భారతీయ మార్కెట్లో 1995 నుంచి సంచలనం సృష్టించి గొప్ప అమ్మకాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' (Ford), 2021లో సరైన విక్రయాలు లేక తయారీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ దేశీయ విపణిలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఫోర్డ్ కంపెనీ మళ్ళీ చెన్నైలో స్థానిక అసెంబ్లీ, దిగుమతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఒకవేళా మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే 'ఎండీవర్' (Endeavour) ఆధునిక హంగులతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్థానిక ఉత్పత్తి 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఫోర్డ్ తన ఎండీవర్‌ను తీసుకురానుంది. గతంలో కంపెనీ తన చెన్నై ఫ్యాక్టరీని విక్రయించాలనుకుని, చివరికి దాన్ని వాయిదా వేసింది. అదే రాబోయే రోజుల్లో కంపెనీ మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతోంది.
ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు
ఫోర్డ్ కంపెనీ తన ఎండీవర్ కారుని మళ్ళీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తే.. మునుపటి కంటే కూడా అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని పొందటంతో పాటు 2.0-లీటర్ టర్బో-డీజిల్, 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్ అనే రెండు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 10-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment