ఆ 40 రోజుల కథ! | 40 days story | Sakshi
Sakshi News home page

ఆ 40 రోజుల కథ!

Published Tue, Jan 19 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

ఆ 40 రోజుల కథ!

ఆ 40 రోజుల కథ!

ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలికిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో  పీడీ రాజు, భానుచందర్, అభినయ ముఖ్యతారలుగా  సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏసుక్రీస్తు పునరుత్థాన దశలో 40 రోజుల పాటు భక్తులతోటే ఉన్నారు. ఆ 40 రోజుల్లో క్రీస్తు ఏం చేశాడన్నదనేది కథ. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. క్రిస్‌మస్ సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. గుడ్‌ఫ్రైడే వేళ మార్చి 25న రిలీజ్ చేయనున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement