త్వరలో రూ.200 నోట్లు?
న్యూఢిల్లీ: కొత్త రూ.2000 లేదంటే రూ.500నోట్లతో చిల్లర ఇబ‍్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన రూ .200 నోట్లను పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్‌బీఐ త్వరలోనే రూ.200నోట్లు విడుదల చేయబోతోందట. ఈ మేరకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం అనుమతిరాగానే కొత్త కరెన్సీ నోట్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంది.
నకిలీ కరెన్సీ, నల్లధనంపై వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాటం నేపథ్యంలో రిజర్వు బ్యాంకు అదనపు భద్రతా లక్షణాలతో నూతన రూ .200 బ్యాంకు నోట్లు తీసుకురానుందట. వీటి ముద్రణకు అధికారుల ఆమోదాలు కోసం వేచి చూస్తోందని ఆర్‌బీఐ అంతరంగిక వర్గాల సమాచా డీమానిటైజేషన్ తర్వాత కొనసాగుతున్న నోట్లకష్టాల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొత్తగా వెయ్యినోట్లు వందనోట్లను కూడా ముద్రించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే కేంద్రప్రభుత్వం రూ.200నోట్ల ప్రింటింగ్‌కి అప్రూవల్ ఇవ్వగానే ముద్రణ ప్రారంభమవుతుందని ఈ వర్గాల సమాచారం. దీనికి తోడు నకిలీలకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రత లక్షణాలతో అన్ని నోట్లను ప్రతి 3-4 సంవత్సరాలకొకసారి మార్చే ప్రతిపాదనను కేంద్ర బ్యాంకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.