New bike
-
తళుక్కుమన్న టీవీఎస్ సరికొత్త రోనిన్
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ రోనిన్ మోటార్‌సైకిల్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న టీవీఎస్ మోటోసోల్ 4.0 కార్యక్రమంలో ఈ సరికొత్త మోడల్ తళుక్కుమంది. 225 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. 20 బీహెచ్పీ, 19 ఎన్ఎం టార్క్ అందిస్తుంది.5 స్పీడ్ గేర్‌బాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కట్–ఆఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ వంటి హంగులు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ మిడ్–వేరియంట్ రైడర్ల భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డ్యూయల్–ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రూపొందింది. బేస్ వేరియంట్‌కు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు.‘ఈ అప్‌గ్రేడ్ టీవీఎస్ రోనిన్ యొక్క మూడు వేరియంట్లలో మరింత స్థిరమైన భేదాన్ని సృష్టిస్తుంది. ఇది రంగు, గ్రాఫిక్స్‌లో మాత్రమే కాకుండా కార్యాచరణలో కూడా స్పష్టమైన వ్యత్యాసాలను అందిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు రోనిన్ మోడల్‌లలో ఇప్పటికే ఉన్న డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్‌లను భర్తీ చేస్తాయి.గివీతో టీవీఎస్ జోడీ..ఈ సందర్భంగా మోటార్‌సైకిల్ లగేజ్ సిస్టమ్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గివీతో టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ రైడింగ్ స్టైల్స్, స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన ప్రీమియం లగేజ్ సొల్యూషన్లను అందజేస్తుందని టీవీఎస్ వివరించింది.ప్రత్యేకంగా టీవీఎస్ ద్విచక్ర వాహనాల కోసం కస్టమ్–డిజైన్ చేయబడిన ఫ్రేమ్‌లు, మౌంట్లను గివీ అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల యాక్సెసరీల విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, ఆధునిక మోటార్‌సైక్లిస్ట్‌లకు అత్యాధునిక డిజైన్, సౌకర్యాన్ని అందిస్తుందని టీవీఎస్ వివరించింది. -
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్‌సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్‌కు అప్డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్లో ఈ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది.కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్‌కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్గ్రేడ్ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన లైనప్‌కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్‌లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తరువాత.. 650 సీసీ విభాగంలో మరో బైక్ లాంచ్ చేసింది. 'ఇంటర్‌సెప్టర్ బేర్ 650' పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్).రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా నిర్మితమైన ఈ బైక్ స్క్రాంబ్లర్ బైక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఆ రెండు బైకుల ఫీచర్స్ ఈ ఒక్క బైకులోనే గమనించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్, సైడ్ ప్యానెల్స్‌పై నంబర్ బోర్డ్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నీ కూడా ఈ బైకును చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ 130 మిమీ ట్రావెల్‌తో 43 మిమీ షోవా యుఎస్డి ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు 115 మిమీ ట్రావెల్‌తో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ హిమాలయన్ బైకులో కనిపించే ఫుల్ కలర్డ్ TFT స్క్రీన్ కూడా ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్648 సీసీ ఇంజిన్ కలిగిన ఇంటర్‌సెప్టర్ బేర్ 650.. 47 Bhp పవర్, 57 Nm టార్క్ అందిస్తుంది. 216 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పుడు డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
టీవీఎస్ అపాచీ లేటెస్ట్ ఎడిషన్.. మరింత పవర్ఫుల్!
టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్టీఆర్ 310 లాగే ఉంటుంది.కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్లెట్లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్‌కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్‌తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్పీ, 29ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్బాక్స్ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.యూఎస్డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివరల డిస్క్ బ్రేక్‌లు, రైడ్ మోడ్లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను కూడా వీటిలో చేర్చింది. అవుట్గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.ధరలుకొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్‌షిఫ్టర్‌తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్‌లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్ అప్డేటెడ్ ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్‌లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్) అనే ఐదు వేరియంట్లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో రావడం విశేషం. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక స్లైడింగ్ కాలిపర్‌తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
లాంచ్‌కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ బైక్
ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్ 2024 ఎఫ్ 900 జీఎస్. ఈ బైక్ టీజర్లను సంస్థ ఇప్పటికే విడుడల చేసింది. దీన్ని బట్టి చూస్తే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.చూడటానికి కొత్తగా కనిపించే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ ముందు భాగం సైడ్ ఫెయిరింగ్లను పొందుతుంది. ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద TFT డాష్ బోర్డు, కీలెస్ ఇగ్నిషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ బరువు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా తక్కువ.ఇదీ చదవండి: నిమిషానికి 693 రాఖీలు.. ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ 895 సీసీ ఇంజిన్ కలిగి 105 బ్రేక్ హార్స్ పవర్, 93 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఆగస్టు చివరి నాటికి అధికారికంగా విడుదలవుతుందని సమాచారం. దీని ధర రూ. 13 లక్షల నుంచి రూ. 14.5 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్'
టీవీఎస్ మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేదు. అంటే ఈ బైకులో స్టాండర్డ్ మోడల్లోని అదే ఇంజిన్ పొందుతుంది.టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్స్ కలిగి ఆలివ్ గ్రీన్ కలర్ స్కీమ్ కూడా పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్దాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది.రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ బైక్ USD ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే కాకుండా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. -
డుకాటీ కొత్త బైక్.. ధర ఎంతంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ డుకాటీ 2025 పానిగెల్ వీ4ను ఆవిష్కరించింది. కంపెనీ మొదటిసారి దేశీయ విఫణిలో ఈ బైకును 2018లో లాంచ్ చేసింది. ఆ తరువాత అనేక మార్పులకు లోనవుతూ వచ్చిన ఈ బైక్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 డుకాటీ పానిగెల్ వీ4 సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ కలిగి ఉంది. ఈ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 216 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని మునుపటి బైక్ కంటే కూడా 2.7 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.2025 డుకాటీ పానిగెల్ వీ4 బైక్ 6.9 ఇంచెస్ TFT డిస్ప్లే పొందుతుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.కొత్త ఫెయిరింగ్ డిజైన్, రీడిజైన్ ఎల్ఈడీ హెడ్‌లైట్, నార్మల్ స్వింగార్మ్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. టైయిల్లైట్ కూడా రీడిజైన్ చేశారు. ఈ బైక్ అధికారిక ధరలు ఇంకా వెల్లడికాలేదు. అయితే దీని ధర రూ. 2772 లక్షల నుంచి రూ. 33.48 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. -
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
-
దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి బైక్: ధర ఎంతో తెలుసా?
డుకాటి భారతదేశంలో హైపర్‌మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్‌మోటార్డ్ 950 ఆర్విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.హైపర్‌మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్‌పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్‌తో ఇంజిన్లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్ లాంచ్ చేసింది.డుకాటీ లాంచ్ చేసిన హైపర్‌మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్, హై ఫ్రంట్ మడ్‌గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
కేవలం 100 మందికి మాత్రమే ఈ బైక్.. వేలంలో కొనాల్సిందే
దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్‌ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle. Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024 -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్‌లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్‌సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్‌లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?
జావా మోటార్‌సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్‌లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు రెడ్ అండ్ క్రోమ్‌లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.జావా 42 బాబర్ కొత్త వేరియంట్లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. -
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' త్వరలోనే '2024 రోడ్‌మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్‌సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్‌స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
మార్కెట్లో లాంచ్ అయిన 'మార్విక్ 440' బైక్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడటానికి హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్జీ బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్‌నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు. సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా? పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. -
‘యమహా’ యమ్మా ఏం బైక్ గురూ..! (ఫొటోలు)