Honda Motorcycle & Scooter: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఈ రోజు హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ఈ బైకులపై ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కంపెనీ తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు బైకుల విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరి చేయదనే ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టం చేసింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అనుమానంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ వచ్చినట్లైతే నీరు లోపలి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా లోపల తుప్పు పట్టే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ఊహించింది. 2020 ఆక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యలో తయారైన బైకులలో ఈ సమస్య తలెత్తవచ్చని.. వాటిని డిసెంబర్ 2023 రెండవ వారం నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకురావాలని కంపెనీ తెలిపింది.
బైక్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలు ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ వెల్లడించినట్లు 2020 - 2023 మధ్య కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment