Abhinaya
-
రిక్షాలో వెళ్తూ ప్రముఖ నటి తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం. ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు నటి వెల్లడించింది. ఆగస్టు 17న ఇదంతా జరిగినట్లు అభినయ చెప్పింది. ఇన్ స్టాలో తల్లిని తలుచుకుని చాలా పెద్ద పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?)తమిళనాడుకు చెందిన అభినయకు పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో నటిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేశ్-వెంకటేశ్‌కి చెల్లిగా నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. వీటితో పాటు నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.'అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇలా సడన్‌గా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావ్. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ' అని భావోద్వేగంతో అభినయ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
Actress Abhinaya: మాటలు రాకపోయినా అభినయంతో అదరగొట్టే హీరోయిన్ (ఫోటోలు)
-
మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!
అభినయ .. ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది-2, సీతారామం చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజైన విశాల్ మూవీ మార్క్ ఆంటోనీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అభినయ సినిమాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన తండ్రితో కలిసి హాజరైంది. ఆమె తండ్రి అభినయ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభినయకు వినపడదు.. అంతే కాదు మాట్లాడలేదు కూడా.. కేవలం సైగల ద్వారానే తన భావాలను వ్యక్తం చేయగలదు. (ఇది చదవండి: సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అభినయ తండ్రి ఆనంద్ మాట్లాడుతూ.. 'నా కూతురిని మొదట మోడలింగ్ రంగంలో తనను వాళ్ల అమ్మనే చాలా బాగా చూసుకుంది. నేను చాలా కంపెనీల వద్దకు వెళ్తే నాపై కొప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. అతనేమైనా పిచ్చోడా అన్నారు. కానీ నేను దేవుడిపై భారం వేశాను. మాకు గాడ్ ఎవరంటే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. మా అమ్మాయి ఇంత అందంగా పుట్టినా.. దేవుడు ఈ ప్రాబ్లమ్ ఇచ్చాడే అనుకున్నాం. మూడేళ్ల వరకు తాను నడవలేదు. చివరికీ హ్యాండీక్యాప్ అనుకున్నాం. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్న తను అందరితో కలిసిపోతుంది. ' అని అన్నారు. అభినయ మాట్లాడుతూ..'తన తల్లిదండ్రులు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నింటిలోనూ నన్ను నడిపించేది అమ్మ, నాన్నే. నాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. నా కుటుంబ సభ్యుల సహకారం జీవితంలో మరిచిపోలేను. మా నాన్నే నా జీవితం. మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. నాకు, నాన్నకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఎప్పడు ఉంటుంది. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎంతో సరదాగా ఉండేది. అప్పుడప్పుడు నువ్వే నా భర్త అనేదాన్ని. తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా' అని అన్నారు. విశాల్‌తో అభినయ పెళ్లి? ఈ వార్త విని షాకింగ్ గురైనట్లు అభినయ వెల్లడించింది. నేను ఆయనను చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలొచ్చాయి. ఒక ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. ఏదో యూట్యూబ్‌లో చూసి ఆమె అలా మాట్లాడింది. కానీ నాకు ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా తల్లిదండ్రులే నాకు అన్నీ కూడా. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేయాలి. రిలేషన్లో విలువలు ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని అభినయం అంటోంది. (ఇది చదవండి: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు) -
ఈ హీరోయిన్ పుట్టుకతోనే మూగ, చెవిటి.. లేచి నడవలేకపోయింది..
దేవుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో తక్కువైందని కొందరు భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అయితే తమ కష్టం వల్లే అది సాధ్యమైందని, లేదంటే ఎవరి కన్ను తమపై పడిందోనని తిట్టిపోస్తుంటారు. ఇలాంటివారు మన చుట్టూ బోలెడంతమంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక లోపంతో పుట్టినవారు అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేయడానికి బదులు జీవిత పోరాటం చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటారు. తమకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంటారు. అలాంటివారిలో ఒకరే హీరోయిన్ అభినయ. మాట్లాడలేదు, కానీ.. పేరుకు తగ్గట్లుగానే అభినయంలో ఆమెకు వంక పెట్టడానికి లేదు. కానీ పుట్టుకతోనే ఆమె చెవిటి, మూగ. దానికి తోడు ప్రోటీన్స్ లోపం వల్ల మూడేళ్ల వరకు లేచి నడవలేకపోయింది. అయినా ఆమె కుంగిపోలేదు. తన మైనస్‌లనే ప్లస్‌గా మార్చుకుంది. మాట్లాడలేకపోయినా, ఏమీ వినబడకపోయినా ఎదుటివారి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో ఇట్టే పసిగట్టేస్తుంది. పాత్రలకనుగుణంగా హావభావాలను వ్యక్తీకరించగలుగుతుంది. రిజెక్ట్ చేసిన డైరెక్టర్ 'నేనింతే' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది అభినయ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హిందీలో బోలెడన్ని సినిమాలు చేసింది. అయితే కోలీవుడ్‌లో ఆమె ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. 'నాడోడిగల్' సినిమాకు అభినయ ఫోటోను చూసిన డైరెక్టర్ సముద్రఖని ఆమెను వెంటనే ఓకే చేశాడు. అయితే ఆమె మూగ, చెవిటి అని తెలియడంతో వద్దని చెప్పి ముంబై నుంచి ఓ హీరోయిన్ను తీసుకొచ్చాడు. తీరా ఆమె సెట్లో ఈ తమిళ భాష ఏంటోనంటూ చిరాకు పడి చివరకు చేయనని చెప్పేసింది. దీంతో డైరెక్టర్ మాటలు రాకపోయిన అభినయతోనే సినిమా తీయాలని ఫిక్సయ్యాడు. సౌత్ టు హాలీవుడ్ కట్ చేస్తే సినిమా సూపర్ హిట్. పదికిపైగా అవార్డులు వచ్చిపడ్డాయి. ఈ సినిమా తెలుగులో శంభో శివ శంభోగా రిలీజైంది. అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. తన కెరీర్లో ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డులు సైతం అందుకుంది. ఆమె ఇక్కడితోనే పరిమితం కాలేదు. హాలీవుడ్లో ఒన్ లిటిల్ ఫింగర్ అనే సినిమా సైతం చేసింది. తనలోని వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) చదవండి: స్టేజీపై విజయ్, సామ్ రొమాంటిక్ డ్యాన్స్.. అది సరే కానీ రౌడీ హీరో ఏంటి? మరీ.. -
సీనియర్ నటి అభినయపై లుకౌట్ నోటీసులు జారీ
కన్నడ నటి అభినయనను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె తల్లితో పాటు సోదరుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వరకట్న వేధింపుల కేసులో ఈ ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు శాండల్‌వుడ్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా గత నెల రోజులుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. దీంతో దోషులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా నటి అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఎన్నో మలుపుల అనంతరం 2012లో వీరిని దోషులుగా తీర్పునిచ్చిన న్యాయస్థానం అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడికి రెండేళ్లు, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
Actress Abhinaya: సినీ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష
సాక్షి, బెంగళూరు: అన్న భార్యపై వరకట్న వేధింపులకు పాల్పడిన కేసులో సినీ నటి అభినయకు హైకోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. అనుభవ సినిమా ద్వారా ఆమె పేరుపొందారు. వివరాలు.. 1998లో సోదరుడు శ్రీనివాస్‌కు లక్ష్మీదేవి అనే యువతితో పెళ్లయింది. ఆ సమయంలో కట్నం తీసుకోలేదు. తరువాత కట్నం తేవాలని పదేపదే లక్ష్మీదేవిని వేధించారు. లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఆమె రూ. 80 వేలు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులను ఆపలేదు. దీంతో బాధితురాలు 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్ పీఎస్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో హైకోర్టులో విచారణ సాగుతూ వచ్చింది. మంగళవారం కేసును విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్‌బీ ప్రభాకర్శాస్త్రి నేరం రుజువైనట్లు పేర్కొన్నారు. ఎన్నో మలుపులు ఈ కేసు గతంలో ఎన్నో మలుపులు తిరిగింది. 2012లో కింది కోర్టు కూడా ఈ కేసులో ఐదు మందికి రెండేళ్ల శిక్ష విధించగా, జిల్లా కోర్టు వారి తప్పిదం లేదని శిక్షను రద్దు చేసింది. దీనిని బాధితురాలి కుటుంబం హైకోర్టులో సవాల్ చేయగా విచారణ సాగింది. భర్త శ్రీనివాస్, అత్తమామలు రామకృష్ణ, జయమ్మకు ఐదేళ్లు జైలు శిక్ష, నాలుగో నిందితుడు చలువరాజ్, ఐదో నిందితురాలు అభినయకు రెండేళ్ల శిక్షను విధించారు. చదవండి: (1920 నేపథ్యంలో...) -
కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్ (25) తాంబరం రంగనాథపురంలో ఉండేవాడు. ఆ సమయంలో ముడిచూరు రోడ్డులోని ఓ బేకరీలో పనిచేస్తున్న అభినయ(28)తో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సమయంలో అభినయ తన తల్లిదండ్రులతో గొడవపడి ఇక్కడే హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 29న రంగనాథపురం పెరుమాళ్ ఆలయంలో తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అభినయను నటరాజన్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత భార్యాభర్తలు రెండు వేర్వేరు నగల దుకాణాల్లో చేరారు. అభినయ ఒక్కరోజు మాత్రమే పనికి వెళ్లి ఆ తర్వాత వెళ్లలేదు. తరువాత అక్టోబర్ 19న అభినయ హఠాత్తుగా అదృశ్యమైంది. అతడి రెండు సెల్ఫోన్లు హ్యాక్ అయ్యాయి. ఇంట్లోని 17 తులాల నగలు, రూ.20 వేలు నగదు, కొత్త పట్టుచీరలతో పరారైంది. దీంతో నటరాజన్ తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..) అభినయ ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మదురై సౌత్ అరిసికర స్ట్రీట్, సోనాథరువార్ టెంపుల్ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో అభినయ సెమ్మంచేరి యమమల్ల పురం సాలైలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హాస్టల్లో ఉన్న అభినయను పోలీసులు హుటాహుటిన అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి 4 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అభినయకు అప్పటికే వివాహమై భర్త, ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసింది. అభినయ ప్లాన్ చేసి నటరాజన్‌ను ప్రేమిస్తున్నట్లు నటించి తన భర్త, బిడ్డ ఉన్న విషయం దాచిపెట్టి నగలు, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అభినయ మరో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అభినయ పలువురు యువకులను పరిచయం చేసుకుని పెళ్లి పేరిట తంతు కానిచ్చి తరువాత డబ్బు, నగలతో ఉడాయిస్తున్నట్లు తెలిసింది. అభినయ సహచరుడిగా ఉన్న సెంథిల్‌కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు.. తల్లిదండ్రులను పిలిపించి..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తిరుచ్చి సుబ్రమణ్యపురానికి చెందిన కార్తీక్ (23) బీఏ చదివి బిస్కెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సెంతనీర్ పురం సమీపంలో ఉన్న వరగనేరి పిచ్చై పట్టణానికి చెందిన అంగుస్వామి కుమార్తె అభినయ(19)ను ప్రేమించాడు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో సమయపురంలోని ఆది మారియమ్మన్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సమయపురం పోలీసులను ఆశ్రయించారు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపారు. రాజీ కుదరడంతో పెళ్లికూమార్తెను వరుడితో పాటు పంపించారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?
నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే విశాల్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నది తెలిసిందే. ఇంతకు ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత ఈయనకు హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కారణాలేమైనా ఆ పెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ నటనపైనే పూర్తి దృష్టి సారించారు. అలాంటిది నటి అభినయతో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై విశాల్ స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం ఖండించారు. నాడోడిగల్ చిత్రంతో నటిగా పరిచయమైన నటి అభినయ మూగ, చెవిటి యువతి అన్న విషయం తెలిసిందే. అయితే ఆ కొరతలను జయించి నటిగా రాణిస్తున్నారు. విశాల్‌తో ప్రేమ అనే ప్రచారం గురించి అభినయ స్పందిస్తూ తాను ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రంలో ఆయనకు భార్యగా నటిస్తున్నానని చెప్పారు. రీల్ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్ లైఫ్‌లో భార్య కాగలమా? అంటూ ప్రశ్నించారు. దీంతో విశాల్ అభినయల మధ్య ప్రేమ అనే వదంతులకు పుల్‌స్టాప్ పడినట్టు అయింది. -
కొన్ని భయాలున్నాయి నాకు : నటి అభినయ శ్రీ
Abhinaya Sri In Bigg Boss 6 Telugu: 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం.. పాటతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలకు హోస్ట్‌గానూ అలరించింది. 2014లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది. ఇక దాదాపు 9ఏళ్ల పాటు తెలుగు తెరకు దూరంగా ఉన్న అభినయ శ్రీ బిగ్‌బాస్-6తో రీఎంట్రీ ఇస్తున్నారు. జంతు ప్రేమికురాలైన అభినయ శ్రీకి బల్లి అంటే మాత్రం చచ్చేంత భయమట. దీంతో పులి అంటే భయం లేదు కానీ లిజర్డ్(బల్లి)అంటే భయమా అని నాగార్జున అడిగారు. చిన్నప్పటి నుంచి తనకి బల్లులంటే భయమని చెబుతుండగానే ఒక్కసారిగా పై నుంచి ప్లాస్టిక్ బల్లులు పడ్డాయి. మరి బిగ్‌బాస్ షోతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో మళ్లీ కంబ్యాక్ ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది. -
'నాసా'మిరంగా!
సాక్షి, చెన్నై: కలలు కనండి.. దానిని సాకారం చేసుకోండి అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశానికి తమిళుల నుంచి ఇటీవల విశేష స్పందన వస్తోంది. తమిళ విద్యార్థులు అనేక మంది పరిశోధనపరంగా ప్రతి ఏటా తమ ప్రతిభను చాటుకునే దిశగా ఉరకలు తీస్తున్నారు. ఎవరో ఒకరు అమెరికాలోని నాసా సందర్శనకు ఎంపిక, అక్కడ జరిగే సదస్సుకు హాజరవుతున్నారు. తొలుత కరూర్ జిల్లా పల్లం పట్టికి చెందిన రిఫాత్ షారూక్‌ను స్పెస్ కిడ్జ్ సహకారంతో పర్యావరణ, వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే రీతిలో అతి తక్కువ బరువుతో ఓ శాటిలైట్ రూపొందించి నాసా క్యూబ్స్ ఇన్ స్పెస్ పోటీల్లో తమిళుడిగా, భారత దేశ ఖ్యాతిని చాటారు. ఆతదుపరి మదురైకు చెందిన మహాత్మాగాంధీ మాంటిస్సోరి మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి జెధాన్య తస్నిమ్ అమెరికాలోని నాసా సందర్శనకు ఎంపికయ్యారు. తాజాగా నామక్కల్‌కు చెందిన అభినయ ఎంపిక కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం రూ.2 లక్షల సాయం ఆరో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు చదవుతున్న విద్యార్థుల్లోని స్పేస్ పరిశోధనా ప్రతిభను వెలికి తీసే రీతిలో ఇటీవల ఓ సంస్థ పరీక్షలు నిర్వహించింది. ఇందులో నామక్కల్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదవుతున్న విద్యార్థిని అభినయ తన ప్రతిభను చాటుకుంది. ఆ బాలిక నాసా పర్యటనకు ఎంపికైంది. నాసా సందర్శనతో పాటుగా అక్కడ జరిగే అంతరిక్ష పరిశోధన మహానాడులో అభినయ ప్రత్యేక ప్రసంగం ఇవ్వనుంది. ఈ సమాచారంతో సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినయకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మరిన్ని రికార్డులు సృష్టించాలని, పరిశోధనాపరంగా తమిళనాడు ఖ్యాతిని చాటాలని సూచించారు. అభినయను ప్రోత్సహిస్తూ రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆమెకు అందించాలని ఆదివారం అధికారుల్ని ఆదేశించారు. -
ఘనంగా అభినయ వివాహం
-
ఘనంగా అభినయ వివాహం
చెన్నై: నటుడు పార్థిబన్, నటి సీతల పెద్ద కూతురు అభినయ పెళ్లి ఆదివారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. అభినయకు నటుడు ఎంఆర్.రాధ కొడుకు ఎంఆర్ఆర్.వాసు కూతురు సత్య జయచిత్ర కొడుకు నరేష్ కార్తీక్‌తో నిన్న (ఆదివారం) ఉదయం స్థానిక అడయారులోని లీలా ప్యాలెస్‌లో వేదమత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నవ వధూవరులను ఆశీర్వదించారు. పార్థిబన్, సీతల రెండవ కూతురు కీర్తన పెళ్లి ఇంతకు ముందే జరిగిన విషయం విదితమే. ఈ వేడుకకు ఎంఆర్.రాధ కటుంబానికి చెందిన నటుడు రాధారవి, లతా రజనీకాంత్, నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు ఏఎస్ఏ.చంద్రశేఖర్, శోభ దంపతులు,కే.భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్ దంపతులు, శాంతను, కీర్తి దంపతులు, దర్శకుడు కేఎస్.రవికుమార్, పాండియరాజన్, ఎళిల్, విక్రమన్, తంగర్‌బచ్చన్, నటుడు శివకుమార్, కార్తీ, సూరి, పృథ్వీరాజన్, మయిల్సామి, మోహన్, చిత్రాలక్ష్మణన్, నిర్మాత ఐçక్. హరి, లేనా తమిళ్‌వానన్, చిత్రకారుడు ఏపీ.శ్రీధర్, మాణిక్య నారాయణన్, నటి ఈశ్వరిరావు, డీటీఆర్.రాజా, రాధిక శరత్‌కుమార్, నిరోషా, ప్రముఖ నటీమణులు శారద, రాజశ్రీ, సచ్చు, వెన్నిరాడై నిర్మల భానుప్రియ, జేఎస్కే.సతీశ్, వ్యాపారవేత్త నల్లికుప్పస్వామి శెట్టియార్, అడ్వకేట్ రాజశేఖర్, నిర్మాత సత్యజ్యోతి త్యాగరాజన్, ఛాయాగ్రాహకుడు సుకుమార్ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రైమ్ థ్రిల్లర్
అరుణ్ విజయ్ హీరోగా మహిమా నంబియార్, అభినయ హీరోయిన్లుగా దర్శకుడు అరివళగన్ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘కుట్రమ్ 23’. ఈ సినిమాను ‘క్రైమ్ 23’గా ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇంద్ర కుమార్ తెలుగులో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ – ‘‘బ్రూస్లీ, ఎంతవాడుగానీ’ చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న అరుణ్ విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు అరివళగన్ సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను చక్కగా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి క్రైమ్ థ్రిల్లర్. ప్రభాస్‌గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 31న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: కేయమ్ భాస్కరన్. -
వాస్తవ సంఘటనలతో...
‘బ్రూస్ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల్లో విలన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కుట్రమ్ 23’. ‘వైశాలి’ చిత్రం ఫేమ్ అరివళగన్ దర్శకుడు. మహిమ నంబియార్, అభినయ హీరోయిన్స్. ఈ చిత్రాన్ని అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో శ్రీ విజయ నరసింహా ఫిలింస్ పతాకంపై ‘క్రైమ్ 23’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 24న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి ప్రసాద్ ధర్మిరెడ్డి మాట్లాడుతూ– ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎమోషన్స్‌తో అరివళగన్ బాగా తెరకెక్కించారు. అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా మంచి నటన కనబరిచాడు. ఇటీవల ప్రభాస్‌గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అన్నారు. -
అందరికీ మంచి పేరు రావాలి: ప్రభాస్
అరుణ్ విజయ్ హీరోగా ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కుట్రమ్ 23’ని తెలుగులో ‘క్రైమ్ 23’ అనే టైటిల్‌తో అనువాదం చేస్తున్నారు. మహిమ నంబియార్, అభినయ కథానాయికలు. శ్రీమతి అరుణ ప్రసాద్ ధర్మిరెడ్డి సమర్పణలో ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్ సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘క్రైమ్ 23’ తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘ఈశ్వర్’లో అరుణ్ విజయ్ సిస్టర్ శ్రీదేవితో కలిసి నటించాను. ఇప్పుడు ‘సాహో’ చిత్రంలో అరుణ్ విజయ్‌తో కలిసి నటిస్తున్నాను. ‘క్రైమ్ 23 ట్రైలర్’ చాలా బాగుంది. హీరోగా అరుణ్ విజయ్‌కు, ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్న నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అరుణ్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ప్రభాస్ చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ పోలీస్‌గా నటించాను. ఆల్ ఎమోషన్స్‌తో అరివళగన్ బాగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘సాహో’, మణిరత్నంగారి ‘నవాబు’ సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘వైశాలి’ తర్వాత తెలుగులో రిలీజ్ అవుతున్న నా రెండో చిత్రమిది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రభాస్‌గారు ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అనువాద కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. తమిళంలో హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
సాయం చేసే చేతులే మిన్న
జె. జాన్ బాబు దర్శకత్వంలో పీవీ రాజు, అభినయ, జె.జె ప్రకాష్ రావు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తొలి కిరణం’. సువర ్ణ క్రియేషన్స్ పతాకంపై టి.సుధాకర్‌బాబు నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడు. యాభై లక్షలకుపైగా ఈ సినిమా సీడీలు అమ్ముడుపోయిన సందర్భంగా ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో జరిపింది. జాన్ బాబు తల్లి విజయమ్మ 77వ జయంతిని పురస్కరించుకుని వందమంది పేదలకు దుస్తులు, గృహోపకరణాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి శివాజీరాజా మాట్లాడుతూ- ‘‘ప్రార్థించే చేతుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అని అన్నారు. ఈ చిత్రకథ అనుకున్నప్పుడే నటీనటులను ఎన్నుకున్నాను. సినిమా అవుట్‌పుట్ చుశాక నా నమ్మకం వమ్ము కాలేదనిపించింది’ అన్నారు జాన్ బాబు. ‘కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్‌కు కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం’’ అన్నారు. -
ఆగస్టులో తొలి కిరణం
పి.డి రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్ ముఖ్య తారలుగా జె. జాన్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ‘‘యేసు సిలువ వేసిన తర్వాత, ఆయన అక్కడే ఉన్న 40 రోజులు ఏం జరిగిందన్న కథతో సినిమా ఉంటుంది. సుమారు గంట గ్రాఫిక్స్ ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘యేసు పాత్ర చేయడం నా అదృష్టం’’ అని పీడీ రాజు అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: కె సువార ్తపాల్. -
నవ దంపతులపై దాడి
► ఐదుగురిపై కేసు కేకేనగర్ : తంజావూరు జిల్లా పాపనాశం సమీపంలో పెళ్లి జరిగిన 30 నిమిషాలకే నవ వధువు తరఫు వారు దాడి జరపడంతో సంచలనం కలిగింది. దీనికి సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తంజావూరు సమీపంలో గల కరందై వీధికి చెందిన మణివన్నన్. ఇతని కుమారుడు రాజేష్ (22). బీబీఏ చదివి మినీబస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఒరత్తనాడు సమీపంలో గల వడక్కుర్ ప్రాంతానికి చెందిన వీరరాజు కుమార్తె అభినయ (22)ను ప్రేమించాడు. ఈ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. సోమవారం అభినయ, రాజేష్ పాపనాశనం తాలూకా కార్యాలయం వెనుక గల దుర్గమ్మన్ ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయం అభినయ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆగ్రహించిన వారు పదిమందితో ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ పెళ్లి చేసుకున్న రాజేష్, అభినయ దంపతులపై దుడ్డుకర్రలతో దాడి చేసి గాయపరిచారు. వెంటనే ప్రేమ జంట తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పాపనాశం సహాయ పోలీసు సూపరింటెండెంట్ సెల్వరాజ్ వారి వద్ద విచారణ జరిపారు. రాజేష్, అభినయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. -
క్రీస్తు సందేశం
‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలొచ్చాయి. మా ‘తొలి కిరణం’ గతంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని దర్శకుడు జె. జాన్‌బాబు అన్నారు. పి.డి.రాజు, అభినయ, భానుచందర్, సాయికిరణ్ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘సమాధి నుంచి బయటకు వచ్చిన క్రీస్తు 40 రోజుల పాటు ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆర్.పి.పట్నాయక్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన రావడం హ్యాపీ. గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఏప్రిల్ 17న సినిమా విడుదల చేస్తాం’’న్నారు. -
ప్రేమలో పడితే... అంతేనా?
ప్రతి ప్రేమకథలోనూ హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలాగని ప్రేమికులందరూ చివరకు బ్రేకప్ అవుతారనీ చెప్పలేం. కానీ, ఓ తమిళ హీరో మాత్రం ప్రేమలో పడితే కచ్చితంగా బ్రేకప్ తప్పదంటున్నారు. ఎజిల్ దురై హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘సెంజిత్తలే ఎన్ కాదలా’. మధుమిల, అభినయ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్’ పేరుతో ఎస్. బాలసుబ్రమణ్యన్, ఎస్. ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలను కుంటున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌భరత్. -
హాలీవుడ్ కు అభినయ
మనిషి సాధనకు అంగవైకల్యం అస్సలు అడ్డు కాదని చాలా మంది ఎల్లలు దాటిన విజయాలతో నిరూపించారు.యువ నటి అభినయను ఈ కోవకు ఆపాదించవచ్చు. తనలోని మైనస్‌లను ప్లస్‌గా మార్చుకుని నటిగా ఎదుగుతున్న నటి అభినయ. సాధారణంగా ఒక చిన్న లోపం ఉంటేనే ఇక జీవతమే లేదన్నంతగా నిరాశ నిస్పృహలకు లోనైపోయే చాలా మంది నటి అభినయను స్ఫూర్తిగా తీసుకుంటే వారి జీవితాలను బాగుపరుచుకోవచ్చు. ఈ నటిని మూగ,చెవుడు అంటి పెట్టుకున్నాయి.అయినా ఏమాత్రం కుంగిపోలేదు. అకుంఠిత దీక్షతో ఎదురొడ్డి గెలిచారు.ఏకంగా హీరోయిన్‌గానే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని బహుభాషా నటిగా రాణిస్తున్నారు. మాట్లాడలేక పోయినా, వినిపించకపోయినా ఎదుటి వాళ్ల పెదాల కదలికలను చూసి వారేమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగల శక్తి, పాత్రల కనుగుణంగా చక్కని భావాలను వ్యక్తం చేయగల ప్రతిభ కలిగిన నటి అభినయ. నాడోడిగళ్ చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసిన అభినయ ఆ తరువాత ఈశన్ చిత్రాల్లో నటించారు.ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.అందులో అడిడా మేళం, తమిళ్సెల్వనుమ్ తనియార్ అంజలియుమ్, నిశబ్దం,విళిత్తిరు, తుడి చిత్రాలు ఉన్నాయి. తుడి చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కథానాయకి ఇతివృత్తంగా ముంబై పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభినయ హీరోయిన్గా నటించారు. ఈమె ఇప్పుడు కోలీవుడ్, టోలీవుడ్లను దాటి ఏకంగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.అక్కడ ఒన్ లిటిల్ ఫింగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అకాడమీ అవార్డు గ్రహీత రూపంశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 56 మంది వికలాంగుల ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.శారీరకంగా బాధింపునకు గురైనా వికలాంగులు మాన సికంగా చాలా ప్రతిభావంతులను చెప్పే కథా చిత్రంగా ఒన్ లిటిల్ ఫింగర్ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇందులో అభినయ ఎన్జీఓ వర్కర్‌గా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇలా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది నటీమణుల్లో ఒకరుగా అభినయ పేరు తెచ్చుకోవడం విశేషం. -
ఆ 40 రోజుల కథ!
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలికిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో పీడీ రాజు, భానుచందర్, అభినయ ముఖ్యతారలుగా సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏసుక్రీస్తు పునరుత్థాన దశలో 40 రోజుల పాటు భక్తులతోటే ఉన్నారు. ఆ 40 రోజుల్లో క్రీస్తు ఏం చేశాడన్నదనేది కథ. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. గుడ్‌ఫ్రైడే వేళ మార్చి 25న రిలీజ్ చేయనున్నాం’’ అని తెలిపారు. -
నందిత పాత్రలో అభినయ
శంభో శివ శంభో చిత్రంలో శివ బాలాజీ ప్రియురాలిగా ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేశ్, మహేశ్ బాబు సోదరిగా ఇప్పటికే తన అందం... అభినయంతో ప్రేక్షక మనసులు దోచుకున్న నటి అభినయ. తాజాగా తుడి పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటించనుంది. అందుకు అంగీకార పత్రంపై కూడా ఆమె సంతకం చేసింది. కామెడీ థ్రీల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అభినయా నందినిగా హోటల్ యజమాని పాత్రలో ఒదిగిపోనుంది. ఈ చిత్రానికి రితున్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో ధనుష్ నటించి తాజా హిందీ చిత్రం షమితాబ్లో కూడా అభినయా నటించిన సంగతి తెలిసిందే. -
తుడి చిత్రంలో అభినయ
నటి అభినయ ప్రధాన పాత్రలో వైవిధ్యభరిత థ్రిల్ల ర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం తుడి. మైంటి రామ పతాకంపై రితున్ సాగర్, జి.లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి అభినయ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇతర ము ఖ్యపాత్రల్లో సుమన్, బ్రహ్మానందం, సూదుకవ్వుం రమేష్, నళిని నటిస్తున్నారు. వీరితో పాటు మరో నాయకిగా ప్రేర్నా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రముఖ న టుడు నటిస్తున్న ఈ చిత్రంలో కమలా థియేటర్ అధినేత చిదంబ రం కొడుకు గణేశ్ మంత్రిగా ప్రాముఖ్యత గల పాత్రలో నటిస్తున్నారు. కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న రితున్ సాగర్ చిత్ర వివరాలను తెలుపుతూ ఒక నక్షత్ర హోటల్లో టైస్టు ఎటాక్ చిత్రకథా ఇతివృత్తం అన్నారు. ఇందులో అభినయ రిసెప్షనిస్టుగా నటిస్తున్నారని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల మధ్య జరిగే సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. చిత్రం ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. ఈయనకిది దర్శకుడిగా తొలి చిత్రం. విజువల్, కమ్యునికేషన్ చదివిన రియాన్ సాగర్ పలు లఘు చిత్రాలను తెరకెక్కించిన అనుభవంతో ఈ తుడి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, మునార్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు దర్శకుడు వెల్లడించారు.