ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో 2023 హోండా SP125 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ త్వరలో అమలులోకి రానున్న బిఎస్6 ఫేస్-2 నిబంధనలకు అనుకూలంగా తయారైంది.
ధర:
2023 హోండా ఎస్‌పి125 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ.85131, రూ.89131 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలు దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 1,000 ఎక్కువ.
(ఇదీ చదవండి: YouTube: అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..)
డిజైన్ & ఫీచర్స్:
కొత్త హోండా ఎస్‌పి125 డిజైన్, ఫీచర్స్ పరంగా ఎక్కువ అప్డేటెడ్స్ లేదు. అయితే ఇది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆఫర్‌లో లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితోపాటు టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటివి ఉంటాయి.
(ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!)
ఇంజిన్:
2023 హోండా ఎస్‌పి125 బైక్ 123.94 సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.8 హెచ్‌పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment