Mega Family Diwali Celebration: Diwali Celebration At Mega Family, Allu Arjun Shares Photo - Sakshi
Sakshi News home page

మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్‌ చేసిన బన్నీ

Published Thu, Nov 4 2021 10:55 AM | Last Updated on Thu, Nov 4 2021 11:39 AM

Diwali Celebration At Mega Family Allu Arjun Shares Photo - Sakshi

Mega Family Diwali Celebration: మెగా ఫ్యామిలీలో దీపావళి పండుగ సందడి నెలకొంది. ఏ పండుగ అయిన అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకచోట చేరుతారు. ఇక ఈ దీవాళికి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి పండుగ వేడుకులను ఘనంగా సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా అభిమానులందరికి ‘హ్యాపీ దీపావళి’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోలో రామ్ చ‌ర‌ణ్‌,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక‌,చైత‌న్య‌, వైష్ణ‌వ్ తేజ్ తో పాటు ప‌లువురు మెగా కుటుంబ స‌భ్యుల ఉన్నారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం కనిపించలేదు. ఈ సెలబ్రెషన్స్‌లో సాయి తేజ్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ కొంత నిరాశకు గురవుతున్నారు. అలాగే ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సాయితేజ్‌ ఇం​కా పూర్తిగా కోలుకోలేదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌పార్ట్‌ డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈమూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా అలరించనున్నాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఏడాది ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. జ‌న‌వ‌రి 7న చిత్రం విడుద‌ల‌వుతుంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement