Ford
-
ప్రపంచంలోని బెస్ట్ ఆఫ్-రోడింగ్ కార్లు (ఫోటోలు)
-
అడ్వెంచర్స్ కోసం అద్భుతమైన వాహనం: ఫియర్స్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ క్యాంపర్ ట్రక్ (ఫోటోలు)
-
టాటా ప్రతీకారం అలా తీరింది..!
దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్‌నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.టాటా కలను ఎగతాళి చేశారు..కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్‌ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.అసలే టాటా గ్రూప్‌నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కోసం డెట్రాయిట్కు వెళ్లారు.అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్‌కి తిరిగొచ్చేశారు.ప్రతీకారం ఇలా తీరింది..తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది. -
ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే?
ప్రత్యర్థులతో పోటీ పడలేక.. అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగడంచేత అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.భారత్‌ను వీడిన మూడేళ్ళ తరువాత ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన కార్యకలాపాలను దేశంలో ప్రారభించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా వెల్లడించారు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయంఇండియాలో కేవలం ఎగుమతుల కోసం మాత్రమే తన తయారీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే వాహనాలను మళ్ళీ భారతదేశంలో విక్రయిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే తమిళనాడు సదుపాయంతో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వాహనాల వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
తమిళనాడుకు అమెరికన్ కంపెనీ: మూడేళ్ళ తరువాత..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'ఫోర్డ్' భారతదేశంలో చాలారోజుల క్రితమే తన కార్యకలాపాలను నిలిపివేసింది. భారతదేశ ఉత్పత్తిని ముగించిన మూడేళ్ళ తర్వాత, గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ.. చెన్నై సమీపంలోని మరైమలై నగర్లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది, అక్కడ నుంచి తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మిచిగాన్‌లోని ఫోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కోరుతూ దాని ఉన్నత యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేసారు.ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రమే కాకుండా.. ఫోర్డ్ ఐఎంజీ ప్రెసిడెంట్ కె హార్ట్, వైస్ ప్రెసిడెంట్ మాథ్యూ కొట్లోవ్స్కీ, ఫోర్డ్ ఇండియా డైరెక్టర్ శ్రీపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు!.. చైనా ఉద్దేశ్యం ఏంటి?ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న తన యూనిట్లను దశలవారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత 2022 ఆగస్టులో చెన్నైలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ఆ తరువాత ఫోర్డ్ భారతదేశంలోని రెండు ప్లాంట్లలో ఒకదాన్ని 2023లో టాటా మోటార్స్‌కు విక్రయించింది. మరో ప్లాంట్‌ను మూసివేసింది.Had a very engaging discussion with the team from @Ford Motors! Explored the feasibility of renewing Ford’s three decade partnership with Tamil Nadu, to again make in Tamil Nadu for the world!@TRBRajaa @Guidance_TN @TNIndMin #InvestInTN #ThriveInTN #LeadWithTN #DravidianModel pic.twitter.com/J2SbFUs8vv— M.K.Stalin (@mkstalin) September 11, 2024 -
భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న ఫోర్డ్!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టితో భారత మార్కెట్లోకి తిరిగి రావాలని యోచిస్తోంది. రీ-ఎంట్రీ అంశాన్ని కంపెనీ సీఈవో జిమ్ ఫార్లీ నేతృత్వంలోని ఫోర్డ్ గ్లోబల్ టీమ్ సమీక్షిస్తోంది.పాశ్చాత్య మార్కెట్లలో స్తబ్దత కారణంగా భవిష్యత్ వృద్ధికి కీలకమైన మార్కెట్‌గా భావించే భారత్‌లో తిరిగి ప్రవేశించే అవకాశాలను అంచనా వేయడానికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఫోర్డ్ గతంలో భారత్‌లో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఎకో స్పోర్ట్ మినీ-ఎస్యూవీ, ఫిగో చిన్న కారు వంటి మోడళ్లతో విజయాన్ని సాధించింది. మహీంద్రా & మహీంద్రాతో కలిసి జాయింట్ వెంచర్లతో చారిత్రక ఉనికి ఉన్నప్పటికీ, ఫోర్డ్ భారత్‌లో స్థిరమైన వ్యాపారాన్ని స్థాపించడంలో సవాళ్లను ఎదుర్కొంది. ఈ వెంచర్లు కంపెనీ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఫోర్డ్ తన గుజరాత్ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు విక్రయించాలని, భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలనే ఆలోచనకు దారితీసింది.ఫోర్డ్ తన చెన్నై ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూకి విక్రయించే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించే పునరాలోచన ఊపందుకుంది. ఫోర్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న చెన్నై ప్లాంట్‌ను కంపెనీ పునరుద్ధరణ వ్యూహానికి కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.ఫోర్డ్ గ్లోబల్ టీమ్ రీ-ఎంట్రీ ప్లాన్‌ను ఆమోదించినట్లయితే, కంపెనీ గణనీయమైన చట్టపరమైన సన్నాహాలను చేపట్టవలసి ఉంటుంది. చెన్నై ప్లాంట్‌లో ఇప్పటికే ఉన్న మెషినరీని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఉత్పత్తి దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా గత మార్చిలో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఫోర్డ్ పునరాలోచనకు కీలకమైన అంశాలు. -
టాటా మోటార్స్ తో కలిసి జాయింట్ వెంచర్?
-
ఫిర్యాదుల వెల్లువ.. లక్షల ఫోర్డ్ కార్ల రీకాల్!
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1.9 ఎక్స్‌ప్లోరర్ ఎస్‌యూవీలను రీకాల్‌కు పిలుపు నిచ్చింది. కారు డ్రైవింగ్ సీటు ఎదురుగా ఉన్న ట్రిమ్ పీస్ విరిగి.. ప్రమాదాలకు కారణమవుతుందని యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్ధారించారు. ఫలితంగా 2011 నుండి 2019 వరకు ఉన్న ఎక్స్‌ప్లోరర్ ఎస్యూవీ మోడల్ కార్లలోని లోపాల్ని సరిచేసి కస్టమర్లకు అందించాలని ఆదేశించారు. ఫిర్యాదుల వెల్లువ 164 ఫోర్డ్ కార్ల యజమానులు కార్లలోని లోపాలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత అమెరికన్ రెగ్యులేటర్లు గత జనవరిలో కార్లలోని సమస్యలపై విచారణ ప్రారంభించారు. కెనడియన్ రెగ్యులేటర్లు సైతం ఫోర్డ్ కార్లలోని సమస్యల గురించి ఆరా తీశారు. ఈ తరుణంలో ఫోర్డ్ రీకాల్ చేసేందుకు సిద్ధమైంది. యజమానులకు విజ్ఞప్తి రీకాల్ చేసిన ఎక్స్ప్లోరర్లలో కేవలం 5శాతం మంది మాత్రమే సమస్య బారిన పడ్డారని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. విడిభాగాలు అందుబాటులో ఉన్నప్పుడు తనిఖీ కోసం డీలర్లను సంప్రదించమని యజమానులకు విజ్ఞప్తి చేసింది. 568 వినియోగదారుల ఫిర్యాదులు, 14,000 కంటే ఎక్కువ వారంటీ నివేదికలు విడిభాగాలు ఊడిపోతున్నాయని ఫిర్యాదులు వచ్చినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమస్య వల్ల ఉత్పన్నమైన ప్రమాదాల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫోర్డ్ ఈ సందర్భంగా వెల్లడించింది. -
భారత్‌లో ఫోర్డ్ రీ ఎంట్రీ!
భారతీయ మార్కెట్లో 1995 నుంచి సంచలనం సృష్టించి గొప్ప అమ్మకాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' (Ford), 2021లో సరైన విక్రయాలు లేక తయారీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ దేశీయ విపణిలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ చెన్నైలో స్థానిక అసెంబ్లీ, దిగుమతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఒకవేళా మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే 'ఎండీవర్' (Endeavour) ఆధునిక హంగులతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్థానిక ఉత్పత్తి 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఫోర్డ్ తన ఎండీవర్‌ను తీసుకురానుంది. గతంలో కంపెనీ తన చెన్నై ఫ్యాక్టరీని విక్రయించాలనుకుని, చివరికి దాన్ని వాయిదా వేసింది. అదే రాబోయే రోజుల్లో కంపెనీ మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు ఫోర్డ్ కంపెనీ తన ఎండీవర్ కారుని మళ్ళీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తే.. మునుపటి కంటే కూడా అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని పొందటంతో పాటు 2.0-లీటర్ టర్బో-డీజిల్, 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్ అనే రెండు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 10-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉండనున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లో ఫోర్డ్ మరో సంచలన నిర్ణయం!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన ఫోర్డ్ కార్ల తయారీని నిలిపివేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫోర్డ్ యాజమాన్యం ఫోర్డ్ చెన్నై ప్లాంట్‌ను ఉక్కు దిగ్గజం జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారతీయలు నాడి పసిగట్టలేక ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ, అమ్మకాలు చేపట్టింది. అయితే, భారతీయుల నాడిని పసిగట్టడంలో విఫలమైంది. అప్పట్లో భారతీయులకు చిన్న కార్లపై మోజు ఎక్కువగా ఉండేది. ఫోర్డ్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. చిన్న కార్లను పరిమిత సంఖ్యలో అమ్మేది. అదే సమయంలో మారుతి, హ్యుండయ్‌లతో పోటీ పడలేదకపోయింది. చేతులు కాల్చుకోవడం ఇష్టం లేకే ఫలితంగా ఫోర్డ్ మన మార్కెట్లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. 2000 నుంచి 2021 వరకు 200 కోట్ల డాలర్ల మేర నష్టమూటగట్టుకుంది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది. ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని 2021లో భారత్‌లో తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్‌కు రెండు ప్లాంట్లు ఈ నేపథ్యంలో.. ఫోర్డ్‌కు భారత్‌లో రెండు కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారు చేసేది. ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి..సనంద్ ప్లాంట్‌ను టాటా కంపెనీకి అమ్మింది. చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మేలా చెన్నైలో ఉన్న రెండో ప్లాంట్‌ను అమ్మేందుకు మహీంద్రా అండ్ మహీంద్రాను, తైవాన్ ఎలక్ట్రానిక్ జెయింట్ విన్‌ఫాస్ట్‌ను సంప్రదించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. చివరకు ఫోర్డ్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థకు జే.ఎస్.డబ్ల్యూ మధ్య కొనుగోలు, అమ్మకాలు ఒప్పందాలు జరిగాయి. చివరికి ట్విస్ట్ ఇచ్చి చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్,డబ్ల్యూకి అమ్మే డీల్ చివరి దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని విరమించుకుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. భారత్‌లో చెన్నైతో పాటు, పలు ప్రాంతాల్లో ఉద్యోగుల్ని నియమించుకుని తిరిగి కార్లను తయారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అటు ఫోర్డ్ కానీ, ఇటు జే.ఎస్.డబ్ల్యూ కానీ స్పందించలేదు. -
కస్టమర్ దెబ్బకు అమెరికన్ కంపెనీకి షాక్ - రూ. 42 లక్షలు..
Ford India: భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ 'ఫోర్డ్' (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్షిప్ నుంచి 'ఫోర్డ్ ఎండీవర్' 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు. అయితే ఈ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీంతో వినియోగదారుడు పంజాబ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. వినియోగదారుడు ఆ కారుని ఎప్పుడు కొన్నాడన్న సంగతి స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే సంస్థ బిఎస్ 4 వాహనాలను బిఎస్ 6 వాహనాలు మార్చాలని అప్పట్లోనే భారత ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఫోర్డ్ ఎండీవర్ 3.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన తరువాత అఆఇల్ లీకేజ్, ఇతర సమస్యలు తలెత్తినట్లు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపిన అనంతరం ఉచితంగా ఇంజిన్ మార్చాలని, కస్టమర్ అసౌకర్యానికి రోజుకి రూ. 2000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్! సుప్రీంకోర్టు తీర్పు.. ఈ ఉత్తర్వుల మీద ఫోర్డ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కంపెనీ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇంజిన్‌ను రీప్లేస్ చేసింది. అయినప్పటికీ కస్టమర్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం నాసిరకం కారుని విక్రయించినదుకు ఫోర్డ్ ఇండియాకు రూ.42 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్! ఇప్పటికే ఫోర్డ్ ఇండియా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.6 లక్షలు చెల్లించింది. కాగా మరో రూ. 36 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కోసం రూ.87,000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. దీంతో మొత్తం రూ.36,87,000 చెల్లించాలి.. అదనంగా సమస్య పూర్తిగా రూపుమాపిన తరువాత కొత్త కారుని వినియోగదారునికి తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, ఛత్తీస్‌గఢ్‌లో నాసిరకం కారును కొనుగోలు చేసిన కస్టమర్‌కు సంస్థ రూ. 29 లక్షల పరిహారం అందించడంతో పాటు కొత్త కారుని అందించింది. -
ఫోర్డ్లో ఉద్యోగుల తొలగింపులు.. డిమాండ్ పడిపోవడంతో
ప్రపంచ దేశాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలవుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకుంటూ పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్న అమలు చేయగా.. మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ నిర్ణయంతో అమెరికాతో పాటు, కెనడాకు చెందిన 3వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు రెండువేల మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెయ్యిమంది ఉన్నారు. మార్కెట్లో పెరిగిపోతున్న పోటీ, ఆర్ధిక మాంద్యం దృష్ట్యా ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ భారీగా పడిపోతుంది. ఈ తరుణంలో ఖర్చులు తగ్గించుకొని భవిష్యత్‌లో సురక్షితంగా ఉండేలా ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఫోర్డ్లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా జర్మనీలో 2,300 మందిని, యూకేలో 200 మందిని తొలగిస్తున్నట్లు ఫోర్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోర్డ్ భవిష్యత్ ప్రణాళికల్ని వివరించింది. 2035 నాటికల్లా యూరప్ అంతటా ఈవీ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొనుగోలు దారులు ఈవీ కార్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల అవసరం తక్కువ ఉంటుందని భావిస్తుంది. యూరప్‌లో 3,400 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా.. 2025 నాటికి వారిలో 2,800 మంది ఇంజనీర్లకు పింక్ స్లిప్‌లు జారీ చేయనుంది. ఇక మిగిలిన 1000 మందిని అడ్మినిస్ట్రేటీవ్ విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది అంత్యత కఠినమైన నిర్ణయం. మా టీం సభ్యుల మధ్య ఈ తొలగింపులతో అనిశ్చితి నెలకొంది. తొలగించిన ఉద్యోగులకు మా మద్దతు ఉంటుందని యూరప్ ఫోర్డ్ ఈ మోడల్ జనరల్ మేనేజర్ మార్టిన్ సుందర్ అన్నారు. -
సంచలన నిర్ణయం తీసుకున్న ఫోర్డ్ కంపెనీ
-
‘చేతులెత్తేసింది’, 47ఏళ్ల తర్వాత..ఆ కార్ల తయారీ నిలిపివేయనున్న ఫోర్డ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచంలోనే వాహనదారులు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటైన ‘ఫోర్డు ఫియస్టా’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఫోర్డ్ బాస్ మరో వారంలో స్పష్టమైన ప్రకటన చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1970లలో పలు సమస్యల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. ఫలితంగా మోడెస్ట్, ఎకనమికల్ కార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో యూరోపియన్ కస్టమర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఫియట్, రెనాల్ట్, వోక్స్వ్యాగన్ బడ్జెట్ కార్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. చదవండి👉 యాపిల్‌కు ఎదురు దెబ్బ, ఎలక్ట్రిక్ కార్ల రహస్యాల్ని దొంగిలించిన ఉద్యోగి! అదే సమయంలో 1972లో ప్రత్యర్ధి ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హెన్రీ ఫోర్డ్-2 రెండు డోర్లతో ‘బాబ్‌క్యాట్’ప్రాజెక్ట్ పేరుతో కారును తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రణాళికలు, అనేక రకాలైన కార్ల డిజైన్లను రూపొందించిన మూడేళ్ల తర్వాత 1975లో ఫియస్టా పేరుతో తొలి వేరియంట్ ఫోర్డు కారును ఆవిష్కరించారు. 1976లో ఆ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే యూరోపియన్ మార్కెట్లో సూపర్ మినీ కార్లుగా వోక్స్ వ్యాగన్ పోలో, రెనాల్ట్ 5 లు మార్కెట్‌ను శాసిస్తుండగా.. బడ్జెట్ ధరలో నడిపేందుకు సౌకర్యంగా ఉండేలా ప్రజలు ఎలాంటి కారైతే కోరుకున్నారో.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫియస్టా ఎంకే 1ను ఫోర్డు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. వెరసి నాలుగేళ్లకే (1980) వన్ మిలియన్ కార్లను అమ్మకాలు జరిపి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మార్కెట్లో విడుదలైన ఫోర్డ్ ఎక్స్ఆర్ సైతం1980లలో రేసర్ల కలల కారుగా మారింది. 1982 నాటికి అమ్మకాలు 2 మిలియన్ల మార్కును అధిగమించాయి. యూకేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతుండడంతో ఆ మోడళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఫోర్డు ఫియాస్టా సెకండ్ జనరేషన్ ఫియస్టా మార్క్2ను ఫోర్డ్ వాహన దారులకు పరిచయం చేశారు. 1983 - 1989 మధ్య కాలంలో తిరుగులేని కారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 1989లో ఫియస్టా మార్క్ 3వ జనరేషన్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో చిన్న కారును తయారు చేసింది. 1.0-లీటర్ మరియు 1.1-లీటర్ ఇంజన్లతో వచ్చింది. నిర్వహణ ఖర్చులు సైతం తగ్గించింది. 1995లో ఫియస్టా మార్క్ 4వ జనరేషన్, 2001లో ఫియస్టా మార్క్ 5వ జనరేషన్, 2006లో ఫియస్టా 6వ జనరేషన్, 2012లో ఫియస్టా మార్క్ 7వ జనరేషన్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనాలకు తెరతీసింది. అయితే ఇటీవల మార్కెట్లో కార్ల విడిభాగాల ధరలు పెరగడం, కొనుగోలు దారులు ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఫోర్డ్ ఫియస్టా కారు తయారీని వచ్చే ఏడాదిలో ఫోర్డ్ నిలిపివేయనుంది. ఫోర్డ్ ఫియస్టా వేరియంట్ కార్ల తయారీ నిలిపివేతపై ఫోర్డ్ బాస్ విలియం క్లే ఫోర్డ్ స్పష్టత ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
3 వేలమందిపై వేటు వేసిన లగ్జరీ కార్ మేకర్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ మేకర్, అమెరికాకుచెందిన ఫోర్ట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 3 వేలమందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు అధికారికరంగా ఫోర్డ్ ధృవీకరించింది. ఉద్యోగాల కోత సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫోర్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. (‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ సంతకం చేసిన ఇమెయిల్ పోస్ట్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 3వేల మంది ఉద్యోగులు, మరికొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు ఫోర్ట్ తెలిపింది. ఈ మేరకు ఫోర్డ్ ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్ సమాచారం అందించింది. ఈ కోతలు ప్రధానంగా అమెరికా, కెనడా, ఇండియాలోని సిబ్బందిని ప్రభావితం చేసింది. (జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా... కానీ ఇక్కడో ట్విస్ట్) ఫోర్డ్లో చాలామంది ఉద్యోగులున్నారని, ఎలక్ట్రిక్, కొత్త సాఫ్ట్వేర్ వాహనాల పోర్ట్‌ఫోలియోకు మారడానికి అవసరమైన నైపుణ్యం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు లేదని ఫార్లే ఇటీవల చెప్పారు. 2026 నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా వెల్లడించడం గమనార్హం. అప్పటికి 10 శాతం ప్రీ-టాక్స్ ప్రాఫిట్ మార్జిన్‌ను చేరుకోవాలని, గత ఏడాది ఇది 7.3 శాతంగా ఉందని చెప్పారు న్యూటెక్నాలజీకి మారడం, వాహనాల అధునాతన సాఫ్ట్వేర్ అభివృద్ధి లాంటి పరిణామాల నేపథ్యంలో నిర్వహణా విధానాన్ని మారుస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఫోర్డ్‌పై రతన్‌టాటా స్వీట్ రివేంజ్ !
దేశమన్నా ఇక్కడి ప్రజలన్నా అమితంగా ఇష్టపడే రతన్‌టాటా ఓ విదేశీ కంపెనీ భారతీయులపై చూపించిన తల పొగరుకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను బిర్లాల కుటుంబ సభ్యుడు వేదాంత్ బిర్లా ట్విటర్లో షేర్ చేశారు. జేఎల్ఆర్ను టాటా టేకోవర్ చేసి పద్నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రతన్‌టాటా గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ఫోర్డ్‌పై టాటా ప్రతీకారం తీర్చుకున్న తీరు.. అంబాసిడర్ కారు మినహా 90వ దశకం వరకు పూర్తిగా స్వదేశీ కార్లు ఇండియాలో అందుబాటులో లేవు. జపాన్, అమెరికా, కొరియా అందించే సాంకేతిక సహకారంతో దేశీయంగా అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ పూర్తి స్వదేశీ కారు లేదు. ఆ లోటు భర్తీ చేసేందుకు రతన్ టాటా ఇండికా పేరుతో స్వదేశీ కారుని 1998లో మార్కెట్లోకి తెచ్చారు టాటా. కానీ ఆ కారు ముందుగా అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించిన నష్టాలు వచ్చాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు, సరైన పరిష్కారం కనుగొనేందుకు 1999లో అమెరికా ఫ్లైట్ ఎక్కారు రతన్ టాటా. మీకెందుకయ్యా కార్లు అమెరికా వెళ్లిన రతన్‌టాటా అక్కడ ఫోర్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇండియా నష్టాల కారణంగా కార్ల తయారీ యూనిట్‌ను కొనుగోలు చేయాలంటూ ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరిపాడు. అప్పుడు ఆ కంపనీ బాస్‌గా ఉన్న బిల్లీఫోర్డ్ భారత్‌ను మరీ తక్కువ చేసి మాట్లాడారు. కార్ల గురించి ఏమీ తెలియని మీకు ఎందుకు సొంత కార్లు ? అంటూ హేళనగా మాట్లాడారు. ఇండికాను మా మద్దతు ఇవ్వలేం. కంపెనీ మూసేయండంటూ ఉచిత సలహా ఇచ్చారు. అవమాన భారంతో ఫోర్డ్ చేసిన వ్యాఖ్యలను నొచ్చుకున్న రతన్ టాటా ఇండియాకి తిరిగి వచ్చారు. రిసెర్చ్ డిపార్ట్మెంటుతో కూర్చుని ఇండికాలోని లోపాలను, మార్కెట్ వ్యూహాలను మరోసారి పరిశీలించుకున్నారు. పట్టుదలతో శ్రమించి ఇండికాను లోపాలను సవరించి మరింత ఆకర్షీయంగా మార్చారు. అంతే దేశీ రోడ్లపై ఇండికా తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికీ ఇండికాకు ఆదరణ తగ్గలేదు. ఫోర్డ్‌ను ఆదుకున్న టాటా ఇండికా డీల్ ఘటన జరిగిన పదేళ్లకు 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఫోర్డ్ కంపెనీ పునాదులు కదిలిపోయాయి. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక దివాలా అంచులకు చేరింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కెందు ఫోర్డ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జాగ్వార్, ల్యాండ్‌రోవర్ (జేఎలర్ఆర్)లను కొనుగోలు చేసి ఫోర్డ్ కంపెనీ దివాలా తీయకుండా ఒడ్డున పడేశారు రతన్ టాటా. అలా భారతీయులను అవమానించిన అమెరికన్ ఫోర్డ్‌పై స్వీట్ రివేంజ్ తీర్చుకున్నారు. #OnthisDay:-2008 Tata Motors completed the deal to acquire two luxury car brands Jaguar and Land Rover. “The best revenge is massive success.” ~ Frank Sinatra. The revenge story Of #Tata, especially #RatanTata Ji over Ford is truly the story of massive success too. @RNTata2000 pic.twitter.com/YCKW6EMR6E — Vedant Birla (@birla_vedant) June 2, 2022 గ్లోబల్ కంపెనీగా ఇండికా ఇచ్చిన స్ఫూర్తితో టాటా మోటార్స్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. బ్రెజిల్‌కి చెందిన మార్క్పోలోతో కలిసి బస్సులు, సౌత్ కొరియాకు చెందిన దేవూతో కలిసి ట్రక్కులు, జపాన్‌కి చెందిన హిటాచితో కలిసి హెవీ మెషినరీ, ఏయిరో స్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ప్రస్తుతం టాటా దూసుకుపోతుంది. చదవండి: Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
హలో బాసూ.. వేగం ఎక్కువైంది.. అని కారు డ్రైవర్‌కు చెబితే!
బండెక్కితే వంద దాటాల్సిందే అనేవాళ్లు చాలా మందే ఉంటారు. రోడ్డు బాగుంటే, జనాలెవరూ లేకపోతే ఈ స్పీడు రెండింతలు కూడా అవుతుంటుంది. ఇలాంటి సమయంలోనే కాస్త అటూఇటైతే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశమే లేదా?.. అంటే ‘మై హూనా’అంటోంది కార్ల కంపెనీ ఫోర్డ్. అత్యవసర సమయాల్లో వాహనం వేగాన్ని తగ్గించే ‘జియోఫెన్సింగ్’టెక్నాలజీని రూపొందించింది. సిటీల్లో ఏయే ప్రాంతాల్లో మెల్లగా వెళ్లాలో అక్కడి నిబంధనల ప్రకారం ఓ వర్చువల్ ప్రాంతాన్ని ఈ టెక్నాలజీ డిజైన్ చేస్తుంది. ఈ ప్రదేశాల్లోకి వాహనం వెళ్లినప్పుడు ఎక్కడైనా వేగం హద్దు మీరినట్టు అనిపిస్తే ‘హలో.. వేగం ఎక్కువైంది’అని డ్రైవర్‌కు ఓ సాఫ్ట్వేర్ రెస్పాన్స్‌ను ఈ టెక్నాలజీ చూపిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తగ్గట్టు వేగాన్ని తగ్గించేస్తుంది. వేగం ఎంత తగ్గుతోందో డ్రైవర్ ముందున్న డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొన్నికొన్నిసార్లు రోడ్లు ఖాళీగా ఉన్నా, జనాలెవరూ లేకున్నా ఇలా వేగం తగ్గిస్తే పరిస్థితేంటి?.. అంటే ఈ టెక్నాలజీని ఆఫ్ చేసే వెసులుబాటు కూడా డ్రైవర్‌కు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్తో అనుసంధానమైన వాహనాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఫోర్డ్ పరిశీలిస్తోంది. మంచి ఫలితాలొస్తున్నాయని కంపెనీ చెబుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్పీడ్ కంట్రోల్‌కు.. ఫోర్డ్ జియోఫెన్సింగ్ టెక్నాలజీ!
-
భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!
వాహన రంగంలో ఉన్న యూఎస్ సంస్థ ఫోర్డ్.. ఎగుమతుల కోసం భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది. భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. -
మీకో దండం మళ్లీ ఇండియా రాలేం!
ఇండియాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదంటూ మరోసారి స్పష్టం చేసింది దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఇండియాలో తమ ఆపరేషన్స్‌ని పునఃప్రారంభించేది లేదని మరోసారి స్పష్టం చేసింది. అప్పుడే గుడ్‌బై కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్టు 2021 సెప్టెంబరులో ప్రకటించింది. ఇక్కడ మార్కెట్లో సరైన పట్టు సాధించలేకపోయిన కారణంగా ఇండియా నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే అప్పటికే ఫోర్డ్‌కు ఇండియాలో గుజరాత్, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రీ ఎంట్రీ ఫోర్డ్ నుంచి నిష్క్రమణ ప్రకటన వెలువడినా.. అనంతర కాలంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ప్రొడక్షన్ లింకెడ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కి ఫోర్డ్ దరఖాస్తు చేసుకుంది. ఫోర్డ్ దరఖాస్తును పరిశీలించిన కేంద్రం ఈ స్కీమ్ అమలుకు అంగీకారం కూడా తెలిపింది. దీంతో ఫోర్డ్ ఏదో ఒక రూపంలో ఇండియాలోకి తిరిగి అడుగు పెడుతుందనే వార్తలు వచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో ఉన్న ఫోర్డ్ కార్ల తయారీ ఫ్యాక్టరీలో ఇకపై పెట్రోలు, డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తారని, వాటిని ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారనే అంచనాలు వచ్చాయి. అయితే ఇండియాలో తమ ఆపరేషన్స్ తిరిగి ప్రారంభించే విషయంపై ఇటీవల సమీక్ష చేసిన ఫోర్డ్ పాత నిర్ణయానికే కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యింది. సారీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కి ఎంపిక చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూనే తాము తిరిగి ఇండియాలో ఎటువంటి కార్ల తయారీ ప్రారంభించలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు తమకున్న కార్ల ఫ్యాక్టరీలను ఇతర సంస్థలకు అమ్మే ప్రయత్నాల్లో జోరు పెంచింది. గుజరాత్ ప్లాంటును కొనేందుకు టాటా గ్రూపు ఆసక్తి చూపిస్తోంది. చదవండి: టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. సింగిల్ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్ -
టెస్లా అయితే కాదు..! టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే..!
ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లు భారీ ఆదరణను పొందాయి. ఐతే అమెరికా మార్కెట్లలో టెస్లాకు అనుహమైన దెబ్బ తగిలింది. అమెరికా కన్స్యూమర్ రిపోర్ట్స్- 2022 ప్రకారం అత్యుత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఫోర్డ్ ముస్టంగ్ మాక్-ఈ (Ford Mustang Mach-E) అగ్రస్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాల పాటు ఈ టైటిల్‌ను కలిగి ఉన్న టెస్లా మోడల్ 3ని అధిగమించింది. ఈ కన్స్యూమర్ రిపోర్ట్స్ అత్యుత్తమ కార్లు, ఎస్ యూవీ, ట్రక్కులను హైలైట్ చేస్తుంది. టెస్లా మోడల్-3 కు పోటీగా ఫోర్డ్ ముస్టాంగ్ మ్యాక్-E వెలుగులోకి వచ్చింది. ఫోర్డ్ 2020లో Mach-E, దాని ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును విక్రయించడం ప్రారంభించింది. ఐతే అమెరికా వాసులు మాత్రం టెస్లా కార్ కంటే ఫోర్డ్ ముస్తాంగ్ మాక్-ఈ కారును ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. టెస్లా మోడల్ 3 స్పెసిఫికేషన్ టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ స్పెసిఫికేషన్ ఫోర్డ్ ఎలక్ట్రిక్ ముస్టాంగ్ మాక్ ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఇంజిన్ 600 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది.వేగంగా ఛార్జింగ్ అయ్యే DC బ్యాటరీ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తర్వాత 47-మైళ్ల దూరం నడుస్తుంది. -
టెస్లాకు చెక్‌పెట్టనున్న ఫోర్డ్..! అదే జరిగితే..?
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల్లో రారాజుగా పేరొందిన టెస్లాను ఢీ కొట్టేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సిద్దమయ్యాయి. ఛార్జింగే సమస్య..! ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఛార్జింగ్ సమయం ఒక్కటే ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు పెను సవాలుగా మారాయి. ఇప్పటికే టెస్లా రూపొందించిన సూపర్ ఛార్జర్స్‌తో కొంత ఉపశమనం కల్గింది. టెస్లా ఆవిష్కరించిన సూపర్ ఛార్జర్స్‌కు పోటీగా మెరుపు వేగంతో చార్జ్ అయ్యే సూపర్ ఛార్జర్స్‌ను తీసుకురావడానికి పలు కంపెనీలు తలమునకలైనాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పూర్తిగా ఫుల్ అయ్యేందుకు పట్టే సమయాన్ని తగ్గించడం కోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే సూపర్ ఛార్జర్స్ విషయంలో టెస్లాకు చెక్ పెడుతూ సరికొత్త ఛార్జర్‌ను ఆవిష్కరించింది. చదవండి: లైంగిక వేధింపులు, ఎలన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ టెస్లాకు సూపర్ ఛార్జర్స్‌కు చెక్..! టెస్లా తన కంపెనీ కార్ల కోసం సూపర్ ఛార్జర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛార్జర్ సహాయంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను కేవలం 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చునని టెస్లా పేర్కొంటుంది. ప్రస్తుతం ఫోర్డ్ తయారుచేసిన కొత్త కేబుల్ ఛార్జర్ డిజైన్ సహాయంతో టెస్లా సూపర్ ఛార్జర్స్ కంటే 4.6 రెట్లు వేగంగా ఛార్జ్ చేయవచ్చునని తెలుస్తోంది. అంటే కేవలం 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఫుల్ చార్జ్ చేయవచ్చును. ఈ సూపర్ కేబుల్ ఛార్జర్‌ను ఫోర్డ్, పర్డ్యూ యూనివర్శిటీ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో వీపరితమైన వేడి...! టెస్లా సూపర్ ఛార్జర్స్‌తో బ్యాటరీలను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆయా కేబుల్స్ వీపరితంగా వేడెక్కె అవకాశం ఉంది. దీంతో ఆయా కేబుల్స్ త్వరగా పాడైపోయే అవకాశం లేకపోలేదు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న పర్డ్యూ యూనివర్సిటీ, ఫోర్డ్ సరికొత్త సూపర్ ఛార్జర్ కేబుల్ డిజైన్‌ను ఆవిష్కరించాయి. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..! -
ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
Anchor Sree mukhi Gifts Ford Car To His Brother: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తమ్ముడు సుష్రుత్ కోసం ఖరీదైన ఫోర్డ్ కారును కొని గిఫ్టుగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. దీంతో ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫోర్డ్ భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు ఎందుకు కొన్నావంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల కారును లాంచ్ చేసిన ఫోర్డ్
ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల ఫిగో కారును ఫోర్డ్ నేడు(జూలై 22) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర ₹7.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఫోర్డ్‌ఫిగో ఆటోమేటిక్ కారు మిడ్-స్పెక్ టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఫోర్డ్ సబ్ కాంపాక్ట్ ఎస్యువీ ఎకోస్పోర్ట్ లో ఉపయోగించిన గేర్ బాక్స్ ఇందులో వాడారు. దీనిలో గల ఇంజిన్ గరిష్ఠంగా 95 బిహెచ్ పీ పవర్, 119 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మరింత పెప్పీ డ్రైవింగ్ అనుభవం కోసం 'స్పోర్ట్' మోడ్ ను అందించారు. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ కారు 16 కి.మీ.పీ.ఎల్(ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫిగో హ్యాచ్ బ్యాక్స్ డీజిల్ వేరియెంట్లకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ లభించదు. రెగ్యులర్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎప్పటిలాగే ఫిగో ఇతర వేరియెంట్లలో కొనసాగుతుంది. 2021 ఫిగో ఆటోమేటిక్ కొత్త డ్యూయల్ టోన్ 15 అంగుళాల అలాయ్ వీల్స్ తో రీడిజైన్ చేయబడ్డాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే కొత్త ఫిగో ఆటోమేటిక్ 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్ లు, రిమోట్ కీలెస్ వంటివి ఉన్నాయి. భద్రతా కోసం ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-లాంచ్ అసిస్ట్ లను పొందుతుంది. -
‘ఆ సువాసన’ వెదజల్లే కారు... ప్రపంచంలోనే మొదటి సారి
FORD MUSTANG MACH-E ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వాహనాల తయారీలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు ఛార్జింగ్, మైలేజీపై దృష్టి సారించగా... ఫోర్డ్ ఓ అడుగు ముందుకు వేసి సరికొత్త ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఆ ఫీలే వేరు ఇంతకాలం పెట్రోలు, డీజిల్ కార్లదే హవా నడిచింది. ఏళ్ల తరబడి పెట్రోలు కార్లు ఉపయోగించాం. దీంతో ఆ కార్లతో తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడింది. పైకి ఎవరు చెప్పకున్నా కారుకు సంబంధించి కంఫర్ట్, కంపాటబులిటీలతో పాటు పెట్రోల్ ఇంజన్ వాసనను కూడా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ అనుభూతి మిస్ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాసన మిస్ అవుతున్నాం పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిన తర్వాత పెట్రోలు వాసనను మిస్ అవుతున్నామని 70 శాతం మంది తెలిపినట్టు ఫోర్డ్ జరిపిన సర్వేలో తేలింది, వైన్, ఛీజ్ కంటే కూడా పెట్రోలు వాసనే ఎక్కువ ఇష్టపడతామని చెప్పిన వారి సంఖ్య కూడా చాంతాడంత తేలింది. తొలిసారిగా దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఉపయోగించే వారికి పెట్రోలు కారు స్మెల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక మాక్ ఈవ్ పేరుతో సరికొత్త ఫ్రాగ్రెన్స్ని తయారు చేసింది ఫోర్డ్. ప్రత్యేక పద్దతిలో తయారు చేసిన ఈ పరిమళాన్ని మొదటగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ-జీటీ మోడల్‌తో ప్రవేశ పెట్టనుంది. పెట్రోలు వాసన మిస్ అవుతున్న వారికి ప్రత్యామ్నయం చూపనుంది. పెట్రోల్ వాసన అందించే తొలి ఈవీ కారుగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ - ఈ జీటీ నిలవనుంది. -
ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర!
వేల్స్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. కాగా వేలంలో దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు. డయానా వాడిన కారుకు వేలంలో 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షల కన్నా ఎక్కువ. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఒక పాతకారుకు ఇంత ధర అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. 1981లో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. అయితే 36 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు. చదవండి: యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్ -
‘బెంజ్’ కార్లలో నిఘా నేత్రం
జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ కార్లలో వినియోగదారులకు తెలియని ఓ రహస్య ఫీచర్ ఉన్నట్లు మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. అదే నిఘా నేత్రం. దాన్నే ట్రాకింగ్ డివైస్ అని, లొకేషన్ సెన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్ ద్వారా ఆ కారు ఎక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయం తెల్సిన వినియోగదారులు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. 1,70,000 మెర్సిడెస్ బెంజ్ కార్లను గతేడాది ఒక్క బ్రిటన్‌లోనే అమ్మామని, వాటన్నింటిలోనూ ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే ఈ సెన్సర్ ఉపయోగాన్ని వాడుకుంటామని యాజమాన్యం పేర్కొంది. థర్ట్ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేశామని, వారికి యజమాని వివరాలతోపాటు కారున్న చోటుకు సంబంధించిన సమాచారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయకూడదు. తాము కార్లను అమ్మేటప్పుడే వినియోగదారుల నుంచి లొకేషన్ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా యాజమాన్యం తెలియజేసింది. కార్లను కొనేటప్పుడు, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్నంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్ తప్పనిసరి అయిందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్ మాజీ రక్షణ మంత్రి డేవిడ్ డేవిస్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ఇలా ‘బిగ్ బ్రదర్’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్ ల్యాండ్ రోవర్, వోక్స్వాగన్ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్ కంపెనీలకు ఉండాలిగానీ మెర్సిడెస్ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్ కారులు చోరీకి గురయ్యాయి. -
త్వరలో అలరించబోతున్న కొత్త కార్లు
కొత్త కారు అంటే ... ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మార్కెట్లోకి ఎప్పుడు ఏ కొత్త కారు వస్తుందా? అని ఎదురు చూసే ఆటోప్రియులు చాలా మందే. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలే ఉంది. ఆటో ఎక్స్ 2018లో చెప్పిన మేరకు ఈ నాలుగు నెలల్లో 11 కార్ల మేర మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఆటో ప్రియులను అలరించనున్న ఈ కార్లేమిటో ఓ సారి తెలుసుకుందామా? మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ : కొత్త ఇంజిన్లతో మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ఆటో అభిమానుల ముందకు వస్తుంది. దాంతో పాటు ఎక్స్టీరియర్స్లో కూడా పలు మార్పులను చేపట్టింది మెర్సిడెస్ బెంజ్. ఇప్పటికే ఈ వెహికిల్ టెస్ట్ డ్రైవ్ అయిపోయిందట. మొత్తం లగ్జరీ లుక్, అద్భుతమైన ప్రదర్శనలో ఇది అభిమానులను అలరించబోతుంది. దీని ధర రూ.42 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు ఉంటుంది. 2018 అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ ఆల్-టెర్రైన్: ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి ఎక్కువ ఆదరణ లభించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ కారు ఒకటి. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎస్టేట్ వెర్షన్ రివైజ్డ్ వెర్షనే ఈ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్. దీనిని తొలుత 216లో ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించారు. దీనిని ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దీని ధర రూ.65 లక్షల మేర ఉండొచ్చు. సెప్టెంబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. 2018 మారుతీ ఎర్టిగా : ఇది సెవన్-సీటర్ ఎంపీవీ. ఇది చాలా తేలికగా, చాలా పీచర్లతో వస్తుంది. కొత్త ఇంజిన్లను దీనిలో పొందుపరిచారు. నెక్సా రిటైల్ స్టోర్లు వీటిని విక్రయించబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్‌లో ఈ వెహికిల్ లాంచింగ్. ఫోర్డ్ ఫిగో అండ్ ఫోర్డ్ యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ : ఈ ఫిగో సిబ్లింగ్స్ అత్యంత శక్తివంతమైన 1.2 లీటరు డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. అదనపు సేఫ్టీ ఫీచర్లు, పలు వినూత్న ఫీచర్లతో ఇది లాంచ్ కాబోతున్నాయి. యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.5.20 లక్షల నుంచి రూ.9 లక్షలుండగా.. ఫిగో ధర రూ.4.80 లక్షల నుంచి రూ.7.80 లక్షలుగా ఉన్నాయి. తొలుత సెప్టెంబర్‌లో యాస్పైర్ను లాంచ్ చేసి, ఆ అనంతరం ఫిగోను మార్కెట్లోకి తేబోతున్నారు. మహింద్రా మారాజ్జో : ఎక్కువ స్పేస్ కలిగి, ఏడు సీట్లతో రాబోతున్న వెహికిల్ మహింద్రా మారాజ్జో. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. లాంచ్ తేదీ : 2018 సెప్టెంబర్ 3. మహింద్రా ఎస్201 : సబ్-కాపాక్ట్ ఎస్యూవీ స్పేస్‌లో మరో వాహనం మహింద్రా ఎస్201. మారుతీ విటారా బ్రిజా, ఎకోస్పోర్ట్, టాటా నెక్సోన్కు ఇది డైరెక్ట్ పోటీ దారిగా నిలువబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్యలో ఉంది. 2018 అక్టోబర్‌లో దీని లాంచింగ్. 2018 హోండా సీఆర్-వీ : ఇప్పటికే మార్కెట్లలో ఐదు తరం సీఆర్-వీ ఉంది. భారత్‌లో ఏడు సీట్ల అవతార్‌గా రాబోతున్న తొలి వాహనం ఇదే. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇది కలిగి ఉండబోతుండగా.. తొలిసారి దీని ద్వారా 1.6 లీటర్ ఇంజిన్‌ను ప్రవేశపెడుతోంది. డస్టన్ జీఓ, జీవో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ : ఎక్స్టీరియర్లో స్వల్ప మార్పులతో, లోపల కొత్త ఫీచర్లతో డస్టన్ ఈ వాహనాలను తీసుకొస్తోంది. టచ్‌స్క్రీన్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇవి కలిగి ఉంటాయి. దీని ధర రూ.3.50 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండబోతున్నాయి. లాంచింగ్ : 2018 సెప్టెంబర్. జీప్ కంపాస్ ట్రైల్హాక్ : భారత్‌లో ఇదే అత్యంత ఖరీదైన కంపాస్ మోడల్. దీని ధర రూ.23 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. లాంచింగ్ : 2018 అక్టోబర్. నిసాన్ కిక్స్ : నిసాన్ కంపెనీ కిక్స్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. టెర్రానో వంటి బ్రో ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ఈ వెహికిల్ లాంచ్ చేస్తోంది. దీని ధర రూ.9.90 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. డిసెంబర్లో దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ శాంట్రో : హ్యుందాయ్ శాంట్రో బడ్జెట్ కార్ కస్టమర్ల మదిలో ఇప్పటికీ బెస్ట్ కారుగానే నిలిచింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్దమైంది. 2018 అక్టోబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
మిలియన్ మార్క్‌ను దాటిన ఫోర్డ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా తక్కువ సమయంలోనే పది లక్షల కార్లను విక్రయించి రికార్డును సృష్టించింది. ఢిల్లీకి చెందిన నిఖిల్ కక్కర్ అనే వినియోగదారుడి విక్రయంతో పోర్డ్ ఇండియా సంస్థ మిలియన్ మార్క్‌ను దాటింది. సంస్థ తయారుచేసిన మిలియన్ మార్క్ వాహనం.. భారత దేశపు మొదటి కాంప్యాక్ట్ యుటిలిటీ వాహనం ఫోర్డ్ ఫ్రీస్టైల్.. ఈ వాహనాన్ని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహరోత్రా చేతుల మీదుగా నిఖిల్ కక్కర్‌కు అందించారు. ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ.. భారతదేశంలో తమ సంస్థ మిలియన్ వినియోగదారులను కలిగి ఉండటం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. తమపై నమ్మకం, విశ్వాసాన్ని ఉంచిన వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్త ఫీచర్లతో మన్నికైన వాహనాలను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజమైన ఫోర్డ్ 1998 నుంచి తన వాహనాలను ఇండియాలో తయారుచేస్తోంది. సురక్షిత, నాణ్యతలకు గుర్తింపు దక్కించుకున్న ఫోర్డ్ భారత మార్కెట్లో దూసుకెళ్తోంది. ఫిగో అండ్ ఎకోస్పోర్ట్, ఐకాన్, ఎండీవర్, ఫియెస్టా తదితర ప్రజాదరణ పొందిన మోడళ్లను ఫోర్డ్ ఇండియా తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా విభాగానికి దేశవ్యాప్తంగా 267 నగరాల్లో, పట్టణాల్లో 465కు పైగా సెల్స్, సర్వీస్ ఔట్లెట్లు ఉన్నాయి. -
ఫోర్డ్ తొలి సీయూవీ ‘ఫ్రీస్టయిల్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ దేశంలోనే తొలి కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ) ఫ్రీస్టయిల్‌ని విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టీ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) డిజైన్‌తో, సాంకేతికత, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశామని ఫోర్డ్ సేల్స్ ప్రొడక్షన్ జీఎం ఆంటోని చీరియన్ కురియన్ గురువారమిక్కడ జరిగిన విలేకరులకు తెలిపారు. ఫ్రీస్టయిల్ పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో నాలుగు వేరియంట్లలో 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ధరల శ్రేణి రూ.5.09–7.89 లక్షల మధ్య ఉంది. దీన్ని గుజరాత్‌లోని సాణంద్ ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. -
మహీంద్రా, ఫోర్డ్‌ల ఎస్యూవీ!
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ ఫోర్డ్ మోటార్‌తో కలసి కొత్త ఎస్‌యూవీలను అభివృద్ధి చేయనున్నది. అంతేకాకుండా ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది ఇరు కంపెనీల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగమే ఇదంతా అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్డీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇరు కంపెనీలు తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయని తెలిపారు. దీంట్లో భాగంగా ఇరు సంస్థలు కలసి మిడ్‌సైజ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను అందుబాటులోకి తేనున్నాయని వివరించారు. ఈ ఎస్‌యూవీని మహీంద్రా ప్లాట్ఫార్మ్పై తయారు చేస్తామని, ఇరు కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల కింద ఈ ఎస్‌యూవీలను సొంతంగా విక్రయిస్తాయని తెలిపారు. ఇరు కంపెనీల ఉద్యోగుల మధ్య సహకారం కొనసాగుతుందని, మూడేళ్ల పాటు కలసి పనిచేస్తామని గోయెంకా తెలిపారు. యుటిలిటి వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ దృష్టిపెట్టాల్సిన కీలక అంశాలని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను అందిస్తామని వివరించారు. -
పెరగనున్న కొత్త మోడల్ కార్ల ధరలు
న్యూ ఢిల్లీ : స్వీడిష్ కార్ల కంపెనీ వోల్వో తన కార్లన్నింటి ధరలను 5శాతం మేర పెంచనునన్నట్లు ప్రకటించింది. 2018 కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని పెంచినందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 2018 బడ్జెట్లో కేంద్రం సీకేడీ, సీబీయూ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 5శాతం పెంచింది. దీంతో సీకేడీ దిగుమతులపై విధించే పన్ను 15 శాతం, సీబీఐ దిగుమతులపై విధించే పన్ను 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న వోల్వో కార్లన్ని సీకేడీ లేదా సీబీయూ విభాగానికి చెందినవే కావడంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ధరలు పెరిగాయి కదాని వినియోగదారులేమీ బాధపడాల్సిన పనిలేదని, పాత ధరల్లోనే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కారును కొనుగోలు చేసుకోవచ్చని తెలిసింది. ఈ పెరిగిన ధరలు కేవలం భారత్‌లోకి దిగుమతి అయ్యే కొత్త మోడల్ కార్లకే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ, బీఎమ్‌డబ్య్లూ, ఆడీ క్యూ3 మాదిరిగానే భారత్‌లో వోల్వో తన ఎస్యూవీ, యక్స్‌సీ40లను కూడా ప్రారంభించనుంది. ఫోర్డ్, స్కోడా కూడా... దిగుమతి సుంకం పెరిగిన నేపథ్యంలో ఫోర్డ్, స్కోడా కంపెనీలు కూడా వాటి కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. స్కోడా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా 1 శాతం నుంచి ధరలను పెంచుతోంది. ఫోర్డ్ కూడా ఎప్పటి మాదిరిగానే తన కార్ల ధరలను 4శాతం పెంచేసింది. ఈ పెంచిన ధరలు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. -
ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోర్డ్ భారీ పెట్టుబడులు
న్యూయార్క్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ దూకుడు పెంచింది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో భారీ పెట్టుబడులు పెడుతోంది. రాబోయే యేళ్లలో మరిన్ని హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. 2022 నాటికి 40 హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లను ఉత్పత్తి చేస్తామని డెట్రాయిట్ ఆధారిత సంస్థ ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ చెప్పారు. సుమారు 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టునున్నట్టు ఆదివారం వెల్లడించారు. దీంతో తమ పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నారు. అయితే వినియోగదారులు తమతో ఉంటారా లేదా అనేదే పెద్ద ప్రశ్న ఉన్నప్పటికీ, సమాధానం మాత్రం సానుకూలంగా ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 16 ఎలక్ట్రిక్ , 24 హైబ్రిడ్ వాహనాలను జోడించాలని యోచిస్తోంది., 2020 నాటికి తమ హైబ్రిడ్ ఎఫ్-150 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంటుందని 2018 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో కంపెనీ వెల్లడించింది. -
జనవరి నుంచి ఆ కార్లు కాస్ట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార్ల కొనుగోలుదారులపై అధిక భారం పడనుంది. పలు కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా జనవరి నుంచి తమ కార్ల మోడల్స్ ధర 4 శాతం వరకూ పెరుగుతుందని ఫోర్డ్ ఇండియా వెల్లడించింది. కమోడిటీ ధరలతో పాటు ముడిపదార్ధాల ధరలు, రవాణా వ్యయం పెరగడంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన న్యూ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సహా అన్ని ఫోర్డ్ ప్రోడక్ట్‌ల ధరలు పెరుగుతాయని చెప్పారు. భారత్‌లో ఫోర్డ్ ప్రస్తుతం రూ 4.8 లక్షల విలువైన ఫిగో నుంచి ఐకానిక్ స్పోర్ట్స్ కార్ మస్టాంగ్ (రూ 71.62 లక్షలు)వరకూ పలు కార్లను విక్రయిస్తోంది. -
ఫోర్డ్‌కు ఝలక్ : రీకాల్ చేయాల్సిందే
వాషింగ్టన్ : ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్‌కు అమెరికాలో చుక్కెదురైంది. లోపభూయిష్టమైన ఎయిర్‌బ్యాగ్‌తో ఉన్న మూడు మిలియన్ల వాహనాలకు అదనపు పరీక్ష నిర్వహించడానికి, రీకాల్ ప్రక్రియను ఆలస్యం చేస్తామంటూ ఫోర్డ్ మోటార్ వేసిన పిటిషన్‌ను అమెరికా జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రతా నిర్వహణ తిరస్కరించింది. టకాటా ఎయిర్‌బ్యాగ్ లోపంతో ఫోర్డ్ మోటార్ ఈ రీకాల్ ప్రక్రియను చేపడుతోంది. కార్లు, ట్రక్కుల్లో ఉన్న అధిక శక్తితో టకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్ఫ్లేటర్లు పేలిపోతున్నాయని విచారణలో వెల్లడైంది. ఈ పేలుళ్లతో ప్రపంచవ్యాప్తంగా 18 మరణాలు సంభవించగా.. 180 మంది గాయాలు పాలయ్యారు. టకాటా కార్పొరేషన్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్‌ల్లో లోపాల వల్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టకాటా ఎయిర్‌బ్యాగ్‌లను వాడుతున్న కార్ల సంస్థల్లో సుమారు 19 కార్ల సంస్థలు రీకాల్ ప్రక్రియను చేపట్టాయి. అదేవిధంగా మాజ్డా మోటార్ కంపెనీ వేసిన ఇదే పిటిషన్‌ను కూడా ఎన్హెచ్టీఎస్ఏ తిరస్కరించింది. ఫోర్డ్, మాజ్డా ఫిర్యాదులపై ఎన్హెచ్టీఎస్ఏ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు డిసెంబర్ 18 వరకు స్పందించవచ్చని మాజ్డా తెలిపింది. ఏజెన్సీ నిర్ణయంపై ఇంకా ఫోర్డ్ మోటార్ స్పందించలేదు. ఎయిర్‌బ్యాగ్స్‌లో లోపాల వల్ల నిస్సాన్ కూడా 5 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. మొత్తంగా ఆటో కంపెనీలు 2019 వరకు 125 మిలియన్ వాహనాలను రీకాల్ చేసే అవకాశముందని టకాటా తెలిపింది. -
ఫోర్డ్ నుంచి కొత్త ఎకోస్పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్డ్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు(గురువారం) లాంచ్ చేసింది. రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల రేంజ్లో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ వేరియంట్ 1.5 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉండగా.. దీని ధర రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల వరకు ఉంది. డీజిల్ ఆప్షన్లో అంతకముందటి మోడల్ మాదిరే ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.8.01 లక్షల నుంచి రూ.10.67 లక్షల రేంజ్లో ఉంది. ఇది లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ కొత్త ఎకోస్పోర్ట్ భారతీయ మార్కెట్‌కున్న తమ నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందని ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. 2013లో ఈ మోడల్‌ను తొలుత లాంచ్ చేసినప్పటి నుంచి 60-65 శాతం ఉన్న స్థానికత స్థాయిలను 85 శాతం వరకు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న మోడల్ ధరలను అదేవిధంగా ఉంచనున్నట్టు చెప్పారు. ఈ కొత్త ఎకోస్పోర్ట్‌లో 1600 మార్పులను ఫోర్డ్ చేపట్టింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీ, స్టాండర్డ్ ఈక్విప్మెంట్లతో దీన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను ఫోర్డ్ ఇండియా ఆపివేసింది. భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో ప్యాసెంజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న కంపెనీగా ఫోర్డ్ ఉందని మెహ్రోత్రా తెలిపారు. -
ఎం అండ్ ఎం, ఫోర్డ్ జట్టు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), ఫోర్డ్ మోటార్ మళ్లీ తాజాగా చేతులు కలిపాయి. ప్రొడక్టు డెవలప్మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్స్, దేశవిదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ వంటి పలు అంశాలకు సంబంధించి ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫోర్డ్ మోటార్, ఎం అండ్ ఎం కంపెనీలు తాజా ఎంవోయూలో భాగంగా మొబిలిటీ ప్రోగ్రామ్స్, కన్సెప్ట్ వెహికల్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకోనున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మూడేళ్లపాటు కొనసాగుతుందని ఇరు కంపెనీలు తెలిపాయి. ‘ఇదివరకు ఫోర్డ్ మోటార్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం పునాదులపైనే తాజా ఒప్పందం కుదిరింది. దీని వల్ల ఇరు కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది’ అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ‘భారత్ తమకు ప్రధాన మార్కెట్. వినియోగదారులకు ఉత్తమమైన వాహనాలను, సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది’ అని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ జిమ్ ఫార్లీ తెలిపారు. 1990లలో ఇరు సంస్థలు సమాన వాటాలతో మహీంద్రా ఫోర్డ్ ఇండియా అనే జాయింట్ వెంచర్‌ను నెలకొల్పాయి. ఆతర్వాత మహీంద్రా దాని నుంచి బయటకు వచ్చేసింది. -
మూడేళ్లలోనే ఫోర్డ్ ఆయన్ని దించేసింది
ఫోర్డ్ మోటార్ కంపెనీ మూడేళ్లలోనే తన సీఈవో మార్క్ ఫీల్డ్స్ ను పదవి నుంచి దించేసింది. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై విసుగెత్తిన ఫోర్డ్ మోటార్, మార్క్ ఫీల్డ్స్ స్థానంలో జిమ్ హాకెట్ ను కంపెనీ కొత్త సీఈవోగా, అధ్యక్షుడిగా నియమించింది. స్టాక్ ఫర్ ఫార్మెన్స్, లాభాలు నిరాశపరుస్తుండటంతో ఇటీవల షేర్ హోల్డర్స్ ను కంపెనీ బోర్డుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017 ప్రారంభం నుంచే మార్క్ ఫీల్డ్స్ ను మార్చే ప్రక్రియను బోర్డు చేపట్టిందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆటో పరిశ్రమ ట్రాన్స్ ఫర్మేటివ్ దశలో ఉందని, ఈ దశలో కంపెనీకి సరియైన సీఈవో జిమ్ హాకటేనని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీల్డ్స్ 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫోర్డ్ మోటార్ స్టాక్ ధర కనీసం 40 శాతం మేర పడిపోయింది. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు గత కొంతకాలంగా మండిపడుతూనే ఉన్నారు. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. -
మారుతీ కొత్త డిజైర్ సందడి
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘డిజైర్’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5.45 లక్షలు–రూ. 9.41 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్ యాస్సైర్, ఫోక్స్‌వ్యాగన్ అమియోలకు గట్టిపోటీనిస్తుందని విళ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్ల ధరలు కూడా రూ.4.7 లక్షలు–రూ.8.41 లక్షల మధ్యలోనే ఉన్నాయి. ‘డిజైర్ మోడల్‌ను భారత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించాం. అనతికాలంలోనే ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఇది అత్యంత పాపులర్ బ్రాండ్ స్థాయికి ఎదిగింది. యువతను, సెడాన్ కస్టమర్ల కోసం ఇప్పుడు ఇదే మోడల్లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చాం’ అని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. కొత్త డిజైర్ మోడల్‌కు సంబంధించి కంపెనీకి ఇప్పటికే 33,000 యూనిట్లకు గానూ బుకింగ్స్ అందాయని పేర్కొన్నారు. కాగా కంపెనీ తన సప్లయర్స్‌తో కలిసి ఈ మోడల్‌పై రూ.1,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. ప్రత్యేకతలు కొత్త డిజైర్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్ వెర్షన్ లీటర్‌కు 28.4 కిలోమీటర్ల మైలేజ్‌ను, పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. మారుతీ ఇప్పటిదాకా దేశంలో 14 లక్షల యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. డిజైర్ మోడల్‌ను 2008 మార్చిలో మార్కెట్లోకి వచ్చింది. ఎంట్రీ సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ ఆధిపత్యానికి డిజైర్ మోడలే ప్రధాన కారణం. -
ఆ ఆటో దిగ్గజంలోనూ ఉద్యోగాలు కట్
మిచిగాన్ : టెక్ దిగ్గజంలోని ఉద్యోగాల కోత ఇప్పుడు ఆటో కంపెనీలకు పాకినట్టుంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ కూడా తమ స్టాఫ్ కు కోత పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని వాల్ స్ట్రీట్ తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంట లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది. అలాన్ ములల్లిని రీప్లేస్ చేస్తూ ఫోర్డ్ సీఈవోగా మార్క్ ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36 శాతం పడిపోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డు సభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. ఈ ప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఫోర్డ్ కంపెనీలో 201000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,01,000 మంది నార్త్ అమెరికాలోనే ఉన్నారు. -
ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!
ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్, తన పాపులర్ మోడల్స్ లో స్పోర్ట్స్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాపులర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్, హ్యాచ్ బ్యాక్ కౌంటర్ఫార్ట్ ఫోర్డ్ ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్స్ ను సోమవారం లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ ట్రిమ్స్ లలో రెండింట్లో ఈ రెండు కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వేరియంట్ ధర 6.31 లక్షల నుంచి, డీజిల్ మోడల్ ధర 7.21 లక్షల మధ్యలో ఉంటుంది. ఫోర్డ్ ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ పెట్రోల్ ట్రిమ్ ధర 6.50 లక్షలు, ఆయిల్ బర్నర్ ధర 7.60 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రంగును ఎంపికచేసుకునే దాన్ని బట్టి బ్లాక్ లేదా వైట్ రూఫ్, బ్లాక్ లేదా వైట్ లో అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్‌ను కంపెనీ ఫిగో స్పోర్ట్స్ కారుకు అమర్చింది. 15 అంగుళాల అలాయ్ వీల్స్, బ్లాక్ రంగుల్లో ఉండే ఇంటీరియర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ స్టీరింగ్ వీల్ బెజిల్ వంటివి ఈ కారును అలరించనున్నాయి. అదేవిధంగా లెదర్ తో రూపొందిన స్టీరింగ్ వీల్‌ను రెడ్ కాంట్రాక్ట్స్ తో స్ట్రిక్చింగ్ చేశారు. సీట్లు కూడా రెడ్ స్ట్రిక్చింగే. దీని మాదిరిగానే ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ కూడా ఉండనుంది. ఫిగోకు అమర్చిన మాదిరే ఒకే రకమైన ఇంజిన్లు దీనికి ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ మొత్తం బ్లాక్ గా ఉంటుంది. దాంతో పాటు బ్లాక్ హెడ్‌ల్యాంప్స్ బెజిల్స్. 15 అంగుళాల సిల్వర్ అలాయ్ వీల్స్, బ్లాక్ ఇంటీరియర్స్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్, సీట్లు గ్రే రంగుల్లో స్ట్రిక్చింగ్ దీనిలో మిగతా డిజైన్ ఫీచర్లు. ఈ రెండు కార్లు కేవలం మాన్యువల్ ట్రాన్సమిషన్తోనే అందుబాటులో ఉన్నాయి. -
ఫోర్డ్ కార్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా దేశంలో తాను విక్రయించే అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనుంది. ఈ పెంపు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుందని, పెరిగిన ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫిగో హచ్‌బ్యాక్ నుంచి మస్టంగ్‌సెడాన్ వరకు ఎన్నో మోడళ్లను కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తమ కార్ల ధరలను మోడళ్లను బట్టి రూ.10,000 వరకు పెంచుతున్నట్టు హోండాకార్స్ ఇండియా సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం పెంచుతున్నట్టు జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సైతం ప్రకటించింది. -
‘ఇది నా వాలెంటైన్ ’
భారత క్రికెటర్ కరుణ్ నాయర్ కొత్త కారు కొన్నాడు.. కొంటే కొన్నాడు ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం. భారత టెస్టు చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఈ కర్ణాటక స్టార్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతడు చేసిన పరుగులు 303. సరిగ్గా ఇదే నంబర్‌ను తను ముచ్చటగా కొనుకు్కన్న ఫోర్డ్ మస్టాంగ్ కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో కనిపించే ఇంగ్లిష్ అక్షరాలో్లనూ విషయం ఉంది. కేఏ అంటే కర్నాటక మాత్రమే కాదు.. కరుణ్ పేరులో మొదటి రెండక్షరాలు కూడా.. ఇక జిల్లా కోడ్‌కు సంబంధించిన దాంట్లో ఎన్ ఏ అక్షరాలున్నాయి. అంటే నాయర్లో తొలి రెండు అక్షరాలు కలిసివస్తున్నాయి. ఇలా తను సాధించిన అత్యదు్భత ఇన్నింగ్స్‌కు గుర్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ కారు ఫొటోను ట్వీట్ చేసిన కరుణ్ ‘ఇది నా వాలెంటైన్ ’ అని చెప్పడం విశేషం. -
ఫోర్డ్ కంపెనీ ‘మిస్–డైరెక్షన్స్’ టీవీసీ
హైదరాబాద్: ఫోర్డ్ కార్ల కంపెనీ ‘మిస్–డైరెక్షన్స్’ పేరుతో కొత్త టెలివిజన్ కమర్షియల్(టీవీసీ)ను ప్రసారం చేస్తోంది. ఫోర్డ్ కార్ల నిర్వహణ ఖరీదైన వ్యవహారమంటూ వస్తున్న అపోహలను తొలగించడానికి ఈ కొత్త టీవీసీని రూపొందించామని ఫోర్డ్ ఇండియా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి ఫోర్డ్ ఇకో స్పోర్ట్ కారు వార్షిక నిర్వహణ వ్యయం రూ.1,483 మాత్రమేనని ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) రాహుల్ గౌతమ్ పేర్కొన్నారు. ఫోర్డ్ కార్ల నిర్వహణ చౌకగా ఉండేందుకు తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని వివరించారు. తమ ఫోర్డ్ ఇండియా వెబ్సైట్లో సర్వీస్ ప్రైస్ కాలుక్యులేటర్, పార్ట్స్ ప్రైసింగ్ తదితర వివరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ టీవీసీని సినిమాల్లో విలన్లుగా నటించే ప్రముఖ నటీ, నటులు ప్రకాశ్‌రాజ్, గుల్షన్ గ్రోవర్, సుధా చంద్రన్‌లతో గ్లోబల్ టీమ్ బ్లూ రూపొందించిందని వివరించారు. -
ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. ‘ప్లాటినమ్ ఎడిషన్’
ప్రారంభ ధర రూ.10.39 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్’ తాజాగా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ప్లాటినమ్ ఎడిషన్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.39 లక్షలు–రూ.10.69 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ లీటర్‌కు 22.27 కిలోమీటర్ల మైలేజ్‌ను.. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లీటర్‌కు 18.88 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.10.39 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.10.69 లక్షలుగా ఉందని తెలిపింది. ఇందులో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ డిజైన్, బ్లాక్ రూఫ్, 17 అంగుళాల పెద్ద వీల్స్, శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నట్లు వివరించింది. -
సుమారు 7లక్షల ఫోర్డ్ కార్లు...
ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్ భారీ ఎత్తున సెడాన్ కార్లను రీకాల్ చేస్తోంది. సీట్ బెల్ట్ ఫంక్షనింగ్ లో సమస్య కారణంగా అమెరికా, ఉత్తర అమెరికాలో సుమారు 680,000 వాహనాలు వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారంవెల్లడించింది. ప్రమాదంలో సంభవించినపుడు సీటు బెల్టులు సరిగా పనిచేయకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. 2013-16 ఫోర్డ్ ఫ్యూజన్, 2015-16 ఫోర్డ్ మోండో, మరియు 2013-15 లింకన్ ఎంకేజే మోడల్ కార్లు ఉన్నట్టు కంపెనీ చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా అధిక ఉష్ణోగ్రతల్లో సరిగా పనిచేయని సీటు బెల్టు సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్లను రీకాల్ చేసింది. ప్రమాదం సమయంలో సీటు బెల్ట్, ఎయిర్ బ్యాగ్ సమన్వయం లోపం కారణంగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. -
చరిత్రలో తలకిందులైన అంచనాలు
ఇప్పటి నుంచి సరిగ్గా వందేళ్ల తర్వాత అంగారక గ్రహంపై మానవులు సుస్థిర నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తారని 'స్పేస్ఎక్స్' సీఈవో ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ఆ దిశగా అప్పుడే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వందేళ్ల తర్వాత ఆయన అంచనా నిజం అయితే దూరదృష్టి గల జీనియస్ అని, ప్రముఖ కాల్పనికుడని కీర్తిస్తారు. ఆయన అంచనా నిజం కాకపోనూ వచ్చు. ఇలా చరిత్రలో తలకిందులైన అంచనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని... 1903లో.. ఆటోమొబైల్ రంగానికి పురోగతి లేదని, ఎప్పటికైనా మానవుడికి గుర్రపు బగ్గీలే దిక్కని అప్పుడే కొత్తగా ఏర్పాటైన హెన్రీ ఫోర్డ్ కంపెనీ న్యాయవాదితో మిచిగాన్ సేవింగ్స్ బ్యాంక్ అధ్యక్షుడు వాదించారు. హŸరేస్ రాకమ్ ఆయన మాటలను వినిపించుకోకుండా ఫోర్డ్ కంపెనీలో తన ఐదువేల డాలర్ల పెట్టుబడిని 1.25 కోట్ల డాలర్లకు పెంచారు. ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెల్సిందే. 1911లో.. త్వరలోనే ఆల్కమీ (ఓ ఖనిజాన్ని బంగారంలోకి మార్చడం) విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ట్రక్కు నిండా ఉన్న ఇనుప కడ్డీలను స్వచ్ఛమైన బంగారంగా మార్చడం చాలా సులువని థామస్ ఎడిసన్ అంచనా వేశారు. ఆయన అంచనా ఇప్పటికీ నెరవేరలేదు. 1912లో.. వైర్లెస్ టెలిగ్రామ్ యుగంలోకి మానవుడు అడుగుపెడుతున్నందున ఇక యుద్ధాలనేవే జరగవని, దేశాల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉండదు కనుక యుద్ధాలు వచ్చే ఆస్కారమే లేదని గుగ్లీ ఎల్మో మార్కోని అంచనా వేశారు. ఆయన ఊహించిన దానికన్నా కమ్యూనికేషన్ల వ్యవస్థ మరింత బలపడినా, యుద్ధాలు సమసిపోలేదనే విషయం మనకు తెలిసిందే. 1920లో.. భూ వాతావరణాన్ని దాటుకొని ఏ రాకెట్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించలేదని, ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక అభిప్రాయపడింది. 1969లో అపోలో 11 అంతరిక్షనౌక చంద్ర మండలంపైకి ప్రయాణించిన విషయం తెల్సిందే. 1955లో.. అణు విద్యుత్‌తో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు పదేళ్లలో మార్కెట్లోకి వస్తాయని లెవిట్ వాక్యూమ్ కంపెనీ అధ్యక్షుడు అలెక్స్ లెవిట్ అంచనా వేశారు. రాలేదు కదా! 1966లో.. 1999 నాటికి మనిషి నడుము బెల్టులకు కట్టుకునే రాకెట్లు వస్తాయని, వాటితో విహరించవచ్చని, ఆకాశంలో ప్రయాణించే కార్లు వస్తాయని, వాతావరణాన్ని సానుకూలంగా నియంత్రించే అద్దాల డోమ్‌ల కింద నగరాలు వెలుస్తాయని రీడర్స్ డైజెస్ట్ మాగజైన్ అంచనా వేసింది. మానవుడు రాకెట్ లేదా విమానాల లాంటి చిన్న పరికరాలపై గాల్లో ఎగరడం, ఆకాశంలో ప్రయాణించే కార్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. వాతావరణాన్ని నియంత్రించే డోమ్‌లు నగరాలపై రాలేదు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే ఆలాంటి గ్లాస్ డోమ్‌లు అవసరం అవుతాయేమో! 1977లో.. ఇంటికో కంప్యూటర్ కోరుకునే ప్రసక్తే రాదని డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు కెన్ ఓస్లెన్ భావించారు. ఎందుకంటే అప్పట్లో ఆయన కంపెనీ కంప్యూటర్లు చిన్న ఇల్లుకంటే పెద్దగా ఉండేవి. 1995లో.. ఏడాదిలో ఇంటెర్నెట్ విస్తరించి సూపర్నోవాలాగా పేలిపోతుందని ఈథర్నెట్ కేబుల్ వ్యవస్థాపకులు రాబర్ట్ మెట్కాఫ్ అంచనా వేశారు. ఎందుకంటే ఆయన కేబుల్ భవిష్యత్తులో అవసరమైన డేటాను ఇముడ్చుకునే అవకాశం లేదని ఆయన భావించారు. 1997లో.. మార్కెట్లో గ్యాడ్జెట్ మేకర్లను తట్టుకోలేక హార్డ్‌వేర్ గేమ్ నుంచి త్వరలోనే నిష్క్రమిస్తావని ప్రముఖ ఆపిల్ కంపెనీని 'వైర్డ్ మేగజైన్' హెచ్చరించింది. ఆ తర్వాత నాలుగేళ్లలోనే వెయ్యి పాటల గ్యాడ్జెట్లను ఆపిల్ కంపెనీ మన జేబుల్లో పెట్టింది. ఇప్పుడా కంపెనీ ఏ స్థాయిలో ఉందో మనకు తెల్సిందే. -
భారీగా తగ్గిన ఫోర్డ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: ఒక వైపు ప్రముఖ కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను అమాంతం పెంచెస్తే అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్ కంపెనీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫోర్ట్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో భారత్ లో కార్ల అమ్మకాలను పెంచుకొనే వ్యూహంలో భాగంగా కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్, ఫిగో హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కార్లను భారీగా తగ్గించింది. సుమారు రూ .25,000 నుంచి రూ 91,000 వరకు ధరల్లో కోత పెట్టింది. సవరించిన ధరలు కింద, ఫోర్డ్ కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్ ఇప్పుడు 1.2 లీటర్ పెట్రోల్ మోడల్ రూ 5.76 లక్షలు, డీజిల్ రూ 6.8 లక్షల పరిధిలో అందుబాటులోకి రానుంది. అదేవిధంగా, ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం మోడల్ పెట్రోల్ వేరియంట్ రూ .25,000 తగ్గి 6.80 లక్షలు, డీజిల్ రూ 91,000 వరకు ధర తగ్గి రూ 7.89 లక్షలకు అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ ఫిగో ఇప్పుడు రూ 29,000 నుంచి రూ 30,000 వరకు ధర తగ్గింపు తర్వాత రూ 4.54 లక్షలు, రూ 6.29 లక్షల రేంజ్లో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్ మోడల్ ఇప్పుడు రూ .50,000 తగ్గి రూ 5.63 లక్షల నుంచి రూ 7.18 లక్షలగా ఉండనుంది. రెండు టాప్ ఎండ్ వెర్షన్లు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త ధరలు తక్షణమే అమలవుతాయని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరలు పునరేకీకరణకు తో ఫిగో మరియు ఆస్పైర్ మోడల్స్ ను వినియోగదారులకు మరింత చేరువ చేయనున్నట్టుఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. కాగా మార్చిలో ఇంతకు ముందు, ఫోర్డ్ ఇండియా రూ 1.12 లక్షల వరకు ధరలు తగ్గించింది. అనంతరం మారుతి సుజుకి ధర రూ 6.99 లక్షల కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజాను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఫోర్ట్ అమ్మకాల్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో డౌన్ స్వల్పంగా 1 శాతం మేర క్షీణించగా, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో జనవరి-జూన్ కాలంలో 17 శాతం తగ్గాయి. రెండు టాప్ కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ రూ 20,000 వివిధ మోడళ్ల ధరల పెంపుపై ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆయకట్టు.. కనికట్టు
అంతంతగానే ఆయకట్టున్నా.. అధిక వ్యయం నీటి పారుదల శాఖలో జిమ్మిక్కులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : చిన్న నీటి చెరువుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఏళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోని చెరువులను మరమ్మతు చేసి, పూర్తి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. జిల్లాలో మొత్తం 1,491 చెరువులున్నాయి. ఇందులో మొదటి విడతలో 20 శాతం అంటే 605 చెరువులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయా చెరువుల ఆయకట్టు.. మరమ్మతుకు వెచ్చించాల్సిన నిధుల అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే.. ఈ చెరువుల ఆయకట్టు లెక్కల్లో అధికారులు జిమ్మిక్కులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అంతంత మాత్రం ఆయకట్టు ఉన్న చెరువులను కూడా వందల ఎకరాలుగా చూపి, అంచనా వ్యయాలను పెంచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజాధనం రూ.లక్షల్లో ఖర్చయినా, ఆయా చెరువుల పనులతో ప్రయోజనం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు పెరిగిన ఈ అంచనాలు కాంట్రాక్టర్లకు భారీగా కలిసొచ్చేలా చేసిందనే విమర్శలూ ఉన్నాయి. బినామీలే గుత్తేదార్లు..? మిషన్ కాకతీయ పథకం చెరువులంటే అధికార పార్టీ నేతలే పనులు చేస్తుండటం సాధారణం. కానీ.. కొన్ని మండలాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారుల బినామీలే గుత్తేదార్ల అవతారమెత్తారనే ఆరోపణలున్నాయి. తమ సమీప బంధువులతో చెరువుల పనులు చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఆయా చెరువుల పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయనే విమర్శలున్నాయి. ఈ విషయం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావనకు వస్తే.. ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు డిపాజిట్ డీడీల కోసం డబ్బులు అత్యవసరం పడితే సర్దుబాటు చేశామే తప్ప, తాము ఎలాంటి కాంట్రాక్టు పనులు చేయడం లేదని.. సదరు అధికారులు సర్ది చెప్పుకున్నట్లు సమాచారం. అలాగే ఆయా చెరువుల పనుల నివేదికల్లోనూ అధికారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. చిన్న చిన్న పనులు ఇంకా మిగిలే ఉన్నప్పటికీ నివేదికల్లో మాత్రం పూర్తయినట్లు పేర్కొంటున్నారు. ఆయకట్టు పెంచలేదు.. – విఠల్, డీఈ నీటి పారుదల శాఖ మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల ఆయకట్టు పెంచే ప్రసక్తే లేదు. ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు బట్టే పనుల అంచనాలను తయారు చేశాం. తక్కువ ఆయకట్టు ఉన్నప్పటికీ ఎక్కువ వ్యయంతో పనులు చేశారనేది అవాస్తవం. -
ఫోర్డ్.. మస్టాంగ్ జీటీ వచ్చేసింది
♦ ధర రూ.65 లక్షలు ♦ గరిష్ట వేగం 250 కి.మీ./గంటకు గ్రేటర్ నోయిడా : ఫోర్డ్ కంపెనీ తన ఐకానిక్ స్పోర్ట్స్ కారు మస్టాంగ్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.65 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)అని ఫోర్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మస్టాంగ్ బ్రాండ్ 52 సంవత్సరాల చరిత్రలో భారత్‌లో మస్టాంగ్ బ్రాండ్ కారును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహరోత్రా పేర్కొన్నారు. ఈ కారును 5లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో రూపాందించామని, గరిష్టవేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లాట్ రాక్ అసెంబ్లీ ప్లాంట్‌లో తయారైన ఈ కారును పూర్తిగా తయారైన కారు రూపంలో దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని అనురాగ్ పేర్కొన్నారు. గత ఏడాది నుంచే ఈ కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించామని, మొదటి ఏడాదిలోనే 1.1 లక్షల మస్టాంగ్ కార్లను విక్రయించామని తెలిపారు. 1964 నుంచి ఇప్పటిదాకా 90 లక్షలకు పైగా మస్టాంగ్ కార్లను ఫోర్డ్ విక్రయించింది. కారు ప్రత్యేకతలు.. మస్టాంగ్లో ఆరవ జనరేషన్ కారు ఇది. ఆరు స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, స్టీరింగ్‌పై పెడల్ షిఫ్టర్స్, నాలుగు డ్రైవింగ్ మోడ్స్(నార్మన్, స్పోర్ట్ప్లస్, ట్రాక్, స్నో/వెట్ మోడ్స్), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, పోనీ ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, 19 అంగుళాల మాగ్నటిక్ గ్లోస్ పెయింట్ మెషిన్డ్ అల్యూమినియం వీల్స్, ట్రై బార్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రివర్సింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, మోకాలి దగ్గర కూడా ఎయిర్బాగ్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
రూ.65లక్షల ఫోర్డ్ కారు వచ్చేసింది
భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరవ తరం మస్టాంగ్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. అమెరికా వాహనరంగం సంస్థ ఫోర్డ్, ఐకానిక్ స్పోర్ట్స్ కారు 'మస్టాంగ్'ను రూ. 65 లక్షలకు(ఎక్స్ షోరూం ఢిల్లీలో) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 1964లో మొదలైన మస్టాంగ్ ప్రస్థానంలో, రైట్ హ్యాండెడ్ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. 5 లీటరు, వీ8 పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో, ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. టాప్ స్పీడ్ 250 కి.మీ/అవర్ గా ఉంది. మస్టాంగ్ ను ఆరు కలర్స్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. రేస్ రెడ్, బ్లాక్, ట్రిపుల్ ఎల్లో ట్రై కోట్, మాగ్నటిక్, ఆక్స్ ఫోర్డ్ వైట్, ఇంగోట్ సిల్వర్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. సిక్స్ వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, లంబర్ సపోర్టుతో ప్యాసెంజర్ సీట్లు, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, 401పీఎస్ పవర్, 515ఎన్ఎమ్ టార్క్ ఈ కారు ప్రత్యేకతలు, ప్రతిఒక్కరూ డ్రైవ్ చేసేలా కారును రూపొందించడమే తమ కమిట్ మెంట్ అని, మస్టాంగ్, కారు కంటే ఎక్కువని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్, సర్వీసు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. ఈ ఐకానిక్ కారును ప్రవేశపెట్టడానికి ఇంతకంటే సరియైన సమయం మరొకటి లేదన్నారు. అమెరికాలోని ఫోర్డ్ ఫ్లాట్ రాక్ అసెంబ్లీ ప్లాంటు నుంచి దిగుమతి చేసుకుని, మస్టాంగ్ ను భారత మార్కెట్లో అమ్మకాలు నిర్వహించనున్నారు. జనవరిలోనే ఈ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్లాన్ ను ఫోర్డ్ ప్రకటించింది. 1964 నుంచి ఫోర్డ్ 90లక్షల యూనిట్ల మస్టాంగ్ కారు మోడల్ లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.ప్రపంచవ్యాప్తంగా 2015లో 1.1లక్షల మస్టాంగ్ యూనిట్లను ఫోర్డ్ విక్రయించింది. . తెలుగురాష్ట్రాల ఐటీఐ విద్యార్థుల కోసం మోటార్ మెకానిక్ వెహికిల్ శిక్షణలో భాగంగా ముషీరాబాద్ ఐటీఐ ప్రాంగణంలో ఆటోమేటివ్ స్టూడెంట్ సర్వీసు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్(అస్సెంట్) కేంద్రాన్ని ఏప్రిల్ లో ఫోర్డ్ ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
కారు వాడుతూ.. చోరీలు..
- స్లైడింగ్ డోర్ ఉన్న లాడ్జిలు, ఇళ్లే టార్గెట్ - ఏడాది కాలంలో 14 చోట్ల దొంగతనాలు - అంతరాష్ట్ర దొంగ సహా ఇద్దరు అరెస్టు - నిందితుల్లో ఒకడు బీటెక్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్: తెల్లవారుజామున రెండు గంటలకు డెన్ నుంచి బయలుదేరడం... ఫోర్డ్ ఐకాన్ కారులో సంచరిస్తూ రెక్కీలు నిర్వహించి స్లైడింగ్ డోర్స్ ఉన్న లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు గుర్తించి అదును చూసి లోపలకు ప్రవేశించి అందినకాడికి దోచుకోవడం.. ఈ పంథాలో రెచ్చిపోతున్న ఇద్దరు దొంగల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక అంతరాష్ట్ర దొంగతో కూడిన ఈ ద్వయం ఏడాదిలో 14 చోట్ల చోరీలకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మంగళవారం తెలిపారు. వీరి నుంచి 1.45 కేజీల బంగారం, ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముంబైలో నేరబాట.. ఛత్తీస్ఘర్ లోని బస్తర్ జిల్లా జగ్దల్పూర్కు చెందిన ఆర్య ప్రతాప్ నాగ్ అలియాస్ దీపక్ మెట్రిక్యులేషన్‌తో చదువుకు స్వస్థి చెప్పాడు. సినిమాల్లో నటించాలన్న ఆశతో ముంబై చేరుకున్నాడు. కొంతకాలం డ్యాన్సులు, నటన నేర్చుకున్నా.. అవకాశాలు రాకపోవడంతో ఫాల్ సీలింగ్ నిర్మాణాన్ని జీవనాధారంగా చేసుకున్నాడు. 2013లో ఓ భవనంలో పని చేస్తున్న ఇతను ఎదురుగా ఉన్న శాటిలైట్ హోటల్లో ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో విల్లేపార్లే పోలీసులకు చిక్కి జైలు నుంచి వచ్చిన తర్వాత 2014లో అక్కడి సహార్ అంధేరీ (ఈస్ట్) ఠాణా పరిధిలో మరో లాడ్జిలోకి ప్రవేశించి ఖరీదైన సెల్‌ఫోన్ చోరీ చేశాడు. రైల్లో పరిచయంతో.. 2015లో బెయిల్ పొందిన ఇతను ఆ ఏడాది జూన్‌లో రైల్లో హైదరాబాద్‌కు వస్తుండగా ఎర్రగడ్డ భవానీనగర్‌కు చెందిన మహ్మద్ ముస్తాఫాతో పరిచయం ఏర్పడింది. బీటెక్ పూర్తి చేసిన ఇతడు సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటీరియర్ డెకరేటర్ గా పని చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న ఇతడికి ఆర్య మాటలు నచ్చడంతో జట్టు కట్టి తన ఇంటికే తీసుకువచ్చి షెల్టర్ ఇచ్చాడు. సాధారణంగా తిరుగుతూ చోరీలు చేస్తే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశంతో ఎర్రగడ్డలో ఓ సెకండ్ హ్యాండ్ ఫోర్డ్ ఐకాన్ కారును ఖరీదు చేసి అందులో తిరుగుతూ రెక్కీలు నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరి కిటికీలకు గ్రిల్స్ లేని, స్లైడింగ్ డోర్‌తో కూడిన గదుల్ని గుర్తిస్తారు. ముస్తఫా కారులోనే ఉండి పరిసరాలను గమనిస్తుండగా... ఆర్య డ్రైనేజ్ పైపు ద్వారా పైకి ఎక్కి స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలకు వెళ్లి ఏమాత్రం అలికిడి కాకుండా బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను కొట్టేసి కారులో ఉడాయిస్తారు. వీరిద్దరూ ఏడాది కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సైఫాబాద్, బేగంపేట, మార్కెట్, గోపాలపురం, సుల్తాన్‌బజార్, మియాపూర్ ఠాణాల పరిధిలోని ఏడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఏడాదిలో ఒకే తరహాలో 14 చోరీలు చేసిన ఈ నిందితులకు సంబంధించి ఆధారాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బేగంపేటలోని ట్రీబూ ట్రాన్సిట్ హోటల్లో దొరికింది. ఈ ఏడాది అక్కడ చోరీ చేసిన ఆర్య సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాడు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని ముస్తఫా, ఆర్యలను అరెస్టు చేశారు. ఈ నిందితులపై పీడీ యాక్ట్‌కు సిఫార్సు చేస్తామని, తదుపరి దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టి రిసీవర్‌పై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. -
మార్కెట్లోకి ఫోర్డ్ న్యూ ఎకో స్పోర్ట్
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా కొత్త కంపాక్ట్ సెడాన్ ఎస్ యూవీ ఎకో స్పోర్ట్ ను గురువారం మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీని ధర రూ.8.58లక్షల నుంచి రూ.9.93లక్షల మధ్య ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. మూడు వేరియంట్లు ట్రెండ్ ప్లస్, టైటానియం, టైటానియం ప్లస్ లో ఈ వెహికిల్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్, 1.5 లీటరు డీజిల్ ఇంజీన్, 1.0 లీటర్ ఎకోబూస్ట్ ఇంజీన్ సామర్థ్యాలతో ఈ వేరియంట్లను రూపొందించామని ఫోర్డ్ తెలిపింది. అన్నీ బ్లాక్ ఎక్స్ టీరియర్స్ తోనే ఈ బ్లాక్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. బ్లాక్ గ్రిల్స్, బ్లాక్ ఔట్ మౌల్డెడ్ హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల బ్లాక్ అలాయ్ వీల్స్, బ్లాక్ మిర్రర్ కవర్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ బెజిల్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, రూఫ్ క్రాస్ బార్స్ తో ఈ బ్లాక్ ఎడిషన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. -
ఫోర్డ్ మస్టాంగ్ జూలైలో మార్కెట్లోకి..
♦ 2017కల్లా 30 అస్సెట్ సెంటర్లు ♦ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్డ్ తయారీ మస్టాంగ్ కారు త్వరలో భారత్‌లో పరుగు తీయనుంది. 1964లో మొదలైన మస్టాంగ్ ప్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5 లీటర్ వి8 ఇంజన్‌తో 4 సీట్లతో రూపొందిన ఈ కారు ఆరు రంగుల్లో లభిస్తుంది. ధర రూ.60-80 లక్షలు ఉండొచ్చు. భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరవ తరం మస్టాంగ్ కారు జూలైలో రోడ్డెక్కనుంది. తొలిసారిగా రైట్ హ్యాండెడ్ మోడల్‌ను కంపెనీ ప్రవేశపెడుతుండడం విశేషం. మూడు నెలల్లో ఇక్కడి రోడ్లపైకి మస్టాంగ్ దూసుకెళ్లే అవకాశం ఉందని ఫోర్డ్ ఇండియా కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.ప్రభు తెలిపారు. శుక్రవారమిక్కడ ముషీరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో ఆటోమోటివ్ స్టూడెంట్ సర్వీస్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (అస్సెట్) కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. సుశిక్షితులైన సిబ్బంది: అసెట్ కేంద్రాల్లో ఐటీఐ విద్యార్థులకు మోటార్ మెకానిక్ వెహికిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కోర్సు పూర్తి అయితే ఫోర్డ్ సర్వీసింగ్ కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు ఉపాధి కూడా కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ముషీరాబాద్ ఐటీఐలో అస్సెట్ కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో కంపెనీకి దేశంలో ఇలాంటి సెంటర్ల సంఖ్య 8కి చేరుకుంది. డిసెంబర్‌కి మరో 7 కేంద్రాలు రానున్నాయి. 2017లో 15 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభు తెలిపారు. ‘ఒక్కో అసెట్ సెంటర్‌కు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి రెండు వారాలకు ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నాం. పెద్ద నగరాల్లో అయితే వర్క్‌షాప్‌కు కనీసం 25-30 మంది మెకానిక్‌లు అవసరం. 2016లో 600 మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు. -
టెస్లా కారును సొంతం చేసుకున్న ఫోర్డ్
టెస్లా మోటార్స్ ఇంక్ తయారు చేసిన మొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో ఒకటైన మోడల్-ఎక్స్ ఫ్యాక్టర్ కు ఫోర్డ్ మోటారు దాదాపు కోటి 32 లక్షలకు సొంతం చేసుకుంది. స్ట్రికర్ ధర కంటే 55 డాలర్లు అధికంగా 1,99,950 డాలర్లకు(దాదాపు కోటి 32లక్షలకు పైగా) మోడల్ ఎక్స్ ను కొనుగోలు చేసింది. వెహికిల్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. టెస్లా ఫ్యాక్టరీ, కాలిఫోర్నియాలో తయారు చేసిన వాహనాల్లో ఇది 64వ కారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం ఫోర్డ్ ఈ కారును మార్చి 1న కొనుగోలు చేసింది. ఆటోమేకర్లు తమ పోటీదారులు తయారుచేసిన వాహనాలను రోడ్ టెస్టింగ్ లకు, కాంపోనెంట్స్, మెటిరీయల్స్ ఎలా అమర్చారో తెలుసుకోవడం కోసం కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవు. మొదటిసారి ఫోర్డ్ మోటార్ ఇంత మొత్తంలో మోడల్ ఎక్స్ కు చెల్లించింది. ఆటోమేకర్లు ఎక్కువగా అధిక లాభాలనిస్తూ, ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ కలిగి ఉన్న ఎస్ యూవీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆటో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విద్యుద్దీకరణ కార్ల కోసం ఫోర్డ్ ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. 2020 కల్లా 13 విద్యుత్ కార్లను మార్కెట్లోకి తేవాలనుకుంటున్నట్టు సమాచారం. దీంతో మార్కెట్లోకి మరిన్ని విద్యుత్ కార్లు రానున్నాయి. తమ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ ను ఎక్కువగా మార్కెట్లోకి తేవడం కోసం ఫోర్డ్ మార్కెట్లోకి వచ్చే అన్నీ కార్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. -
యువతకు 'ఫోర్డ్' మంచి అవకాశం!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రతిభగల టెక్నీషియన్లను దేశానికి అందించేందుకు మరో అడుగు వేసింది. మనేసర్ లో ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నైపుణ్యంగల టెక్నీషియన్ల సృష్టికి ప్రయత్నాలు ప్రారంభించింది. టెక్నికల్ ట్రైనింగ్ ఐఎన్ సీ (టీటీఐ) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని ఫోర్డ్ కంపెనీ మానేసర్ లోని 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరింపజేసింది. ఏడాదికి 13,500 రోజులకు పైగా ప్రత్యేక సాంకేతిక శిక్షణ అందించనున్నట్లు ఫోర్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త సౌకర్యంలో నైపుణ్యంతోపాటు, నాణ్యమైన ఫోర్డ్ ఉత్పత్తులు వెలువడేందుకు దోహదపడుతుందని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన స్వతంత్ర సాకేంతిక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగు ప్రాంతాల్లో బాడీ షాప్ ట్రైనింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయాలన్న ప్రత్యేక దృష్టితో మొట్టమొదటి అడుగు వేశామని మెహ్రోత్రా తెలిపారు. ఫోర్డ్ ఇండియా ఇప్పటికే భారతదేశంలోని చెన్నై, కొచ్చిన్, కొల్హాపూర్, అహ్మదాబాద్, మొహాలీ, కోల్ కతా మొదలైన ఆరు నగరాల్లో శిక్షణా కేంద్రాలు కలిగి ఉందని ఆయన తెలిపారు. -
యంగ్ ఏజ్‌లో ఓల్డ్ ఏజ్ చూడొచ్చు
మిచిగాన్: వృద్ధాప్య సమస్యలు మనకు తెలియనివికావు. వయసు మీద పడుతున్నాకొద్దీ కాళ్లు పీకుతుంటాయి. చేతులు లాగుతుంటాయి. మొకాళ్లు సలుపుతుంటాయి. నడుము వొంగదు. మెడ కదలదు. నాలుక తిరగదు. కాళ్లు ముందుకు పడవు. కాసేపు నడిస్తేనే అలసట. చేతులు సరిగ్గా ఆడవు. ముంచేతులు లాగుతుంటాయి. చూపు సరిగ్గా ఆనదు. గుడ్లు పీకుతుంటాయి. చెవులు సరిగ్గా వినిపించవు. బుర్ర సరిగ్గా పనిచేయదు. చుట్టుపక్కల గోలగోల ధ్వనులు. మొత్తంగా పరిస్థితి గందరగోళంగాను, బిత్తరబిత్తరగాను ఉంటుంది. యుక్త వయస్సులోనే ఇలాంటి పూర్తి అనుభూతులను మనకు కలిగించే ఓ సూట్‌ను ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ రూపొందించింది. కళ్లు గ్లూకోమా వచ్చినట్టు మసమసకగా కనిపించేందుకు గాగుల్స్‌ను, చెవులు సరిగ్గా వినిపించకుండా ఉండేందుకు హెడ్‌ఫోన్స్‌ను, మెడ సరిగ్గా తిరగకుండా ఉండేందుకు నెక్ బ్యాండ్‌ను, స్టిమ్యులేట్ చేయడానికి గ్లోవ్స్‌ను, కాళ్ల పిక్కలను పట్టి ఉంచేందుకు పట్టీలను రూపొందించి, వీటన్నింటితో కలిపి ఓ సూట్‌గా తయారు చేసింది. ఈ సూటను ఎవరు ధరించినా వందేళ్లకు పైబడిన వృద్ధుడిగా అనుభూతి పొందక తప్పదు. 36 ఏళ్ల రిచర్డ్ గ్రే అనే ఓ మిడియా రిపోర్టర్‌కు ఈ సూట్‌ను తొడిగి ఫోర్డ్ కంపెనీ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించింది. ఈ సూటును ధరించి రిపోర్టర్ ఓ పబ్లిక్ పార్కులో ప్రయాసపడి పరుగెత్తాడు. పైన ఉదహరించిన అనుభూతులన్నీ ఆయన అనుభవించినవే. రోజూ సునాయాసంగా పరుగెత్తే తాను ఆ సూటు ధరించాక రెండు కిలోమీటరు పరుగెత్తడం కూడా గగనమైందని, సూటు విప్పివేయగానే మళ్లీ 36 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేశానని ఆయన తన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ‘థర్డ్ ఏజ్ సూట్’ పేరు పెట్టిన ఈ సూటును కంపెనీ ఉత్పత్తుల ప్రచారకర్తగా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన 104 ఏళ్ల బ్రిటీష్ మారథాన్ రన్నర్ సిక్ ఫౌజా సింగ్‌ను మోడల్‌గా తీసుకొని రూపొందించారు. పడుచువాళ్లకు వృద్ధాప్య సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ సూటును తయారు చేయలేదు. నిజంగా వృద్ధుల సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అర్థం చేసుకొని వారికి అనుగుణంగా కార్లను, వాటిలోని డ్రైవింగ్ వ్యవస్థను రూపొందించడం కోసమే ‘ఫోర్డ్’ కంపెనీ ఈ సూటును రూపొందించింది. ఈ ప్రయోగం ద్వారానే వృద్ధులు ఇగ్నిషన్ కీ ద్వారా కార్టును స్టార్ట్ చేయలేరని భావించి, దాని స్థానంలో బటన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే కారు డోర్లు వేయడం, తీయడాన్ని మరింత సులువు చేసింది. వృద్ధులు సులభంగా కార్లను పార్కు చేసేందుకు కూడా అవసరమైన మార్పులు తీసుకొస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్లకుపైగా చరిత్ర... అమెరికాలో చక్కని జనాదరణ ఉన్న స్పోర్ట్స్ కారు ‘మస్టాంగ్’ భారతీయ రోడ్లపై పరిగెత్తడానికి సిద్ధమవుతోంది. అమెరికా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ తాజాగా ఆరవ జనరేషన్ ‘మస్టాంగ్’ను గురువారం ఆవిష్కరించింది. దీన్ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీన్ని ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఢిల్లీ ఆటో ఎక్స్పో-2016’లో ప్రదర్శించనుంది. అదిరిపోయే డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ‘మస్టాంగ్’ సొంతమని, స్టైల్, పనితీరు తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారికి ఈ కారు కచ్చితంగా సరి పోతుందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నిగెల్ హారిస్ తెలిపారు. కారు ప్రత్యేకతలు: ‘మస్టాంగ్’లో షార్ట్ రియర్ డెక్, లాంగ్ హుడ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్, వాల్వ్ ట్రైన్ అండ్ సిలిండర్ హెడ్స్‌తో కూడిన 5.0 లీటర్ శక్తివంతమైన వీ8 ఇంజిన్, ఫోర్డ్ సింక్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్ తన మాటలతో కారులోని ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను కమాండ్ చేసే వెసులుబాటు, పుష్ బటన్ స్టార్ట్, నావిగేషన్, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. 1964లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు విక్రయాలు ఇప్పటి వరకు 90 లక్షల యూనిట్లకు చేరాయని పేర్కొంది. ‘మస్టాంగ్’ కారు ప్రస్తుతం ఫాస్ట్‌బ్యాక్, కన్వర్టబుల్ అనే రెండు మోడళ్లలో అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమౌతోంది. భారత్‌లోకి ఫాస్ట్‌బ్యాక్ మోడల్ ముందుగా రానుంది. ధరను కంపెనీ ప్రకటించలేదు. రూ.50-60 లక్షల శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఫోర్డ్ నుంచి కొత్త ఎండీవర్
♦ రక్షణ కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ♦ ధర రూ.24.1-28.69 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రీమియం ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎండీవర్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. పటిష్టమైన ఉక్కుతో వాహ నాన్ని తయారు చేశారు. ప్రీమియం ఎస్‌యూవీలో తొలిసారిగా ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ను వాడారు. ఇందులో ఒకటి డ్రైవర్ సీటు ముందు మోకాలి రక్షణకోసం ఏర్పాటు చేశారు. మౌఖిక ఆదేశాల ఆధారంగా పనిచేసేలా సింక్-2 అనే వ్యవస్థ ఉంది. 10,000లకుపైగా విభిన్న ఆదేశాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. ఏడుగురు కూర్చోవచ్చు. ఫోర్ వీల్ డ్రైవ్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెమి-ఆటో ప్యారలల్ పార్క్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్‌తోపాటు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న రోడ్లలో డ్రైవర్‌ను హెచ్చరించే అడ్వాన్స్డ్ టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ఎస్‌యూవీల హవా..: భారత్‌లో ప్రీమియం ఎస్‌యూవీల మార్కెట్ ప్రస్తుతం 18,000 యూనిట్లుంది. 2024 నాటికి ఇది ఒక లక్ష యూని ట్లకు ఎగుస్తుందని ఫోర్డ్ ఇండియా డీలర్ డెవలప్మెంట్ జీఎం ఎస్.లక్ష్మీరామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త ఎండీవర్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి భారత్ నుంచి 50 దేశాలకు వాహనాలను ఎగుమతి చేయాలన్నది కంపెనీ లక్ష్యమని చెప్పారు. 2016 ఫోర్డ్‌కు ఆశాజనకంగా ఉంటుందన్నారు. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో సరికొత్త ఎండీవర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.24.1-28.69 లక్షలు ఉంది. 2.2, 3.2 లీటర్ ఇంజిన్ వేరియంట్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది లభిస్తుంది. -
ఫోర్డ్ చెన్నై ప్లాంట్ నుంచి పది లక్షల కార్లు
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ చెన్నై ప్లాంట్ నుంచి పదిలక్షలవ కారును, ఇంజిన్‌ను ఉత్పత్తి చేసింది. ఈ పదిలక్షలవ కారుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను తయారు చేశామని ఫోర్డ్ ఇండియా ఈడీ(మాన్యుఫాక్చరింగ్ ఫోర్డ్ చెన్నై వెహికల్ అసెంబ్లీ, ఇంజిన్ ప్లాంట్) బాలసుందరం రాధాకృష్ణన్ చెప్పారు. ఈ చెన్నై ప్లాంట్ తమకు అంతర్జాతీయ తయారీ కేంద్రంగా కూడా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లను ఫోర్డ్ ఇండియా తయారు చేస్తోంది. -
ఎస్యువి సెగ్మెంట్లో ఫోర్డ్ ఎండీవర్ న్యూమోడల్
-
ఫోర్డ్ నుంచి ఫిగో ఆస్పైర్
న్యూఢిల్లీ : ఫోర్డ్ ఇండియా కంపెనీ కొత్త కారు ఫిగో ఆస్పైర్ ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.4.90 లక్షల నుంచి రూ.8.24 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ నెగైల్ హారిస్ చెప్పారు. మంచి మైలేజీ, డిజైన్, తాము వెచ్చించే డబ్బుకు తగ్గట్టు విలువ ఉన్న కారు కావాలని భారతీయులు కోరుకుంటారని, దీనిని దృష్టిలో పెట్టుకునే ఫిగో ఆస్పైర్ను రూపొందించామని వివరించారు. -
టాటాను అవమానించిన ఫోర్ట్ కంపెనీ
-
అవమానించినా.. ఆదుకున్నాం!
ఫోర్డ్ నుంచి జేఎల్ఆర్ టేకోవర్‌పై టాటాల మనోగతం ముంబై: నవ్విన నాపచేనే పండటం అంటే ఇదేనేమో!! దేశీ కార్పొరేట్ అగ్రగామి టాటా గ్రూప్ తమ కార్ల వ్యాపారాన్ని విక్రయించడం కోసం 1999లో ఫోర్డ్‌ను సంప్రదిస్తే... హేళనలు, అవమానాలను ఎదుర్కొంది. అదే టాటా గ్రూప్... తొమ్మిదేళ్ల తర్వాత ఫోర్డ్ నుంచి బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)ను దక్కించుకొని ఆ సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించింది. ఈ డీల్‌ను సాకారం చేసింది అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ టాటా రతన్ టాటా(ప్రస్తుతం గ్రూప్ గౌరవ చైర్మన్). ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫోర్డ్‌తో చర్చల సందర్భంగా రతన్ టాటా బృందంలోని కీలక సభ్యుడు ప్రవీణ్ కాడ్లే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘మా కార్ల తయారీ విభాగాన్ని అమ్మడానికి 1999లో డెట్రాయిట్‌లోని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లను కలిశాం. రతన్‌టాటాతో పాటు నేను కూడా ఆ సంప్రదింపుల టీమ్‌లో ఉన్నా. ఆ భేటీలో ఫోర్డ్ సభ్యుల నుంచి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నాం. అసలు మీరు(టాటా గ్రూప్) ఈ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించారు. మీకు దీని గురించి ఏం తెలుసు. దీన్ని కొనుగోలు చేసి ఉపకారం చేస్తాం.. అంటూ వాళ్లు హేళనగా మాట్లాడారు. వెంటనే మేం అదే సాయంత్రం న్యూయార్క్‌కు తిరిగొచ్చేశాం. ఆ 90 నిమిషాల విమాన ప్రయాణంలో రతన్ టాటా చాలా విచారంగా కనిపించారు. అయితే, 2008లో సీన్ మొత్తం రివర్స్ అయింది. మేం జేఎల్ఆర్ను ఫోర్డ్ మోటార్స్ నుంచి టేకోవర్ చేయడానికి ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పుడు రతన్ టాటాకు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా దీన్ని కొనుగోలు చేసి మాకెంతో ఉపకారం చేస్తున్నారంటూ కీర్తించారు కూడా’ అని కాడ్లే గత స్మృతులను తెలియజేశారు. వైబీ చవాన్ జాతీయ అవార్డు-2014ను రతన్ టాటా తరఫున అందుకుంటూ ఆయన ఈ విషయాలు చెబుతుంటే అక్కడ హాజరైన వారంతా చప్పట్లతో హోరెత్తించారు. టాటా మోటార్స్‌ను వృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్‌ల బృందంలో కాడ్లే కీలక పాత్ర పోషించారు. 21 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం టాటా క్యాపిటల్‌కు సారథిగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుని దివాలా అంచున నిలిచిన ఫోర్డ్ నుంచి జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లు(దాదాపు 14,300 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేయడం తెలిసిందే. ఇప్పుడు దేశీయంగా మందగమనం ఎదుర్కొంటున్న టాటా మోటార్స్‌కు ప్రధాన ఆదాయ వనరుగా జేఎల్ఆర్ నిలుస్తుండటం విశేషం. -
రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో
హాలీవుడ్ ప్రముఖ నటుడు 72 ఏళ్ల హారిసన్ ఫోర్డ్ వెండితెర మీదే కాదు.. నిజజీవితంలో కూడా హీరోగానే ఉన్నారు. గురువారం ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానంలో ఇంజన్ పనిచేయక అత్యవసరంగా దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా చాకచక్యంగా దాన్ని గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించి పరోక్షంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారు. స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ మంచి నైపుణ్యం గల పైలట్. ఆయన రెండో ప్రపంచయుద్ధం కాలం నాటికి చెందిన సింగిల్ ఇంజన్ గల చిన్న వింటేజ్ విమానంలో గురువారం నాడు విహారయాత్రకు వెళ్లాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గగనతలంలో విహరిస్తుండగా హఠాత్తుగా అందులోని ఇంజన్ చెడిపోయింది. ఏ మాత్రం కంగారు పడకుండా దగ్గరలో ఉన్న శాంటా మోనికా విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం కోసం విమానాశ్రయం అధికారులను కోరారు. వారు అందుకు అనుమతించినా విమానాశ్రయం రన్‌వేకు చేరుకోలేకపోయారు. సమీపంలో ఉన్న జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా విమానాన్ని ఆ పక్కనే ఉన్న కాలిఫోర్నియా గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించారు. అక్కడ కూడా భారీ చెట్లను తప్పించుకొని అత్యంత చాకచక్యంగా విమానాన్ని క్రాష్‌ల్యాండింగ్ చేశారు. విమానం జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు విమానాన్ని ఏకంగా 180 డిగ్రీల కోణంలో గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించడం సాహసోపేతమైన చర్యను ప్రమాదస్థలాన్ని సందర్శించిన విమానయాన నిపుణుడు రిక్ డేక్ తెలిపారు. చెట్లకు తగలకుండా అతి జాగ్రత్తగా విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయడం, అందులో 72 ఏళ్ల వయసులో అలా చేయడం మామూలు విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి ఉక్లా మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరిన ఫోర్డ్‌కు ప్రాణాపాయం లేదని ఆయన కుమారుడు బెక్ ఫోర్డ్ తెలిపారు. 1966లోనే పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ ఇంతకుముందు కూడా నిజ జీవితంలో పలు సాహసాలు చేశారు. 2000 సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగు ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి అక్కడికి తన విమానంలో వెళ్లి ఆమెను రక్షించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో ఫోర్డ్ కారు విరిగింది. కోలుకున్నాక ఆ షూటింగ్‌ను పూర్తి చేశారు. -
రెసిడెంట్ డాక్టర్ల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించేందుకు ఆరోగ్య కార్యదర్శి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఆదివారం తెలిపింది. ‘సమ్మెను మార్చి 15 వరకు వాయిదావేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే వారంలోగా సెక్యూరిటీని పెంచుతామనే హామీ మాకు లభించింది. అప్పటిలోగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 16 నుంచి మళ్లీ సమ్మెకు వెళ్తాం’ అని ఎఫ్ఓఆర్డీఏ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ చెప్పారు. ఎఫ్ఓఆర్డీఏలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు మొత్తం 25 ఉన్నాయి. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణం సెక్యూరిటీని పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 12న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎఫ్ఓఆర్డీ లేఖ రాసింది. ఫిబ్రవరి 28లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని అందులో పేర్కొంది. గతంలో గురు టిగ్ బహదూర్ హాస్పిటల్, సప్దర్ జంగ్ ఆసుపత్రుల్లో రోగుల బంధువులు రెసిడెంట్ డాక్టర్లపై దాడులు చేయడంతో అసోసియేషన్ ఈ లేఖను రాసింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరైన భద్రత చర్యలు లేకపోవడం వల్ల రోగుల డబ్బు దొంగతనానికి గురవుతోందని ఫిర్యాదులో పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత పెంచి రక్షణ కల్పించాలని సింగ్ కోరారు. రోగులు కూడా తమను అర్థం చేసుకుని సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. -
టైరు పంక్చరై దొరికిపోయిన ఎర్రదొంగలు
వాహనం సహా రూ.20 లక్షల విలువ గల దుంగలు స్వాధీనం పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు పరారీ చౌడేపల్లె: వాహనం టైరు పంక్చర్ కావడంతో ఎర్రచందనం దొంగలు దొరి కిపోయిన ఘటన మంగళవారం ఉదయం చౌడేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉదయం ఏపీ16జె4821 నంబర్ గల ఫోర్డ్ ఫియెట్ కారు సోమల నుంచి చౌడేపల్లె వైపునకు అతివేగం గా వస్తోంది. కడియాలకుంట సమీపంలో ముందు టైరు పంక్చర్ అయింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా చౌడేపల్లె బస్టాండు మీదుగా పుంగనూరు రోడ్డు వైపు వెళ్లాడు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ప్రయివేటు రైసు మిల్లు వద్ద కారు ఆపి ఆతృతగా టైరు మార్చుతుండడం తో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగార్జునరెడ్డి తన సిబ్బంది తో కలిసి అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు రాడ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అందులో ఒకరిని పోలీ సులు అదుపులోకి తీసుకోగా మిగిలి న ఇద్దరు పొలాల్లోకి పారిపోయా రు. కారులో తొమ్మిది దుంగలు బయటపడ్డాయి. దొరికిన వ్యక్తి వై ఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వాడిగా గుర్తించారు. ఇంటి దొంగల పనేనా.. పోలీసులకు దొరికిన ఎర్రచందనం దుంగలు డిపోలో నిల్వ చేసినవేన ని పోలీసులు అభిప్రాయపడుతున్నా రు. సాధారణంగా ఫారె్‌స్ట్, పోలీసులకు దుంగలు పట్టుబడితే కేసులో నమోదు చేసేందుకు దుంగల పొడ వు, బరువును పెయింట్‌తో నమో దు చేస్తారు. పోలీసులకు చిక్కిన తొమ్మిది దుంగలపైనా పెయింట్ తో వివరాలు ఉండడంతో డిపోలో నిల్వచేసిన దుంగలుగా అనుమానిస్తున్నారు. ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్సు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం సహా గంజాయి స్వాదీనం
పుత్తూరు : పుత్తూరు మండల పరిధిలోని వేపగుంట రైల్వే గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం కారులో అక్రమంగా గంజారుు రవాణాచేస్తున్న ఇద్దరు తమిళనాడువాసులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కారుసహా 15లక్షల విలువజేసే 300కిలోల గంజారుుని స్వాధీనంచేసుకున్నారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు విలేకరులకు వెల్లడించారు. తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన కలై అనే వ్యక్తి ఎస్.ప్రసన్నపాం డి, టి.మహాళింగంతో కలసి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి టీఎన్‌యూ 5878 అనే ఫోర్డ్ ఐకాన్ వాహనంలో గంజాయి సంచులు నింపుకుని ప్రసన్నపాండి, మహాళింగం తమిళనాడుకు బయలుదేరారు. వారు పుత్తూరు మండలం వేపగుంట మీదుగా పల్లిపట్టుకు వెళుతున్నట్లు పుత్తూరు సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం అందింది. ఎస్ఐలు రామాంజనేయులు, నాగన్న, ఏఎస్ఐలు నరసింహులు, రవితో పాటు సిబ్బందిని ఆయన అప్రమత్తం చేశారు. వారు అక్కడికి చేరుకుని వాహనాన్ని తనిఖీచేయగా 16 సంచుల్లో గంజాయి ఉంది. దాని బరువు 300 కిలోలు, విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజారుుని అక్రమ రవాణా చేస్తున్న ఎస్.ప్రసన్నపాండి, టి.మహాళింగాన్ని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంజాయి రవాణా లో ప్రధాన సూత్రధారి కలై అని, అతను వాహనంలో రాకుం డా రైలులో మధురై వెళ్లినట్లు డీఎస్పీ చెప్పారు. అనంతపురం బస్సులో గంజాయి స్వాధీనం : మరో ఇద్దరి అరెస్ట్ ములకలచెరువు: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందిన వారు. ములకచెరువు ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు అనంతపురం జిల్లా కొక్కంటిక్రాస్ నుంచి ఆర్టీసీ బస్సులో ఇద్దరు గంజాయితో బయలుదేరారని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసు స్టేషన్ నుంచి సమాచారం అందింది. ములకలచెరువు ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బం దితో బస్సులో తనిఖీలుచేశారు. బస్సులో ప్రయాణిస్తున్న రహంతుల్లా (45), జహారా (36)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని తనకల్లు పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. వారిద్దరూ అనంతపురం జిల్లా బాలసముద్రం పంచాయతీ, మారెప్పగారిపల్లెకు చెందిన వారని ఎస్ఐ తెలిపారు. వారు తమిళనాడు రాష్ట్రం వేలూరుకు గంజాయి తీసుకుని వెళుతునట్లు ఆయన వివరించారు. -
టాప్ గేర్‌లో మారుతీ..
- ఆగస్టులో జోరుగా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు - పండుగల సీజన్‌పై ఆశలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయి. సెంటిమెంట్ మెరుగుపడడంతో మారుతీ సుజుకి, హోండా కార్స్, హ్యుందాయ్, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో మంచి వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్, తదితర కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ కార్లు(స్విఫ్ట్, ఎస్టిలో, సెలెరియో, రిట్జ్, డిజైర్ కార్ల) అమ్మకాలు 53 శాతం పెరగడం విశేషం. మొత్తం మీద మారుతీ దేశీయ అమ్మకాలు 27 శాతం పెరిగాయి. గత నెలలో కూడా మారుతీ అమ్మకాలు మెరుగుపడ్డాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు మాత్రం 19 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి) విషయంలో ఆగస్టు నెల వివిధ కంపెనీలకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక టూవీలర్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలన్నీ విక్రయాల్లో 20 శాతానికి మించి వృద్ధి సాధించాయి. పండుగ సీజన్లో మరింత జోరుగా ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని, ఈ ప్రభావం వాహనాల కొనుగోళ్లపై ఉంటోందని నిపుణులంటున్నారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఉండే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) డిమాండ్ పెరిగి వాహన విక్రయాలు జోరుగా ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం, కొత్త మోడళ్లు, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర అంశాల కారణంగా పండుగల సీజన్ సందర్భంగా అమ్మకాలు బాగుంటాయనే ఆశాభావాన్ని వివిధ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని దీంతో వాహన మార్కెట్లో వ్యాపార విశ్వాసం మెరుగైందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోగలవని పేర్కొన్నారు. పండుగల సీజన్ సందర్భంగా కొత్త మోడళ్లను, అప్‌గ్రేడ్ వేరియంట్లను మొత్తం 10 కొత్త ఉత్పత్తులను అందించనున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలు... • ఐషర్ మోటార్స్ దేశీయ అమ్మకాలు 66% పెరి గాయి. ఎగుమతులు 47% వృద్ధి చెందాయి. • మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 27 శాతం, ఎగుమతులు 10 శాతం చొప్పున పెరిగాయి. • హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 19% పెరగ్గా, ఎగుమతులు 40% తగ్గాయి. ఎలైట్ ఐ20, ఎక్సెంట్, గ్రాండ్ వంటి కొత్త కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. • మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గాయి. • టయోటా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. • నెలా నెలా తమ అమ్మకాలు పెరుగుతున్నాయని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. రానున్న నెలల్లో అమ్మకాల్లో మరింత వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. -
ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు
విశాఖపట్నం: వర్షాలు లేక అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 3.1 అడుగుల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్రా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది. -
అర్థరాత్రి పుడ్
హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి 1 వరకు అనుమతి బార్లు, పబ్‌లకు వారాంతాల్లో మాత్రమే అనుమతించిన సర్కార్ మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా అమలు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పునరాలోచన అక్రమ మైనింగ్‌పై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాత్రి జీవనం (నైట్ లైఫ్) గురించి కలలు కంటున్న టెక్కీల కోరికలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లను తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతించింది. బార్లు, పబ్‌లు వారాంతాల్లో మాత్రమే ఒంటి గంట వరకు తెరచి ఉంచాలి. కొన్ని సంఘాలు, సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడించారు. ఈ రోజు (శనివారం) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఒంటి గంట వరకు నైట్ లైఫ్‌ను విస్తరించారని తెలిపారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ సహా సీనియర్ పోలీసు అధికారులు నైట్ లైఫ్‌ను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వేల మంది హోం గార్డులను నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జరగబోయే నేరాలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని, అయితే నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాలు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపడానికి రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ఆయన తెలిపారు. లోకాయుక్త ప్రతిపాదనల మేరకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా శాంతి భద్రతలను కాపాడే దిశగా అదనపు డీజీపీ స్థాయి అధికారులను జిల్లాల ఇన్ఛార్జిలుగా నియమించనున్నట్లు వెల్లడించారు. నిర్జన ప్రదేశాల్లో ఏటీఎంలకు సాయుధ సిబ్బందిని కాపలాగా నియమించాలని ఆయా బ్యాంకులకు సూచించామని ఆయన తెలిపారు. -
2015 నుంచి సానంద్‌లో కార్ల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ఈ ఏడాది ఆఖరు నాటికి అందుబాటులోకి రాగలదని, వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (తయారీ విభాగం) టామ్ చకలకల్ వెల్లడించారు. ఇది వచ్చాక ప్రస్తుతమున్న చెన్నై ప్లాంటుతో కూడా కలిపితే మొత్తం 4.40 లక్షల వాహనాల తయారీ సామర్ధ్యం లభించగలదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇంజిన్ల ఉత్పత్తి సామర్ధ్యం కూడా 6.10 లక్షలకు చేరగలదని వివరించారు. రెండింటిపైనా చెరో బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టామ్ పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ ఫార్చూన్ హార్మనీ గ్రూప్ డెరైక్టర్ నీరవ్ మోడి తదితరులతో కలిసి మూడు ఫోర్డ్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం మొత్తం 304 పైచిలుకు సెంటర్లు ఉండగా.. రాష్ట్రంలో 21 ఉన్నాయని టామ్ చెప్పారు. ప్రధానంగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే, చిన్న కార్లకు డిమాండ్ మరింత పెరగగనున్న నేపథ్యంలో వీటిపై మరింత దృష్టి పెట్టనున్నట్లు టామ్ తెలిపారు. మరోవైపు, చెన్నై ప్లాంటు ఉత్పత్తిలో 40 శాతం వాహనాలను 35 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని..త్వరలో దీన్ని 50కి పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాల తగ్గింపు అనేది ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇచ్చేదే అయినప్పటికీ.. ఇది స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికంగా ఉండనుందా అన్నది చూడాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కార్ల ధరలను తగ్గించే విషయంపై ఇంకా సమీక్షిస్తున్నామని టామ్ చెప్పారు. -
ఫోర్డ్... ఫిగో కాన్సెప్ట్ కార్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్ కారును సోమవారం ఆవిష్కరించింది. భారత్‌లో 2018 నాటికి ఈ బి సెగ్మెంట్ కార్లు ఏడాదికి 20 లక్షల వరకూ అమ్ముడవుతాయని అంచనా. మొత్తం కార్ల అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ అమ్మకాలు మూడో వంతు ఉంటాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఫిగో, ఇకోస్పోర్ట్లు విజయవంతం కావడంతో మరో పటిష్టమైన కారును మార్కెట్లోకి తేవాలనుకున్నామని ఆ దిశగా ఈ ఫిగో కాన్సెప్ట్‌ను తెస్తున్నామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నిగెల్ హారిస్ చెప్పారు. ఈ కారును ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది ఆయన వెల్లడించలేదు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో 23 మోడళ్లను అందుబాటులోకి తెస్తామని, వీటిల్లో కొన్నింటిని భారత్‌లోకి తెస్తామని ఫోర్డ్ మోటార్ కంపెనీ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్(ఇంజనీరింగ్) కుమార్ గల్హోత్ర పేర్కొన్నారు. -
ఫోర్డ్ క్లాసిక్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ క్లాసిక్ సెడాన్ కార్ల ధరలను రూ. లక్ష వరకూ తగ్గించింది. ఇప్పుడు ఫోర్డ్ క్లాసిక్ కార్లు రూ.4.99 లక్షల నుంచి రూ.7.59 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) లభిస్తాయని, ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా తెలిపారు. ఈ కొత్త ధరలు బుధవారం నుంచే వర్తిస్తాయని చెప్పారు. తమ అంతర్జాతీయ బ్రాండ్ ప్రచారం ‘గో ఫర్దర్’లో భాగంగా ఈ కార్ల ధరలను సవరించామని వివరించారు. 1.6 లీటర్ డ్యురాటెక్ పెట్రోల్, 1.4 లీటర్ టీడీసీఐ డ్యురాటార్క్ డీజిల్ ఇంజిన్ మోడళ్లలో లభించే ఈ కారులో ఫాగ్ ల్యాంప్‌లు, ఎయిర్‌బ్యాగ్స్, కీలెస్ ఎంట్రీ, స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్ ఏబీఎస్, వంటి ప్రత్యేకతలున్నాయని వినయ్ వివరించారు. -
ఫోర్డ్ కార్ల ధరలు 5 శాతం పెరిగాయ్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నామని కంపెనీ గురువారం తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పలేదని, ఈ పెరుగుదల తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏ మోడల్‌పై ఎంత ధర పెంచుతున్నదీ కంపెనీ వివరంగా వెల్లడించలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికంగా ఉన్న ఇంధనం ధరలు, పడిపోతున్న రూపాయి తదితర అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా వివరించారు.