Honda bike
-
హోండా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (ఫొటోలు)
-
ఆ బైకులు కొన్నవారికి షాక్.. రీకాల్ ప్రకటించిన కంపెనీ!
Honda Motorcycle & Scooter: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఈ రోజు హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ బైకులపై ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కంపెనీ తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు బైకుల విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరి చేయదనే ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టం చేసింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అనుమానంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ వచ్చినట్లైతే నీరు లోపలి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా లోపల తుప్పు పట్టే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ఊహించింది. 2020 ఆక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యలో తయారైన బైకులలో ఈ సమస్య తలెత్తవచ్చని.. వాటిని డిసెంబర్ 2023 రెండవ వారం నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకురావాలని కంపెనీ తెలిపింది. బైక్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలు ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ వెల్లడించినట్లు 2020 - 2023 మధ్య కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. -
2023 హోండా యూనికార్న్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Honda Unicorn Lunched: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న యునికార్న్ బైకు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన 2023 హోండా యూనికార్న్ ధర రూ. 1,09,800. ఈ బైక్ మునుపటి మోడల్ ధర రూ. 1,05,718 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే ఈ అప్డేటెడ్ బైక్ ధర మునుపటి కంటే కూడా రూ. 4,082 ఎక్కువ. ఈ బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. ఈ అప్డేటెడ్ బైక్ డిజైన్ & ఫీచర్స్ అన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు 715 మిమీ, మొత్తం బరువు 140 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా యూనికార్న్ కూడా ఒకటి కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) ఇంజిన్ & వారంటీ అప్డేటెడ్ హోండా యూనికార్న్ బైకులో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.9 bhp పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి డ్రమ్ బ్రేక్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి - ధర ఎంతో తెలుసా?) హోండా కంపెనీ కొత్త యునికార్న్ కోసం స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల వారంటీ మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ కొనుగోలుపైన 10 సంవత్సరాల వారంటీ కవరేజ్ పొందవచ్చు. -
హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో 2023 హోండా SP125 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ త్వరలో అమలులోకి రానున్న బిఎస్6 ఫేస్-2 నిబంధనలకు అనుకూలంగా తయారైంది. ధర: 2023 హోండా ఎస్పి125 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ.85131, రూ.89131 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలు దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 1,000 ఎక్కువ. (ఇదీ చదవండి: YouTube: అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..) డిజైన్ & ఫీచర్స్: కొత్త హోండా ఎస్పి125 డిజైన్, ఫీచర్స్ పరంగా ఎక్కువ అప్డేటెడ్స్ లేదు. అయితే ఇది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆఫర్లో లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితోపాటు టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఉంటాయి. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) ఇంజిన్: 2023 హోండా ఎస్పి125 బైక్ 123.94 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.8 హెచ్‌పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. -
అదిరే ఫీచర్స్‌తో హోండా కొత్త బైక్స్.. ధర ఎంతంటే?
హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో హైనెస్ CB350, CB350RS బైకులను విడుదల చేసింది. సీబీ350 బైక్ ధర రూ. 2.10 లక్షల నుంచి రూ. 2.15 లక్షలు, కాగా సీబీ350ఆర్ఎస్ ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉన్నాయి. హోండా విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ చూడటానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కావున ధరలు రూ. 9,400 నుంచి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కొత్త హైనెస్ సీబీ350 ట్యాంక్‌పై రెండు తెల్లటి చారలు గమనించవచ్చు. సీబీ350ఆర్ఎస్ బైక్ గ్లోసి బ్లూ, మాట్ గ్రే/బ్లాక్ కలర్వే కలర్స్‌లో అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) హోండా కొత్త బైకులలో 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 హెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అదే సమయంలో స్ప్లిట్ సీట్ సెటప్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి. -
హోండా నుంచి మరో బైక్ 'సిబి350 కేఫ్ రేసర్' - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా CB350 లైనప్‌కి కొత్త నియో-రెట్రో మోటార్‌సైకిల్ జోడించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. హైనెస్, ఆర్ఎస్ విడుదల చేసిన తరువాత, హోండా సిబి350 కేఫ్ రేసర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ గురించి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, ఇటీవల స్పెషల్ క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో కనిపించింది. ఈ బైక్ సాధారణ మోడల్ మాదిరిగా కాకుండా.. చిన్న ఫ్లైస్క్రీన్, బ్యాక్ సీట్ కౌల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మెకానిజమ్స్ మొత్తం సిబి350కి సమానంగా ఉంటుంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ 348 సిసి ఇంజిన్ కలిగి, 20.6 బీహెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. సిబి350 కేఫ్ రేసర్ బైకులో హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ కొంత వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్బీ చార్జర్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి సిబి350 కేఫ్ రేసర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలు అధికారికంగా ఆవిష్కరణ సమయంలో వెల్లడవుతాయి. (గమనిక: ఈ కథనంలో ఉపయోగించి హోండా సిబి350 ఫోటో అవగాహన కోసం మాత్రమే.) -
గుడ్ న్యూస్: భారీ డిస్కౌంట్, ఈ బైక్‌పై రూ.50వేలు తగ్గింపు!
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బైక్ లవర్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాలు పెంచుకునేందుకు తాజాగా లాంచ్ చేసిన కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సరికొత్తగా హోండా CB300F బైక్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు, ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ ధరను రూ.50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమితి కాలానికే వర్తించనుందని తెలిపింది. భారీ తగ్గింపు! కొత్త హోండా CB300F స్ట్రీట్‌ఫైటర్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అది డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. వాటి ప్రారంభ ధర రూ.2.26 లక్షలు, రూ.2.29 లక్షలు ఉండగా తాజాగా కంపెనీ వాటిపై రూ. 50,000 తగ్గించింది. దీంతో డీలక్స్ ధర రూ. 1.76 లక్షలుకాగా, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలుగా ఉంది. కొత్త ధర ప్రకారం KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే హోండా సీబీ300F తక్కువ ధరకే లభిస్తుంది. 125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు ఉండగా, హోండా బైక్ ధర రూ. 1.76 లక్షలు ఉంది. హోండా CB300F పవర్లో 293.52cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తోంది. ఈ మోటార్ 7,500 RPM వద్ద 24.1 bhp మరియు 5,500 RPM వద్ద 25.6 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. -
హోండా బంపరాఫర్..! ఆ బైక్‌పై ఏకంగా రూ. 10 లక్షల తగ్గింపు..!
స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా బంపరాఫర్‌ను ప్రకటించింది. హోండా పోర్ట్‌ఫోలియోలోని ఫ్లాగ్షిప్ మోటార్‌సైకిల్ హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ ధరలను గణనీయంగా తగ్గించింది. 2020లో హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్-2020 బైక్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ లాంచ్ ధర రూ. 32.68 (ఎక్స్-షోరూమ్ ధర) లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌పై ప్రకటించిన తగ్గింపుతో ఇప్పుడు హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్ రూ. 23.11 లక్షలకు రిటైల్ కానుంది. దాదాపు రూ. 10 లక్షల తగ్గింపును హోండా ప్రకటించింది. ధర తగ్గింపుపై హోండా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ అధికారిక బిగ్‌వింగ్ ఇండియా వెబ్సైట్లో హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్ కొత్త ధరతో కన్పిస్తోంది. హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్ రెండు కలర్ వేరియంట్లలో రానుంది. బ్లాక్, రెడ్ కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ అత్యంత శక్తివంతమైన ఫైర్‌బ్లేడ్ బైక్ నిలుస్తోంది. ఈ బైక్‌లో 1000cc, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, DOHC, ఇన్లైన్-4 సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ 14,500 RPM వద్ద 214.5 hp గరిష్ట శక్తిని, 12,500 RPM వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది హోండాకు చెందిన సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)ని కూడా పొందుతుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..? -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
స్టైలిష్ లుక్‌తో హోండా సీబీ 200 ఎక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా కొత్త సీబీ200ఎక్స్ అడ్వెంచరర్–టూరర్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. గురుగ్రాం ఎక్స్‌షోరూంలో ధర రూ.1.44 లక్షలు. వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటుంది. 17 హెచ్‌పీ పవర్, 16 ఎన్ ఎం టార్క్‌తో 184 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్ఈడీ లైటింగ్, పూర్తి స్థాయి డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, డ్యూయల్ పర్పస్ టైర్స్, యూఎస్డీ ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్ మౌంటెడ్ కీ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : కంటి చూపుతో కాదు కత్తితో.. -
వారెవా! ఏముంది బైక్
చూసీచూడగానే 'వారెవా' అనిపించేలా ఉంది హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వారి గోల్డ్‌వింగ్ టూర్. గత నెల విడుదల చేసిన ఈ బైక్ ఎయిర్ బ్యాగ్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (డీసీటి) అనే రెండు వేరియెంట్లలో లభ్యం అవుతుంది. 'కంఫర్డ్, లగ్జరీ టాప్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న గోల్డ్వింగ్కు మంచి స్పందన వస్తుంది” అని కంపెనీ చెబుతుంది. ఈ బైక్ ధర ఎంతో తెలుస్తే! మీరు ఒకింత షాక్ అవుతారు. మాన్యూవల్ ట్రాన్స్ మిషన్ బైక్ ధర రూ.37,20,342గా ఉంటే, డీసీటి + ఎయిర్ బ్యాగ్ ధర వచ్చేసి రూ.39,16,055 (ఎక్స్ షో రూమ్, హర్యానా)గా ఉంది. 1,833 సీసీ ఇంజిన్ ఈ గోల్డ్ వింగ్ 1833సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ 24-వాల్వ్ ఎస్ వోహెచ్ సీ ఫ్లాట్-6 ఇంజిన్ తో వస్తుంది. ఇది 5,500 ఆర్ పీఎమ్ వద్ద 124.7 హెచ్ పీ, 170 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. అలాగే, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆష్షన్(డీసీటి) విత్ ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ కూడా ఉంది. 2021 గోల్డ్ వింగ్ హోండా సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ (హెచ్ ఎస్ టీసీ)తో వస్తుంది, ఇది విభిన్న రైడింగ్ పరిస్థితుల్లో రియర్ వీల్ ట్రాక్షన్ మానిటర్ చేయడానికి సహాయపడుతుంది. ఇతర ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్(ఐఎస్ జి), ఐడ్లింగ్ స్టాప్(డిసిటి ఆప్షన్ పై), మాన్యువల్-డిసిటి వేరియెంట్లపై హిల్ స్టార్ట్ అసిస్ట్(హెచ్ఎస్ ఎ) ఉన్నాయి. దీనిలోని ఏడు అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్ టి లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే స్క్రీన్ ఆడియో, నావిగేషన్ సిస్టమ్‌ల మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. 2021 గోల్డ్ వింగ్ స్మార్ట్ కీ మోటార్ సైకిల్ యొక్క అన్ని వ్యవస్థలను యాక్టివేట్ చేస్తుంది. ఇగ్నీషన్, హ్యాండిల్ బార్ లాక్ ని కేవలం తీసుకెళ్లేటప్పుడు ఆన్/ఆఫ్ చేయవచ్చు. దీనిలో అప్ గ్రేడ్ చేసిన లైట్ వెయిట్ స్పీకర్లు ఉన్నాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 21.1 లీటర్లు. గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ), హైదరాబాద్ (తెలంగాణ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్ షిప్‌లలో హోండా 2021 గోల్డ్ వింగ్ టూర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. -
కస్టమర్లకు హోండా శుభవార్త !
వెబ్‌డెస్క్: కస్టమర్లకు హోండా మోటార్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఫ్రీ సర్వీసులు పొందలేకపోయిన వారికి ఉపశమనం కలిగించే ఆఫర్ ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు గడువులో ఫ్రీ సర్వీసులు పొందలేక పోయిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నెలల కాలంలో ముగిసిపోయే వారంటీ, ఫ్రీ సర్వీసులను జులై 31 వరకు పొడిగిస్తున్నట్టు హోండా సంస్థ పేర్కొంది. పెరిగిన హోండా షైన్ ధర ఇండియన అర్బన్ మార్కెట్లో పట్టున్న హోండా సంస్థ ధరలు పెంచింది. హోండా టూవీలర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న షైన్ మోడల్ ధరను పెంచింది. బీఎస్ 6 ప్రమాణాలతో తయారు చేసిన హోండా షైన్ బైక్ రేటు రూ. 1072 పెంచింది. గడిచిన రెండు నెలల్లో వరుసగా రెండోసారి షైన్ బైక్ రేటును హోండా పెంచింది. ప్రస్తుతం ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం షైన్ బైక్ డ్రమ్వేరియంట్ మోడల్ ధర రూ. 71,550 ఉండగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346గా ఉంది. ప్రస్తుత ధరల పెంపుతో వీటిపై అదనంగా రూ. 1072 వ్యయం కానుంది. పెరిగిన ధరపై జీఎస్టీ, ఇతర లోకల్ ట్యాక్సులు కలుపుకుని కొనుగోలు దారులపై అదనంగా దాదాపు రెండు వేల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓ వైపు షైన్ బైక్ ధరలు పెంచిన హోండా సంస్థ మరోవైపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు జూన్ 30లోపు హోండా షైన్ బైకును కొనుగోలు చేస్తే.. రూ. 3500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చంటూ ప్రత్యేక ఆఫర్‌ను హోండా సంస్థ ప్రకటించింది. -
హోండా యూనికార్న్.. కొత్త వేరియంట్
రెండు వేరియంట్లలో లభ్యం ధరలు రూ. 69,350, రూ.74,414 న్యూఢిల్లీ: హోండా కంపెనీ యూనికార్న్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త 163 సీసీ సీబీ యూనికార్న్‌ను వచ్చే నెల మూడో వారం నుంచి విక్రయిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది తామందిస్తున్న నాలుగో ఆవిష్కరణ ఈ బైక్ అని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు పేర్కొన్నారు. స్టాండర్డ్ (ధర రూ.69,350), సీబీఎస్(ధర రూ.74,414; ఈ రెండు ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అనే రెండు వేరియంట్లలో ఈ బైక్‌ను అందిస్తున్నామని వివరించారు. హోండా ఈకో టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్ లీటర్‌కు 62 కి.మీ. మైలేజీనిస్తుందని తెలిపారు. స్టైల్, ఫ్యాషన్ కోరుకునే యువత కోసం ఈ బైక్‌ను రూపొందించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) వై.ఎస్.గులేరియా చెప్పారు. కాంబి-బ్రేక్ సిస్టమ్, బీమింగ్ హెడ్‌లైట్, స్టైలిష్ హెచ్- షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్ తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బైక్‌ను అందిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది 10 కొత్త టూవీలర్లను(ఇందులో 7 కొత్త మోడళ్లు) విడుదల చేస్తామని వెల్లడించారు.