ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1.9 ఎక్స్‌ప్లోరర్ ఎస్‌యూవీలను రీకాల్‌కు పిలుపు నిచ్చింది.
కారు డ్రైవింగ్ సీటు ఎదురుగా ఉన్న ట్రిమ్ పీస్ విరిగి.. ప్రమాదాలకు కారణమవుతుందని యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్ధారించారు. ఫలితంగా 2011 నుండి 2019 వరకు ఉన్న ఎక్స్‌ప్లోరర్ ఎస్‌యూవీ మోడల్ కార్లలోని లోపాల్ని సరిచేసి కస్టమర్లకు అందించాలని ఆదేశించారు.
ఫిర్యాదుల వెల్లువ
164 ఫోర్డ్ కార్ల యజమానులు కార్లలోని లోపాలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత అమెరికన్ రెగ్యులేటర్లు గత జనవరిలో కార్లలోని సమస్యలపై విచారణ ప్రారంభించారు. కెనడియన్ రెగ్యులేటర్లు సైతం ఫోర్డ్ కార్లలోని సమస్యల గురించి ఆరా తీశారు. ఈ తరుణంలో ఫోర్డ్ రీకాల్ చేసేందుకు సిద్ధమైంది.
యజమానులకు విజ్ఞప్తి
రీకాల్ చేసిన ఎక్స్‌ప్లోరర్‌లలో కేవలం 5శాతం మంది మాత్రమే సమస్య బారిన పడ్డారని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. విడిభాగాలు అందుబాటులో ఉన్నప్పుడు తనిఖీ కోసం డీలర్‌లను సంప్రదించమని యజమానులకు విజ్ఞప్తి చేసింది. 568 వినియోగదారుల ఫిర్యాదులు, 14,000 కంటే ఎక్కువ వారంటీ నివేదికలు విడిభాగాలు ఊడిపోతున్నాయని ఫిర్యాదులు వచ్చినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమస్య వల్ల ఉత్పన్నమైన ప్రమాదాల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫోర్డ్ ఈ సందర్భంగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment