
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ మల్టీపర్పస్ వెహికల్, ఈకోలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రివర్స్ పార్కింగ్ అసిస్ట్, కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ తదితర భద్రత ఫీచర్లతో(ఇవి స్టాండర్డ్) ఈ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని మారుతీ సుజుకీ తెలిపింది. స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈకో కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉందని, ఫీచర్లను బట్టి కొత్త వేరియంట్ ధర ప్రస్తుత ధర కంటే రూ.400–23,000 అధికమని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment