Tolikiranam
-
డిసెంబర్ 22న 'తొలి కిరణం' రిలీజ్
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో T. సుధాకర్ నిర్మాత గా జె. జాన్ బాబు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తొలి కిరణం చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు సినిమాలో ఇప్పటి వరకు రాని కొత్త పాయింట్ తో మా చిత్రాన్ని నిర్మిచాం. 45 నిమిషాలు అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యింది. మా చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అదించటం సినిమా పై అంచనాలు పెంచింది. ఆయన అద్భుతమైన పాటలు అందిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మలయాళ నటి భవ్య మేరీ మాతగా నటించింది. 'తొలి కిరణం' చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. -
దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!
‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్లో ఈ చిత్రం ఆడాలి’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో ‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా. నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో కనిపిస్తా’’ అని దివ్యవాణి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి. -
క్రిస్మస్ కానుకగా...
యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. ప్రభువు పాత్రలో పీడీ రాజు నటించారు. జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూస లెమ్‌తో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం. ఆర్పీ పట్నాయక్‌గారు మంచి పాటలి చ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కథ మేము అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆర్పీ సంగీతం హైలైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా పాటలు రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. -
ఏసు పుట్టిన దేశంలో...
ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా చాలా చిత్రాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘తొలికిరణం’. పాటల చిత్రీకరణను ఇజ్రాయిల్‌లో జరపనున్నారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యేసుక్రీస్తు జీవితంలో ఎవరూ చూపించని అంశాలను, కోణాలను మా చిత్రంలో చూపిస్తున్నాం. సహజత్వం కోసం కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించేందుకు జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూసలేంతో పాటు ఈజిప్టు దేశాలకు వెళుతున్నాం. జూన్ లేదా జులై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటు న్నాం. ఆర్పీ పట్నాయక్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అభినయ, మౌనిక, జెమిని సురేశ్ ముఖ్య తారలు. -
ఆ 40 రోజుల కథ!
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలికిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో పీడీ రాజు, భానుచందర్, అభినయ ముఖ్యతారలుగా సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏసుక్రీస్తు పునరుత్థాన దశలో 40 రోజుల పాటు భక్తులతోటే ఉన్నారు. ఆ 40 రోజుల్లో క్రీస్తు ఏం చేశాడన్నదనేది కథ. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. గుడ్‌ఫ్రైడే వేళ మార్చి 25న రిలీజ్ చేయనున్నాం’’ అని తెలిపారు. -
క్రీస్తు జీవితం...
ఏసుక్రీస్తు జీవితాన్ని సరికొత్త కోణంలో తెరపై ఆవిష్కరించడానికి రూపొందుతోన్న చిత్రం ‘తొలి కిరణం’. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. పీడీ రాజు, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితాన్ని మరోసారి తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని చెప్పారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ-పాటలు: టి.ఎ ప్రభుకిరణ్ , రచనా సహకారం: వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ. -
తొలి వెలుగు!
ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. టి.ఎ.ప్రభుకిరణ్ స్క్రిప్ట్‌తో పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జక్కుల బెనహర్ కెమెరా స్విచాన్ చేయగా, మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఎనిమిది పాటలుంటాయి. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ నెల 15 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు.