అనేక ఆధునిక వాహనాలు భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. కంపెనీ 'అపాచీ ఆర్టీఎక్స్' (Apache RTX) అనే నేమ్‌ప్లేట్‌ను ట్రేడ్‌మార్క్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపాచీ విభాగంలో 160సీసీ, 180సీసీ, 200సీసీ, 310సీసీ బైకులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ సెగ్మెంట్‌లో మరో కొత్త మోడల్ చేరటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!)
అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌పై టీవీఎస్ కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు ఒక బైక్ కూడా విడుదల చేయలేదు. రాబోయే కొత్త బైక్ టీవీఎస్ ఆర్టీఆర్ కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు అడ్వెంచర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ బైకులు ఆల్ ఇన్ వన్ బైకులుగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!)
కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ తప్పకుండా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment