breaking news
deepavali celebrations
-
గోరంత దీపం జగమంత వెలుగు
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్‌లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు మార్గ దర్శనం చేస్తుంది.మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాందీపాల కథపూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు. ఎలా జరుపు కోవాలంటే..?దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.ఈసారి రికార్డ్ బ్రేక్ కావాల్సిందే!గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.వారణాసిలో దేవతల దీపావళిదీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.దీపావళి పూట...శివాజీ కోట!దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.దేవతలకు స్వాగతంజార్ఖండ్లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య -
దేశ ప్రగతికి ‘డబుల్ డోసు’
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధికి ఇది ‘డబుల్ డోసు’ మద్దతు అని తేల్చిచెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పన్నుల విధానం గందరగోళం ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థను సంస్కరించి, సరళీకృతం చేశామని పేర్కొన్నారు. జీఎస్టీలో తాజా సంస్కరణలను ప్రసార మాధ్యమాలు ‘జీఎస్టీ 2.0’గా అభివరి్ణస్తున్నాయని తెలిపారు. తాజా మార్పులతో రెండు విధాలుగా లబ్ధి కలుగుతుందని వివరించారు. సాధారణ ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. అందుకే ఇది డబుల్ డోసు అని స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన విజేతలతో మోదీ మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం తదుపరి తరం సంస్కరణలను ఆపే ప్రసక్తేలేదు. దేశ ప్రజలకు డబుల్ ధమాకా ఇస్తానని ఎర్రకోట నుంచి హామీ ఇచ్చా. సెపె్టంబర్ 22న నవరాత్రుల తొలి రోజు నుంచే ఈ ధమాకా అందుబాటులోకి రాబోతోంది. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు విధించాయి. వంట గదిలో వాడుకొనే వస్తువులను, ఆఖరికి ఔషధాలను కూడా వదిలిపెట్టలేదు. అప్పటి పాలన ఇంకా కొనసాగుతూ ఉంటే రూ.100 విలువైన వస్తువు కొనుగోలుపై రూ.25 పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రజల చేతుల్లో డబ్బులు మిగిల్చి, వారి జీవితాలను మెరుగుపర్చాలన్న ధ్యేయంతో మేము పని చేస్తున్నాం. ఆన్లైన్ మనీ గేమింగ్‌ను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకొచ్చాం. ఈ విషయంలో మాపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని నిర్ణయించాం. గేమింగ్ అనేది చెడ్డది కాకపోయినా అదే పేరుతో జూదం ఆడడం ప్రమాదకరమే. ఆన్లైన్ గేమింగ్ సరైన రీతిలో నిర్వహిస్తే గ్లోబల్ మార్కెట్లో మన దేశమే నంబర్ వన్ అవుతుంది. మన దేశ ప్రగతి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
లవ్ అండ్ లైట్ : ఫెస్టివ్ వైబ్స్‌తో కళకళలాడిపోతున్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
సమంత దీపావళి సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
అబ్బుర పరిచేలా, టన్నుల్లో బంగారం అమ్మకాలు
ఐదురోజుల దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ధన్‌తేరాస్ రోజు భారత్‌లో బంగారం, వెండిపై జరిగే లావాదేవీలు సుమారు రూ.30వేల కోట్లు జరుగుతుందని అంచనా. అదే సమయంలో ఆటోమొబైల్స్, కిచెన్‌లో వినియోగించే వస్తువులు, చీపుర్ల వ్యాపారం సైతం భారీగా జరిగే అవకాశం ఉందని సమాచారం. ధన్‌తేరాస్‌తో (నవంబర్ 10తో) దేశంలో దీపావళి ఉత్సవాలు ప్రారంభమై..రూపచతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, అన్నాచెల్లెళ్ల (భయ్యా దూజ్) ముగుస్తాయి. ఈ ఐదు రోజుల సమయంలో పైన పేర్కొన్న పరిశ్రమల్లో వ్యాపారం జోరుగా సాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. రూ.50వేల కోట్లు దాటింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. నవంబర్ 10న దేశం అంతటా జరిగిన వ్యాపారం రూ.50 వేల కోట్లు దాటినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఢిల్లీలో బిజినెస్ రూ. 5,000 కోట్లు జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భారతియా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ధన్‌తేరాస్ రోజు గణేష్,లక్ష్మి, కుబేరుల విగ్రహాలతో పాటు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పాత్రలు, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చీపుర్లు వంటి వస్తువులు ఈ రోజున కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మంచిదని భావిస్తారని అన్నారు. అంతేకాకుండా, మట్టి దీపాలు, ఇల్లు, ఆఫీసుల అలంకరణ కోసం వినియోగించే వస్తువులు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, దీపావళి పూజ సామగ్రి కొనుగోలు కూడా ధన్‌తేరాస్ రోజున కొనుగోలు చేస్తారని చెప్పారు బంగారం, వెండి విక్రయ లావాదేవీలు దేశవ్యాప్తంగా బంగారం, వెండి తదితర వస్తువులకు సంబంధించి రూ.30,000 కోట్ల టర్నోవర్ దాటిందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. ఈ వ్యాపారంలో సుమారు రూ. 27,000 కోట్ల విలువైన బంగారు వస్తువులు, రూ. 3,000 కోట్ల వెండి లావాదేవీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్ముడు పోయిందంటే ధన్‌తేరాస్‌లో ఇప్పటి వరకు సుమారుగా 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడుపోయాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) క్రింద నమోదైన 1,85,000 రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాలు విక్రయించే వ్యాపారులు ఉన్నట్లు తేలింది. బీఐఎస్ ప్రమాణాలు ఇంకా అమలు చేయని ప్రాంతాల్లో అదనంగా 2,25,000 చిన్న ఆభరణాల షాపులు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఐదురోజుల దీపావళికి భారత్ ఏటా విదేశాల నుంచి దాదాపు 800 టన్నుల బంగారం, 4,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటోంది. -
Diwali Celebrations: దీపావళి వేడుకలో పటాకాలా మెరిసిన బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
హాంగ్ కాంగ్లో దీపావళి ధమాల్!
హాంగ్ కాంగ్లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదర్శిస్తూ, పిల్లలు - పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక షీలా సమతాని, మిస్ కోని వాంగ్, NAAC (The Neighbourhood Advice Action Council)-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు. ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యవర్గ సభ్యులు రమాదేవి సారంగా, రాధిక విశ్వనాథ్, కొండ మాధురి, హర్షిణి పచ్చoటి, రాజశేఖర్ మన్నే, వేమూరి విశ్వనాథ్, హరీన్ తుమ్మల, గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు. -
స్వీట్లు, టపాసుల దుకాణాల వద్ధ కొనుగోలుదారుల సందడి
-
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
స్విట్జర్లాండ్‌లో భారత సంస్కృతి ఉట్టి పడేలా..
జ్యూరిచ్: స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన తెలుగు ప్రజలు భారత సంస్కృతి ఉట్టి పడేలా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2021 నవంబర్ 21న తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ సీహెచ్ ఆధ్వర్యంలో జ్యూరీచ్లో దీపావళి వేడుకలను అంగ రంగ వైభవంగా జరిగాయి. వేడుకను తెలుగు అసోసియేషన్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ కడలి గనికాంబ, జనరల్ సెక్రెటరీ కిషోర్ తాటికొండలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు సహకారం అందించారు. దీపావళిని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన 150మంది తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పిల్లలతో సహా అంతా అందరూ వెలిగించిన కాకర పువ్వులు, చిచ్చుబుడ్డులతో ఆ ప్రాంగణమంతా దీపాకాంతులతో వెల్లివిరిసింది. శుభోదయం గ్రూప్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
మహేశ్ బాబుకు దీపావళి బహుమతులు పంపిన పవన్ దంపతులు
Pawan Kalyan Family Send Diwali Gifts To Mahesh babu And Namrata Shirodkar: దీపావళి పండగ సందర్భంగా సినీ తారలంతా సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. ఈ పండగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినం సందర్భంగా నటుడు పవన్ కల్యాణ్ దంపతులు సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులకు బాహుమతులు పంపారు. అలాగే డైరెక్టర్ క్రిష్‌కు కూడా పవన్ దీపావళి కానుకలు పంపినట్లు తెలుస్తోంది. చదవండి: దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్ ఇక పవన్ దంపతులు పంపిన గిఫ్ట్ ఫొటోలను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ బహుమతుల బాక్స్‌లో స్వీట్స్‌తో పాటు, పర్యావరణహిత పటాసులు ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్, అన్నా లెజినోవా దంపతులు గిఫ్టులు పంపారంటూ నమ్రత ఫొటోను పంచుకున్నారు. ఈ మేరకు ‘థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమలో పవన్ కల్యాణ్, మహేశ్ బాబులు మంచి సన్నిహితులుగా ఉంటారనే విషయం తెలిసిందే. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: దీపావళికి జిగేల్మన్న తారలు, చూసేయండి ఫొటోలు Samantha: సమంత సంచలన నిర్ణయం, ఇకపై వాటికి దూరమట! -
దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు
-
దీపావళికి జిగేల్మన్న తారలు, చూసేయండి ఫొటోలు
వెలుగు జిలుగుల దీపావళిని కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, స్నేహితులతో సెలబ్రేట్ చేసుకున్నారు సినీతారలు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సెలబ్రిటీలు వారి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫ్యాన్స్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళిని తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram A post shared by Eesha Agarwal 👑 (@eesha_agarwal.official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Shanvi sri (@shanvisri) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టపాసులు కాలుస్తూ గాయాలపాలు.. సరోజినీ దేవి ఆస్పత్రికి జనం క్యూ
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ పూట పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా గాయపపడిన వారి సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారంతా హైదరాబాద్‌లోని సరోజనిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాలుస్తూ 31 మంది పిల్లలు, పెద్దలు గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా. తీవ్రంగా గాయపడిన నలుగురికి సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి ఆపరేషన్ అవసరమైంది. చదవండి: భీతావహం.. పేలిన దీపావళి బాంబులు చంద్రాయణగుట్టకు చెందిన రాజ్ తివారి అనేవ్యక్తి ఏకంగా కన్ను కోల్పోయాడు. దీంతో దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేదా అవిటివారు కావాలిస వస్తుందని సరోజినీదేవి వైద్యురాలు కవిత హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్ చేసిన బన్నీ
Mega Family Diwali Celebration: మెగా ఫ్యామిలీలో దీపావళి పండుగ సందడి నెలకొంది. ఏ పండుగ అయిన అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకచోట చేరుతారు. ఇక ఈ దీవాళికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి పండుగ వేడుకులను ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులందరికి ‘హ్యాపీ దీపావళి’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోలో రామ్ చరణ్,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక,చైతన్య, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యుల ఉన్నారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం కనిపించలేదు. ఈ సెలబ్రెషన్స్‌లో సాయి తేజ్ లేకపోవడం ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. అలాగే ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయితేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా అలరించనున్నాడు. ఇక రామ్‌చరణ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించనున్నాడు. జనవరి 7న చిత్రం విడుదలవుతుంది. ఇందులో రామ్‌చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. Happy Diwali 🪔 pic.twitter.com/QqdOqxR9nb — Allu Arjun (@alluarjun) November 3, 2021 -
దీపావళికి పర్యావరణహిత టపాసులు
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది. -
కొంచెం ఆలస్యంగా...
క్యాన్సర్ వ్యాధికి భయపడకుండా, బాధపడకుండా.. ధైర్యంగా చికిత్స చేయించుకుంటూ, ప్రతి క్షణాన్నీ మిస్ కాకుండా ఆనందంగా గడుపుతున్నారు సోనాలి బింద్రే. గురువారం కుటుంబంతో కలసి న్యూయార్క్‌లో దీపావళి పండగను జరుపుకున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం సోనాలి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ సెలబ్రేషన్స్ ఫొటోలను ట్వీటర్లో షేర్ చేశారు. ‘‘ముంబైలో సంబరాల కంటే కొంచెం లేట్‌గా న్యూయార్క్‌లో మొదలుపెట్టాం. మనలాగా సంప్రదాయ బట్టలు వేసుకుందాం అంటే ఇక్కడ లేవు. పూజ కూడా సింపు ల్గా చేశాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు సోనాలి. -
విన్నారా.. సౌండ్ పడుద్ది సప్పుడు గుప్పెడే!
సాక్షి,సిటీబ్యూరో: వెలుగు దివ్వెల కేళి.. దీపావళి పండగ ఈ ఏడాది గ్రేటర్లో పర్యావరణహితంగా మారనుంది. అధిక శబ్దం వెలువడే బాణసంచా పేలుళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇటు నగర పోలీసులు అటు బల్దియా అధికారులు శబ్ద, వాయుకాలుష్యంపై సమరభేరి మోగించారు. దీంతో ఈసారి దీపావళిని ఎలాంటి బాణసంచా పేలుళ్లు లేకుండా జరుపుకునేందుకు గ్రేటర్ సిటీజన్లు సైతం మక్కువ చూపుతున్నారు. మహానగరంలో ఏటా ఈ పండగ సందర్భంగా సిటీజన్లు మూడురోజుల పాటు పెద్ద ఎత్తున క్రాకర్స్‌ను కాలుస్తుంటారు. గతేడాది సుమారు రూ.100 కోట్ల మేర టపాసులను బూడిద చేశారంటే దాని ద్వారా వెలువడిన శబ్ద, వాయు కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి టపాసుల అమ్మకాలు సగానికి పడిపోయినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో తాము తమిళనాడు, చైనాల నుంచి తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి చేసుకున్నట్లు చెబుతున్నారు. ‘సుప్రీం’ షరతులతో దివ్వెల పండగ.. దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోత.. బాణసంచా వెలుగులు. అయితే, ఆ ప్రమోదం మాటున ఉన్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీపావళి వేళ బాణసంచాను రాత్రి 8 నుంచి 10 గంటలమధ్యనే కాల్చాలన్న షరతు విధించిన విషయం విదితమే. అయితే, సూప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే నగర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు ఆంక్షలు విధించినప్పటికీ.. సమయం దాటి టపాసులు పేల్చే వారిని అదుపుచేయడం, అవధులు దాటే కాలుష్యాన్ని లెక్కించడం, లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోళ్లు చేయాలన్న నిబంధన అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యాన్ని లెక్కించే యంత్రాంగమేది? నగరంలో హెచ్‌సీయూ, సనత్‌నగర్, పాశమైలారం, జూపార్కు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం ‘కంటిన్యూయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, బెంజిన్, టోలిన్ వంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తుంది. మరో 21 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్ శాంప్లర్ వంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను మాత్రమే లెక్కగడుతోంది. ‘సుప్రీం’ మార్గదర్శకాల నేపథ్యంలో దీపావళికి వారం రోజుల ముందు, తర్వాత నగరవ్యాప్తంగా వివిధ రకాల వాయు కాలుష్యాన్ని లెక్కించేందుకు అవసరమైన సిబ్బంది, కాలుష్య నమోదు కేంద్రాలు లేకపోవడంతో అవధులు దాటే కాలుష్యాన్ని ఎవరు.. ఎలా లెక్కిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. సగానికి తగ్గిన టపాసుల విక్రయాలు గ్రేటర్ పరిధిలో ఏటా దీపావళికి సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్ కొనుగోలు చేస్తుంటారు. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్ అమ్మకాలు సగానికి పడిపోయాయని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారం రూ.50 కోట్ల మార్కును దాటడం గగనమేనని బాణసంచా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలివీ.. ♦ దీపావళికి ఏడు రోజుల ముందు, తర్వాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి. ♦ దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ♦ ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. ♦ తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి. ♦ బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం.. ప్రజలకు అవగాహన కల్పించాలి. ♦ నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి. ♦ టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. శబ్దకాలుష్యంతో జాగ్రత్త దీపావళి టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, పెంపుడు జంతువులు ప్రమాదంలో పడినట్టే. వాయు కాలుష్యంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు భారీగా పెరిగి శ్వాసకోశ వ్యాధులు, కళ్లసంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ముఖ్యంగా టపాసులు కాల్చినపుడు వెలువడే శబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ మించరాదు. కానీ నగరంలో ఇవి ఏటా 90 డెసిబుల్స్‌కు మించి నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద శబ్దాలు చిన్నారులు, పెంపుడు జంతువుల్లో విపరిణామాలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతువులు 50 డెసిబుల్స్ దాటి వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. రాకెట్లు, భూచక్రాల వంటివి కాల్చినపుడు జంతువులకు తగిలి గాయాలపాలవుతాయి. అవి ఎపిలెప్సీ (వణుకుడు) బారిన పడతాయి. ఈ గాయాలు సమీప భవిష్యత్‌లో వాటికి పెనుముప్పుగా మారడం తథ్యం. వాయు కాలుష్యంతో ముప్పే.. టపాసులు కాల్చగా వచ్చే పొగలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులులు ప్రజల ఊపిరితిత్తులకు తీవ్ర హాని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ ఏటా దీపావళికి సల్ఫర్ డై ఆక్సైడ్ 450–500 మైక్రోగ్రాములకు చేరుతోంది. నైట్రోజన్ ఆక్సైడ్ సైతం క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ అదీ 450–500 మైక్రోగ్రాములు దాటుతోంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక ధూళిరేణువులు(ఎస్పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములు మించరాదు. కానీ 300 మైక్రోగ్రాములు మించుతోంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఆనంద దీపావళి ఇలా.. ♦ ప్రమిదల్లో వెలిగించిన దీపాలు, తీరొక్క పూలతో మీ ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలను అందంగా అలంకరించి ముస్తాబు చేసుకోండి. ♦ తక్కువ శబ్దం వెదజల్లే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల్‌ఛడీ, పెన్సిల్స్ కాల్చాలి. ♦ శబ్దాలు కాకుండా వెలుగులు విరజిమ్మే మతాబులను ఎంపిక చేసుకోవాలి. ♦ విపరీత శబ్దాలు కర్ణభేరీకి సోకకుండా చెవుల్లో దూది పెట్టుకోవాలి. ♦ టపాసుల మోత శృతి మించకుండా చూసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రయత్నించాలి. -
అమెరికాలో ఘనంగా దసరా, దీపావళి సంబరాలు
అమెరికాలోని కాన్సస్ సిటిలో దసరా, దీపావళి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ (టీఏజీకేసీ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. కార్యక్రమ విభాగ అధిపతి విశేషు రేపల్లె స్వాగత పలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నిర్వహించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన, ఫ్యాషన్ షో, సినిమా పాటల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాహుబలి సంగీత సమ్మేళనం కార్యక్రమానికే ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సహకారాలు అందించిన కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ రావికంటి, గొండి గీత, వెంకట్ గొర్రెపాటి, వేణు ములకను సత్కరించారు. చివరగా శ్రీమతి జ్యోతిర్బిందు కల్లమాడి ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దీపావళి పంచ్
-
దీపావళి శుభాకాంక్షలు


