బ్రిటిష్ కంపెనీ ‘పీ50’ విడుదల చేసిన ఈ కారు ప్రపంచంలోనే అతి చిన్న కారు. ఈ కంపెనీ దాదాపు అరవై ఏళ్లుగా ఈ కార్ల ఉత్పత్తి చేస్తోంది. అన్నేళ్లుగా ఉత్పత్తి చేస్తున్న ఈ కారులో కొత్త విశేషం ఏముందనేగా మీ అనుమానం? ఇప్పటి వరకు మిగిలిన కంపెనీల మాదిరిగానే ‘పీ50’ కూడా పూర్తిగా తయారైన కార్లనే తన షోరూమ్‌ల ద్వారా విక్రయించేది.
తాజాగా ఈ కంపెనీ ‘పీల్ పీ50’ పేరుతో ఈ కారుకు సంబంధించిన ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్’ (డీఐవై) కిట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో టైర్లతో కూడిన చక్రాలు, హెడ్‌లైట్లు, స్టీరింగ్‌వీల్, సీటు, పైభాగంలో అమర్చుకునేందుకు ఫైబర్‌గ్లాస్ షెల్ సహా కారుకు చెందిన విడిభాగాలన్నీ ఉంటాయి.
దీని పార్సెల్‌ను తెచ్చుకుని, ఇంట్లోనే పూర్తి కారును ఎవరికి వారు సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇదివరకు పెట్రోలుతో నడిచే కార్లు రూపొందించిన ఈ కంపెనీ, తాజాగా ఎలక్ట్రిక్ మోడల్‌ను డీఐవై కిట్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఇది 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు సాయంతో 49 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
దీని గరిష్ఠవేగం గంటకు 45 కిలోమీటర్లు. ఇందులో ఒక వ్యక్తి కూర్చోవడానికి, పరిమితంగా లగేజీ పెట్టుకోవడానికి చోటు ఉంటుంది. దీని ధర 10,379 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment