క్రీస్తు జీవితం... | Life of Jesus | Sakshi
Sakshi News home page

క్రీస్తు జీవితం...

Published Thu, Oct 15 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

క్రీస్తు జీవితం...

క్రీస్తు జీవితం...

ఏసుక్రీస్తు  జీవితాన్ని సరికొత్త కోణంలో తెరపై ఆవిష్కరించడానికి రూపొందుతోన్న చిత్రం ‘తొలి కిరణం’. సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. పీడీ  రాజు, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితాన్ని మరోసారి తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని చెప్పారు. క్రిస్‌మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ-పాటలు: టి.ఎ ప్రభుకిరణ్ , రచనా సహకారం: వి.ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement