Ford India
-
భారత్‌లో ఫోర్డ్ రీ ఎంట్రీ!
భారతీయ మార్కెట్లో 1995 నుంచి సంచలనం సృష్టించి గొప్ప అమ్మకాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' (Ford), 2021లో సరైన విక్రయాలు లేక తయారీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ దేశీయ విపణిలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ చెన్నైలో స్థానిక అసెంబ్లీ, దిగుమతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఒకవేళా మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే 'ఎండీవర్' (Endeavour) ఆధునిక హంగులతో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే స్థానిక ఉత్పత్తి 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఫోర్డ్ తన ఎండీవర్‌ను తీసుకురానుంది. గతంలో కంపెనీ తన చెన్నై ఫ్యాక్టరీని విక్రయించాలనుకుని, చివరికి దాన్ని వాయిదా వేసింది. అదే రాబోయే రోజుల్లో కంపెనీ మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు ఫోర్డ్ కంపెనీ తన ఎండీవర్ కారుని మళ్ళీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తే.. మునుపటి కంటే కూడా అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటివాటిని పొందటంతో పాటు 2.0-లీటర్ టర్బో-డీజిల్, 3.0-లీటర్ V6 టర్బో-డీజిల్ అనే రెండు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 10-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కస్టమర్ దెబ్బకు అమెరికన్ కంపెనీకి షాక్ - రూ. 42 లక్షలు..
Ford India: భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ 'ఫోర్డ్' (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్షిప్ నుంచి 'ఫోర్డ్ ఎండీవర్' 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు. అయితే ఈ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీంతో వినియోగదారుడు పంజాబ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. వినియోగదారుడు ఆ కారుని ఎప్పుడు కొన్నాడన్న సంగతి స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే సంస్థ బిఎస్ 4 వాహనాలను బిఎస్ 6 వాహనాలు మార్చాలని అప్పట్లోనే భారత ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఫోర్డ్ ఎండీవర్ 3.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన తరువాత అఆఇల్ లీకేజ్, ఇతర సమస్యలు తలెత్తినట్లు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపిన అనంతరం ఉచితంగా ఇంజిన్ మార్చాలని, కస్టమర్ అసౌకర్యానికి రోజుకి రూ. 2000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్! సుప్రీంకోర్టు తీర్పు.. ఈ ఉత్తర్వుల మీద ఫోర్డ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కంపెనీ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇంజిన్‌ను రీప్లేస్ చేసింది. అయినప్పటికీ కస్టమర్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం నాసిరకం కారుని విక్రయించినదుకు ఫోర్డ్ ఇండియాకు రూ.42 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్! ఇప్పటికే ఫోర్డ్ ఇండియా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.6 లక్షలు చెల్లించింది. కాగా మరో రూ. 36 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కోసం రూ.87,000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. దీంతో మొత్తం రూ.36,87,000 చెల్లించాలి.. అదనంగా సమస్య పూర్తిగా రూపుమాపిన తరువాత కొత్త కారుని వినియోగదారునికి తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, ఛత్తీస్‌గఢ్‌లో నాసిరకం కారును కొనుగోలు చేసిన కస్టమర్‌కు సంస్థ రూ. 29 లక్షల పరిహారం అందించడంతో పాటు కొత్త కారుని అందించింది. -
టాటా మోటార్స్‌కు ఫోర్డ్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సణంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంటును 2023 జనవరి 10కల్లా పూర్తిగా చేజిక్కించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా ఫోర్డ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన గుజరాత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు దాదాపు రూ. 726 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ కొనుగోలులో భాగంగా మొత్తం భవంతులు, మెషీనరీ, భూమితోపాటు, వాహన తయారీ ప్లాంటును సొంతం చేసుకోనుంది. అర్హతగల ఉద్యోగులు సైతం బదిలీకానున్నారు. ప్రభుత్వం, సంబంధిత ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందిన నేపథ్యంలో 2023 జనవరి 10కల్లా లావాదేవీని పూర్తి చేయాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వివరించింది. లక్ష్యంలో 59 శాతానికి ద్రవ్యలోటు న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ ముగిసే నాటికి లక్ష్యంలో 59 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్–2023 మార్చి) ముగిసే నాటికి రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తి అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే నవంబర్ ముగిసే నాటికి ఇది 9.78 లక్షల కోట్లకు చేరింది. అంటే వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 59 శాతానికి చేరిందన్నమాట. -
3 వేలమందిపై వేటు వేసిన లగ్జరీ కార్ మేకర్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ మేకర్, అమెరికాకుచెందిన ఫోర్ట్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 3 వేలమందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు అధికారికరంగా ఫోర్డ్ ధృవీకరించింది. ఉద్యోగాల కోత సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఫోర్డ్ అధికార ప్రతినిధి తెలిపారు. (‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ ,చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ సంతకం చేసిన ఇమెయిల్ పోస్ట్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 3వేల మంది ఉద్యోగులు, మరికొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు ఫోర్ట్ తెలిపింది. ఈ మేరకు ఫోర్డ్ ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్ సమాచారం అందించింది. ఈ కోతలు ప్రధానంగా అమెరికా, కెనడా, ఇండియాలోని సిబ్బందిని ప్రభావితం చేసింది. (జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా... కానీ ఇక్కడో ట్విస్ట్) ఫోర్డ్లో చాలామంది ఉద్యోగులున్నారని, ఎలక్ట్రిక్, కొత్త సాఫ్ట్వేర్ వాహనాల పోర్ట్‌ఫోలియోకు మారడానికి అవసరమైన నైపుణ్యం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు లేదని ఫార్లే ఇటీవల చెప్పారు. 2026 నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయాలను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా వెల్లడించడం గమనార్హం. అప్పటికి 10 శాతం ప్రీ-టాక్స్ ప్రాఫిట్ మార్జిన్‌ను చేరుకోవాలని, గత ఏడాది ఇది 7.3 శాతంగా ఉందని చెప్పారు న్యూటెక్నాలజీకి మారడం, వాహనాల అధునాతన సాఫ్ట్వేర్ అభివృద్ధి లాంటి పరిణామాల నేపథ్యంలో నిర్వహణా విధానాన్ని మారుస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
భారీ డీల్: ఫోర్డ్‌ను కొనేసిన టాటా! ఎన్ని వందల కోట్లంటే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..ఫోర్డ్ మోటార్ మ్యాని ఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి అగ్రిమెంట్ నిన్ననే పూర్తయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సమస్యలు, మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ కంపెనీల సత్తా చాటడంతో అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. 2021 సెప్టెంబర్‌లో ఫోర్డ్ ఆ ప్రకటన చేసే సమాయానికి ఆ సంస్థకు గుజరాత్, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ యూనిట్లను ఫోర్డ్ అమ్మకానికి పెట్టగా..వాటిని కొనుగోలు చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది. ఈ తరుణంలో గుజరాత్‌లోని ఫోర్డ్‌కు చెందిన సనంద్ వెహికల్ ప్లాంట్ స్థలాలు,ఇతర ఆస్తులు,అలాగే అర్హులైన ఉద్యోగుల్ని కొనసాగించేలా ఒప్పందం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం..గుజరాత్ ఫోర్డ్ కార్ల తయారీ ఫ్యాక్టరీని 91.5 మిలియన్ డాలర్లకు (రూ.726 కోట్లు) టాటా సంస్థ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మా మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యం సంతృప్తి పరిచే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లు సమయానుకూలమైనది. ఇది వాటాదారుల విజయం అంటూ' టాటా మోటార్స్ తెలిపింది. కాగా, సనంద్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం వల్ల టాటా మోటార్స్ ఏడాదికి 300,000 యూనిట్ల కార్ల తయారీ సామర్థ్యం 420,000కి పెరగవచ్చని భావిస్తుంది. గత ఏడాది ఫోర్డ్ భారత్‌లో తమ కార్ల తయారీ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అప్పటి వరకు దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫోర్డ్ మార్కెట్ షేర్ 2శాతం మాత్రమే ఉంది. లాభాల్ని ఆర్జించడానికి రెండు దశాబ్దాలకు పైగా కష్టపడింది. చదవండి👉: భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా! -
భారత్‌కు భారీ షాక్.. దేశం నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!
Ford Ends Production units In India భారతీయులు ఎక్కువ ఇష్టపడే కార్లు జాబితా తీస్తే అందులో తప్పకుండా ఫోర్డ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ భారత్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే భారీ నష్టాలు కారణంగా ఈ సంస్థ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశామని కంపెనీ వెల్లడించింది. ఫోర్డ్‌కు భారతదేశంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సనంద్ ప్లాంట్ నుంచి, ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేసేది. చెన్నై ప్లాంట్ నుంచి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. 9 సెప్టెంబర్ 2021న ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ 2021లో నిలిపివేసింది. కార్లు, ఇంజిన్లు ఎగుమతి ప్రయోజనాల కోసం చెన్నై ప్లాంట్‌ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం చెన్నై యూనిట్‌ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లైంది. ఎకోస్పోర్ట్ ఫోర్డ్‌కు ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత మార్కెట్లో ఇతర కార్లకు గట్టి పోటిని కూడా ఇవ్వగలిగింది ఫోర్డ్. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్లో ఆశించినంతగా క్లిక్ కాలేదు. చివరికి, ఫోర్డ్‌కు భారీ నష్టాలు రావడంతో దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదు. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
టాటా చేతికి ఫోర్డ్ ఇండియా ప్లాంట్
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంటును కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్ ఇండియా (ఎఫ్ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం, టాటా మోటర్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం స్థలం, భవంతులు, వాహనాల తయారీ ప్లాంటు, యంత్రాలు, పరికరాలు మొదలైనవి టీపీఈఎంఎల్ కొనుగోలు చేయనుంది. అలాగే, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఎఫ్ఐపీఎల్ సాణంద్ ప్లాంటులోని వాహనాల తయారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే, అర్హత కలిగిన ఉద్యోగులు కూడా టీపీఈఎంఎల్‌కు బదిలీ అవుతారు. తదుపరి కొద్ది వారాల వ్యవధిలోనే టీపీఈఎంఎల్, ఎఫ్ఐపీఎల్ పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. సాణంద్ ప్లాంట్‌లో ఇంజిన్ల తయారీని ఫోర్డ్ కొనసాగించనుండటంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆ కంపెనీకి టాటా మోటార్స్ లీజుకు ఇవ్వనుంది. నీరు, విద్యుత్, వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంటు మొదలైనవి రెండు సంస్థలు కలిసి వినియోగించుకోనున్నాయి. కొత్త పెట్టుబడులు.. తమ వాహనాల ఉత్పత్తికి అనువుగా యూనిట్‌ను సిద్ధం చేసే దిశగా టీపీఈఎంఎల్ కొత్త యంత్రాలు, పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఏటా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా ప్లాంటును తీర్చిదిద్దనుంది. తర్వాత రోజుల్లో దీన్ని 4 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోనుంది. ‘మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొద్ది నెలలు పడుతుంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది మాకు తోడ్పడుతుంది. పైగా సాణంద్‌లోని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్లాంటుకు పక్కనే ఈ యూనిట్ ఉండటం కూడా మాకు కలిసి వస్తుంది‘ అని టాటా మోటార్స్ పేర్కొంది. ‘టాటా మోటార్స్‌కు దశాబ్ద కాలం పైగా గుజరాత్‌తో అనుబంధం ఉంది. సాణంద్‌లో సొంత తయారీ ప్లాంటు ఉంది. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ ఒప్పందమే నిదర్శనం‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టీపీఈఎంఎల్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. తమ వాహనాలకు కొనుగోలుదారుల్లో డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా కంపెనీ అనేక రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు. ఉద్యోగులకు భరోసా.. 2011లో ఫోర్డ్ ఇండియా సాణంద్‌లోని ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారీ యూనిట్ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు దేశీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమైన ఫోర్డ్ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై దిగుమతి చేసుకున్న వాహనాలు మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, తాజా ఒప్పందంతో ఆ సమస్య తప్పుతుందని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ‘ఫోర్డ్ ప్లాంటు మూసివేతతో 3,000 మంది పర్మనెంటు ఉద్యోగులు, 20,000 మంది వర్కర్లతో పాటు కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ సంస్థల్లో ను భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పడే పరిస్థితి నెలకొంది. కానీ, ప్రస్తుత ఒప్పందంతో ఆ సమస్య పరిష్కారమవుతుంది‘ అని పేర్కొంది. -
భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!
వాహన రంగంలో ఉన్న యూఎస్ సంస్థ ఫోర్డ్.. ఎగుమతుల కోసం భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది. భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. -
'ఫోర్డ్' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్ టాటా!
రతన్ టాటా..వెటరన్ పారిశ్రామికవేత్త..పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగంలో సంచలన, వినూత్న నిర్ణయాలకు పెట్టింది ఆయన పేరు. ఇటీవల అప్పుల భారంతో కూరుకుపోయిన ఎయిరిండియాను రతన్ టాటాకు చెందిన టాటా గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా కోవిడ్‌తో దెబ్బకు దివాళా తీసే స్థితిలో ఉన్న అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ 'ఫోర్డ్' యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కరోనా క్రైసిస్‌లో సైతం టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ మనదేశంలో 85 శాతం వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తుండగా..అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ చేతులెత్తేసింది. ఈ మేరకు భారత్‌లోని ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, సంసద్(గుజరాత్), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను అమ్మకానికి పెట్టింది. అందులో సంసద్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. కొనుగోళ్లలో భాగంగా సంసద్ యూనిట్ ప్రతినిధుల్ని టాటా గ్రూప్ సంప్రదించినట్లు తెలుస్తోంది. వచ్చేవారం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టాటా గ్రూప్.., ఫోర్డ్ యూనిట్లను కొనుగోలు ప్రతిపాదనలపై స్పష్టత రానుంది. ఒకవేళ అదే జరిగితే మరికొద్ది రోజుల్లో ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ హస్తగతం చేసుకోనుంది. ఇక గుజరాత్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటాకు అమ్మిన తర్వాత.. పీఎల్ఐ స్కీమ్‌లో ఫోర్డ్ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
ఫోర్డ్ చెన్నై యూనిట్‌పై టాటా మోటార్స్ కన్ను?!
చెన్నై: చెన్నైలోని మరాయ్ నగర్లో ఉన్న ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను స్వాధీనం చేసుకునే అవకాశంపై తమిళనాడు ప్రభుత్వం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి తంగం తెన్నారసుతో సమావేశం అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో రెండవసారి జరిగిన ఉన్నత స్థాయి చర్చల సమావేశం ఇది. సెప్టెంబర్ 27న టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సీఎంను కలిశారు.(చదవండి: ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!) అయితే, ఈ సమావేశాల వివరాలు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వాటికి అధ్యక్షత వహించినప్పటి నుంచి తుది నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు, మిగిలినవన్నీ ఊహాగానాలు అన్నారు. ఫోర్డ్ మరాయిమలాయి నగర్ ప్లాంట్ 2.40 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 30 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది. యుఎస్ కార్ల తయారీసంస్థ ఈ ప్లాంట్‌లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. (చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!) ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ లో సనంద్ వద్ద ఒక కర్మాగారం కూడా ఉంది. ఫోర్డ్ భారతదేశం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన తర్వాత పరోక్షంగా 4 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. ఈ యూనిట్ గనుక టాటా మోటార్స్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు ఉపశమనం లభించినట్లే అవుతుంది. అయితే, ఈ విషయం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడా లేదు. కంపెనీ భారతదేశంలో సుమారు 170 డీలర్ భాగస్వాములను కలిగి ఉంది. ఈ డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. -
'ఫోర్డ్' పంచాయితీలో సాయం చేయండి: ఎఫ్ఏడీఏ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఓ లేఖ రాశారు. డీలర్లకు పరిహార స్వరూపాన్ని నిర్ణయించే విషయంలో ఎఫ్ఏడీఏ ప్రతిపాదించే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా ఫోర్డ్ ఇండియాను ఆదేశించాలని గులాటీ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పరిహార ప్యాకేజీలాంటిదేమీ ప్రకటించకుండానే నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ) మీద సంతకాలు చేయాలంటూ డీలర్లను ఫోర్డ్ ఇండియా బలవంత పెడుతోందని గులాటీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్లు, కస్టమర్లతో పాటు ఆయా డీలర్‌షిప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలను కూడా పరిరక్షించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని గులాటీ కోరారు. గడిచిన పదేళ్లలో భారత మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఫోర్డ్.. ఇక్కడి తమ తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, ఇకపై దిగుమతి చేసుకున్నవే విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
5 ఆటోమొబైల్ కంపెనీల దెబ్బకి నిరుద్యోగులుగా 64,000 మంది
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో పేర్కొన్నట్లుగా ఎక్కడో జరిగిన ఒక చర్య వల్ల ప్రస్తుతం జరుగుతున్న పని మీద ప్రభావం పడుతుంది. అలాగే, జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వెంటనే కాకపోయిన ఆ తర్వాత ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఐదేళ్లలో భారతదేశం విడిచివెళ్లిపోతున్న సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. దేశం విడిచిపోతున్న విదేశీ ఆటో మొబైల్ కంపెనీల వల్ల సుమారు 64,00 మంది ఉద్యోగం కోల్పోయినట్లు, రూ.2,485 కోట్ల నష్టం డీలర్లకు వాటిల్లినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్(ఎఫ్ఎడీఎ) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పంచుకున్న డేటాలో వెల్లడించింది. ఆరు ప్రధాన ఆటోమోటివ్ కంపెనీలు బ్రాండ్లు అయిన ఫోర్డ్, జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, ఫీయట్, హార్లే డేవిడ్సన్, యుఎం మోటార్ సైకిల్స్ వంటి అనేక దిగ్గజ విదేశీ వాహన కంపెనీలు 2017 నుంచి భారతదేశంలో అమ్మకాలను నిలిపివేశాయి. ఈ నిర్ణయం వల్ల 464 మందికి పైగా డీలర్లు ప్రభావితం అయ్యారు. ఎఫ్ఎడీఎ అధ్యక్షుడు వింకేష్ గులాటి మాట్లాడుతూ.. "ఈ ఎంఎన్సీల ఆకస్మికంగా వెళ్ళిపోవడం మొత్తం ఆటో రిటైల్ పరిశ్రమకు చాలా బాధను కలిగిస్తాయి. వినియోగదారుల నుంచి సరైన మద్దతు లేకుండా వ్యాపారం చేయడం కష్టం. కానీ, దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయం భారీ పెట్టుబడులతో ఈ రంగంలోనికి ప్రవేశించాలి అనుకునే స్టార్టప్ కంపెనీల ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది" అని ఆగస్టులో జరిగిన ఎఫ్ఎడీఎ మూడవ ఆటో రిటైల్ సమావేశానికి హాజరైన భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేను ఉద్దేశించి ప్రస్తావించారు. ఫోర్డ్ ఇండియా అనేక సంవత్సరాలుగా నిలుదొక్కుకునేందుకు ప్రయత్నించిన తర్వాత ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న నిష్క్రమించింది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో స్వంత ఉద్యోగులలో 4,000 మందికి పైగా రెండు తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్నారు. ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం వల్ల వారు నిరుద్యోగులుగా మారనున్నారు. భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ డిమాండ్ చేసింది. ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రాకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. (చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!) -
భారత్‌కు దిగ్గజ కంపెనీ గుడ్‌బై, పరిహారంపై రాని స్పష్టత
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ..భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ డిమాండ్ చేసింది. ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రాకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. ఫోర్డ్ ప్లాంట్ల మూసివేత ప్రకటనతో కొనుగోలుదారులంతా బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారని, దీంతో డీలర్లు భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మంది డీలర్‌షిప్‌లు తీసుకుని అయిదేళ్లు కూడా కాలేదని, కనీసం బ్రేక్ ఈవెన్ స్థాయి కూడా అందుకోలేదని గులాటీ తెలిపారు. పరిహారానికి సంబంధించి ఫోర్డ్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఉంటుంది కాబట్టి దాన్ని తమకు తెలియజేస్తే డీలర్లకు వివరించడానికి వీలవుతుందని, ఈ ప్రక్రియ సామరస్యంగా ముగిసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. డీలర్లకు పంపిన నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ)లోనూ పలు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని, వాటిని సవరించాలని.. తగు రీతిలో స్పష్టతనివ్వాలని గులాటీ కోరారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోని రెండు ప్లాంట్లలోనూ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, ఇకపై కేవలం దిగుమతి చేసుకున్న వాహనాలే విక్రయిస్తామని ఫోర్డ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 4,000 మంది పైచిలుకు ఫోర్డ్ ఉద్యోగులపైనా, దాదాపు 300 పైగా అవుట్‌లెట్స్‌ను నిర్వహించే 150 మంది డీలర్లపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కంపెనీ గత పదేళ్ల కాలంలో భారత మార్కెట్లో సుమారు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు చవిచూసింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!
'Please don't leave': ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఫోర్డ్ డోంట్ గో అంటూ సోషల్ మీడియాలో ఫోర్డ్‌తో తమకున్న ఎమోషనల్ బాండింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది. - మెయినుద్దీన్ షేక్ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్ అస్పైర్ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్ ప్లీజ్ డోంట్ గో అంటూ కోరాడు No more EcoSport and Endeavour #FordIndia pic.twitter.com/gWRGunXA19 — Car Stuff (@carrelatedstuff) September 9, 2021 - భార్గవ్ పెదకొలిమి అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్‌బ్రేక్ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్, పవర్ఫుల్ ఇంజన్ అందివ్వడంలో ఫోర్ట్ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. - నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్ నౌతియాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. I'm at a loss of words. I dreamt of owning a Ford since I was 6 or maybe 7 years old. A childhood dream just got crushed. I wish you had updated your budget vehicles (Figo/Freestyle/Aspire). They were enthusiast's choice and had so much potential. 😢 — Siddharth Nautiyal (@1998_Siddharth_) September 9, 2021 నాట్ లీవింగ్ ఇండియా ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్ ట్వీట్స్‌కి ఫోర్డ్ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్ బిజినెస్ మోడల్ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్ రన్లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది. Hello, Kunal: Ford is NOT leaving India. A new, asset-light business model is being created with the reforms we announced today. This business model will be more profitable in the long run. ^VG — Ford India Service (@FordIndiaHelp) September 9, 2021 -
ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ తన భారత ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పిస్తోంది. కోవిడ్–19(కరోనా) వైరస్ కంపెనీలో వ్యాపించకుండా ఉండేందుకు ఇక్కడి 10,000 మంది ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఫెసిలిటీలోనే పనిచేయాల్సిన ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారికి ఈ అవకాశం ఇచ్చినట్లు వివరించింది. ఇదే విధంగా వోల్వో కార్ ఇండియా కూడా తన ఉద్యోగుల్లో 40 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇచ్చింది. -
ఫోర్డ్ ఎండీవర్ 2020 ఎడిషన్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ ప్రీమియమ్ ఎస్యూవీ మోడల్, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్ ఎస్యూవీ 2020 ఎడిషన్ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్డీ అనురాగ్ మెహరోత్రా చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకే అని, ఆ తర్వాత నుంచి రూ.70,000 అధికంగా ఉంటాయని వివరించారు. బీఎస్–సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా 2.0 లీటర్ ఈకోబ్లూ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించామని, 10 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 14 శాతం అధిక మైలేజీ.... ఎస్యూవీ సెగ్మెంట్లో ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న ఎస్యూవీ ఎండీవరే అని అనురాగ్ పేర్కొన్నారు. ఈ 2020 ఎడిషన్ 14 శాతం అధిక మైలేజీని ఇస్తుందని తెలిపారు. ఈ మోడల్లో 4 ్ఠ2 డ్రైవ్‌లైన్ వేరియంట్ 13.9 కి.మీ. 4 ్ఠ4 డ్రైవ్‌లైన్ వేరియంట్ 12.4 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారులు ఎండీవర్‌నే ఎంచుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
పాత కారు.. కొత్త మోజు
బంజారాహిల్స్: కాలం చెల్లిన పాత కార్లను చాలామంది స్క్రాబ్ దుకాణాలకు అమ్మేస్తుంటారు. కానీ బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లోని అరోరా కాలనీకి చెందిన యువకుడు నవాబ్ ముర్తుజా అలీ హుస్సేన్ మాత్రం అలా చేయడు. తన తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న పాత కార్లను భద్రంగా ఉంచుతున్నాడు. అంతేగాక పాత కార్లను కొనుగోలు చేస్తూ వాటిపై తన మక్కువను చాటుకుంటున్నాడు. ముర్తుజా అలీ హుస్సేన్ది నవాబుల కుటుంబం. ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం కార్ల వ్యాపారం చేస్తున్నాడు. తన షెడ్లో 1926 నాటి ఆస్టిన్, ఫోర్డ్ కార్లు ఇప్పటికీ ఉన్నాయి. 1938లో తయారైన మోరిస్ టైగర్, 1945కు చెందిన మోరిస్, 1948కు చెందిన జాగ్వార్ కార్లు ఆయన ఇంటిలో కొలువుదీరాయి. వింటేజ్ కార్ల ప్రదర్శనలో వీటిని పెడుతుంటారు. ఇప్పటి వరకు తన వద్ద 15 పాత కార్లు ఉన్నాయని, వాటిని అపురూపంగా చూసుకుంటానని వెల్లడించాడు. తన హాబీ వెనక ఉన్న విశేషాలను ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. ఎంతో గర్వంగా ఉంటుంది.. ‘మా నాన్న నవాబ్ సయ్యద్ కుర్బాన్ అలీ. ముంబైలో అంబానీ వ్యక్తిగత సలహాదారుగా పనిచేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆయన మృతి చెందారు. మా తాత నవాబ్ ఇనాయత్ జంగ్. బహదూర్ నిజాం సర్కార్‌లో పనిచేసేవారు. నాటి నుంచి మేం నవాబులమయ్యాం. 1926లో నగరంలో అతి కొద్ది మందికి మాత్రమే కార్లు ఉండేవి. అందులో మా కుటుంబం ఒకటి. అప్పటి కారును ఇప్పటి వరకు మా ఇంట్లో భద్రంగా ఉంది. తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన పాత కార్లను భద్రంగా ఉంచారు. నేను సైతం ఇదే బాటలో నడుస్తున్నా. నేను జాగ్వార్ వింటేజ్ కారులో సిటీ రోడ్లపై తిరుగుతుంటా. అంతా నన్నే చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. వివిధ దేశాలవారు నా వద్ద ఉన్న కార్లను చూసేందుకు వస్తుంటారు. దేశంలో జరిగే వింటేజ్ కార్ల ప్రదర్శనకు కార్లను తీసుకెళ్తుంటాను. నా వద్ద 1926 నాటి మోడల్ ఫోర్డ్ కారు రూ.కోట్లు వెచ్చించినా దొరకదు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్లలోనే ఫంక్షన్లకు వెళుతుంటాం. అక్కడ అందరి కళ్లూ వీటిపై ఉంటాయి. అరోరా కాలనీలో పాత కార్లు ఒకే ఇంట్లో పార్కు చేసి ఉండటంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తుంటారు’ అని ముర్తుజా అలీ హుస్సేన్ ఆనందం వ్యక్తంచేశారు. -
మహీంద్రా చేతికి ‘ఫోర్డ్ ఇండియా’
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార పరంగా తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ(ఎఫ్ఎంసీ) మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)తో జట్టు కట్టింది. రెండు కంపెనీల ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్(జేవీ)కు ఫోర్డ్ మోటార్ కంపెనీ భారత వ్యాపార కార్యకలాపాలు బదిలీ అవుతాయి. ఈ జేవీలో ఎంఅండ్ఎంకు 51 శాతం వాటా, మిగిలిన 49 శాతం వాటా ఫోర్డ్ మోటార్‌కు ఉంటుంది. గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న ఇంజిన్ల తయారీ ప్లాంట్ మాత్రం ఫోర్డ్ అధీనంలో ఉంటుంది. భారత్‌లో ఫోర్డ్ బ్రాండ్ కింద వాహనాల అభివృద్ధితోపాటు విక్రయాలను ఈ జేవీ చూస్తుంది. అదే విధంగా అధిక వృద్ధి అవకాశాలుఉన్న విదేశీ మార్కెట్లలో మహీంద్రా, ఫోర్డ్ బ్రాండ్ల వాహనాలను కూడా విక్రయిస్తుంది. జాయింట్ వెంచర్ స్వరూపం.. ఒప్పందంలో భాగంగా ఫోర్డ్ మోటార్ అనుబంధ కంపెనీ ఆర్డోర్ ఆటోమోటివ్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఎంఅండ్ఎం 51 శాతం వాటా తీసుకుంటుంది. ఇందుకోసం ఎంఅండ్ఎం రూ.657 కోట్లు చెల్లిస్తుంది. మిగిలిన 49 శాతం వాటా ఫోర్ట్ మోటార్ చేతుల్లోనే ఉంటుంది. 51 శాతం వాటా కోసం చేసే పెట్టుబడులు సహా మొత్తం రూ.1,400 కోట్లను ఆర్డోర్ ఆటోమోటివ్ పరిధిలో వ్యాపార వృద్ధికి ఎంఅండ్ఎం వెచ్చించనుంది. ఫోర్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని భారత వ్యాపార కార్యకలాపాలు ఆర్డోర్ ఆటోమోటివ్‌కు బదిలీ చేస్తారు. చెన్నై, సనంద్ ప్లాంట్లు కూడా బదిలీ అవుతాయి. కాకపోతే సనంద్‌లోని పవర్‌ట్రెయిన్ తయారీ ప్లాంట్‌ను ఈ ఒప్పందంలో చేర్చలేదు. ఫోర్డ్ ఇండియా 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.26,324 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరాల్లో వరుసగా రూ.25,010, రూ.22,103 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. మూడు యుటిలిటీ వాహనాలు మిడ్‌సైజ్ ఎస్‌యూవీతోపాటు మూడు నూతన యుటిలిటీ వాహనాలను ఫోర్డ్ బ్రాండ్ కింద జాయింట్ వెంచర్ తీసుకురానుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ జేవీ దృష్టి పెడుతుంది. వర్ధమాన మార్కెట్ల కోసం వాహనాలను అభివృద్ధి చేయడంతోపాటు ఎగుమతి కూడా చేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య లావాదేవీ 2020 మధ్య నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఫోర్డ్, ఎంఅండ్ఎం 2017 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక ఒప్పందం ఒకటి చేసుకున్నాయి. ఉత్పత్తుల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలు, పంపిణీ విషయంలో సహకరించుకోవడం నాటి ఒప్పందం కాగా, ఇప్పుడు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. కలసి సాగితే లాభం..: ‘‘ఇంజనీరింగ్, విజయవంతమైన నిర్వహణలో మహీంద్రాకు అనుభవం ఉంది. ఫోర్డ్‌కు సాంకేతికత, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానత, భవిష్యత్తు టెక్నాలజీలను అందిపుచ్చుకునే బలాలు ఉన్నాయి’’ అని ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఉమ్మడి సహకారంతో వినియోగదారులకు మరిన్ని వాహనాలను అందించడం సాధ్యపడుతుందని ఫోర్డ్ మోటార్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిల్‌ఫోర్డ్ అన్నారు. -
మార్కెట్లోకి ఫోర్డ్ ‘ఎకోస్పోర్ట్ 2019’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చిన ఈ 2019 ఎడిషన్ ధరల శ్రేణి రూ.7.69 లక్షల నుంచి రూ.11.33 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్ వేరియంట్ 1.5లీటర్ల ఇంజిన్, 1–లీటర్ ఎకోబోస్ట్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుండగా.. డీజిల్ వేరియంట్ 1.5లీటర్ల ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ‘థండర్ ఎడిషన్’ డీజిల్ ఇంజిన్ ధరల శ్రేణి రూ.10.18 లక్షల నుంచి రూ.10.68 లక్షలు. ఇక గతేడాది ఎకోస్పోర్ట్ వెర్షన్‌తో పోల్చితే ఈ నూతన ఎడిషన్ ధర రూ.57,400 వరకు తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. ట్రిమ్ స్థాయి ఆధారంగా రూ.8,300 నుంచి గరిష్టంగా 57,400 వరకు తగ్గినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహరోత్రా మాట్లాడుతూ.. ‘ఉత్పత్తి అభివృద్ధి పరంగా బలమైన బృందం తమ పనితీరును ప్రదర్శించడం, కొనసాగుతున్న స్థానికీకరణ కృషి ఫలితంగా ఈ నూతన వెర్షన్ విడుదలైంది’ అని అన్నారు. -
మార్కెట్లోకి ఫోర్డ్ ‘ఫిగో’ 2019 ఎడిషన్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘ఫిగో’లో నూతన ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈకారు విడుదల కాగా, ధరల శ్రేణి రూ.5.15 లక్షలు నుంచి రూ.8.09 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. 1.2 లీటర్లు, 1.5 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో విడుదలైన నూతన ఫిగోలో.. టాప్ ఎండ్ మోడల్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎలెక్ట్రోక్రోమిక్ మిర్రర్ లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 1,200లకు మించిన నూతన భాగాలు, సమగ్ర పునఃరూపకల్పన, మెరుగైన భద్రతా సాంకేతికత, నూతన ఇంజిన్ ఈ ఏడాది ఎడిషన్ ప్రత్యేకతలుగా తెలిపింది. -
వాహన సంస్థల ఫ్రెండ్లీ షి‘కారు’
(సాక్షి, బిజినెస్ విభాగం): కానోడికి కానోడు మనోడనేది నానుడి. కానీ ఇపుడు వాహన పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కంపెనీలు పోటీ కంపెనీల్ని ప్రత్యర్థులుగా భావించడం మానేస్తున్నాయి. ప్రతి కంపెనీ... తోటి కంపెనీని ఫ్రెండ్లీగానే చూస్తోంది. దీనికి ప్రధాన కారణం భారత్ స్టేజ్ (బీఎస్)–6 నిబంధనలే, ఇవి మరో ఏడాదిలో అమల్లోకి రానుండటం తో... వీటికి తగిన ఇంజిన్ల తయారీ కోసం కార్ల కంపెనీలు గట్టి కసరత్తు చేస్తున్నాయి. సొంతగా ఇంజిన్లు తయారు చేయాలంటే పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఇతర చర, స్థిర వ్యయాలు అదనం. మరోవైపు బీఎస్–6 నిబంధనల గడువు దగ్గరకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో వాహన పరిశ్రమలో కంపెనీలు మిత్ర గీతం ఆలపిస్తున్నాయి. పోటీ అని చూడకుండా ఒక కంపెనీ, మరో రెండు, మూడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ బిజినెస్ ప్రత్యేక కథనమిది... భారత్ స్టేజ్ అంటే... మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మోటార్ వాహనాల నుంచి వాతావరణంలోకి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, పర్టిక్యులేట్ మ్యాటర్(పీఎమ్), సల్ఫర్ ఆక్సైడ్ల మోతాదులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిబంధనల్ని రూపొందించారు. 2017 నుంచి భారత్ స్టేజ్–4 నిబంధనలు అమల్లోకి రాగా... 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్–6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ల తయారీ, కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవటం కంపెనీలకు వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఇంజిన్ల తయారీ ఖరీదు కావడం, ఇతర వ్యయాల కారణంగా కొనుగోలు దారులకు కూడా అదనపు భారం తప్పదు. తప్పనిసరై ఒప్పందాలు... వ్యయ భారం తగ్గించుకునే క్రమంలో భాగంగా కార్ల కంపెనీలు పోటీ కంపెనీలతో తప్పనిసరై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తర్వాతి తరం ఇంజిన్ల తయారీ కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఆరుకు పైగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం దీంట్లో భాగమే. ఈ రెండు కంపెనీలే కాక ఫియట్, ఫోర్డ్, తదితర పెద్ద కంపెనీలు కూడా ఇంజిన్లకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇంజిన్లను ఇతర కంపెనీల నుంచి సమీకరించడం వల్ల కార్ల కంపెనీలకు చాలా అంశాలు కలసివస్తాయి. స్థిర, చర వ్యయాలు తక్కువగా ఉండటమే కాకుండా కంపెనీలు ప్రొడక్ట్ డెవలప్మెంట్పై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది. దీంతో వాహనం ధరను ఆకర్షణీయ స్థాయిలో నిర్ణయించవచ్చు. బీఎస్–4 డీజిల్ ఇంజిన్ల కన్నా బీఎస్–6 డీజిల్ ఇంజిన్ల ఖరీదు ఎక్కువ. ఈ ఇంజిన్లను సరుకులు రవాణా చేసే త్రీ వీలర్ల నుంచి ఆధునిక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌కు(ఎస్యూవీ) వినియోగించనున్నారు. టాటా మోటార్స్‌కు ఫియట్ ఇంజిన్లు... టాటా మోటార్స్ ఇటీవలే హారియర్ పేరిట కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చింది. దీనిని 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో రూపొందించారు. ఈ ఇంజిన్లను ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (గతంలో ఫియట్ ఇండియా) నుంచి టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాదే మార్కెట్లోకి రానున్న ఏడు సీట్ల హారియర్ మోడల్‌కు కూడా ఇంజిన్లను ఈ కంపెనీ నుంచే టాటా మోటార్స్ తీసుకుంటోంది. హారియర్‌లో ఆటోమేటిక్ వేరియంట్‌కు కావలసిన ఇంజిన్ల కోసం కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్తో టాటా చర్చలు జరిపిందని, సాంకేతిక కారణాలతో డీల్ కుదరలేదని సమాచారం. హారియర్ ఆటోమేటిక్ వేరియంట్‌కు కావలసిన బీఎస్–6 డీజిల్ ఇంజిన్లను సరఫరా చేస్తామని ఫియట్ క్రిస్లర్ కంపెనీ ముందుకు వచ్చింది. టాటా మోటార్స్‌కే కాకుండా బ్రిటిష్ బ్రాండ్ ఎమ్జీ మోటార్స్‌కు కూడా ఇంజిన్లను సరఫరా చేయడానికి ఫియట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎమ్జీ మోటార్స్ భారత మార్కెట్లో హెక్టర్ మోడల్‌తో అరంగేట్రం చేయనుంది. ఐదు సీట్ల ప్రీమియం ఎస్యూవీ... హెక్టర్‌లో ఫియట్ సరఫరా చేసే ఇంజిన్లనే ఉపయోగిస్తారు. ఇదే ఇంజిన్‌ను ఫియట్ కంపెనీ తన జీప్ కంపాస్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తోంది. ఫోర్డ్‌కు మహీంద్రా... ఇంజిన్ల సరఫరా ఒక్క ఫియట్ కంపెనీకే పరిమితం కాలేదు. దేశీ దిగ్గజ వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇంజిన్లను సరఫరా చేయనుంది. ఈ కంపెనీ 1.2 లీటర్ల టర్బో–చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను ఫోర్డ్ కంపెనీకి సరఫరా చేస్తోంది. తన ఈకో స్పోర్ట్ ఎస్‌యూవీలో ఈ ఇంజిన్లను ఫోర్డ్ వాడుకోనుంది. ఇటీవలే మహీంద్రా మార్కెట్లోకి తెచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీలో ఈ ఇంజిన్నే వాడారు. మహీంద్రా ఇంజిన్లను సరఫరా చేయటంతో పాటు, వేరే కంపెనీ నుంచి ఇంజిన్లను కొనుగోలు కూడా చేస్తోంది. తన త్రీ వీలర్ల కోసం చిన్నదైన రెండు సిలిండర్ల డీజిల్ ఇంజిన్లను గ్రీవ్స్ కాటన్ కంపెనీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక గ్రీవ్స్ కాటన్ బీఎస్–సిక్స్ ఇంజిన్లను పియాజియో కంపెనీకి సరఫరా చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పియాజియో కంపెనీ తన త్రీ వీలర్లలో ఈ ఇంజిన్లను ఉపయోగించనున్నది. ఫోక్స్‌వ్యాగన్ ప్రాజెక్ట్ 2.0 ఫోక్స్‌వ్యాగన్– స్కోడా భారత్‌లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వచ్చే ఏడాది కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం బీఎస్–6 ఇంజిన్ల కొనుగోలుదారుల కోసం చూస్తోంది. జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే బీఎస్– 6(యూరో–సిక్స్) ఇంజిన్లు తయారు చేస్తోంది. భారత్‌లో ప్రాజెక్ట్ 2.0 పేరుతో కొత్త తరం ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టనుంది. ఇంజిన్ల తయారీకి స్థానిక విడిభాగాలను 95 శాతం వరకూ వినియోగించుకోనున్నది. టెక్నాలజీ కోసం కూడా... బీఎస్–6 ఇంజిన్ టెక్నాలజీ కోసం టాటా మోటార్స్ సంస్థ వెస్ట్పోర్ట్ ఫ్యూయల్ సిస్టమ్స్తోను, అశోక్ లేలాండ్ జపాన్‌కు చెందిన హినోతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కెనడాకు చెందిన వెస్ట్పోర్ట్ 4, 6 సిలిండర్ల సీఎన్జీ ఇంజిన్లను టాటా మోటార్స్‌కు సరఫరా చేయనుంది. తన ట్రక్కులు, బస్సుల కోసం ఈ ఇంజిన్లను టాటా మోటార్స్ ఉపయోగిస్తుంది. కమ్మిన్స్ కంపెనీతో ఇంజిన్ల సరఫరా ఒప్పందాలు గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్ కొనసాగిస్తోంది. బీఎస్–సిక్స్ డీజిల్ ఇంజిన్ల కోసం తాజాగా మరో ఒప్పందాన్ని టాటా మోటార్స్ కుదుర్చుకుంది. -
చదువుకున్నా.. సెన్స్ సున్నా..
నగరాల్లో కార్లను నడిపే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలా స్పందిస్తున్నారు? రోడ్లపై వారెంత అప్రమత్తంగా ఉంటున్నారు? ఇతరులతో ఎంత మర్యాదగా మెలుగుతున్నారు? ఇలాంటి విషయాలపై ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఫోర్డ్ ఇటీవల కార్టెసి సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం హైదరాబాద్ సహా 10 నగరాలను ఎంచుకుంది. రహదారి భద్రతను పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన ఫైవ్– పిల్లర్ అప్రోచ్‌కు అనుగుణంగా దేశీయ నగరాల్లో కార్ల డ్రైవర్లను, వారి ప్రవర్తనను విశ్లేషించే ప్రయత్నం చేసిందీ సర్వే. సాక్షి, సిటీబ్యూరో :6 మెట్రో నగరాల్లో.. కార్లు నడిపేవారు అత్యంత అప్రమత్తతతో మెలుగుతున్నవిగా హైదరాబాద్, కోల్‌కతా నగరాలు ఎంపికవ్వడం విశేషం. అదే సమయంలో ఈ విభాగంలో ముంబై, ఢిల్లీ నగరాలు మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. నాన్ మెట్రో నగరాల్లో లూథియానా, లక్నో, పుణె ముందంజలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రోడ్లపై వాహన చోదకుల ప్రవర్తన, ఆలోచనల గురించి ఈ సర్వే వెల్లడించిన పలు విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చదువుకున్నా.. సెన్స్ సున్నా.. ట్రాఫిక్ సేఫ్టీ, రైట్ రోడ్ బిహేవియర్లో విద్యావంతులు మేము సైతం అంటూ నిబంధనలు తోసి రాజంటున్నారని సర్వే తేల్చింది. విద్యావంతులైన వారిలో 51శాతం మందికి సీట్ బెల్ట్స్ వాడడం రోడ్ సేఫ్టీకి అత్యవసరమైన అంశమనేది అవగాహన లేదు. అలాగే తాము చైల్డ్ లాక్ ఉపయోగించబోమని 42శాతం మంది చెప్పారు. అదే విధంగా 27శాతం మంది తాము రాత్రి సమయంలో డైప్పర్స్ వాడమన్నారు. ఇక డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడంలో తప్పేమీ లేదని 22 శాతం మంది అంటున్నారు. పిల్లలే ‘దారి’ చూపుతున్నారు సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పెళ్లి కాని వారు, సింగిల్స్‌గా నివసిస్తున్నవారి కన్నా, పెళ్లయి పిల్లలున్నవారు చాలా అప్రమత్తతతో ఉంటున్నారట. పసిపిల్లలు కలిగి ఉన్న యువ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే టీనేజ్ పిల్లలున్నవారు కూడా తమ పిల్లలకు రోడ్ సేఫ్టీ విషయంలో రోల్ మోడల్స్‌గా ఉండాలని కోరుకుంటూ తదనుగుణంగా మెలుగుతున్నారు. అనుభవమే పాఠం.. ఏ విషయంలోనైనా అనుభవాన్ని మించిన పాఠం లేదు. గతంలో రోడ్డు ప్రయాణాల సమయంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నవారు, ప్రమాదాలు/ఇతర నష్టాలకు గురైన వారు ఒకింత జాగ్రత్తగా ఉంటున్నారు. అటువంటి అనుభవాలేమీ లేనివారికన్నా 8శాతం ఎక్కువ జాగ్రత్త చూపిస్తున్నారు. కారున్న మైనరూ.. షురూ నిర్ణీత వయసు లేకపోయినా డ్రైవ్ చేయడాన్ని తాము అంగీకరిస్తామని 33శాతం మంది చెప్పడం ఆందోళనకరం. అలాగే 18శాతం మంది మద్యం సేవించి డ్రైవ్ చేయడం ఏమంత పెద్ద తప్పుకాదని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే 18 నుంచి 34 మధ్య వయస్కులు తమకన్నా పెద్ద వయస్కులతో పోలిస్తే కాస్తంత అప్రమత్తత పెంచుకోవాల్సిన అవసరం కనిపించింది. ఇక పురుషులకన్నా మహిళలు మరింత జాగరూకతతో మెలుగుతున్నట్టు వెల్లడైంది. పరుగే జీవన తత్వం.. కరువైన మానవత్వం.. ఉరుకుల పరుగుల జీవితం యాంత్రికంగా మార్చేస్తోందని మరోసారి రుజువైంది. రోడ్ల మీద అంధుల కోసం తాము ఆగబోమని 48శాతం మంది తేల్చి చెప్పేశారు. ప్రతి ఇద్దరిలో ఒకరు తాము రహదారి మధ్యలో సాయం కోసం అర్థించే వ్యక్తిని పట్టించుకోమన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను తమ వాహనంలో ఆస్పత్రికి తరలించే ఆలోచన చేయబోమని 41శాతం మంది, వృద్ధులకు రోడ్డు దాటడంలో సాయపడబోమని 40శాతం మంది చెబుతున్నారు. ఖాకీ.. లేకపోతే చలాకీ.. అదుపు చేసేవారు లేకపోతే చాలా మందిలో హద్దూ అదుపూ ఉండదని తేలింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు గానీ కనపడకపోతే సిగ్నల్స్ పట్టించుకోబోమని 22శాతం మంది అంగీకరించారు. అలాగే ఒకవేళ నిబంధనలను అతిక్రమించి పట్టుబడినా పోలీసుల్ని ‘మేనేజ్’ చేయడానికి ప్రయత్నిస్తామని 22శాతం మంది అంటున్నారు. -
అటూఇటుగా బైక్‌ల విక్రయాలు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి. ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్ 2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది. సోనాలికా ట్రాక్టర్ విక్రయాలు 12% పెరిగాయి గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 11.9% పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14% వృద్ధి చెందాయి. జీఎస్టీని తగ్గించాలి.. ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28% జీఎస్టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలూ ఉన్నాయని పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్‌లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్టీ రేటును 18%కి తగ్గించాలని కోరారు. -
హ్యుందాయ్ కార్ల ధరలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్ నుంచి ఎస్యూవీ ట్యూసన్ వరకూ వివిధ రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కమోడిటీల ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లలో ఒడిదుడుకుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, నిస్సాన్ ఇండియా, మారుతీ సుజుకీ, టయోటా, బీఎమ్‌డబ్ల్యూ, రెనో, ఇసుజు కంపెనీలు ధరలను పెంచనున్నామని పేర్కొన్నాయి. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్‌ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.