అమెరికాలోని కాన్సస్ సిటిలో దసరా, దీపావళి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ (టీఏజీకేసీ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు.
కార్యక్రమ విభాగ అధిపతి విశేషు రేపల్లె స్వాగత పలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నిర్వహించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన, ఫ్యాషన్ షో, సినిమా పాటల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాహుబలి సంగీత సమ్మేళనం కార్యక్రమానికే ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సహకారాలు అందించిన కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ రావికంటి, గొండి గీత, వెంకట్ గొర్రెపాటి, వేణు ములకను సత్కరించారు. చివరగా శ్రీమతి జ్యోతిర్బిందు కల్లమాడి ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అమెరికాలో ఘనంగా దసరా, దీపావళి సంబరాలు
Published Sat, Nov 12 2016 10:29 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement