Endeavour
-
భారత్‌లో ఫోర్డ్ రీ ఎంట్రీ!
భారతీయ మార్కెట్లో 1995 నుంచి సంచలనం సృష్టించి గొప్ప అమ్మకాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' (Ford), 2021లో సరైన విక్రయాలు లేక తయారీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ దేశీయ విపణిలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ చెన్నైలో స్థానిక అసెంబ్లీ, దిగుమతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఒకవేళా మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే 'ఎండీవర్' (Endeavour) ఆధునిక హంగులతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్థానిక ఉత్పత్తి 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఫోర్డ్ తన ఎండీవర్‌ను తీసుకురానుంది. గతంలో కంపెనీ తన చెన్నై ఫ్యాక్టరీని విక్రయించాలనుకుని, చివరికి దాన్ని వాయిదా వేసింది. అదే రాబోయే రోజుల్లో కంపెనీ మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు ఫోర్డ్ కంపెనీ తన ఎండీవర్ కారుని మళ్ళీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తే.. మునుపటి కంటే కూడా అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని పొందటంతో పాటు 2.0-లీటర్ టర్బో-డీజిల్, 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్ అనే రెండు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 10-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉండనున్నట్లు తెలుస్తోంది. -
ఫోర్డ్ ఎండీవర్ 2020 ఎడిషన్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ ప్రీమియమ్ ఎస్యూవీ మోడల్, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్ ఎస్యూవీ 2020 ఎడిషన్ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్డీ అనురాగ్ మెహరోత్రా చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకే అని, ఆ తర్వాత నుంచి రూ.70,000 అధికంగా ఉంటాయని వివరించారు. బీఎస్–సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా 2.0 లీటర్ ఈకోబ్లూ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించామని, 10 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 14 శాతం అధిక మైలేజీ.... ఎస్యూవీ సెగ్మెంట్లో ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న ఎస్యూవీ ఎండీవరే అని అనురాగ్ పేర్కొన్నారు. ఈ 2020 ఎడిషన్ 14 శాతం అధిక మైలేజీని ఇస్తుందని తెలిపారు. ఈ మోడల్లో 4 ్ఠ2 డ్రైవ్‌లైన్ వేరియంట్ 13.9 కి.మీ. 4 ్ఠ4 డ్రైవ్‌లైన్ వేరియంట్ 12.4 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారులు ఎండీవర్‌నే ఎంచుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఫోర్డ్ నుంచి కొత్త ఎండీవర్
♦ రక్షణ కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ♦ ధర రూ.24.1-28.69 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రీమియం ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎండీవర్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. పటిష్టమైన ఉక్కుతో వాహ నాన్ని తయారు చేశారు. ప్రీమియం ఎస్‌యూవీలో తొలిసారిగా ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ను వాడారు. ఇందులో ఒకటి డ్రైవర్ సీటు ముందు మోకాలి రక్షణకోసం ఏర్పాటు చేశారు. మౌఖిక ఆదేశాల ఆధారంగా పనిచేసేలా సింక్-2 అనే వ్యవస్థ ఉంది. 10,000లకుపైగా విభిన్న ఆదేశాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. ఏడుగురు కూర్చోవచ్చు. ఫోర్ వీల్ డ్రైవ్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెమి-ఆటో ప్యారలల్ పార్క్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్‌తోపాటు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న రోడ్లలో డ్రైవర్‌ను హెచ్చరించే అడ్వాన్స్డ్ టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ఎస్‌యూవీల హవా..: భారత్‌లో ప్రీమియం ఎస్‌యూవీల మార్కెట్ ప్రస్తుతం 18,000 యూనిట్లుంది. 2024 నాటికి ఇది ఒక లక్ష యూని ట్లకు ఎగుస్తుందని ఫోర్డ్ ఇండియా డీలర్ డెవలప్మెంట్ జీఎం ఎస్.లక్ష్మీరామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త ఎండీవర్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి భారత్ నుంచి 50 దేశాలకు వాహనాలను ఎగుమతి చేయాలన్నది కంపెనీ లక్ష్యమని చెప్పారు. 2016 ఫోర్డ్‌కు ఆశాజనకంగా ఉంటుందన్నారు. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో సరికొత్త ఎండీవర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.24.1-28.69 లక్షలు ఉంది. 2.2, 3.2 లీటర్ ఇంజిన్ వేరియంట్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది లభిస్తుంది. -
ఎస్యువి సెగ్మెంట్లో ఫోర్డ్ ఎండీవర్ న్యూమోడల్