
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna) ఖరీదైన కారుని బహుమతి ఇచ్చాడు. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు . దీని విలువ మార్కెట్‌లో కోటిన్నర వరకు ఉంటుంది. ప్రీమియంది అయితే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఓ సంగీత దర్శకుడికి బాలయ్య ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి. కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తమన్ రెచ్చిపోతాడు
బాలయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే చాలు తమన్(Thaman) రెచ్చిపోతాడు. ఎంతలా అంటే ఆయన ఇచ్చే బీజీఎంకి థియేటర్స్‌లో బాక్సులు బద్దలైపోయేలా. అఖండ సినిమా భారీ విజయం సాధించడంలో తమనే కీలక పాత్ర పోషించాడు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం అందించాడు.

ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరీ చిత్రాలకు కూడా అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. వీరసింహారెడ్డి బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరేట్. సోషల్ మీడియాలో బాలయ్య ఎలివేషన్ వీడియోలన్నింటికి ఈ మూవీ బీజీఎంనే వాడుతారు. ఇక ఇటీవల రిలీజైన డాకు మహారాజ్‌కు కూడా తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అందుకే బాలయ్యకు తమన్ అంటే విపరీతమైన ప్రేమ. ముద్దుగా తమ్ముడు అని పిలుచుకుంటాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అఖండ 2’ చిత్రం తెరకెక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment