ఫోర్డ్‌ ఎండీవర్‌ 2020 ఎడిషన్‌ | Ford India Launch Endeavour 2020 Edition | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ ఎండీవర్‌ 2020 ఎడిషన్‌

Published Wed, Feb 26 2020 8:10 AM | Last Updated on Wed, Feb 26 2020 8:10 AM

Ford India Launch Endeavour 2020 Edition - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా కంపెనీ ప్రీమియమ్‌ ఎస్‌యూవీ మోడల్, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్‌ ఎస్‌యూవీ 2020 ఎడిషన్‌ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్‌డీ అనురాగ్‌ మెహరోత్రా చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకే అని, ఆ తర్వాత నుంచి రూ.70,000 అధికంగా ఉంటాయని వివరించారు.  బీఎస్‌–సిక్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా 2.0 లీటర్‌ ఈకోబ్లూ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించామని, 10 గేర్ల ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 

14 శాతం అధిక మైలేజీ....
ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న ఎస్‌యూవీ ఎండీవరే అని అనురాగ్‌ పేర్కొన్నారు. ఈ 2020 ఎడిషన్‌ 14 శాతం అధిక మైలేజీని ఇస్తుందని తెలిపారు. ఈ మోడల్‌లో 4 ్ఠ2 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 13.9 కి.మీ. 4 ్ఠ4 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 12.4 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారులు ఎండీవర్‌నే ఎంచుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement