
టపాసులు చూపుతున్న మంత్రి హర్షవర్థన్
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది.