తొలి వెలుగు! | PD Raju act's in tolikiranam | Sakshi
Sakshi News home page

తొలి వెలుగు!

Published Tue, Sep 8 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

తొలి వెలుగు!

తొలి వెలుగు!

ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. టి.ఎ.ప్రభుకిరణ్ స్క్రిప్ట్‌తో పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జక్కుల బెనహర్ కెమెరా స్విచాన్ చేయగా, మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఎనిమిది పాటలుంటాయి.  క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ నెల 15 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement