మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోట కనిపించిన ఆ ఇద్దరు! | Allu Arjun, Ram Charan And Other Mega Family Members Participated In Christmas Celebrations 2023, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan, Allu Arjun Christmas Celebrations: మెగా హీరోలందరూ ఒక్కచోట కలిస్తే.. క్రిస్మస్ పిక్ వైరల్

Published Tue, Dec 26 2023 7:52 AM | Last Updated on Tue, Dec 26 2023 12:08 PM

Mega Family Christmas Celebrations 2023 Allu Arjun Ram Charan  - Sakshi

క్రిస్మస్ హడావుడి ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఆల్మ్టోస్ట్ సోమవారమంతా క్రిస్మస్ పిక్సే కనిపించాయి. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిక్ మాత్రం వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

ఏ పండగొచ్చినా సరే మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ జరగ్గా.. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని రూమర్స్ వచ్చాయి.

అలానే ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్.. సోషల్ మీడియాలో ఏం విష్ చేయకపోవడం తదితర అంశాల వల్ల వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో వీళ్లు కలిసి కనిపించారు. వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహా, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ పిక్‌లో ఉన్నారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement