కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్‌ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.
మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.
కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment