15 ఏళ్లుగా ప్రేమ నిజమే.. విశాల్‌తో రూమర్స్‌పై 'అభినయ' కామెంట్‌ | Actress Abhinaya Comment Her Boyfriend And Vishal | Sakshi
Sakshi News home page

15 ఏళ్లుగా ప్రేమ, విశాల్‌తో కాదు అంటూనే.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ'

Jan 29 2025 11:54 AM | Updated on Jan 29 2025 12:44 PM

Actress Abhinaya Comment Her Boyfriend And Vishal

దమ్ము సినిమాలో ఎన్టీఆర్‌ సోదరిగా నటించిన అభినయ

రామ్‌ చరణ్‌ ధృవ సినిమాలో డా.అక్షరగా ఛాన్స్‌

చిరకాల స్నేహితుడితో పెళ్లి ప్రకటించిన అభినయ

విశాల్‌తో రూమర్స్‌.. నిజం లేదంటూ  క్లారిటీ

రవితేజ నటించిన 'నేనింతే' సినిమాతో నటి అభినయ (Abhinaya) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ‘శంభో శివ శంభో’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. విశాల్‌తో (Vishal ) పెళ్లి, ప్రేమ రూమర్స్‌పై ఆమె స్పందించారు. ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) అభినయ.. తన సైన్‌ లాంగ్వేజ్‌తో  పలు విషయాలు పంచుకున్నారు. రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'పని' (Pani). నటుడు జోజూ జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఈ మూవీలో ఆమెపై  చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం చాలా  వివాదాస్పదమైంది. దీంతో జోజూ జార్జ్‌ మేకింగ్‌ను చాలామంది తప్పుపట్టారు. ఈ విషయంపై కూడా అభినయ స్పందించారు.

విశాల్‌తో  ప్రేమ.. అసలు ప్రియుడిని పరిచయం చేసిన అభినయ
విశాల్‌తో పూజా చిత్రంలో మెప్పించిన అభినయ.. మార్క్‌ ఆంటోని మూవీలో  ఆయనకు భార్యగా నటించారు. ఆమెలో నటన పరంగా చాలా టాలెంట్‌ దాగి ఉందని పలుమార్లు విశాలు కామెంట్‌ చేశారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలాసార్లు రూమర్స్‌ వచ్చాయి. దీంతో  పలు వేదికల మీద ఇప్పటికే వారిద్దరూ ఖండించారు.   అయినా కూడా.. అభినయతో విశాల్ పెళ్లి అనే వార్తలు మాత్రం ప్రచారంలోనే ఉన్నాయి. త్వరలో పెళ్లి అంటూ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. 

(ఇదీ చదవండి : ఓటీటీలో రొమాన్స్‌ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు)

అయితే, ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని అభినయ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన సైన్‌ లాంగ్వేజ్‌లో పంచుకున్నారు. 33 ఏళ్ల అభినయకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. ఆపై మీరు ఒంటరిగా ఉన్నారా..? ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా..?  అనే ప్రశ్నలు ఎదురుకావడంతో అభినయ కంగుతిన్నారు. అయితే, ఏమాత్రం తడబాటుపడకుండా తిరిగి సమాధానం ఇచ్చారు. తాను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నానని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని  ప్రకటించిన అభినయ అభిమానులను ఆశ్చర్యపరిచారు.

మలయాళ సినిమా 'పని'లో బోల్డ్‌ సీన్‌లో అభినయ
తాజా మలయాళ చిత్రం 'పని' సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సినిమా చాలా బాగుంది అంటూ మంచి టాక్‌ ఉంది. నటుడు జోజూ జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు . ఇందులో అభినయపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. దీంతో జోజూ మేకింగ్‌ను అందరూ ట్రోల్‌ చేశారు. దీనిపై కూడా ఆమె రియాక్ట్‌ అయ్యారు. 'ఒక  మూవీలో ఎలాంటి సీన్లు పెట్టాలి..? ఎలా తెరకెక్కించాలి..?  వంటి అంశాలు పూర్తిగా దర్శకుడి నిర్ణయం. దానిని నటీనటులు తప్పకుండా గౌరవించాలి. 

దీంతో నేను ఈ అంశం గురించి పెద్దగా ఏం మాట్లడను. ఒక ప్రాజెక్ట్‌ పూర్తి కావాలంటే అందులో దర్శకుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అతని మాటే తుది నిర్ణయంగా భావించాలి. సౌత్‌ ఇండియాలో జోజూ చాలా గొప్ప నటుడు. గొప్ప గొప్ప దర్శకులతో ఆయన పనిచేశారు. మంచి అనుభవం ఉన్న నటుడు మాత్రమే కాకుండా ఒక సినిమా మేకర్‌గా ఆయన రాణిస్తున్నారు.' అని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement