Christmas
-
విజయవాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్‌ను స్పెషల్‌గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్‌కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్‌లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్‌గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
విమానం గాల్లో ఉండగా గందరగోళం.. 11 మంది ప్రయాణికులకు గాయాలు
కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్‌బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. -
Mega And Allu Family Christmas Celebration: అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ.. హాజరైన మెగా ఫ్యామిలీ (ఫొటోలు)
-
రామ్ చరణ్‌పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా..) అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్మస్ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z — Upasana Konidela (@upasanakonidela) December 26, 2023 -
దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. యూఏఈలో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డేరా క్రీక్ ధోవ్ క్రూయిజ్‌లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, ఇతర మతస్థులు, వారి కుటుంబాలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. . ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్తో కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లోని వివిధ సంఘాల పాస్టర్స్, సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు జాన్ ప్రసాద్, జైకుమార్ రబ్బి తదితరులు హాజరయ్యారు. -
క్రిస్మస్ వేడుకల్లో అలరించిన లైవ్ మ్యూజిక్ బ్యాండ్ (ఫొటోలు)
-
మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోట కనిపించిన ఆ ఇద్దరు!
క్రిస్మస్ హడావుడి ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఆల్మ్టోస్ట్ సోమవారమంతా క్రిస్మస్ పిక్సే కనిపించాయి. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిక్ మాత్రం వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) ఏ పండగొచ్చినా సరే మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ జరగ్గా.. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని రూమర్స్ వచ్చాయి. అలానే ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్.. సోషల్ మీడియాలో ఏం విష్ చేయకపోవడం తదితర అంశాల వల్ల వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో వీళ్లు కలిసి కనిపించారు. వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహా, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ పిక్‌లో ఉన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
Merry Christmas: బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు. వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్బైజాన్లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్ ఆవేదన వ్యక్తంచేశారు. -
Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ ‘నో’
కీవ్: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్యాలెండర్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్‌లో దశాబ్దాలుగా రష్యన్ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం. -
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
Hyderabad Christmas Celebrations: వైభవంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్‌లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Christmas At PM Modi House Pics: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
Niharika Konidela: సీక్రెట్ సాంటాగా మెగా డాటర్.. ఫ్రెండ్స్‌తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
Christmas: శ్రీలంక ప్రభుత్వ సంచలన నిర్ణయం
కొలంబో: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా జైలు పాలైన వెయ్యికిపైగా మంది ఖైదీలకు క్రిస్మస్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత వారం దేశంలో డ్రగ్స్‌పై నిరోధానికి చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్‌లో పోలీసులు ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునరావాస కేంద్రంలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలో జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ను పురస్కరించుకుని 1000 మందిని జైళ్ల నుంచి విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. గడిచిన శుక్రవారం వరకు దేశంలోని జైళ్లలో 30 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే దేశంలో ఉన్న జైళ్ల మొత్తం కెపాసిటీ కేవలం 11 వేలేనని జైళ్ల శాఖ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. బౌద్ధ మతస్తులు మెజారిటీలుగా ఉండే శ్రీలంకంలో గతంలో బుద్ధ జయంతి రోజు కూడా భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
Christmas 2023 Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
Christmas: కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం
బెత్లెహాం: క్రిస్మస్ వేడుకలు లేకపోవడంతో పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని క్రీస్తు జన్మస్థలం బెత్లెహాం నగరం కళ తప్పింది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు, నగరంలోని మేంజర్ స్క్వేర్‌లో చేసే ప్రత్యేక అలంకారాలు ఏవీ కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ముళ్ల కంచెలు, శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా క్రీస్తు జన్మించిన బెత్లెహాం నగరంలో ఈసారి క్రిస్మస్ వేడుకలు రద్దు చేశారు. క్రిస్మస్ సందర్భంగా మేంజర్ స్క్వేర్‌లో విదేశీ టూరిస్టులు, వందల మంది యువకులు చేసే మార్చ్ బ్యాండ్‌కు బదులు సైనికులు కవాతు చేస్తున్నారు. ‘ఈ ఏడాది బెత్లెహాంలో క్రిస్మస్ చెట్టు లేదు. వెలుగులు లేవు. కేలం చీకట్లే ఉన్నాయి’ అని జెరూసలెంలో ఆరు సంవత్సరాల నుంచి నివసిస్తున్న వియత్నాంకు చెందిన మాంక్ జాన్ విన్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకల రద్దు బెత్లెహాం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెత్లెహాం ఆదాయంలో 70 శాతం విదేశీ పర్యాటకుల నుంచే వస్తుంది. ఇది కూడా చాలా వరకు క్రిస్మస్ సీజన్లో వచ్చే ఆదాయమే. ఇప్పుడు ఈ ఆదాయం లేకపోవడంతో నగరంలోని 70 హోటల్లు మూతపడ్డాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదీచదవండి..హిజాబ్ వివాదం: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
వివక్ష లేని వ్యవస్థ
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సింహాద్రిపురంలో రూ.11.6 కోట్లతో సుందరీకరించిన రహదారులు, జంక్షన్లను తొలుత ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఫోర్‌లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్ జంక్షన్లున్నాయి. అనంతరం రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో నిర్మించిన వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. రూ.3.19 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం, రూ.2 కోట్లతో రూపుదిద్దుకున్న నూతన పోలీసు స్టేషన్, రూ.3.16తో సిద్ధమైన ఎంపీడీవో నూతన కార్యాలయాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పులివెందుల మండల ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రభుత్వ ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలపై మమకారం, బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన సంతోషంతో సీఎం జగన్ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. కలసి చాలా రోజులైంది.. ‘మనమంతా కలసి చాలా రోజులైంది.. ఒకసారి కలిసినట్లుంటుంది.. కష్ట సుఖాలు పంచుకున్నట్లుంటుంది’ అనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అందుకు అన్ని వర్గాల సమ్మతి, సహకారం ఎంతో అవసరమన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ లోగిళ్లలోనే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదనేదే మన ప్రభుత్వ సిద్ధాంతమని ముఖ్యమంత్రి తెలిపారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే వ్యవస్థ పటిష్టంగా సాగుతుందనే విషయాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రజలు గుర్తించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన కొనసాగిస్తామన్నారు. ‘పాడా’ పరిధిలో పనులపై సమీక్ష.. ‘పాడా’ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్యమంత్రికి క్లుప్తంగా వివరించారు. పులివెందుల రూరల్ మండలంలో గ్రామ పరిపాలన సంతృప్తికరంగా సాగుతోందన్నారు. పీబీసీ, సీబీఆర్ మైనర్, మైక్రో ఇరిగేషన్ ఆయకట్టు పరిధిలో దాదాపు 14 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి తెచ్చామన్నారు. రూరల్ పరిధిలో పాడా, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రూ.44.40 కోట్లతో మంజూరు చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.31.08 కోట్లు వెచ్చించి పలు పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. మైక్రో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఉపాధి హామీ, నాడు–నేడు పనులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రూ.135.49 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.58.85 కోట్లు ఖర్చు చేశామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎం దృష్టికి పలు ప్రతిపాదనలు.. పులివెందుల పరిధిలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై పలువురు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించారు. సీబీఆర్–ఎర్రబెల్లి నూతన పైప్‌లైన్ పరిధిలోని మోతున్నూతనపల్లెలో స్టోరేజీ పాయింట్ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. గవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఎర్రబల్లె చెరువు నుంచి పంపింగ్ ద్వారా చిన్న గుంతలకు నీటిని సరఫరా చేస్తే వ్యవసాయ అవసరాలు తీరుతాయని కొందరు గ్రామస్తులు విన్నవించారు. షాదీ తోఫా, కళ్యాణమస్తు ఆర్థిక సాయాన్ని పెంచి దూదేకుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడాన్ని నూర్‌బాషా దూదేకుల సంఘం నాయకుడు మహమ్మద్ రఫీ స్వాగతించారు. సర్టిఫికెట్ల జారీలో నూర్ బాషాలను ముస్లింలుగా గుర్తించాలని కోరారు. పచ్చదనంతో కళకళ.. ‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పులివెందుల మండలం పచ్చదనంతో కళకళలాడుతోందని.. ఇదంతా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే సాధ్యమైంది’ అంటూ పలువురు మండల నాయకులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వాయర్ల పరిసర ప్రాంత గ్రామస్తులు, రైతులకు ఇంకా ఏవైనా సమస్యలుంటే పూర్తి వివరాలను అందజేస్తే సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ సమీక్షను ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జేసీ గణేష్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సలహా కమిటీ మెంబర్ బలరామిరెడ్డి, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు ఖాదరబాధర వరలక్ష్మి, కొమ్మా వరలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తంరెడ్డి, మాజీ ఉప మండలాధ్యక్షుడు పుష్పనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవత్వం పరిమళించి.. సింహాద్రిపురం: వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సింహాద్రిపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల అనంతరం తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన కాగితాలతో నిరీక్షిస్తున్న పలువురు మహిళలను చూసి వాహనాన్ని నిలిపివేశారు. కాన్వాయ్ వేగంగా వెళ్తున్నప్పటికీ వారిని గుర్తించిన సీఎం వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని, సహాయం చేయాలని ఓ మహిళ కోరగా.. మరో మహిళ తన భర్త చనిపోయారని, సాయం అందించాలని వేడుకుంది. వెంటనే వారికి తగిన సహాయం అందించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తన బిడ్డకు తలలో కణితి ఆపరేషన్‌కు సాయం చేయాలని తాడిపత్రికి చెందిన ఓ మహిళ అభ్యర్థించడంతో పూర్తి స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్ఫ్రైజ్ గిప్్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్‌లను, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దని తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి లింక్‌లలో సైబర్ నేరగాళ్లు ఫోన్, ల్యాప్లాప్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా కూపన్లు, గిఫ్ట్‌లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లు, ఎస్సెమ్మెస్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఇడుపులపాయ:క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
-
పురాతన క్రిస్మస్ సంత! ఎక్కడ జరుగుతుందంటే..?
దక్షిణ అమెరికా దేశమైన పెరులో పురాతనమైన క్రిస్మస్ సంత ఏటా డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ఈ సంత దాదాపు ఐదువందల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. పెరులోని కుస్కో నగరంలో ఏర్పాటు చేసే ఈ సంతకు దేశం నలుమూలలకు చెందిన హస్తకళా నిపుణులు తాము తయారు చేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఇతర కళాఖండాలతో చేరుకుంటారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంత కొనసాగుతుంది. ‘శాంచురాంటికై’ పేరుతో ఈ సంతను ఏర్పాటు చేయడాన్ని పెరు ప్రజలు పండుగలాగా జరుపుకొంటారు. వీథుల్లో నృత్యగానాలతో ఊరేగింపులు జరుపుతూ సందడి చేస్తారు. ఈ సంతలో రకరకాల పరిమాణాల్లో తయారు చేసిన బాల ఏసు బొమ్మలు, ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక నమూనా బొమ్మలు, ఉయ్యాలలోని ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలు వంటివి అమ్ముతారు. వెదురు, కలప, పింగాణి, వెండి వస్తువులను, సంప్రదాయకరమైన ఆభరణాలను, క్రిస్మస్ అలంకరణల కోసం ఉపయోగించే ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలు వంటివి కూడా అమ్ముతారు. పెరులో జరిగే ఈ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించింది. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)