Honda Motorcycle
-
హోండా మోటార్‌సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్‌వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త యూనికార్న్: వివరాలు
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ఒకటైన 'హోండా మోటార్‌సైకిల్'.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పాపులర్ బైక్ 'యునికార్న్'ను సరికొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.హోండా యూనికార్న్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే అమ్ముడవుతోంది. దీని ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ, బజాజ్ పల్సర్ 150 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూనికార్న్ బైకు మీద కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీ, మరో ఏడేళ్లు ఎక్స్టెండెడ్ వారంటీ ఉన్నాయి.కొత్త హోండా యూనికార్న్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఎంపికలను కలిగి ఉంది. 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ పొందుతుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ప్రారంభంలో హోండా యునికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ స్కీమ్‌లలో విక్రయించబడింది. ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ స్కీమ్‌లో కూడా అమ్ముడైంది. ఇక రాబోయే కొత్త యునికార్న్ ఎలాంటి అప్డేట్స్ పొందుతుందో అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
ఆ బైకులు కొన్నవారికి షాక్.. రీకాల్ ప్రకటించిన కంపెనీ!
Honda Motorcycle & Scooter: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఈ రోజు హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ బైకులపై ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కంపెనీ తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు బైకుల విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరి చేయదనే ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టం చేసింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అనుమానంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ వచ్చినట్లైతే నీరు లోపలి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా లోపల తుప్పు పట్టే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ఊహించింది. 2020 ఆక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యలో తయారైన బైకులలో ఈ సమస్య తలెత్తవచ్చని.. వాటిని డిసెంబర్ 2023 రెండవ వారం నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకురావాలని కంపెనీ తెలిపింది. బైక్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలు ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ వెల్లడించినట్లు 2020 - 2023 మధ్య కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. -
హోండా నుంచి డియో 125 స్కూటర్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో డియో 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.83,400 నుంచి ప్రారంభం. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ ఫీచర్‌తో ప్రస్తుతం రెండు వేరియంట్లలో 125 సీసీ ఇంజన్‌తో కొత్త మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, సీట్, ఫ్యూయల్ లిడ్ తెరవడానికి మల్టీ ఫంక్షన్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 171 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి హంగులు జోడించింది. -
2023 హోండా యూనికార్న్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Honda Unicorn Lunched: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న యునికార్న్ బైకు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన 2023 హోండా యూనికార్న్ ధర రూ. 1,09,800. ఈ బైక్ మునుపటి మోడల్ ధర రూ. 1,05,718 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే ఈ అప్డేటెడ్ బైక్ ధర మునుపటి కంటే కూడా రూ. 4,082 ఎక్కువ. ఈ బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. ఈ అప్డేటెడ్ బైక్ డిజైన్ & ఫీచర్స్ అన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు 715 మిమీ, మొత్తం బరువు 140 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా యూనికార్న్ కూడా ఒకటి కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) ఇంజిన్ & వారంటీ అప్డేటెడ్ హోండా యూనికార్న్ బైకులో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.9 bhp పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి డ్రమ్ బ్రేక్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి - ధర ఎంతో తెలుసా?) హోండా కంపెనీ కొత్త యునికార్న్ కోసం స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల వారంటీ మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ కొనుగోలుపైన 10 సంవత్సరాల వారంటీ కవరేజ్ పొందవచ్చు. -
హోండా నుంచి మరో బైక్ 'సిబి350 కేఫ్ రేసర్' - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా CB350 లైనప్‌కి కొత్త నియో-రెట్రో మోటార్‌సైకిల్ జోడించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. హైనెస్, ఆర్ఎస్ విడుదల చేసిన తరువాత, హోండా సిబి350 కేఫ్ రేసర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ గురించి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, ఇటీవల స్పెషల్ క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో కనిపించింది. ఈ బైక్ సాధారణ మోడల్ మాదిరిగా కాకుండా.. చిన్న ఫ్లైస్క్రీన్, బ్యాక్ సీట్ కౌల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మెకానిజమ్స్ మొత్తం సిబి350కి సమానంగా ఉంటుంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ 348 సిసి ఇంజిన్ కలిగి, 20.6 బీహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. సిబి350 కేఫ్ రేసర్ బైకులో హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ కొంత వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్బీ చార్జర్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి సిబి350 కేఫ్ రేసర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలు అధికారికంగా ఆవిష్కరణ సమయంలో వెల్లడవుతాయి. (గమనిక: ఈ కథనంలో ఉపయోగించి హోండా సిబి350 ఫోటో అవగాహన కోసం మాత్రమే.) -
టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగ ంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్గా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)కు చెందిన ‘యాక్టివా’ అవతరించింది. ఇది వరకు ఈ రికార్డు హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ సిరీస్ పేరిట ఉండేది. అలాగే గత 17 ఏళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్లలో బైక్స్‌దే ఆధిపత్యం. కాగా ఇప్పుడు హోండా యాక్టివా, బైక్స్ దూకుడుకు కళ్లెం వేసింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలలో (జనవరి-జూన్) యాక్టివా టూవీలర్స్ విక్రయాలు 13,38,015 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హీరో స్ల్పెండర్ సిరీస్ వాహన విక్రయాలు 12,33,725 యూనిట్లుగా ఉన్నాయి.కాగా హెచ్ఎంఎస్ఐ.. తన యాక్టివా శ్రేణిలో యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహనాలను వినియోగదారులకు అందిస్తోంది. ఇక హీరో కంపెనీ తన స్ల్పెండర్ సిరీస్‌లో భాగంగా సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్రొ, స్ల్పెండర్ ప్రొ క్లాసిక్, స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. -
టూ వీలర్ల విపణిలో హోండా లక్ష్యం 30% వాటా..
కంపెనీ ప్రెసిడెంట్ కీట మురమత్సు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 2016-17లో 30% వాటా టార్గెట్ చేసుకుంది. భారత టూ వీలర్ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాటా 27%గా ఉంది. ఈ ఏడాది పరిశ్రమ 3-5% వృద్ధి కనబరుస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తాము 20% వృద్ధి ఆశిస్తున్నట్టు హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్ కీట మురమత్సు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ ఏర్పాటు చేసి ఏడాదైన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015-16లో కంపెనీ 44.6 లక్షల యూనిట్లు విక్రయించింది. సంస్థ అమ్మకాల్లో స్కూటర్ల వాటా 56% ఉంది. మోటార్ సైకిళ్ల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నందున 2016-17లో ఈ విభాగం వాటా 50%నికి చేరుతుందన్నారు. రూ.600 కోట్లతో కర్నాటక ప్లాంటులో కొత్త లైన్‌ను జోడిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఉత్పత్తి 6 లక్షల యూనిట్లు పెరుగుతుంది. -
సికింద్రాబాద్‌లో హోండా ప్రి-ఓన్డ్ ‘బెస్ట్ డీల్’ ఔట్లెట్
హైదరాబాద్: ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ సమీపంలోని ఫార్య్చూన్ హోండాలో సర్టిఫైడ్ ప్రి-ఓన్డ్ ఔట్లెట్ ‘బెస్ట్ డీల్’ను ప్రారంభించింది. ఈ ఔట్లెట్ ద్వారా కస్టమర్లకు సరసమైన ధరలకు టూవీలర్లను అందించడం, పాత బైక్స్‌కు ఎక్స్చేంజ్ సౌకర్యం వంటి సదుపాయలను కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు రెండు ఉచిత బైక్ సర్వీసులు, ఆరు నెలల వారంటీ వంటి సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొంది. కాగా సికింద్రాబాద్‌లో ఏర్పాటైన కొత్త ఔట్లెట్స్ కంపెనీకి మొత్తంగా తెలంగాణలో మూడవది. దేశంలో 84వది. -
హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీ ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ బైక్ కేటగిరిలో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీబీ షైన్ ఎస్పీ పేరుతో అందిస్తున్న ఈ 125 సీసీ మోడల్ బైక్ ధరలు రూ.59,900 నుంచి రూ.64,400(ఎక్స్ షోరూ మ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ బైక్‌లను ఏడాది కాలంలో 3 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇప్పటివరకూ 43 లక్షల షైన్ బైక్‌లను విక్రయించామని వివరించారు. గుజరాత్లో ప్లాంట్ నిర్మాణానికి రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు.