జ్యూరిచ్: స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన తెలుగు ప్రజలు భారత సంస్కృతి ఉట్టి పడేలా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2021 నవంబర్ 21న తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ సీహెచ్ ఆధ్వర్యంలో జ్యూరీచ్లో దీపావళి వేడుకలను అంగ రంగ వైభవంగా జరిగాయి. వేడుకను తెలుగు అసోసియేషన్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ కడలి గనికాంబ, జనరల్ సెక్రెటరీ కిషోర్ తాటికొండలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు సహకారం అందించారు.
దీపావళిని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన 150మంది తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పిల్లలతో సహా అంతా అందరూ వెలిగించిన కాకర పువ్వులు, చిచ్చుబుడ్డులతో ఆ ప్రాంగణమంతా దీపాకాంతులతో వెల్లివిరిసింది. శుభోదయం గ్రూప్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment