PD Raju
-
యేసుక్రీస్తు జీవిత కథతో...
ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవితకథతో చాలా సినిమాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు యేసుక్రీస్తుగా నటించిన చిత్రం ‘తొలి కిరణం’. జె. జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 7న జాన్‌బాబు జన్మదినం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని చాలా కష్టపడి నిర్మించాం. ఇందులోని 45 నిమిషాల గ్రాఫిక్స్ హైలెట్‌గా ఉంటాయి. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. కష్టపడి నటించాం’’ అన్నారు íపీడీ రాజు. ‘‘ఈ సినిమా చాలా నేచురల్‌గా ఉంది. ఇలాంటి సినిమాలు మన తర్వాతి సమాజానికి చాలా అవసరం’’ అని నటుడు బెనర్జీ అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సాగర్‌తో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్. -
ఏసు నడిచిన ప్రదేశాల్లో...
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జె.జాన్‌బాబు దర్శకుడు. టి.సుధాకర్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇంతవరకు వచ్చిన ఏసుక్రీస్తు చిత్రాలన్నీ ఒక ఎల్తైతే, ‘తొలికిరణం’ మరో ఎత్తు. రియలిస్టిక్‌గా ఉండేందుకు క్రీస్తు నడిచిన ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఖర్చుకు వెనుకాడకుండా మంచి లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. అద్భుతమైన పాటలు అందించిన ఆర్పీ పట్నాయక్‌కి కృతజ్ఞతలు. సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. ఈ నెల 10న టీజర్ విడుదల చేసి, త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
క్రిస్మస్ కానుకగా...
యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. ప్రభువు పాత్రలో పీడీ రాజు నటించారు. జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూస లెమ్‌తో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం. ఆర్పీ పట్నాయక్‌గారు మంచి పాటలి చ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కథ మేము అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఆర్పీ సంగీతం హైలైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా పాటలు రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. -
యేసు సందేశంతో...
ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడేం చేశారు? ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో రూపొందు తోన్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ఏసుక్రీస్తుగా, అభినయ మేరీ మాతగా జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 28న పాటల్ని, క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ క్రీస్తు జీవితంలో ఎవరూ స్పృశించని అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేయను న్నాం. ఆర్పీ పట్నా యక్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యం హైలైట్’’ నిర్మాత అన్నారు. -
ఏసు పుట్టిన దేశంలో...
ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా చాలా చిత్రాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘తొలికిరణం’. పాటల చిత్రీకరణను ఇజ్రాయిల్‌లో జరపనున్నారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యేసుక్రీస్తు జీవితంలో ఎవరూ చూపించని అంశాలను, కోణాలను మా చిత్రంలో చూపిస్తున్నాం. సహజత్వం కోసం కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించేందుకు జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూసలేంతో పాటు ఈజిప్టు దేశాలకు వెళుతున్నాం. జూన్ లేదా జులై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటు న్నాం. ఆర్పీ పట్నాయక్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అభినయ, మౌనిక, జెమిని సురేశ్ ముఖ్య తారలు. -
తొలి కిరణ సంగీతం
ఏసుక్రీస్తు జీవితం మళ్లీ తెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది. పీడి రాజు ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం ‘తొలి కిరణం’. ఆర్ .పి.పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ వేడుక కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నిర్మించాం. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, ఎడిటింగ్: వినయ్. -
క్రీస్తు విశేషాలతో...
ఏసుక్రీస్తు జీవిత విశేషాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కి రణం’. పీడీ రాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కె.జాన్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మట్లాడుతూ -‘‘గోవా, ఈజిప్ట్, పాలస్తీనా, ఇజ్రాయిల్‌లో జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 25న గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: మురళీకృష్ణ. -
తొలి వెలుగు!
ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. టి.ఎ.ప్రభుకిరణ్ స్క్రిప్ట్‌తో పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జక్కుల బెనహర్ కెమెరా స్విచాన్ చేయగా, మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఎనిమిది పాటలుంటాయి. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ నెల 15 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు.