భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక కోటి (10 మిలియన్) యాక్టివా స్కూటర్లను విక్రయించి సేల్స్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.
2001లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన యాక్టివా 2017 నాటికి 50 లక్షల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత 50 లక్షల సేల్స్ సాధించడానికి 7 సంవత్సరాల సమయంలో పట్టింది. యాక్టివా స్కూటర్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు వంటి ప్రాంతాల్లో విరివిగా అమ్ముడైంది. దీంతో 1 కోటి సేల్స్ సాధించింది. అమ్మకాల్లో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడల్స్ రెండూ ఉన్నాయి.
ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..
హోండా మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న టూ వీలర్స్ ఇవే..
యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోటార్‌సైకిల్స్ మాత్రమే కాకుండా డియో, షైన్ 100, సీడీ 110 డ్రీమ్ డీలక్స్, షైన్ 125, ఎస్పీ125, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి టూ వీలర్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 110సీసీ, 125 సీసీ బైకులు అమ్ముడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment