్వులు అందర్ని ఆకట్టుకున్నాయి. చేతన్ స్థానికంగా మంచి పేరు ఉండటంతో పెద్ద ఎత్తున బంధువుల, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. -
పని కోసం వెళ్తూ పరలోకానికి..
రెబ్బెన(ఆసిఫాబాద్) : పని నిమిత్తం వెళ్తున్న నలుగురు వ్యక్తులను మృత్యువు కబలించింది. ఈ సంఘటన శనివారం రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధిలోని సోనాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన బోలెరో క్యాంపర్ వాహనం సోనాపూర్ వాగు బ్రిడ్జిపై నుంచి వాగులో పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టు పనులు చేపడుతున్న డీబీఎల్ సంస్థ వద్ద మరో సంస్థ సబ్ కాంట్రాక్టు పనులు చేపడుతోంది. సంస్థకు చెందిన మిషనరీ మరమ్మతు పనుల కోసం రామగుండం పరిధిలోని ఎన్టీపీసీకి చెందిన మెకానిక్‌లు బల్ల కోటేశ్వర్రావు( 53), చిరకాల చరణ్‌కుమార్(35)తోపాటు మరో మెకానిక్ మంచిర్యాలకు చెందిన విశ్వనాథపల్లి దుర్గారావు(48)లను పిలిపించారు. ఇందులో భాగంగా మెకానిక్‌లను తీసుకువచ్చే పనిని సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన మహ్మద్ ఇయాజ్‌ఖాన్(34)కు అప్పగించారు. శనివారం ఇయాజ్‌ఖాన్ ఎంహెచ్ 34 ఏవీ 1618 నంబర్ గల బోలెరో కాంపర్ వాహనంతో ఎన్టీపీసీకి చేరుకుని కోటేశ్వర్రావు, చరణ్కుమార్లతోపాటు దుర్గారావును ఎక్కించుకుని కైరిగూడకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని సోనాపూర్ సమీపంలో వాగు వద్ద ఒక్కసారి వాహనం దూసుకుపోయి బ్రిడ్జిని బలంగా ఢీకొట్టి వాగులో బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ల ద్వారా ప్రమాద సమాచారం సోనాపూర్ వాగులో బోలెరో వాహనం బోల్తాపడిన సమయంలో ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయిన ప్రమాదం జరిగిన కాసేపటికి గోలేటి నుంచి కైరిగూడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు వాగులో బోల్తాపడిన వాహనాన్ని గమనించి కైరిగూడ ఓసీపీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సింగరేణి అధికారులు పోలీస్‌శాఖకు, సింగరేణి ఎస్‌అండ్‌పీసీకి సమాచారం అందించారు. ఇరుశాఖలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని పరిశీలించగా అప్పటికే అందులోని వ్యక్తులు మృతి చెంది వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఎస్సై శివకుమార్, కైరిగూడ ప్రాజెక్టు అధికారి మోహన్‌రెడ్డితోపాటు ఎస్అండ్పీసీ సిబ్బంది. స్థానికులు సుమారు అరగంట పాటు శ్రమించి మృతదేహాలను వాహనం నుంచి బయటకి తీయగలిగారు. గోలేటి సింగరేణి డిస్పెన్సరీ రవికుమార్ మృతదేహాలను వైద్యపరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఆర్టీవో అధికారుల దర్యాప్తు సోనాపూర్ వాగులో వాహనం బోల్తాపడి నలు గురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై జిల్లా రవా ణా శాఖాధికారి అజ్మీరశ్యాంనాయక్ దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ముందుగా వాహనం రోడ్డు దిగిన ప్రదేశంతోపాటు బ్రిడ్డిని ఢీకొట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అతి వేగంతో వాహనాన్ని తొలుతున్న క్రమంలో బ్రిడ్జీ వద్దకు రాగానే ఎదురుగా మరో వాహనం వచ్చి ఉండవచ్చని దీంతో డ్రైవర్‌కి ఏమి తోచక వాహనాన్ని పక్కకు తిప్పటంతో అదుపు తప్పి వాగులో బోల్తాపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. సోనాపూర్ రోడ్డు ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్, డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను సీఐ పురుషోత్తంను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఎస్పీకి వివరించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అందరూ నిరుపేదలే.. బెల్లంపల్లి : కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్ వాగులో బోలెరో అదుపు తప్పి బోల్తాపడి మరణించిన నలుగురు మృతులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరూ నిరుపేదలే. కుటుంబ పోషణ కోసం మెకానిక్, వెల్డింగ్, ఆటోమొబైల్, డ్రైవర్ పనులు నిర్వహిస్తూ పొట్టపోసుకునే రోజువారీ వర్కర్లు. వీరందరూ కైరిగూడ ఓసీపీలో పనులు నిర్వహిస్తున్న ‘ధన్ సర్ ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ’ తరఫున ఓ వాహనానికి మరమ్మతు పనులు నిర్వహించడం కోసం వెళ్లారు. మార్గమధ్యలో ప్రమాదం జరగడంతో ఈ నలుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. వీరి అకాల మరణంతో ఆ నలుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెక్కల కష్టం తప్పా పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ వర్కర్ల భార్యాబిడ్డలు దిక్కు లేని అనాథలుగా మారారు. బతుకు దెరువు కోసం వలస వచ్చి.. విశ్వనాథంపల్లి దుర్గారావుది స్వగ్రామం విజయవాడ. బతుకు దెరువును వెతుక్కుంటూ ఆయన భార్యాపిల్లలతో మంచిర్యాల ప్రాంతానికి వలస వచ్చాడు. లారీ మెకానిక్‌గా పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అడపాదడపా ధన్సర్ ఇంజినీరింగ్ వరŠస్క్ కంపెనీకి చెందిన వాహనాలకు మరమ్మతులు చేస్తున్న దుర్గారావు అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దుర్గారావుకు భార్య పద్మ, కూతుళ్లు సుమతి, వినీత, మమత ఉన్నారు. ముగ్గురు కూతుళ్లు కూడా పెళ్లీడుకు వచ్చి ఉన్నారు. తండ్రి మరణంతో ఆ బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పాల్వంచ నుంచి వచ్చి.. బండ్ల కోటేశ్వర్‌రావుది స్వగ్రామం ఖమ్మం జిల్లా పాల్వంచ. సుమారు మూడు దశాబ్దాల క్రితం వలస వచ్చి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ ప్రాంతంలోని సుభాష్‌నగర్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. కోటేశ్వర్రావుకు భార్య నాగమణి, కొడుకులు మహేశ్, వినోద్, ఉమేశ్కాగా కూతురు స్వాతి. ఇందులో స్వాతికి వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. ముగ్గురు కొడుకుల్లో ఎవరికి పెళ్లి కాలేదు. ఉద్యోగవేటలో ఉన్నారు. కోటేశ్వర్రావు లేత్ మిషన్ వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.పెద్దగా ఆస్తి పాస్తులు లేని కోటేశ్వర్రావు ప్రమాదం బారిన పడి తనువు చాలించడంతో ఆ కుటుంబం కూడా కష్టాల్లో పడింది. అనాథలైన భార్యాబిడ్డలు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన తిరకాల చరణ్‌కుమార్ కూడా ఎన్టీపీసీకి వలస వచ్చి ఆటోమొబైల్ వర్క్స్ నిర్వహిస్తున్నాడు. వలస వచ్చి ఇప్పటికీ రెండున్నర దశాబ్దాలు గడచింది. అతడికి రెక్కల కష్టం తప్పా ఆస్తిపాస్తులు లేవు. మృతుడికి భార్య స్వప్న, ఎనిమిదేళ్ల కూతురు భార్గవి, పదేళ్ల కొడుకు ప్రవీణ్ ఉన్నాడు. మరో మృతుడు బండ్ల కోటేశ్వర్రావుకు చరణ్‌కుమార్ సమీప బంధువు అవుతాడు. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడం, బతుకు దెరువును వెతుక్కుంటూ ఇద్దరు కూడా ఎన్టీపీసీకి వచ్చారు. కొన్నేళ్ల నుంచి వాహనాల మెకానిక్ పనులు కలిసిమెలిసి నిర్వహిస్తున్న ఆ ఇద్దరిని మృత్యువు ఒకేసారి తీసుకెళ్లడం బాధిత కుటుంబాలకు తీరని సోకం మిగిలిచింది. చరణ్‌కుమార్ అకాల మరణంతో భార్య, చిన్నారులైన కూతురు, కొడుకు అనాథలయ్యారు. నెల రోజుల క్రితం విధుల్లో చేరి జార్ఘండ్ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన ఎయాజ్ఖాన్ నెల రోజుల క్రితం రెబ్బెనకు వచ్చాడు. ధన్సర్ ఇంజనీరింగ్ వరŠక్క్ కంపెనీలో వాహన డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. అతడి కుటుంబీకులు ధన్బాద్లోనే ఉంటున్నారు. ఇదివరకు ఆయన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో సదరు కంపెనీలో పనిచేశాడు. ప్రస్తుతం రెబ్బెనకు వచ్చి ధన్సర్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ వాహన డ్రైవర్‌గా కుదిరాడు. ఓ వాహనం మరమ్మతుల కోసం చరణ్‌కుమార్, కోటేశ్వర్రావు, దుర్గారావును ఇళ్లకు వెళి బొలెరో వాహనంలో ఎక్కించుకుని కైరిగూడ ఓసీపీకి వెళ్తూ అకాల మృతి చెందాడు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో కుటుంబ వివరాలు సమగ్రంగా తెలియరాలేదు. -
మృత్యు శకటాలు
ప్రత్తిపాడు : అది విజయనగరం జిల్లాలోని నారాయణపురం గ్రామం. ఎప్పటిలానే ఈ నెల కూడా ఆ ఊరికి 104 వాహనం వచ్చింది. ఏ పెద్దమ్మా బాగున్నావా.. ఏంది తాతా ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ పలకరిస్తూ స్టాఫ్ నర్సుతో పాటు తోటి సిబ్బంది చంద్రన్న సంచార చికిత్స వాహనం నుంచి కిందకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తించారు. తిరిగి బొబ్బిలి సీహెచ్‌సీకి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో మిర్తివలస వద్ద మృత్యువు కాపు కాసింది. ఫిట్నెస్, బీమా లేని 104 వాహనం ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అంతే వాహనం నడుపుతున్న పైలట్ సిల్ల మోహన్‌రావు, నిండు నెలల గర్భిణి స్టాఫ్ నర్సు సంతోషిమారిలు ఆ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. ఇది ఈనెల 14వ తేదీన విజయనగరం జిల్లా మిర్తివలస వద్ద జరిగిన ప్రమాదం. వాస్తవానికి ఇది అక్షరాలా ప్రమాదమే. కానీ ప్రమాదమే కదా అని తేలిగ్గా తీసుకుందామా.. అంటే ఆ ప్రమాదం వెనుక ఆయా శాఖల పెను నిర్లక్ష్యం దాగి ఉంది. కారణం ప్రభుత్వం తిప్పుతున్న ఈ 104 వాహనాలకు ఫిట్నెస్ గానీ ఇన్సూరెన్స్ గానీ లేకపోవడమే. ఇప్పుడు ఇదే 104 ఉద్యోగులను ఆందోళన బాట పట్టేలా చేసింది. చంద్రన్న మా ప్రాణాలకు రక్షణ ఏదన్నా.. అంటూ ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట పట్టారు. బాధ్యులు ఎవ్వరు.. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా ఎక్కడికక్కడ నిలబెట్టి రోడ్డుపైనే ముక్కుపిండి జరిమానాలు విధించే అధికారులు, ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. నిబంధనలతో ఏ మాత్రం పనిలేకుండా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా ఇటు రవాణాశాఖ గానీ, అటు పోలీస్ శాఖకు గానీ చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని ఐదు డివిజన్లలో 24 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క వాహనానికి రెండేళ్లుగా బీమా గానీ, ఫిట్నెస్ గానీ లేదు. అయినా సంబంధిత శాఖల అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి.. పొరబాటున ఈ వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించి సిబ్బంది మరణిస్తే వారికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందే పరిస్థితి లేదు. అదే జరిగితే ఉద్యోగుల కుటుంబాలు ఉన్నపళంగా రోడ్డున పడాల్సిన దుస్థితి చోటు చేసుకుంటుంది. కారణం బీమా లేని వాహనంలో ప్రయాణించడమే. విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో యూనియన్లు పోరాటం చేయడంతో సంస్థ కొంత మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేసిందని సిబ్బంది చెబుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు పోలీసులు, కమిషనర్లు, రవాణాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుచేతనే ఈ నెల 17వ తేదీ నుంచి 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నిరవధిక సమ్మెను చేపడుతున్నారు. లేనిమాట వాస్తవమే జిల్లాలోని 104 వాహనాలకు ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్ లేని మాట వాస్తవమే. కారణం వాహనాలు ప్రభుత్వం పేరుతో ఉన్నాయి. యునైటెడ్ ఆంధ్రాలో కొన్నా వాహనాలు కావడంతో తెలంగాణ నుంచి వీటికి ఎన్వోసి రావలసి ఉంది. బహుశా వారంలో వీటికి ఎన్వోసీ వచ్చే అవకాశం ఉంది. ఎన్వోసీ రాగానే ఫిట్నెస్ వస్తుంది. సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ వాహనాలను గ్రామాలకు పంపుతున్నాం. సేవలు ఎక్కడా నిలిచిపోలేదు. – ఎం.వి.సత్యనారాయణ, 104 జిల్లా మేనేజర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత ఏదీ 104 వాహనాలకు ఆర్సీలు, ఎఫ్ఏసీ, ఇన్సూరెన్స్‌లు లేకుండా రోడ్లపై తిప్పుతున్నారు. అవి ప్రమాదాలకు గురై ఉద్యోగుల నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనాలకు బీమా లేక బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా ఉంది. కనీసం ఉద్యోగస్తులకు భద్రత లేకుండా ఉంది. ప్రభుత్వం స్పందించాలి. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి. –పి.విజయ్, 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
లేని వాహనానికి మూడేళ్ల బిల్లులు..
బినామీ వాహనంతో మూడేళ్ల బిల్లులు నొక్కేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. యుటిలిటీ వాహనం పేరిట విద్యుత్ శాఖ ఇచ్చిన సౌలభ్యాన్ని ఆసరా చేసుకొని వాహనాన్ని వాడకుండానే రూ.10.83 లక్షల బిల్లులు స్వాహా చేసేందుకు గుట్టుగా ప్రయత్నం సాగిస్తున్నారు. ఓ పోలీస్టేషన్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే వాహనం అద్దె, బిల్లుల చెల్లించేందుకు అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది అద్దెకు సంబంధించి రూ.3 లక్షలు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. విషయం బయటకు రావడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిపివేయడంతో పాటు విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. సాక్షి, మెదక్:మెదక్ విద్యుత్ డివిజన్ పరిధిలోని పాపన్నపేట సబ్‌డివిజన్‌లో ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లకు సంబంధించి యుటిలిటీ వాహనం బిల్లులు కాంట్రాక్టర్ పేరిట పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికి ప్రతి ఏడాది సబ్ డివిజన్ అధికారులకు ఒక యుటిలిటీ వాహనం ఇస్తారు. ఈ వాహనం విద్యుత్ సామగ్రి రవాణా చేసేందుకు అనుకూలంగా ఉండాలి. అయితే కొంతమంది అధికారులు తమ సొంత వాహనాలను దీనికోసం వాడుతూ యుటిలిటీ వాహనం పేరిట బిల్లులు వసూలు చేస్తున్నారు. కారులాంటి వాహనాలకునెలకు రూ.20వేలు చెల్లిస్తుండగా ట్రక్కు లాంటి వాహనాలకు రూ.32వేలు క్లయిమ్ చేసే అవకాశం ఉంటుంది. యుటిలిటీ వాహన సేవలు వినియోగించుకుంటున్నట్లు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ...డబ్బు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్ ఆ విద్యుత్ అధికారి కాంట్రాక్టర్ పేరిట నవంబర్ 2015 నుంచి సెప్టెంబర్ 2017 వరకు పాత డివిజన్లో ఉన్న జోగిపేటలో బిల్లులు పొందడానికి యత్నించినట్లు సమాచారం. అయితే అవి బినామీ కావడంతో అక్కడి అధికారులు వాటిని క్లయిమ్ చేయనట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పాపన్నపేట సబ్ డివిజన్ మెదక్ డివిజన్ పరిధిలోనికి మారింది. దీంతో పాపన్నపేటకు చెందిన అధికారి మెదక్ డివిజన్లో మూడేళ్లకు సంబంధించిన బిల్లులు క్లయిమ్ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంత వరకు ఈ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది. నవంబర్ 2015 నుంచి నవంబర్ 2017 వరకు లేని వాహనానికి ఓ కాంట్రాక్టర్ పేరిట రూ.10.83 లక్షల బిల్లులు తయారు చేసి మంజూరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. చిత్రం ఏమిటంటే మెదక్ డివిజన్‌లోకి మారిన కేవలం ఆరు నెలల కాలంలో మూడేళ్ల బిల్లులకు అగ్రిమెంట్ సైతం చేయించుకొని నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందేందుకు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక ఏడాదికి సంబంధించి సుమారు రూ.3లక్షల వరకు బిల్లులు క్లయిమ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ నంబరు 56001919362 ద్వారా రూ.4,00,907 అగ్రిమెంట్ నంబరు 560022811 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్ నంబరు 560022812 ద్వారా రూ.1,72,052, అగ్రిమెంట్ నంబరు 5600267270 ద్వారా రూ.3,38,400 మొత్తం రూ.10,83,860 బిల్లుల చెల్లింపుల కోసం బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే 2017లో ఈదురు గాలులు వచ్చి పాపన్నపేట మండలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయిన సమయంలో ఓ కాంట్రాక్టర్ పేరిట అగ్రిమెంట్ చేయించుకొని సుమారు రూ.5లక్షల వరకు నిధులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బిల్లులు చెల్లించలేదు.. పాపన్ననపేట ఏడీఈ సబ్ డివిజన్ కార్యాలయంలో యుటిలిటీ వాహనం బిల్లులు చెల్లింపుల వ్యవహారంపై డీఈ వెంకటరత్నం వివరణ కోరగా అగ్రిమెంట్ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీస్టేషన్లో ఉన్న వాహనంపై బిల్లులు క్లెయిమ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టేశారు. ఒక వాహనం వినియోగించినట్లు బిల్లులు సమర్పించటం జరిగిందన్నారు. ఏడాదికి సంబంధించిన బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇంకా డబ్బులు డ్రా కాలేదని తెలిపారు. యుటిలిటీ వాహనం వినియోగం, బిల్లులు సమర్పించిన తీరుపై అనుమానాలు ఉండటంతో విచారణకు ఆదేశించామన్నారు. -
బాబు బొమ్మ ఉంటే.. రైట్ రైట్..!
తాళ్లూరు: పేదల చెంతకే వైద్య సేవలు అనే ఉన్నత లక్ష్యంతో నడుస్తున్న చంద్రన్న సంచార చికిత్స వాహనాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. ఆయా వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్న పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఆయా సేవలు అందకపోగా, డొక్కు వాహనాలు ప్రమాదాలను తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా వాహనాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు భయపడుతున్నారు. చేసేది లేక ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేందుకు 2008లో ‘104’ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో విజయవంతంగా కొనసాగిన ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధిపొందుతూ వచ్చారు. అనంతరం 2010లో డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ (ఆర్ఓఆర్) జీఓ నంబర్ 3 ప్రకారం 104 వాహనాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు చెల్లించారు. 2014 వరకూ ఈ పథకం సక్రమంగానే సాగింది. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలకు పేర్ల మార్పులో భాగంగా 104 పథకానికి కూడా చంద్రన్న సంచార చికిత్స వాహనంగా పేరు మార్చారు. వీటి నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలోకి మార్చి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించారు. అమలుకాని ఉత్తర్వులు... పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో 277 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉండగా, మన జిల్లాలో 20 వాహనాల ద్వారా సేవలు ప్రారంభించారు. వాటిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న మినిట్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ప్రకారం ప్రభుత్వ కార్మిక చట్టాలు, అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చే ఆర్థికశాఖ ఉత్తర్వులు అమలు చేయాలి. కానీ, అవేమీ అమలు చేయడం లేదు. నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వాహనాలు... చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఇతర అన్ని వాహనాల మాదిరిగానే ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, మరమ్మతులు చేయించాలి. కానీ, రాష్ట్రంలోని 277 వాహనాలకు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, ట్యాక్సులు, మరమ్మతులు లేవు. కనీసం జనరల్ చెకప్, మైనర్ మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా వాహనాలలో సీలింగ్ ఊడిపోయింది. లైట్లు పనిచేయక రోగులను పరీక్షించే సమయంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బ్రేకులు కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి నెలకొనడంతో వాటిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాలు పొంచి ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల డ్రైవర్లకు జరిమానా... వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వాహన డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ జరిమానా విధిస్తోంది. ఏళ్ల తరబడి కనిపెట్టుకుని ఉన్న డ్రైవర్లపై జరిమానాలు విధిస్తుండటం సిబ్బందిని కలవరపెడుతోంది. జరిమానాలు విధించడంతో పాటు వాహనాలకు మరమ్మతులు చేయించకుండా ప్రమాదాలకు గురిచేయడంపై సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నేటికీ ఉమ్మడి రిజిస్ట్రేషనే... రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా చంద్రన్న సంచార చికిత్స వాహనాలు నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఫిట్నెస్ పరీక్షలు లేకపోవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌పై తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు మరమ్మతులతో పాటు ఫిట్నెస్ పరీక్షలు చేయించి బీమా సౌకర్యం కల్పించాలని, తద్వారా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే ఇక్కట్లే... 104 వాహనాలలో ఉద్యోగ భద్రత ఉంటుందన్న ఆశతో 11 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,662 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వారిలో జిల్లాలో 120 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే, వాహనాలకు మరమ్మతులు చేయకపోవడంతో పాటు ఎంవీఐల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ గడువు పూర్తయి సామర్థ్య పరీక్షకు సమయానికి రాని వాహనాలకు రవాణాశాఖ రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తుంది. కానీ, ఈ వాహనాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బొమ్మతో పాటు పేరు కూడా రాసుకుని తిరుగుతున్న వాహనాలు కావడంతో డొక్కు వాహనాలైనాగానీ రవాణా శాఖ అధికారులు ఆపే ధైర్యం చేయడం లేదు. -
అగ్ని ఆర్పేదెలా..!
భద్రాచలం : వేసవి రానే వచ్చింది. గిరిజన గూడేలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాల తీవ్రత అధికంగానే ఉంటుంది. దీనికి తోడు పారిశ్రామిక జిల్లా కావటంతో అగ్నిమాపక శాఖకు వేసవికాలమంతా చేతి నిండా పని ఉంటుంది. ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తరుణమిది. కానీ జిల్లాలోని అగ్నిమాపక శాఖకు సుస్తి చేసింది. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, దాదాపు అన్ని చోట్లా సమస్యలు తాండవిస్తున్నాయి. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో స్టేషన్ నిర్వహణ అధికారి పోస్టు ఖాళీగాఉంది. జిల్లాలోని ఏ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో ఉన్న వారిపైనే పనిభారం పడుతోంది. వాహనాలు సైతం మరమ్మతులకు గురి కావటంతో ప్రమాద ప్రదేశానికి సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పరాయి పంచన పడిగాపులు... అగ్నిమాపక కేంద్రాలకు కొన్ని చోట్ల సరైన వసతి లేదు. భద్రాచలంలో భవన సౌకర్యం లేక బాలికల సదనంలో తాత్కాలికంగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరైనా, పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త భవన నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూల్చివేయటంతో అగ్నిమాపక శకటంతో పాటు, సిబ్బంది సమీపంలోని బాలికల సదనంలోకి వెళ్లారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మణుగూరులో మళ్లీ అగ్రిమెంట్ చేస్తేనే... మణుగూరులో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నప్పటకీ, ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదు. అద్దె ప్రాతిపదికన స్టేషన్‌కు తీసుకున్న వాహనం అగ్రిమెంట్ మార్చితో పూర్తి కావస్తోంది. మళ్లీ గడువు పెంచటమో, లేకుంటే మరో వాహనం సమకూర్చటమో చేయాలి. కానీ దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో మార్చి తర్వాత ఏం చేయాలోనని అక్కడి అధికారులు ఆయోమయంలో పడ్డారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పుడున్న వాహనం కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. రిపేర్ కోసం ఎలాంటి నిధులు రావడం లేదు. దీంతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సకాలంలో గమ్యం చేరుకోవటం లేదు. మార్గమధ్యలోనే వాహనం మొరాయిస్తుండటంతో సకాలంలో మంటలార్పేందుకు రావటం లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. సిబ్బంది లేక ఉన్నవారిపైనే ఒత్తిడి... ఒక్కో ఫైర్ స్టేషన్‌కు అగ్నిమాపక అధికారితో పాటు 15 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఒక్క ఇల్లెందులో మినహా మరెక్కడా పూర్తి స్థాయిలో లేరు. భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారిగా పనిచేసిన సరేష్‌కుమార్ పదోన్నతిపై బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ పోస్టు ఖాళీగానే ఉంది. కొత్తగూడెం స్టేషన్ అధికారికే భద్రాచలం స్టేషన్ నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. భద్రాచలంలో లీడింగ్ ఫైర్‌మెన్ పోస్టులు ఇద్దరికి గాను ఒకరిని మణుగూరుకు డిప్యూటేషన్‌పై పంపించారు. డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు ఉండాలి. కానీ ఇందులో ఒకరిని అశ్వారావుపేటకు పంపించారు. దీంతో ముగ్గురు హోంగార్డులను, ఆర్టీసీ డ్రైవర్ ఒకరిని ఇక్కడికి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అశ్వారావుపేటలో లీడింగ్ ఫైర్‌మెన్ 1, ఫైర్‌మెన్ 5, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. మణుగూరు స్టేషన్లో వివిధ చోట్ల నుంచి డిప్యూటేషనలపై వచ్చిన సిబ్బందితోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాస్తవంగా ఒక్కో స్టేషన్లో రోజుకు రెండు షిప్టులు, ఒక్కో షిఫ్టుకు ఎనిమిది మంది చొప్పున పనిచేయాలి. కానీ ఎక్కడా ఇలా జరగటం లేదని, ఖాళీల వల్ల ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోంది సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం పరుగులు తీయాల్సిందే... అగ్నిప్రమాదాల సమయంలో సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు నీరే ప్రధానం. స్టేషన్లో ఎప్పుడూ నీటి ట్యాంకర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు స్టేషన్లకు నీటి సౌకర్యం లేదు. భద్రాచలంలో గోదావరి నీరు పుష్కలంగా వస్తున్నందున వాటితోనే ట్యాంకర్‌ను నింపుతున్నారు. మణుగూరులో మోటార్ లేదు. అశ్వారావుపేటలో ఉన్న మోటార్ మరమ్మతుకు గురైంది. దీంతో ఈ రెండు చోట్ల ట్యాంకర్‌ను నీటితో నింపేందుకు వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల వద్ద నింపుకుంటున్నారు. మోటార్ మరమ్మతులకు గురై ఏడు నెలలు కావస్తున్నా, నిధుల లేమితో వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సమస్యలపై సత్వరమే దృష్టి సారించి, అత్యవసర విభాగమైన అగ్నిమాపక శాఖను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. భద్రాచలంలో భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రామకృష్ణ, అగ్నిమాపక శాఖ ఇన్చార్జి అధికారి, భద్రాచలం -
కొత్త వాహన పాలసీ 2 నెలల్లో!!
గ్రేటర్ నోయిడా: కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో కొత్త వాహన పాలసీ ముసాయిదాను ప్రకటించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా పాలసీని రూపొందిస్తామని భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు. 14వ ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలసీ రూపకల్పనలో సియామ్, ఏసీఎంఏ సహా పరిశ్రమ ప్రతినిధుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారాయన. ‘ఎఫ్ఏఎంఈ స్కీమ్ తొలి దశ మార్చిలో ముగియనుంది. దీంతో రెండో దశపై దృష్టి కేంద్రీకరించాం. దీన్ని మరింత విజయవంతం చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. వివిధ వాహన విభాగాలపై పన్నును సవరించాలనే పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ‘పరిశ్రమ నుంచి పలు విజ్ఞప్తులు అందాయి. కొత్త పాలసీ విధానంలో వీటిని పరిష్కరిస్తాం’ అని హామీనిచ్చారు. కొత్త పాలసీ విధానం పరిశ్రమకు, వినియోగదారులకు స్నేహపూరితంగా ఉంటుందన్నారు. పరిశ్రమ కొత్త టెక్నాలజీలను ఒడిసి పట్టుకోవాలని, బీఎస్–6 నిబంధనల అమలు విషయంలో సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరిశ్రమకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇక పన్ను సంబంధ సమస్యలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉందని సియామ్ ప్రెసిడెంట్ అభయ్ ఫిరొడియా కోరారు. వాహన పరిశ్రమలో పలు మంత్రిత్వ శాఖల ప్రమేయం ఉందని, అలాకాకుండా ప్రతిపాదిత నోడల్ వ్యవస్థ ‘నేషనల్ ఆటోమోటివ్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్ తర్వాత కూడా బీఎస్–4 వాహన విక్రయాలకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేటు 5%గా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఇది 12%. అలాగే ప్యాసింజర్ వాహన విభాగంలో కేవలం రెండు జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉండాలని కోరుతోంది. యూఎం లోహియా: యూఎం లోహియా టూవీలర్స్ తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ ‘రెనెగెడ్ థార్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కంపెనీ అలాగే రెనెగెడ్ డ్యూటీ ఎస్, రెనెగెడ్ డ్యూటీ ఏస్ బైక్స్‌ను ప్రదర్శకు ఉంచింది. వీటి ప్రారంభ ధర రూ.1.9 లక్షలు. ఈ రెండింటిలో 223 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. సుజుకీ మోటార్‌సైకిల్: సుజుకీ మోటార్‌సైకిల్ తాజాగా 125 సీసీ అడ్వాన్స్డ్ లగ్జరీ స్కూటర్ ‘బర్గ్‌మ్యాన్ స్ట్రీట్’ను ఆవిష్కరించింది. అలాగే సహా సబ్ 1,000 సీసీ విభాగంలో జీఎస్ఎక్స్–ఎస్750 బైక్‌ను ప్రదర్శించింది. కంపెనీ హయబుసా తర్వాత భారత్‌లో తయారు చేస్తోన్న రెండో పవర్ బైక్ ఈ జీఎస్ఎక్స్–ఎస్750నే. ఇన్ట్రూడర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శనకు ఉంచింది. పినాకిల్: పినాకిల్ స్పెషాలిటీ వెహికల్స్ తాజాగా కస్టమైజ్డ్ లగ్జరీ ఎక్స్‌పాండబుల్ మోటార్హోమ్ ‘ఫినెట్జా’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.15–50 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. కంపెనీ అలాగే మోడిఫైడ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ వ్యాన్ ‘ఒపిసియా’, కస్టమైజ్డ్ టూరర్ ‘మాగ్రిఫిసియా’, మోడిఫైడ్ ప్రొడక్ట్ డిస్ప్లే వ్యాన్ ‘ఎగ్జిబికా’లను ప్రదర్శనకు ఉంచింది. ఎంఫ్లుక్స్ మోటార్స్: ఎంఫ్లుక్స్ మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ‘ఎంఫ్లుక్స్ వన్’ నమూనాను ఆవిష్కరించింది. ఇది 2019 ఏప్రిల్‌లో భారతీయ రోడ్లపై పరిగెత్తనుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. యూనిటి: స్వీడన్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ యూనిటి తాజాగా 5 సీటర్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షలు. ఇది 2020లో మార్కెట్లోకి రానుంది. కంపెనీ అలాగే 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు ‘యూనిటి వన్’ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్ల అసెంబ్లింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం బర్డ్ గ్రూప్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ట్వంటీ టూ మోటార్స్: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ట్వంటీ టూ మోటార్స్ తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఫ్లో’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. దీన్ని 5 గంటలు చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. వీటి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇవి 2018 రెండో అర్ధభాగంలో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. (ఆటోషోను ప్రారంభిస్తున్న సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్. ) (టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310తో మోడల్) (బీఎండబ్ల్యూ మినీ కూపర్ కన్వర్టబుల్ ఎస్) -
అద్దె కారుపై మోజు.. సర్కారు వాహనానికి బూజు!
పెద్దపల్లిరూరల్: సర్కారు జీపులో తిరగడం సారుకు నామూషీగా అనిపించిందేమో.. మరో కారును అద్దెకు తీసుకొని తిరిగారు. కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాకు వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తిరుమల్ప్రసాద్కు ప్రభుత్వం ఓ జీపును కేటాయిం చి, దానిని నడిపేందుకు శ్రీనివాస్ అనే డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ జీపులోనే జిల్లా కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్, ఇతర సామగ్రిని సైతం తరలించారు. ఆతర్వాత నిబంధనలకు విరుద్ధంగా టాక్సీ కాకుండా సొంత రిజిస్ట్రేషన్ కలిగిన కారును అద్దెకు తీసుకోవడంతో సర్కారు జీపు మూలన పడింది. కారును అద్దెకిచ్చిన యజమాని అద్దె డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ను నిధులు కేటాయించాలంటూ విన్నవించగా తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఏదో ఓరకంగా సమకూర్చుకొని రెండు నెలల అద్దెను చెల్లించినట్లు సమాచారం. మిగతా అద్దెను ఇవ్వకుండా సదరు యజమానినే తన కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పని చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తిరిగి ప్రస్తుతం మంథని డివిజన్లో అన్ అకౌంట్ టేబుల్లో నిల్వ ఉన్న నిధుల నుంచి అద్దె కోసం రూ. 2లక్షలు కేటాయించాలంటూ ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్‌ను అభ్యర్థించి ఆమోదం పొందాడు. అయితే మంథని డివిజన్ అధికారి మాత్రం లక్ష నిధులను జిల్లా అధికారికి బదలాయించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామాల్లో తిరిగేందుకు తానే సొంతంగా కారును కొనుగోలు చేసిన సదరు అధికారి ప్రభుత్వ వేతనం పొందే డ్రైవర్ శ్రీనివాస్‌నే తన వాహనం నడిపించేందుకు ఉపయోగించడం విశేషం. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ప్రసాద్ను వివరణ కోరగా కార్యాలయ అంతర్గత విషయాలు మీకెలా తెలుస్తాయి.. వివరాలు కావాలంటే మీరు కలెక్టర్‌నే అడగండి.. ఏదైనా వివరణ కావాలనుకుంటే ముఖాముఖి మాట్లాడాలని ఫోన్లో చెప్పడం కుదరదన్నారు. ఇదే విషయమై ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారి శ్రీధర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జగిత్యాల, పెద్దపల్లిలకే డ్రైవర్లు, వాహనాలను కేటాయించామన్నారు. సిరిసిల్లకు సౌకర్యం లేదన్నారు. వాహనాలు పాతవి కావడంతో మరమ్మతులు ఎక్కువైన కారణంగా అద్దెకు తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వానలోనూ కారు బేఫికర్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఇటీవలే ముంబై, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కొన్ని ప్రాంతాలు నీట మునగటాన్ని చూశాం. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో కార్లు పూర్తిగా మునిగిపోయిన ఘటనలూ ఎదురయ్యాయి. నిజానికిలాంటి సమయాల్లో వాహనాలకు కలిగే నష్టం అనూహ్యం. లక్షలు పోసి కొన్న కారుకు పూర్తి రక్షణ కల్పించుకునేందుకు ఎన్నో పాలసీలున్నాయి. వర్షాలకు వాహనం నీట మునిగితే ఇంజిన్ పనిచేయకుండా పోయే ప్రమాదముంది. అంతేకాదు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రమాదాల ముప్పూ ఎక్కువే. వర్షాలప్పుడు రోడ్లు స్పష్టంగా కనిపించకపోవటం వల్లో, తడితో జారిపోవటం వల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. నీరు ఇంజిన్లోకి ప్రవేశించడం వల్ల కారు నిలిచిపోవటమూ జరుగుతుంటుంది. ఇలాంటి నష్టాల నుంచి రక్షణ కోసం బీమా కంపెనీలు యాడ్ ఆన్ పాలసీలు అందిస్తున్నాయి. దీంతో ఈ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. ఇంజిన్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఇంజిన్లోకి నీరు వెళ్లడం వల్ల జరిగే నష్టానికీ పరిహారం లభిస్తుంది. దీంతోపాటు వారంలో అన్ని రోజులూ ఏ సమయంలోనైనా కాల్ చేస్తే రోడ్డుపై వాహనం నిలిచిన చోటకే వచ్చి సాయం అందించే సదుపాయం, పరిహారం కోసం దరఖాస్తు చేస్తే కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించే పాలసీలూ ఉన్నాయ. కాబట్టి కారుకు బీమా తీసుకునే ముందు పాలసీలో ఈ విధమైన ప్రయోజనాలు ఇన్‌బిల్ట్‌గా ఉన్నదీ, లేనిదీ విచారించుకోవాలి. లేకపోతే యాడ్ ఆన్ పాలసీలు తీసుకోవచ్చు. టెలిమ్యాటిక్స్ టెక్నాలజీ టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. దీంతో కొన్ని బీమా కంపెనీలు వినూత్నమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. టెక్నాలజీ సాయంతో ప్రమాదాలకు అవకాశాలను తగ్గించడమే కాకుండా, క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. టెలిమ్యాటిక్స్ టెక్నాలజీ సాయంతో కారు ఇంజిన్, బ్యాటరీ స్థితిగతులను పర్యవేక్షించడం, డ్రైవింగ్ తీరు గురించి కాలానుగుణంగా డ్రైవర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం, వాహన నిర్వహణ, లొకేషన్, మార్గం, వేగం ఇలా భిన్న రకాల సమాచారాన్ని అప్‌డేట్స్‌గా అందిస్తున్నాయి. ఈ విధమైన చర్యలతో కారును ఫిట్‌గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ కార్ బ్రేక్‌డౌన్ అయితే టెలిమ్యాటిక్స్ పరికరంలోని జీపీఎస్ సాయంతో బీమా కంపెనీ వెంటనే మరో వాహనాన్ని అక్కడికి పంపిస్తుంది. క్లెయిమ్‌లకు డిజిటల్ పరిష్కారం వర్షాకాలంలో బీమా కంపెనీలకు వచ్చే క్లెయిమ్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో 70 శాతం పరిహారం కోసం వచ్చే దరఖాస్తులన్నీ ఓన్ డ్యామేజీ (స్వయంగా నష్టం) విభాగంలో రూ.20,000లోపు ఉంటున్నవే. కారు కొనుగోలు ధరతో పోలిస్తే ఇది చిన్న మొత్తమే కావచ్చు. కానీ పాలసీ లేకపోతే ఈ చిన్న మొత్తాలే నెలవారీ బడ్జెట్‌ను ఖాళీ చేసేస్తాయి. క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు, ముఖ్యంగా చిన్న మొత్తాల్లోని క్లెయిమ్ దరఖాస్తుల పరిష్కారానికి బీమా కంపెనీలు మోటారు బీమా పాలసీదారుల కోసం స్వయం మదింపు టూల్స్‌ను ప్రవేశపెట్టాయి. యాప్స్ ఆధారితంగా ఇవి పనిచేస్తాయి. వాహనానికి నష్టం వాటిల్లినప్పుడు దాని తాలుకూ ఫొటోలు, ప్రమాద సమాచారాన్ని, పాలసీ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను ఈ యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ ద్వారా వచ్చిన వివరాల్ని బీమా కంపెనీ ఉద్యోగి పరిశీలించి పరిహారం విషయమై పాలసీదారుడికి సమాచారం అందిస్తారు. సంబంధిత పరిహారం మొత్తాన్ని పాలసీదారుడు అంగీకరిస్తే నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సమగ్ర పాలసీ మంచిది... సమగ్ర మోటారు బీమా పాలసీ అన్నది కీలకమైన ఆర్థిక పెట్టుబడి వంటిది. ప్రమాదం అనంతరం పరిహారం చెల్లించడానికే పరిమితం కాకుండా టెక్నాలజీతో ప్రమాదాలను నియంత్రించే విషయంలో, ప్రమాదం చోటుచేసుకుంటే నష్టం పెద్దదవకుండా పాలసీదారులకు కావాల్సిన సాయాన్ని అందిస్తున్నాయి. కనుక వర్షాల సమయంలో మీ వాహనానికి ఉన్న రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని అందుకు రక్షణ కల్పించే సమగ్ర పాలసీ తీసుకోవడం మంచిది. -
త్వరలో హైపర్ సోనిక్ వాహనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధ్వనివేగానికి మించిన వేగం (హైపర్ సోనిక్)తో ప్రయాణించే వాహనాల తయారీ సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుందని రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ కంది ప్రాంగణంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)తోపాటు విద్యా, పారిశ్రామిక రంగాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వచ్చే పదేళ్లలో మిలటరీ ఆపరేషన్స్‌లో, 2050 నాటికి మానవ రవాణాలో హైపర్ సోనిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైపర్ సోనిక్ వాహనాల తయారీలో 1800 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకునే మిశ్రమ లోహాలు కీలకపాత్ర పోషిస్తాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీర్.వి.కామత్ వెల్లడించారు. ఈ లోహం తయారీనే అతిపెద్ద సవాలుగా నిలవబోతోందన్నారు. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబొరేటరీ ఈ దిశగా సానుకూల అడుగులు వేస్తోం దని కామత్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే లోహాల తయారీపై అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ తదితర దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని డీఆర్డీఓ డైరెక్టర్ ఎం ఎస్ఆర్ ప్రసాద్ వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పరిశోధనల్లో ముందంజలో ఉందన్నారు. ఇప్పటివరకు ఐదారు సెకన్లు మాత్రమే నడిచే వాహనాలు రూపొందించిన విషయాన్ని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్తగా కనుగొనే మిశ్రమ లోహం పునర్ వినియోగానికి వీలుగా ఉండటంతోపాటు.. అందుబాటు «ధరల్లో ఉండేలా చూడాల్సి ఉందన్నారు. రెండు గంటల్లోనే న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ హైపర్సోనిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు కేవలం రెండు గంటల వ్యవధిలో ప్రయాణం చేయొచ్చని ఎంఎస్ఆర్ ప్రసాద్ వెల్లడిం చారు. హైపర్ సోనిక్, సంబంధిత రంగాల్లో పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయని హైపర్సోనిక్ టెస్ట్ వెహికల్ ప్రోగ్రాం ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.శర్మ వెల్లడించారు. అత్యంత వేగంగా ప్రయాణించాలనే కలను హైపర్సోనిక్ సాంకేతికత సు«సాధ్యం చేయబోతోందని ఇస్రో శాస్త్రవేత్త శ్యాంమోహన్ వెల్లడించారు. మిలిటరీ ఆపరేషన్స్, అంతరిక్ష వాహనాలు, మానవ రవాణాలో హైపర్ సోనిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తు తం ఉపగ్రహాల ప్రయోగంలో వినియోగిస్తున్న శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను తిరిగి ఉపయోగించుకునే అవకాశం లేదన్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీకి వినూత్న ఆవిష్కరణలు జోడించి.. శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌ను తిరిగి ఉపయోగించే పరిస్థితి రావాలన్నారు. -
అమ్మో కారు..
ఇబ్రహీంపట్నంరూరల్: అడవిలో అనుమానాస్పద స్థితిలో నిలిపివేసిన కారు కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా అడవిలో ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కారులో ఎమన్నా ఉందా అని భయపడుతున్నారు. మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఏ నోట విన్నా కారు గురించే. వివరాల్లోకి వెళితే.. నాగన్‌పల్లి గ్రామం శివారులోని మూల మలుపు వద్ద ఉన్న దాసర్రాయి సమీపంలోని చెట్ల పొదల్లో మారుతీ 800 కారు నిలిపి ఉంది. గత నాలుగు రోజులుగా అక్కడే ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. సోమవారం కొందరు యువకులు ధైర్యం చేసి కారు వద్దకు వెళ్లి చూశారు. కారు నెంబరు ఏఐడబ్ల్యూ–9495 నెంబరు కలిగి తెల్లరంగు కారును గుర్తించారు. నాలుగు చక్రాలలో గాలిపోయి ఉంది. కారు కనెక్షన్లు తొలగించి ఉన్నట్లు యువకులు గుర్తించారు. -
ఒరిజినల్ లేకుంటే జైలుకే..
టీ.నగర్: సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు. దీనిగురించి చెన్నై ట్రాఫిక్ పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపింది. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్‌లో వాహనం నడపరాదని, అలాగే ట్రాఫిక్ పోలీసులు కోరినపుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పక చూపాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండు కలిపి శిక్ష విధించవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన యజమానుల సంఘం ఆవేదన: ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుల గురించి తమిళనాడు పర్యాటక వాహన యజమానుల సంఘం నిర్వాహకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారం ప్రస్తుతం దీనావస్థలో ఉన్నందున ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుల ప్రకటన మరింత ఆవేదన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైతులకు మరిన్ని ప్రాంతీయ కేంద్రాలు
♦ వారికి వాహన, గృహ, విద్యా, పర్సనల్ లోన్లూ ఇవ్వాలి ♦ ఇవన్నీ వేగవంతం చేసేందుకు మరో 21 రీజినల్ సెంటర్లు ♦ ఏడాదిలో కొత్తగా 70 శాఖలు, 5 ఇన్టచ్ సెంటర్లు ♦ ‘సాక్షి’తో ఎస్బీఐ తెలంగాణ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతులకు పంట రుణాలివ్వటంతోనే బ్యాంకుల పని అయిపోయినట్లు కాదు. కారు, టూవీలర్, ఇల్లు, విద్య, పర్సనల్ లోన్ వంటి ఇతరత్రా అవసరాలకూ ముందుండాలి. మరోవంక ఇతర రుణ గ్రహీతలతో కలిపి వీరిని ఒకే గాటన కట్టకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ చెప్పారు. ఈ ఉద్దేశంతోనే తాము తెలంగాణలో ప్రత్యేకంగా రిటైల్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్లను (ఆర్‌సీపీసీ) ఏర్పాటు చేశామని, ఇవి రైతులకు పంట రుణాలే కాక వారికి అవసరమైన ఇతర రుణాలనూ అందిస్తాయని చెప్పారు. బుధవారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన పలు అంశాలు మాట్లాడారు. అవి... తెలంగాణలో ఐదు ఆర్సీపీసీలు రైతులు పంట రుణాలు మినహా ఇతరత్రా రుణాలకోసం రుణదాతలు, బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలతో నష్టపోతున్నారు. ఆర్‌సీపీసీ సెంటర్ల ఏర్పాటుతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఆర్‌సీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సెంటర్ 20 శాఖలను కవర్ చేస్తుంది. తెలంగాణలో 700 బ్రాంచులు అగ్రికల్చరల్ లోన్లపై పనిచేస్తాయి. వీటిని కవర్ చేయడానికి కొత్తగా మరో 26 ఆర్సీపీసీలను ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లోనే రుణాలు మంజూరు చేస్తాం. వాహన రుణాలకైతే ఇంకా తక్కువ సమయం పడుతుంది. ఆగస్టుకల్లా 70 బ్రాంచీల విలీనం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం జరిగింది. మేలో డేటా, ఖాతాల బదిలీ కూడా పూర్తయింది కూడా. ఆయా అనుబంధ బ్యాంకుల వ్యాపారం రూ.13 వేల కోట్లు ఎస్బీఐలో విలీనమైంది. ప్రస్తుతం వాటి బ్రాంచీల విలీన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆగస్టు నాటికి 70 శాఖల విలీనం పూర్తవుతుంది. విలీనంలో భాగంగా సేవింగ్స్ ఖాతాలు, ఉత్పత్తులు, రుణాల మంజూరు పద్ధతి, సంస్కృతి వంటి వాటిపై అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. రోజుకు 200 మందికి బృంద శిక్షణలిస్తున్నాం. కొత్తగా 64 శాఖల ఏర్పాటు.. ప్రస్తుతం తెలంగాణలో ఎస్బీఐకి 1,300 బ్రాంచులు, 2,800 ఏటీఎంలున్నాయి. వచ్చే 3 నెలల్లో కొత్తగా 300 ఏటీఎంలు, ఏడాదిలో 64 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. తెలంగాణలో 10 ఇన్ టచ్ ఎస్బీఐ శాఖలున్నాయి. ఇందులో 9 హైదరాబాద్‌లో, 1 వరంగల్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 5 శాఖలను ఏర్పాటు చేస్తాం. ఇవి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో వస్తాయి. ఎస్‌హెచ్‌జీలకు రూ.2 వేల కోట్ల రుణాలు.. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) గతేడాది రూ.2,300 కోట్ల రుణాలిచ్చాం. ఈ ఏడాది రూ.2 వేల కోట్లు లక్ష్యించాం. రాష్ట్రంలో 1.60 లక్షల ఎస్‌హెచ్‌జీ బృందాలుండగా.. 65 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 99 శాతం రైతులకు రూపే కార్డులను పంపిణీ చేశాం. ఇందులో 60 శాతం మంది వినియోగిస్తున్నారు. ఎస్బీఐ మొత్తం లావాదేవీల్లో 42 శాతం డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. -
వాహనం ఢీకొని జింక మృతి
కోడుమూరు రూరల్ : పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పొలాల్లో పూడ్చిపెట్టారు. -
వాహనం వాడకుండానే బిల్లులు డ్రా
► ఇతర మండలానికి చెందిన ఓ వెహికిల్‌పై రూ.1.45లక్షల బిల్లు డ్రా ► ఆరునెలల వాహనం అలవెన్సు బిల్లు జేబులోకి ► గండేడ్ మండల ఇన్చార్జ్ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు గండేడ్: క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు కేటాయించిన వాహనాన్ని వాడుకోకుండానే ఓ అధికారి ఆరునెలల బిల్లును కాజేశారు. అంతేకాకుండా కార్యాలయ మెయింటనెన్స్ డబ్బులను కూడా తన సొంత అకౌంట్లో వేసుకుని డ్రా చేశారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల బిల్లు రూ.1.45లక్షలను జేబులో వేసుకున్నారు. గండేడ్ మండలానికి ఆయన ఇన్చార్జ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనుల పర్యవేక్షణ కోసంప్రతినెలా అద్దె వాహనంలో ఆయా గ్రామాలను సందర్శించాలి. అలాంటి పనులకు సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని కూడా ఆ వాహనంలోనే తీసుకువెళ్లాలి. ఆ వాహనానికి ప్రతినెలా రూ.24వేల చొప్పున అద్దె చెల్లిస్తారు. కానీ, వాహనం వినియోగించకుండానే కోస్గి మండలం ముస్రిప్ప గ్రామానికి చెందిన మౌలానా టీఎస్ 06యూపీ3796 ఇండికా వాహనం పేరున బిల్లులు పంపించి సదరు అధికారి తన ఖాతాలో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్రతినెలా రూ.24వేల చొప్పున లక్షా 45వేల రూపాయలను ఖాతాలోకి వేసుకున్నారు. జీఎస్‌లో చేసిన పనిని బట్టి 6శాతం కార్యాలయ నిర్వహణకు, పేపర్ ఖర్చులకు వినియోగించాలి. కానీ ఆ డబ్బులు కూడా తన ఖాతాలోకి మళ్లించి వాడుకున్నట్లు తెలిసింది. వేసవిలోకూడా వాహనాన్ని వినియోగించలేదు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జలనిధి కార్యక్రమంలో ప్రచారం చేసేందుకు సంబంధిత అధికారులను తీసుకువెళ్లేందుకు ఆయా తేదీల్లో వాహనం కూడా వినియోగించాలి. కానీ గతనెల 24న ఎలాంటి వాహనం లేకుండానే ఎండలో మోటారు బైకులపై అధికారులను తీసుకువెళ్లారు. వచ్చే 9, 13,2 0 తేదీల్లో కూడా ఆ వాహనాన్ని వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత ఈజీఎస్ అధికారులు కూడా వాహనాన్ని వాడుకుందామన్నా అందుకు ఆయన ఒప్పుకోనట్లు సమాచారం. ఇలా వాహనం బిల్లులు కాజేసినా, కార్యాలయ బిల్లులు వాడినా అడిగేవారే కరువయ్యారు. ఎలాంటి నిధులు వినియోగించలేదు: కాళుసింగ్, గండేడ్ ఎంపీడీఓ వాహనం వినియోగించేందుకు నెలచొప్పున 24వేల వచ్చేది వాస్తవమే. గత సంవత్సరం రంగారెడ్డిలో ఉన్నప్పుడు వాహనం వినియోగించాం. బిల్లులు పెట్టాం. కాని ఎలాంటి డబ్బులూ రాలేదు. -
యువకుడి దుర్మరణం
చాగల్లు: చాగల్లు మండలం ఎస్.ముప్పవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కలవలపల్లి గ్రామానికి చెందిన జానా రాముడు (22) తన స్నేహితుడు జొన్న వెంకటేశ్వరరావుతో కలిసి బైక్‌పై నిడదవోలు వెళ్లారు. అక్కడి నుంచి ఊనగట్ల వెళుతుండగా మార్గమధ్యంలో గురువారం రాత్రి సమయంలో ఎస్.ముప్పవరం గ్రామ శివారు మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రాముడు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వరరావు కాలు, చేయికి గాయాలయ్యాయి. చాగల్లు ఏఎస్సై ఎం.ధనరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల ఆందోళన మృతుడి బంధువులు నిడదవోలు–పంగిడి రహదారిపై ఆందోళనకు దిగారు. శుక్రవారం వేకువజాము వరకు ఆందోళన సాగింది. మాజీ సర్పంచ్ కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ రోడ్డులో క్వారీ లారీలు మితివీురిన వేగంతో వెళుతూ ప్రాణాలను హరిస్తున్నాయని అన్నారు. ఇలాంటి లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో సమిశ్రగూడెం ఎస్సై నరేంద్ర, ఏఎస్సై ఎం.ధనరాజు మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు. -
టీటీడీకి అశోక్ లెలాండ్ విరాళం