Coming Soon
-
జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో
తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెరపై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహంచింది. కొత్త గాయకులను పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు. -
ఐఫోన్ 16 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ కొత్త సిరీస్ లాంచ్ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను రాబోయే రోజుల్లో యాపిల్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆవిష్కరించనున్నారు.గత ఏడాది యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ హై-ఎండ్ ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి ఏ18 ప్రో పొందనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సీరీస్‌తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఓఎస్ 18 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.గత సంవత్సరం యాపిల్ ఐఫోన్ 15 ప్రో కోసం యాక్షన్ బటన్ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ వనిల్లా ఐఫోన్ 15లో లేదు. కానీ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో ఈ యాక్షన్ బటన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. దీనితోపాటు క్యాప్చర్ బటన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫోటో టేకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండూ కూడా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే కూడా పెద్ద డిస్ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో డిస్ప్లే 6.1 ఇంచెస్ నుంచి 6.3 ఇంచెస్‌కు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.7 ఇంచెస్ నుంచి 6.9 ఇంచెస్ డిస్ప్లే పొందవచ్చు. వీటి బరువు కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. -
భారత్‌లో ఫోర్డ్ రీ ఎంట్రీ!
భారతీయ మార్కెట్లో 1995 నుంచి సంచలనం సృష్టించి గొప్ప అమ్మకాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' (Ford), 2021లో సరైన విక్రయాలు లేక తయారీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ దేశీయ విపణిలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ చెన్నైలో స్థానిక అసెంబ్లీ, దిగుమతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఒకవేళా మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే 'ఎండీవర్' (Endeavour) ఆధునిక హంగులతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్థానిక ఉత్పత్తి 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఫోర్డ్ తన ఎండీవర్‌ను తీసుకురానుంది. గతంలో కంపెనీ తన చెన్నై ఫ్యాక్టరీని విక్రయించాలనుకుని, చివరికి దాన్ని వాయిదా వేసింది. అదే రాబోయే రోజుల్లో కంపెనీ మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు ఫోర్డ్ కంపెనీ తన ఎండీవర్ కారుని మళ్ళీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తే.. మునుపటి కంటే కూడా అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని పొందటంతో పాటు 2.0-లీటర్ టర్బో-డీజిల్, 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్ అనే రెండు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 10-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉండనున్నట్లు తెలుస్తోంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు
భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ త్వరలో వర్చ్యువల్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ ప్రో' (Vision Pro) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ లాంచ్ చేయనున్న ఈ కొత్త హెడ్సెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ తన వర్చ్యువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను లాంచ్ చేయడానికంటే ముందు రిటైల్ స్టోర్లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం. యాపిల్ సంస్థ ఈ విజన్ ప్రో హెడ్సెట్ సేల్స్ కోసం ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి డెలివరీలు ప్రారంభమయ్యే సమయంలో శిక్షణ పొందిన ఉద్యోగులు రిటైల్ స్టోర్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్‌సెట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు. ధర (Price) 2023 WWDC ఈవెంట్లో మొదటి సారి కనిపించిన యాపిల్ విజన్ ప్రో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ హెడ్సెట్లో ఎమ్2 చిప్ సెట్, రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్ వంటివి ఉంటాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఇదీ చదవండి: ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్ ఈ లేటెస్ట్ హెడ్‌సెట్‌తో వర్చ్యువల్ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఇది మొదట కేవలం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తరువాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ హెడ్సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. I’d expect a Vision Pro related announcement sometime this upcoming week. Start writing your “Apple Wins CES” headlines. https://t.co/A41ayEKe6o — Mark Gurman (@markgurman) January 7, 2024 -
త్వరలో ఫలితాలు.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తీరినట్టేనా!
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇతర సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఐటీ కంపెనీల అవస్థలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అయితే 2023 ప్రారంభం కంటే చివరి త్రైమాసికం కొంత వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో పరిస్థితులు కొంత సాధారణస్థాయికి వచ్చినప్పటికీ.. చాలా ఐటీ సంస్థలు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాయి. ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం, రోజురోజుకి తగ్గుతున్న ఆదాయాల వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రభావం ఉద్యోగుల మీద, వారి జీతాల మీద కూడా పడింది. ఈ కారణంగానే జీతాల పెంపు కూడా కొంత వాయిదా పడింది. భారతీయ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్ టీ, టెక్ మహీంద్రా మొదలైనవన్నీ ఈ నెలలో తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మునుపటి కంటే కొంత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు లాభాల్లో రాకపోయినప్పటికీ వాటి యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ప్రకటిస్తాయోనని మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయి. యాజమాన్యాలు ఐటీ రంగానికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తే స్టాక్ల్లో మంచి ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఫెడ్ మీటింగ్‌లో రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను పెంచబోమనే సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు పాజిటివ్‌గా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ఈ ఏడాది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు కనిపించనప్పటికీ.. కొత్త ఉద్యోగాలు పెరిగే సూచనలు కూడా ఆశాజనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా! ఐటీ సంస్థల ఫలితాల విషయానికి వస్తే.. టైర్ 1 కంపెనీల వృద్ధి 2.6 శాతం నుంచి 5 శాతం, టైర్ 2 సంస్థల ఆదాయం 1 నుంచి 3 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఫలితాలు ఈ నెల చివరి నాటికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఆదాయ వివరాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఐటీ కంపెనీ స్టాక్స్‌ల్లో ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రియుడి కోసం పాక్ చెక్కేసిన అంజూ..మళ్లీ వార్తల్లోకి, స్టోరీ ఏంటంటే?
ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజూ అలియాస్ ఫాతిమా గుర్తుందా. ఈ ఫాతిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ పాక్‌లోని మారుమూల గ్రామానికి వెళ్లి ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ త్వరలోనే భారతదేశానికి రానుంది. అంజూ తన పిల్లల్ని కలిసేందుకే భారత్ వెళ్లేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోందని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుందని నస్రుల్లా చెప్పారు. తాము ఇస్లామాబాద్‌లో విదేశీ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యమైనప్పటికీ, అది రాగానే అంజూ భారత్ వెళుతుందని నస్రుల్లా తెలిపారు. భారత్‌లో ఉన్న తన పిల్లల్ని కలిసిన తర్వాత ఆమె తిరిగి పాకిస్తాన్‌కు వస్తుందన్నారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్) కాగా ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లింది అంజూ. అయితే తమది ప్రేమలేదు దోమా లేదు..పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ముందు చెప్పినప్పటికీ ఆ తరువాత ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారడం తెలిసిందే. ఆగస్టులో ఈమె వీసానుమరో ఏడాది పాటు పొడిగించింది. అయితే నస్రుల్లాతో ప్రేమ, పెళ్లికి ముందే అంజూకి రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
విడుదలకు సిద్దమవుతున్న టయోటా కొత్త ఎమ్‌పివి ఇదే!
Toyota Rumion: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ త్వరలోనే కొత్త 'రూమియన్' (Rumion) అనే కొత్త ఎమ్‌పివి విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, వెల్ఫైర్ విభాగంలో రూమియన్ నాల్గవ మోడల్ అవుతుంది. త్వరలోనే టయోటా వెల్ఫైర్ ఆధునిక అప్డేట్స్ అందుకునే అవకాశం ఉంది. ఈ కొత్త MPV డిజైన్ దాదాపు ఎర్టిగా మాదిరిగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్ కూడా దాదాపు ఆ మోడల్ మాదిరిగానే ఉండవచ్చు. (ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!) ఇంజిన్ పరంగా.. రూమియన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 103 హార్స్ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభించనుంది. ఇది CNG వేరియంట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 2023 సెప్టెంబర్ నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్‌నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్‌సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్‌లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్‌నేమ్‌తో ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్‌సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్‌లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద మోటార్‌సైకిల్‌గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్‌తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్‌తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
టీవీఎస్ నుంచి కొత్త బైక్.. పేరేంటో తెలుసా?
అనేక ఆధునిక వాహనాలు భారతీయ మార్కెట్లో అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ 'అపాచీ ఆర్టీఎక్స్' (Apache RTX) అనే నేమ్‌ప్లేట్‌ను ట్రేడ్‌మార్క్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపాచీ విభాగంలో 160సీసీ, 180సీసీ, 200సీసీ, 310సీసీ బైకులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్ చేరటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌పై టీవీఎస్ కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు ఒక బైక్ కూడా విడుదల చేయలేదు. రాబోయే కొత్త బైక్ టీవీఎస్ ఆర్టీఆర్ కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతే కాకుండా చాలా మంది వాహన ప్రియులు అడ్వెంచర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ బైకులు ఆల్ ఇన్ వన్ బైకులుగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ తప్పకుండా ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంకింగ్ మోసాలపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
ముంబై: ఖాతాాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడానికి సంబంధించి సవరించిన కొత్త మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ త్వరలో ప్రకటించనుంది. ఫ్రాడ్ వర్గీకరణ మార్గదర్శకాల అంశంపై పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ ఈ విషయాలు తెలిపారు. ఎగవేతదారును ఫ్రాడ్‌గా ముద్ర వేసే ముందు వారు తమ వాదనలను వినిపించేందుకు అవకాశం కల్పించేలా బ్యాంకులు సహజ న్యాయ సూత్రాలను పాటించాలంటూ బ్యాంకులకు సుప్రీం కోర్టు ఇటీవల ఓ కేసులో స్పష్టం చేసిన నేపథ్యంలో జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఎలక్ట్రిక్ వెర్షన్లో రానున్న హ్యుందాయ్ క్రెటా.. లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు దూసుకెళ్తున్న సమయంలో హ్యుందాయ్ కంపెనీ దేశీయ విఫణిలో మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేయనున్న ఈ లేటెస్ట్ మోడల్ టెస్టింగ్ కూడా మొదలైపోయింది. ఇంతకీ హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు ఏది? ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు అరంగేట్రం చేయనుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కోనా (Kona) ఎలక్ట్రిక్ కారుతో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ తన క్రెటా SUV ని కూడా ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఎలాంటి క్యామోఫేజ్ లేకుండానే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత MG ZS EVకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు చూడటానికి సాధారణ క్రెటా మాదిరిగా కనిపించినప్పటికీ తప్పకుండా కొన్ని మార్పులు పొందనుంది. ఇందులో ఎటువంటి మార్పులు జరిగాయనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కోనా ఎలక్ట్రిక్ ఆధారంగా ఇది తయారయ్యే అవకాశం ఉందని, ఇది 400 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) హ్యుందాయ్ కంపెనీ అమ్మకాల్లో క్రెటా పాత్ర చాలా ప్రధానమైనది, కావున ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదలైతే మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
టాటా టియోగో కొత్త వెర్షన్ కమింగ్ సూన్, అందుబాటు ధరలో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్ఆర్జీ మోడల్లో త్వరలోనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టి ట్రిమ్’’ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్‌లతో డిస్ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు. అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్జెడ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. Do you chase the XTraordinary? Get ready for a dose of XTra eNeRGy coming your way! Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf — Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022 -
కొత్త స్మార్ట్‌ఫోన్ కంపెనీ వస్తోంది: దిగ్గజాలకు గుబులే!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలోకి మరో కొత్త కంపెనీ దూసుకొస్తోంది. లండన్‌కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్‌లో వర్చువల్ ఈవెంట్ ద్వారా తన జర్నీని స్టార్ చేయనుంది. ఫ్లాగ్షిప్ రేంజ్లో తన తొలి స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. 'రిటర్న్ టు ఇన్స్టింక్ట్' అనే వర్చువల్ ఈవెంట్‌తో నథింగ్ ఫోన్ 1 లాంచింగ్ జూలై 12న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామంటూ కంపెనీ మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే ధర, ఫీచర్లపై అధికారింగా ధృవీకరణ లేనప్పటికీ ఊహాగానాలు ఇలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు, అంచనాలు 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేను 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50 + 8 + 2 ఎంపీ ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-సి పోర్ట్ ధర సుమారు 534 డాలర్లుగా (రూ. 41,400)ఉండొచ్చని అంచనా. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి రానుంది. Unlearn. Undo. Starting with phone (1). Nothing (event) - Return to Instinct. Tuesday 12 July, 16:00 BST. Get notified: https://t.co/FEJL4Jb2Aw#phone1 pic.twitter.com/SX0PCdeXw9 — Nothing (@nothing) June 8, 2022 -
సఫారీ సరికొత్తగా.. కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. ఆటో ఎక్స్పో 2020లో గ్రావిటాస్ కోడ్‌నేమ్‌తో ప్రదర్శించిన ఎస్యూవీనే సఫారీ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కంపెనీ తెస్తోంది. కొత్త తరం ఎస్యూవీ వినియోగదారుల కోసం ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీని రూపొందించామని, త్వరలోనే బుకింగ్స్ మొదలు పెడతామని, ఈ నెలలోనే షోరూమ్స్‌కు అందుబాటులోకి తెస్తున్నామని టాటా మోటార్స్ వెల్లడించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా...! ల్యాండ్ రోవర్‌కు చెందిన డీ8 ప్లాట్ఫార్మ్పై క్రయోటెక్ టర్బో–డీజిల్ ఇంజిన్‌తో ఈ కొత్త సఫారీని రూపొందించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం) శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆల్–వీల్ డ్రైవ్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, 8.8 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, జేబీఎల్ స్పీకర్లు....తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రూ.14-20 లక్షల రేంజ్లో ఉన్న ఐదు సీట్ల హారియర్ మోడల్ కన్నా ఈ సఫారీ ఎస్యూవీ ధర ఒకింత ఎక్కువ ఉండొచ్చు. ఎమ్జీ హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, హ్యుందాయ్ క్రెటా ఆధారిత ఎస్‌యూవీలకు కొత్త సఫారీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సఫారీతో కొనసాగింపు..... భారత్‌లో ఎస్యూవీ లైఫ్‌స్టైల్ టాటా సఫారీతోనే మొదలైందని, ఇతర కంపెనీలు అనుసరించాయని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. గత ఇరవైయేళ్లుగా హోదాకు, పనితీరుకు ప్రతీకగా టాటా సఫారీ నిలిచిందని, ఈ వైభవాన్ని కొత్త సఫారీతో కొనసాగిస్తామని వివరించారు. -
పబ్జీ ప్రియులకు శుభవార్త : కమింగ్ సూన్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జీ యూజర్లకు శుభవార్త. భారతీయ వినియోగదారులకోసం కొత్త అవతారంలో ఈ గేమ్ తిరిగి అందుబాటులోకి రానుంది. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌గా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్నామని పబ్జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్‌ప్లేను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. పబ్జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇటీవల మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. అజూర్ క్లౌడ్‌లో యూజర్ డేటా స్టోర్ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారం ప్రకటించింది. అంతేకాదు గేమ్ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. ‘పబ్జీ మొబైల్ ఇండియా’ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కాగా కరోనా వైరస్, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పబ్జీ సహా చైనాకు చెందిన యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో (అక్టోబర్ 30,శుక్రవారం) నుంచి భారత్‌లో పబ్జీ గేమ్‌ను సర్వీసులు, యాక్సెస్‌ను నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గేమ్ మళ్లీ భారతీయులకు అందుబాటులోకి రానుంది. -
అదరగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 7 ప్రొ : ప్రీబుకింగ్ ఆఫర్
సాక్షి, ముంబై : చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయ బోతోంది. వన్‌ప్లస్ 6 కు సక్సెసర్‌గా వన్‌ప్లస్ 7ను ఈ నెలలో ఆవిష్కరించనుంది. ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ వన్‌ప్లస్ 7 టీజర్‌ను విడుదల చేశారు. వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్ అండ్ స్మూత్ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఫైనల్ గా వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను కంపెనీ బెంగుళూరులో మే 14న జరిగే ఈవెంట్లో లాంచ్ చేయనుంది. సీఈఓ విడుదల చేసిన టీజర్ వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 ప్రో 5జీపేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుందన్న అంచనాలకు బలాన్నిస్తోంది. వన్‌ప్లస్ 7 ప్రొ ఫీచర్లపై అంచనాలు 6.7 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 3120x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 6/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 48+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఓచర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. అలాగే మే 4నుంచి వెయ్యి రూపాయలతో ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ బుకింగ్ ద్వారా 15వేల రూపాయల స్ర్కీన్ రిప్లేస్మెంట్ సదుపాయం ఆరు నెలలవరకు ఉచితం. -
భారత్‌కు త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్
-
4 వారికి బ్యాడ్ అట..అందుకే 5 వస్తోంది
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'వన్ ప్లస్' తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 2017లో వన్ ప్లస్ 5ను త్వరలో విడుదల చేయనుంది. గతంలో వన్ ప్లస్ 3 వచ్చిన దృష్ట్యా దాని తరువాత వన్ ప్లస్ 4 వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం నెట్ లోహల్చల్ చేస్తున్న లీక్స్ ప్రకారం వన్ ప్లస్ సంస్థ యూజర్లందరికీ షాక్ ఇస్తూ త్వరలో వన్ ప్లస్ 5ను విడుదల చేయనుంది. వన్ ప్లస్ 3టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేయనుంది. అయితే శాంసంగ్, యాపిల్, గూగుల్ తో సమానంగా దూసుకుపోతున్న వన్‌ప్లస్ శాంసంగ్ ఎస్8, ఆపిల్ 7 తో పోలిస్తే రీజనబుల్ ప్రైస్‌లోనే అందించనుందని తెలుస్తోంది. 8జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందని మరోరిపోర్టు నివేదించింది. అధికారికంగా లాంచ్ కాకముందే ఇంకెన్ని రూమర్లు,అంచనాలు చెలురేగుతాయో చూడాలి. చైనాలో 4 అంకెను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఆ అంకె వల్ల అంతా చెడు జరుగుతుందని వారు విశ్వసిస్తారట. ఈ నేపథ్యంలోనే చైనా మొబైల్‌దిగ్గజం వన్ ప్లస్ తన ఫోన్ సిరీస్‌లో వన్ ప్లస్ 4ను విడుదల చేయడం లేదని సమాచారం. ఈ ఫ్లాగ్షిప్ డివైస్ పై స్పెసిఫికేషన్స్ అంచనాలు ఇలా ఉన్నాయి. వన్ ప్లస్ 5 ఫీచర్లు 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీ, 8 జీబీ ర్యామ్ 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0 -
త్వరలో రూ.200 నోట్లు?
-
త్వరలో రూ.200 నోట్లు?
న్యూఢిల్లీ: కొత్త రూ.2000 లేదంటే రూ.500నోట్లతో చిల్లర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన రూ .200 నోట్లను పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్బీఐ త్వరలోనే రూ.200నోట్లు విడుదల చేయబోతోందట. ఈ మేరకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం అనుమతిరాగానే కొత్త కరెన్సీ నోట్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంది. నకిలీ కరెన్సీ, నల్లధనంపై వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాటం నేపథ్యంలో రిజర్వు బ్యాంకు అదనపు భద్రతా లక్షణాలతో నూతన రూ .200 బ్యాంకు నోట్లు తీసుకురానుందట. వీటి ముద్రణకు అధికారుల ఆమోదాలు కోసం వేచి చూస్తోందని ఆర్బీఐ అంతరంగిక వర్గాల సమాచా డీమానిటైజేషన్ తర్వాత కొనసాగుతున్న నోట్లకష్టాల నేపథ్యంలో ఆర్బిఐ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొత్తగా వెయ్యినోట్లు వందనోట్లను కూడా ముద్రించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే కేంద్రప్రభుత్వం రూ.200నోట్ల ప్రింటింగ్‌కి అప్రూవల్ ఇవ్వగానే ముద్రణ ప్రారంభమవుతుందని ఈ వర్గాల సమాచారం. దీనికి తోడు నకిలీలకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రత లక్షణాలతో అన్ని నోట్లను ప్రతి 3-4 సంవత్సరాలకొకసారి మార్చే ప్రతిపాదనను కేంద్ర బ్యాంకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
వారం రోజుల్లో కొత్త కమిషనర్..!
అనంతపురం న్యూసిటీ : మరో వారం రోజుల్లో నగరపాలక సంస్థకు నూతన కమిషనర్ రానున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరపాలక సంస్థలో పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా పది మంది కమిషనర్లు మారారు. గ్రూపు రాజకీయాల నడుమ ఇక్కడ పని చేయాలంటే హడలిపోతున్నారు. దీంతో ఈ సీటులో వచ్చేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏపీఎండీపీలో ప్రాజెక్టు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మూర్తిను కమిషనర్‌గా పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని డీఎంఏ వర్గాలు తెలిపాయి. మంత్రి నారాయణ పేషీ నుంచే జీఓను విడుదల చేసి కమిషనర్‌ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, గ్రూపు తగాదాలు సీఎం దృష్టికి Ðð వెళ్లాయి. పరిపాలనపరంగా ప్రజాప్రతినిధులు అతిగా నగరపాలక సంస్థపై జోక్యం చేసుకోకూడదని ఇద్దరు ప్రజాప్రతినిధులకు అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులపై దాడులు, అవినీతితో పార్టీ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని అధిష్టానం సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోసారి కమిషనర్‌పై ఎవరైనా దూకుడుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలుంటాయని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. నూతనంగా బాధ్యతలు తీసుకునే అధికారి పాలకుల ఒత్తిళ్లకు ఏ మేరకు తట్టుకుంటారో వేచి చూడాలి. -
త్వరలో ఈ-మార్క్స్‌కార్డులు
– ప్రిన్సిపాళ్ల సమావేశంలో వీసీ ఆచార్య కే రాజగోపాల్ ఎస్కేయూ : విద్యార్థుల సంక్షేమమే అంతిమ లక్ష్యమని, విద్యార్థులు మార్క్స్ కార్డుల కోసం వర్సిటీకి రాకుండా ఈ – మార్క్స్ కార్డుల జారీ విధానం అందుబాటులోకి తెస్తామని ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దూరవిద్య పరీక్షల్లో ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు పంపే విధానం విజయవంతమైందన్నారు. అదే తరహాలోనే రెగ్యులర్ డిగ్రీ పరీక్షలకు సైతం ఆన్లైన్లో ప్రశ్నాపత్రాలు పంపే విధానం అమలు చేస్తామన్నారు. ‘ఎలక్ట్రానికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ ’ (ఈడీపీఎఫ్) అమలు చేసే తీరుతెన్నులు, సాధ్యాసాధ్యాలు వివరించారు. ఈడీపీఎఫ్ అమలు చేయడంతో ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్య ఉత్పన్నం కాదన్నారు. నిర్దేశించిన పరీక్ష సమయానికి గంట ముందు పాస్వర్డ్ తెలియజేస్తారన్నారు. అనుబంధ డిగ్రీ కళాశాలలకు కంప్యూటర్, యూపీఎస్, ప్రింటర్స్, నెట్వర్క్ సౌకర్యం, జిరాక్స్ మిషన్ వర్సిటీ కల్పిస్తుందన్నారు. విద్యార్థులు మార్క్స్ కార్డుల కోసం వర్సిటీకి రాకుండా ఈ –మార్క్స్ కార్డులు విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వెంకట రమణ, సీడీసీ డీన్ ఆచార్య కె.లక్ష్మిదేవి, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య రెడ్డి వెంకట రాజు, ఆచార్య రామ్మూర్తి, ఆచార్య మునినారాయణప్ప, ఆచార్య తులసీనాయక్, సీఈ ఎంఏ ఆనంద్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మీ ఇంటికి– మీ భూమి
అనంతపురం అర్బన్ : ‘ మూడోవిడత మీ ఇంటికి– మీ భూమి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించండి. కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు లైసెన్డ్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోండి.’’ అని సర్వేయర్లను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం స్థానిక డ్వామా హాల్లో సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్లో కలిసి మీ ఇంటికి– మీ భూమి అంశంపై సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఏసీ మాట్లాడుతూ మీ ఇంటికి– మీ భూమిలో వచ్చే సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భూ లోక్ అదాలత్‌లో సర్వే సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనేదానిపై శాఖ అధికారులు, సర్వేయర్లకు స్పష్టత ఉండాలన్నారు. జిల్లాలో 24 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో గౌరవ వేతనం లైసెన్డ్స్ సర్వేయర్లకు సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇదివరకు వేలుగులో పనిచేసిన సర్వేయర్లకు ఈటీఎస్, ఆటోకాడ్లో శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. మీ కోసం, మీ సేవలో వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. మొక్కుబడి సర్వేను సహించను ప్రజాసాధికార సర్వే మొక్కుబడిగా చేస్తే సహించబోనని అధికారులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చెప్పారు. తప్పుల్ని సరిచేసి ఈనెల 10లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి సర్వేపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో తప్పులు చేసిన ఎన్యుమరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్వైజర్లు తప్పని సరిగా వంద శాతం ఈకేవైసీని ఈ నెల 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
‘ఈమాల్’ ఆగయా..
జిల్లాకు 3వేల ఇంజక్షన్లు వినాయకపురం పీహెచ్‌సీకి వంద.. ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మలేరియాకు సంబంధించిన ఈమాల్ ఇంజక్షన్లు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. ‘మలేరియా మందేదయా’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 7వ తేదీన కథనం ప్రచురితమైన విషయం విదితమే. మలేరియా జ్వరం వచ్చిన వారికి ఈమాల్ ఇంజక్షన్ వేయాల్సి ఉంటుందని, వీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో ఏజెన్సీలోని ఆదివాసీలు జ్వరం తగ్గక ఇబ్బందులు పడుతున్నారని, వేరే కిట్స్‌తో చికిత్స చేసినప్పటికీ తగ్గకపోవడం.. మళ్లీ మళ్లీ పీహెచ్‌సీల వెంట తిరగాల్సిన పరిస్థితి రావడంతో.. పీహెచ్సీ వైద్యులు చివరకు ఈమాల్ ఇంజక్షన్‌ను బయట కొనుగోలు చేయాలని ప్రిస్కిప్షన్ రాసిస్తున్నారంటూ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు.. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 3వేల ఈమాల్ ఇంజక్షన్లు జిల్లాకు పంపించింది. మొదటి విడతగా అవసరమైన 3వేల ఈమాల్ ఇంజక్షన్లను ప్రభుత్వం అందజేసిందని జిల్లా మలేరియా అధికారి అయ్యదేవర రాంబాబు తెలిపారు. ఇవి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో అశ్వారావుపేట మండలం వినాయకపురం పీహెచ్‌సీకి అత్యవసరంగా 100 ఇంజక్షన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. -
త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనం
-
7/Gబృందావన కాలనీ సీక్వెల్
-
వేగవంతమైన ఇంటర్నెట్ త్వరలో
న్యూయార్క్: ఆన్లైన్లో వీడియోలు లోడ్కావడానికి ఎక్కువ సమయం పట్టడం మనందరికీ అనుభవంలోనిదే. దీనికి కారణం ఇంటర్నెట్ స్పీడ్ పరిమితంగా ఉండడమే. ఇకమీదట ఈ బాధ లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ ప్రసారానికి పరిశోధకులు మార్గం కనిపెట్టారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఇంటర్నెట్ను ప్రసారం చేసే ఆప్టికల్ ఫైబర్స్‌లో డాటా ట్రాన్సిమిషన్ రేట్‌ను పెంచడం ద్వారా గంటకు 12,000 కిమీ వేగంతో ఇంటర్నెట్ ప్రసారం చేశారు. దీంతో ఆప్టికల్ ఫైబర్స్‌లో ప్రయాణానికి శక్తిని అందింబే రిపీటర్ల అవసరం ఉండబోదని, త్వరలో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు. -
నవ్యాంధ్రలో 150 పడకల ESI ఆసుపత్రి
-
బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్..
విజయవాడ బ్యూరో: బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్. అదేంటి బాయిలర్ కోళ్లు గురించి విన్నాం.. బ్రాయిలర్ చేపలు అంటున్నారేంటని విస్తుపోకండి. మీరు చదువుతున్నది నిజమే. మాంసాహార ఉత్పత్తిలో ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో బ్రాయిలర్ కోడి మాదిరిగా రాష్ట్రంలోని మాంసాహార ప్రియులకు చేపలు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మత్స్య శాస్త్రవేతల మదిలో మెదిలింది. ఆఫ్రికన్ దేశాల్లో లభించే తిలాఫియా జాతికి చెందిన చేపలపై చేసిన ప్రయోగాలు ఫలించడంతో ఏపీలో సాగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 జిల్లాల్లో 2,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న హేచరీల నుంచి తిలాఫియా చేప పిల్లల్ని పెంచనున్నారు. గుడ్డు నుంచి పిల్లగా మారిన రోజు నుంచే ప్రత్యేకంగా హార్మోన్లతో కూడిన మేత అందించడంతో తిలాఫియా ఆడ చేపలు సైతం మగ చేపలుగా మారిపోతాయి. దీంతో పునరుత్పిత్తి అవకాశంలేనిరీతిలో పెరుగుతాయి. వాటిని ప్రత్యేకంగా మాంసం కోసమే వినియోగిస్తారు. దీన్ని ముల్లు, చర్మం తొలగించి విక్రయిస్తే లాభాల పంట పండుతుంది. ఇది మంచి మాంసాహారం కావడంతో దేశీయ మార్కెట్లోను గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. రోగాలను, కాలుష్యాన్ని తట్టుకుని ఎలాగైనా బతికే మొండిజాతి చేప కావడంతో తక్కువ సమయంలోనే 750 గ్రాముల వరకు పెరుగుతుంది. ఒక ముల్లు(మిడిల్ బోన్) మాత్రమే ఉండే తిలాఫియా చేపల మాంసం రుచిగా ఉంటుంది. -
బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్..
సాక్షి, బ్యూరో: బ్రాయిలర్ చేపలు వచ్చేస్తున్నాయ్. అదేంటి బాయిలర్ కోళ్లు గురించి విన్నాం.. బ్రాయిలర్ చేపలు అంటున్నారేంటని విస్తుపోకండి. మీరు చదువుతున్నది నిజమే. మాంసాహార ఉత్పత్తిలో ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో బ్రాయిలర్ కోడి మాదిరిగా రాష్ట్రంలోని మాంసాహార ప్రియులకు చేపలు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మత్స్య శాస్త్రవేతల మదిలో మెదిలింది. ఆఫ్రికన్ దేశాల్లో లభించే తిలాఫియా జాతికి చెందిన చేపలపై చేసిన ప్రయోగాలు ఫలించడంతో ఏపీలో సాగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 జిల్లాల్లో 2,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న హేచరీల నుంచి తిలాఫియా చేప పిల్లల్ని పెంచనున్నారు. గుడ్డు నుంచి పిల్లగా మారిన రోజు నుంచే ప్రత్యేకంగా హార్మోన్లతో కూడిన మేత అందించడంతో తిలాఫియా ఆడ చేపలు సైతం మగ చేపలుగా మారిపోతాయి. దీంతో పునరుత్పిత్తి అవకాశంలేనిరీతిలో పెరుగుతాయి. వాటిని ప్రత్యేకంగా మాంసం కోసమే వినియోగిస్తారు. దీన్ని ముల్లు, చర్మం తొలగించి విక్రయిస్తే లాభాల పంట పండుతుంది. ఇది మంచి మాంసాహారం కావడంతో దేశీయ మార్కెట్లోను గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. రోగాలను, కాలుష్యాన్ని తట్టుకుని ఎలాగైనా బతికే మొండిజాతి చేప కావడంతో తక్కువ సమయంలోనే 750 గ్రాముల వరకు పెరుగుతుంది. ఒక ముల్లు(మిడిల్ బోన్) మాత్రమే ఉండే తిలాఫియా చేపల మాంసం రుచిగా ఉంటుంది. -
త్వరలో విడుదల