Ford Endeavour
-
కస్టమర్ దెబ్బకు అమెరికన్ కంపెనీకి షాక్ - రూ. 42 లక్షలు..
Ford India: భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ 'ఫోర్డ్' (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్షిప్ నుంచి 'ఫోర్డ్ ఎండీవర్' 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు. అయితే ఈ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీంతో వినియోగదారుడు పంజాబ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. వినియోగదారుడు ఆ కారుని ఎప్పుడు కొన్నాడన్న సంగతి స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే సంస్థ బిఎస్ 4 వాహనాలను బిఎస్ 6 వాహనాలు మార్చాలని అప్పట్లోనే భారత ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఫోర్డ్ ఎండీవర్ 3.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన తరువాత అఆఇల్ లీకేజ్, ఇతర సమస్యలు తలెత్తినట్లు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపిన అనంతరం ఉచితంగా ఇంజిన్ మార్చాలని, కస్టమర్ అసౌకర్యానికి రోజుకి రూ. 2000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్! సుప్రీంకోర్టు తీర్పు.. ఈ ఉత్తర్వుల మీద ఫోర్డ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కంపెనీ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇంజిన్‌ను రీప్లేస్ చేసింది. అయినప్పటికీ కస్టమర్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం నాసిరకం కారుని విక్రయించినదుకు ఫోర్డ్ ఇండియాకు రూ.42 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్! ఇప్పటికే ఫోర్డ్ ఇండియా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.6 లక్షలు చెల్లించింది. కాగా మరో రూ. 36 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కోసం రూ.87,000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. దీంతో మొత్తం రూ.36,87,000 చెల్లించాలి.. అదనంగా సమస్య పూర్తిగా రూపుమాపిన తరువాత కొత్త కారుని వినియోగదారునికి తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, ఛత్తీస్‌గఢ్‌లో నాసిరకం కారును కొనుగోలు చేసిన కస్టమర్‌కు సంస్థ రూ. 29 లక్షల పరిహారం అందించడంతో పాటు కొత్త కారుని అందించింది. -
ఫోర్డ్ ఎండీవర్ 2019 లాంచ్
సాక్షి, ముంబై: ఫోర్డ్ ఎండీవర్ 2019 భారతదేశంలో లాంచ్ అయింది. దీని రూ.28.19 లక్షలు ( ఎక్స్-షోరూం,ఢిల్లీ) గా కంపెనీ నిర్ణయించింది. 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ఇంజీన్మాన్యువల్ గేర్‌బాక్స్‌తో బేస్ మోడల్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు 3.2 డీజీల్ ఇంజీన్‌తో ఆటోమేటిగ్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. బేసిక్ మోడల్ లీటరుకు 14.2కి.మీ మైలేజ్ ఇస్తుంది. హై ఎండ్ మోడల్ లీటరుకు 12.62 కి.మీ. ఇస్తుంది. తమ కంపెనీ వారసత్వాన్ని వినియోగాదారులకు అభిరుచులకనుగుణంగా అసాధారణ ఫీచర్లతో న్యూ ఫోర్డ్‌ను లాంచ్ చేశామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. Presenting the New Ford Endeavour at a price starting INR 28.19 Lakh. With extraordinary power & performance with unmatched elegance & convenience, get set to be the master of every terrain. Book a test drive now: https://t.co/o5GU0y63ql #FordEndeavour pic.twitter.com/xUHK6n3aI8 — Ford India (@FordIndia) February 22, 2019 -
భారీగా పెరిగిన ఫోర్డ్ ఎండీవర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ సెస్ రేట్ల పెంపు తర్వాత కార్ల కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా తన ప్రీమియం ఎస్యూవీ ఎండీవర్ ధరలను భారీగా పెంచేసింది. జెస్టీ సెస్ రేట్లకు అనుగుణంగా ప్రీమియం ఎస్యూవీ ఎండీవర్ ధరలను రూ.1.8 లక్షలకు వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫిగో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఐకానిన్ మస్టాంగ్ సెడాన్ వరకు వివిధ మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఎండీవర్ కారు ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు పెంచుతున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. కంపెనీకి చెందిన ఇతర మోడల్స్‌పై ఈ పెంపు ప్రభావం అంతగా లేదని పేర్కొన్నారు. జీఎస్టీ సెస్ పెంపుతో ఇప్పటికే హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్లు తమ వాహనాల ధరలను పెంచేశాయి. గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్(జీఎస్టీ) కింద మిడ్ సైజు, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ రేట్లు 2 శాతం, 5 శాతం, 7 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. జీఎస్టీ పాలన కింద కార్లపై అత్యధిక పన్ను శ్లాబు 28 శాతంగా ఉంది. సెస్ 1 శాతం నుంచి 22 శాతంగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ధర రూ.1.5 లక్షల మేర తగ్గించనున్నట్టు కంపెనీ తెలిపింది. కానీ సెస్ రేట్లు పెంచడంతో, ఫోర్డ్ ఎండీవర్ ధరను మళ్లీ కంపెనీ పెంచేసింది. -
భారీగా తగ్గిన ఆ కారు ధర!
ఓ వైపు కార్ల ధరలు పెంచుతూ వినియోగదారులకు కాక పుట్టిస్తుంటే .. ఆశ్చర్యకరంగా ఫోర్డ్ కంపెనీ కార్ల ధరలను భారీగా తగ్గించేసింది. ఎంత అనుకుంటున్నారా..? ఏకంగా రూ.2.82 లక్షల మేర తన ఎండీవర్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించేసింది. ఈ ధరల తగ్గింపును ట్రెండ్ వేరియంట్ కొనుగోలుదారులు వినియోగించుకునేలా అవకాశం కల్పించింది. టైటానియం వేరియంట్స్ ధరలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచేసింది. ఆగస్టు మొదట్లోనే ఈ అమెరికా కారు తయారీదారి ఫిగో హ్యాచ్, ఆస్పైర్ సెడాన్లపై రూ.91వేల వరకు ధరను తగ్గించింది. అదేనెలల్లో ఎండీవర్లపై రూ.1.72లక్షల వరకు కోత విధించింది. కానీ అదే సమయంలో పరిమితంగా టైటానియం వెర్షన్లపై ధరలను పెంచింది. కొత్తగా ఎండీవర్ ట్రెండ్ వేరియంట్లపై రూ.2.82 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎస్‌యూవీల అమ్మకాలను విపరీతంగా పెంచడానికి ఫోర్డ్ ఎండీవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ధరల తగ్గింపు కేవలం అమ్మకాలను పెంచడానికి మాత్రమే కాక, తన ప్రత్యర్థి టయోటా ఫార్చ్యునర్ నవంబర్‌లో తీసుకు రాబోతున్న కొత్త వాహనాలకు పోటీ ఇవ్వడానికి కూడా ఓ కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో ధరల తగ్గింపు అనంతరం ఎండీవర్ కార్లు సరసమైన ధరల్లో మార్కెట్లో లభించనున్నాయి. ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 4x4 మాన్యువల్, ట్రెండ్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్లపై ఈ ధరల తగ్గింపు ఎక్కువగా ఉండటం విశేషం. ఎండీ ఫాలోవర్స్‌కు కానుకగా తీసుకొచ్చిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్, వినియోగదారులు కార్ల కొనుగోలుకు మంచి అవకాశంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.