భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ఒకటైన 'హోండా మోటార్‌సైకిల్'.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పాపులర్ బైక్ 'యునికార్న్'ను సరికొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
హోండా యూనికార్న్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే అమ్ముడవుతోంది. దీని ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ, బజాజ్ పల్సర్ 150 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూనికార్న్ బైకు మీద కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీ, మరో ఏడేళ్లు ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉన్నాయి.
కొత్త హోండా యూనికార్న్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఎంపికలను కలిగి ఉంది. 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ పొందుతుంది.
ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
ప్రారంభంలో హోండా యునికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ స్కీమ్‌లలో విక్రయించబడింది. ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ స్కీమ్‌లో కూడా అమ్ముడైంది. ఇక రాబోయే కొత్త యునికార్న్ ఎలాంటి అప్డేట్స్ పొందుతుందో అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment