
న్యూఢిల్లీ: అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ తన భారత ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పిస్తోంది. కోవిడ్–19(కరోనా) వైరస్ కంపెనీలో వ్యాపించకుండా ఉండేందుకు ఇక్కడి 10,000 మంది ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఫెసిలిటీలోనే పనిచేయాల్సిన ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారికి ఈ అవకాశం ఇచ్చినట్లు వివరించింది. ఇదే విధంగా వోల్వో కార్ ఇండియా కూడా తన ఉద్యోగుల్లో 40 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment