Ford India: భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ 'ఫోర్డ్' (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్‌షిప్ నుంచి 'ఫోర్డ్ ఎండీవర్' 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు. అయితే ఈ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీంతో వినియోగదారుడు పంజాబ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
వినియోగదారుడు ఆ కారుని ఎప్పుడు కొన్నాడన్న సంగతి స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే సంస్థ బిఎస్ 4 వాహనాలను బిఎస్ 6 వాహనాలు మార్చాలని అప్పట్లోనే భారత ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఫోర్డ్ ఎండీవర్ 3.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన తరువాత అఆఇల్ లీకేజ్, ఇతర సమస్యలు తలెత్తినట్లు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపిన అనంతరం ఉచితంగా ఇంజిన్ మార్చాలని, కస్టమర్ అసౌకర్యానికి రోజుకి రూ. 2000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!
సుప్రీంకోర్టు తీర్పు..
ఈ ఉత్తర్వుల మీద ఫోర్డ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కంపెనీ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇంజిన్‌ను రీప్లేస్ చేసింది. అయినప్పటికీ కస్టమర్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం నాసిరకం కారుని విక్రయించినదుకు ఫోర్డ్ ఇండియాకు రూ.42 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!
ఇప్పటికే ఫోర్డ్ ఇండియా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.6 లక్షలు చెల్లించింది. కాగా మరో రూ. 36 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కోసం రూ.87,000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. దీంతో మొత్తం రూ.36,87,000 చెల్లించాలి.. అదనంగా సమస్య పూర్తిగా రూపుమాపిన తరువాత కొత్త కారుని వినియోగదారునికి తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, ఛత్తీస్‌గఢ్‌లో నాసిరకం కారును కొనుగోలు చేసిన కస్టమర్‌కు సంస్థ రూ. 29 లక్షల పరిహారం అందించడంతో పాటు కొత్త కారుని అందించింది.
Comments
Please login to add a commentAdd a comment