Rs 200 note
-
రూ.200నోటు లాంచ్, ఏటీఎంలు సిద్దమేనా?
సాక్షి, ఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వినాయక చవితి సందర్భంగా కొత్త రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మూడో కొత్త నోటు ఇదే. ఈ నోటు విడుదలైన వెంటనే ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద భారీగా జనాలు క్యూ కట్టి మరీ ఈ నోటును సొంతం చేసుకుంటున్నారు. రూ.200 నోటుతో పాటు కొత్త రూ.50 నోటును కూడా ఆర్బీఐ నేడే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే కొత్త రూ.200 మీ పక్కనే ఉన్న ఏటీఎంలలోకి వస్తుందా? అంటే ఏటీఎంలో ఈ నోట్లను విత్‌డ్రా చేసుకోవడానికి మరో 2 వారాల పాటు వేచిచూడాల్సి ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. రిపోర్టుల ప్రకారం ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉందని తెలిసింది. ప్రస్తుతం ఎంపికచేసిన ఆర్బీఐ ఆఫీసుల వద్ద, బ్యాంకుల వద్ద మాత్రమే కొత్త రూ.200 నోటు అందుబాటులో ఉంటుందని రిపోర్టులు తెలిపాయి. ఏటీఎంల సామర్థ్యంతో నోట్ల సరఫరాను ఏటీఎం ప్రొవైడర్లు సరిపోల్చి చూడాల్సి ఉందన్నారు. ప్రతి క్యాసెట్లో ప్రస్తుతం 2,500 నోట్లు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రూ.200 నోట్లను పంపిణీ చేయాలంటే మరో రెండు వారాలైన సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. మహాత్మాగాంధీ(కొత్త సిరీస్)లో, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నేటి నుంచి ఈ నోట్లను జారీచేస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబించించేలా సాంచీ స్థూపం ఈ నోట్లపై ఉంటుంది. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఈ నోట్లు ఉన్నాయి. -
రూ.200 నోటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్బీఐ శుభవార్త అందించింది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త రూ.200 నోటు రేపే మార్కెట్లోకి వచ్చేస్తోంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో వీటిని శుక్రవారం మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. ఈ కరెన్సీ నోటు మార్కెట్లో ద్రవ్య సమస్యను, రూ.100 నోటుపై పడుతున్న భారాన్ని తగ్గించనుందని ఆర్బీఐ తెలిపింది. ''రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆగస్టు 25న రూ.200 డినామినేషన్ బ్యాంకు నోట్లను మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో మార్కెట్లోకి జారీచేస్తుంది. దీనిపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది'' అని ఆర్బీఐ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ సాంస్కృతిక పౌరసత్వాన్ని ప్రతిబింబించేలానే ఈ నోట్లను ఆర్బీఐ తీసుకొస్తుంది. ఈ నోటు బేస్ కలర్ బ్రైట్ ఎల్లో. చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో ఈ కొత్త నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు నిన్ననే రిపోర్టులు వచ్చాయి. కానీ రిపోర్టుల కంటే కాస్త ముందస్తుగానే, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా పరమైన ఫీచర్లతో ఈ కొత్త రూ.200 నోటు వస్తోంది. రూ. 100, రూ. 500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటివరకూ లేదు. దీంతో రూ. 200 నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా. అంతేగాక.. రూ. 200నోట్లు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది. 200 రూపాయిల బ్యాంకు నోట్ల విడుదలకు ఇటు కేంద్రం కూడా నిన్ననే(బుధవారమే) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.200 నోట్లను ఆర్బీఐ జారీ చేయనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నోట్ల విడుదలకు ఆమోదం తెలిపిన రెండు రోజుల్లోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. -
రూ.2000 నోటుపై ప్రభుత్వం స్పందించింది
న్యూఢిల్లీ : రూ.2000 నోటును రద్దు చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు కేంద్రప్రభుత్వం చెక్ పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. అంతేకాక త్వరలోనే కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ''రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే వార్తలేమీ లేవు'' అని గంగ్వార్ చెప్పారు. కొత్త రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి ధృవీకరణ రావాల్సి ఉందన్నారు. రూ.2000 నోట్లపై సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపివేసిందని తెలిసింది. జూలై 26న ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణను కూడా డిమాండ్ చేశాయి. డీమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చిన కొత్త రూ.2000 నోటును రద్దు చేస్తున్నారా? అందుకే ప్రింటిగ్ ఆపివేశారా? అంటూ నిలదీశాయి. కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆర్థికమంత్రి ఎలాంటి సమాధానమివ్వలేదు. కొత్త రూ.2000 నోటును లీగల్ టెండర్ లాగా కొనసాగిస్తూ చలామణిని పరిమితం చేస్తుందని, కానీ రద్దు చేసే అవకాశం లేదని ఓ వైపు ఇండస్ట్రి నిపుణులు కూడా చెప్పారు. కొత్త రూ.200 నోటును ప్రవేశపెట్టి, మార్కెట్లో నెలకొన్న చిన్న నోట్ల సమస్యకు చెక్ పెడుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.200 నోటు ప్రింటింగ్ మొదలైందని, వీటిని త్వరలోనే చలామణిలోకి తీసుకొస్తామని గంగ్వార్ శుక్రవారం కూడా చెప్పార. ఈ కొత్త రూ.200 నోటుతో చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ను పెంచుతామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ఈ నోటును ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. -
వచ్చే నెలలోనే కొత్త రూ.200నోట్లు
-
వచ్చే నెలలోనే కొత్త రూ.200నోట్లు
న్యూఢిల్లీ: చిల్లరకష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా చర్యలకు దిగాయి. ప్రధనంగా పెద్ద నోట్ల రద్దు. ఆ తరువాత చలామణిలోకి వచ్చిన రూ. 2వేల నోటు కరెన్సీ లభ్యత గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రూ. 200 నోటును అందుబాటులోకి తీసుకురానుంది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నెలలోనే వీటిని విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారుల ద్వారా తెలుస్తోంది. మైసూర్‌లోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ రూ. 200 రూపాయల నోట్లను ఇప్పటికే ప్రింటింగ్ మొదలుపెట్టిందని, ముద్రణ ప్రక్రియ పూర్తి కావడానికి 21రోజులు పడుతుందని ప్రభుత్వ పెట్టుబడి, కరెన్సీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలోనే 200 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలన్న డెడ్ లైన్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అత్యధిక భద్రతా ఫీచర్లతో వివిధ స్థాయిల్లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుంది. ఆర్బీఐకు చెందిన భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని మైసూర్, సల్బోని నుండి వాటిని ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఎస్బీ నివేదిక ప్రకారం, బ్యాంకుల వద్ద కరెన్సీ సర్క్యులేషన్ 5.4 శాతానికి తగ్గింది. నోట్ల రద్దుకు ముందు ఇది 23.19శాతంగా ఉంది. దీంతో కొత్త నోట్లు ప్రవేశంతో డిమాండ్ , సరఫరా గ్యాప్ ను తగ్గించటానికి సహాయం చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా చిల్లర కష్టాలను అధిగమించడానికి కొత్త రూ.200 నోటును తీసుకురావాలని మార్చి నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే నకిలీలను నిరోధించడానికి గాను కొత్త కరెన్సీలో అదనపు భద్రతా పొరను జోడించాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
త్వరలో మార్కెట్లోకి రూ.200 నోట్లు..!
-
త్వరలో రూ.200 నోట్లు?
-
త్వరలో రూ.200 నోట్లు?
న్యూఢిల్లీ: కొత్త రూ.2000 లేదంటే రూ.500నోట్లతో చిల్లర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన రూ .200 నోట్లను పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్బీఐ త్వరలోనే రూ.200నోట్లు విడుదల చేయబోతోందట. ఈ మేరకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం అనుమతిరాగానే కొత్త కరెన్సీ నోట్లను ముద్రించేందుకు సిద్ధంగా ఉంది. నకిలీ కరెన్సీ, నల్లధనంపై వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాటం నేపథ్యంలో రిజర్వు బ్యాంకు అదనపు భద్రతా లక్షణాలతో నూతన రూ .200 బ్యాంకు నోట్లు తీసుకురానుందట. వీటి ముద్రణకు అధికారుల ఆమోదాలు కోసం వేచి చూస్తోందని ఆర్బీఐ అంతరంగిక వర్గాల సమాచా డీమానిటైజేషన్ తర్వాత కొనసాగుతున్న నోట్లకష్టాల నేపథ్యంలో ఆర్బిఐ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొత్తగా వెయ్యినోట్లు వందనోట్లను కూడా ముద్రించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే కేంద్రప్రభుత్వం రూ.200నోట్ల ప్రింటింగ్‌కి అప్రూవల్ ఇవ్వగానే ముద్రణ ప్రారంభమవుతుందని ఈ వర్గాల సమాచారం. దీనికి తోడు నకిలీలకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రత లక్షణాలతో అన్ని నోట్లను ప్రతి 3-4 సంవత్సరాలకొకసారి మార్చే ప్రతిపాదనను కేంద్ర బ్యాంకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.